ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు.
జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్‌లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు.
అంతర పంటలు.. అదనపు మేలు
Published Tue, Sep 23 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement