జిల్లాలో మరో 10 కొనుగోలు కేంద్రాలు | Another 10 purchasing centers | Sakshi
Sakshi News home page

జిల్లాలో మరో 10 కొనుగోలు కేంద్రాలు

Published Fri, Jan 20 2017 12:05 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

Another 10 purchasing centers

ఉరవకొండ : జిల్లాలో మరో పది కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని గుత్తి, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో  ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంది విక్రయానికి కేంద్రాలకు పంటను తెస్తున్న రైతులకు నష్టం కలుగకుండా చూస్తామన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో 7, కర్నూలులో 7 కేంద్రాలను ప్రారంభించామని  చెప్పారు.  త్వరలోనే పప్పుశెనగ కుడా కోనగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం బాలభాస్కర్, డీఓ పవన్, హ్యాండ్స్‌ సంస్థ అధ్యక్షుడు నారాయణస్వామి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement