జొన్నల వంటలు | Sorghum Recipes special story | Sakshi
Sakshi News home page

జొన్నల వంటలు

Published Sun, Dec 30 2018 1:19 AM | Last Updated on Sun, Dec 30 2018 1:19 AM

Sorghum Recipes special story - Sakshi

జొన్న బూందీ లడ్డు
కావలసినవి:  గోధుమపిండి/సెనగ పిండి – ఒక కప్పు, జొన్న పిండి – ఒకటిన్నర కప్పులు ల్లం పొడి – 2 కప్పులు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను,  కిస్‌మిస్‌ – తగినన్ని
జీడి పప్పులు – తగినన్ని, నెయ్యి /నువ్వుల నూనె – వేయించడానికి తగినంత

తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి/సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక  పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
జొన్నలు (Great Millet)  నియాసిన్‌ (Niacin)mg (B3)    1.8
రిబోఫ్లావిన్‌  (Rivoflavin)mg (B2)     0.13
థయామిన్‌(Thiamine) mg (B1)    0.37
కెరోటిన్‌ (Carotene)ug        47
ఐరన్‌ (Calcium)g        0.03
కాల్షియం (Phosphorous)g    0.28
ఫాస్పరస్‌(Protein)g        10.4
ప్రొటీన్‌ (Minerals) g        1.6
ఖనిజాలు (Carbo Hydrate) g    72.4
పిండిపదార్థం (Fiber) g        1.3
పిండిపదార్థము/పీచు నిష్పత్తి  (Carbo Hydrate/Fiber Ratio)    55.69


జొన్న చుడువా
కావలసినవి: జొన్న అటుకులు – ఒక కప్పు, నూనె – 3 టీ స్పూన్లు, మినప్పప్పు – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూనుపల్లీలు – ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూనుఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను

తయారీ:  స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

జొన్న బాక్రావాడి మసాలా
కావలసినవి:  జొన్న పిండి – 50 గ్రా., సెనగ పిండి – 50 గ్రా., గోధుమ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు మిరియాల పొడి – ఒక టీ స్పూను, వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్‌ స్పూన్లుసోంపు పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబాదం పప్పుల పొడి – ఒక టేబుల్‌ స్పూను, ధనియాల పొడి – ఒక టీస్పూనుజీడిపప్పుల పొడి – ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు – తగినంతమిరప కారం – ఒక టీ స్పూను, గసగసాల పొడి – ఒక టీ స్పూనుచాట్‌ మసాలా – ఒక టీ స్పూను, నూనె – ఒక టేబుల్‌ స్పూను, నీళ్లు – తగినన్ని

తయారీ:  ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది.  రోల్‌ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.


జొన్నలు – జీడిపప్పు గోరుమీఠీలు
కావలసినవి:  జొన్న పిండి – 100 గ్రా., పెసర పిండి – 50 గ్రా. ఇడ్లీ రవ్వ – 50 గ్రా., మిరియాల పొడి – 10 గ్రా.
ఉప్పు – తగినంత, జీడి పప్పులు – 20 గ్రా., నూనె – 250 గ్రా., నీళ్లు – తగినన్ని

తయారీ:  ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో జొన్న పిండి, పెసర పిండి, ఇడ్లీ రవ్వ వేసి అన్నీ కలిసేలా కలపాలి. మరుగుతున్న నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. జీడిపప్పు పలుకులు జత చేసి మరోమారు కలపాలి. చేతితో చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ, బొటన వేలితో ఒత్తుతూ గోరు మీఠీలు తయారుచేయాలి. అలా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

జొన్న షర్‌బత్‌
కావలసినవి:  జొన్నలు – పావు కప్పుచల్లటి నీళ్లు – 3 కప్పులుమిరియాలు – 10నిమ్మ కాయ ముక్కలు – 3బెల్లం పొడి – అర కప్పునిమ్మ రసం – 2 టేబుల్‌ స్పూన్లుతాజా బత్తాయి రసం – ఒక కప్పు
ఐస్‌ ముక్కలు – కొద్దిగా

తయారీ: ముందుగా జొన్నలను మంచి నీళ్లలో శుభ్రంగా కడిగి, నీళ్లను ఒంపేయాలి. ఒక పాత్రలో తగినన్ని మంచి నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కడిగిన జొన్నలు జత చేసి బాగా కలియబెట్టి, మంట తగ్గించి పది నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. మిరియాలు, నిమ్మ కాయ ముక్కలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బాగా చల్లారాక వడకట్టాలి. నిమ్మ రసం, బత్తాయి రసం, ఐస్‌ ముక్కలు జత చేసి బాగా కలిపి చల్లగా అందించాలి.

జొన్నల కార బూందీ
కావలసినవి: జొన్న పిండి – ఒక కప్పుగోధుమ పిండి లేదా సెనగ పిండి – ఒక కప్పుకి కొద్దిగా తక్కువనూనె – తగినంత, జీడిపప్పులు – 10 గ్రా.మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు, నీళ్లు – తగినన్ని

తయారీ: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి/సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement