redgram
-
జిల్లాలో మరో 10 కొనుగోలు కేంద్రాలు
ఉరవకొండ : జిల్లాలో మరో పది కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఎండీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని గుత్తి, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంది విక్రయానికి కేంద్రాలకు పంటను తెస్తున్న రైతులకు నష్టం కలుగకుండా చూస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో 7, కర్నూలులో 7 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే పప్పుశెనగ కుడా కోనగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం బాలభాస్కర్, డీఓ పవన్, హ్యాండ్స్ సంస్థ అధ్యక్షుడు నారాయణస్వామి పాల్గొన్నారు. -
కంది పంటపై అవగాహన
నవాబుపేట : మండలంలోని కొల్లూర్‌లో కంది పంటపై రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, పంకజ్, గోపీనాథ్ కందిపంట సాగు, విత్తనాల ఉత్పత్తిపై అవగాహక కల్పించారు. రైతులు ప్రణాళిక ప్రకారం పంటలు సాగుచేయాలని సూచించారు. ప్రతి గ్రామం విత్తనోత్పత్తి కేంద్రంగా మారేందుకు రైతులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ వెంకటయ్య, రైతులు రాజు, రాము, నర్సింహులు, చందర్, రఘు, రమేశ్, యాదయ్య, మల్లయ్య, నారాయణ, నానులాల్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర పంటలు.. అదనపు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు.