cuisine
-
అంతర్జాతీయ చెఫ్‌లతో హైదరాబాద్‌లో కలీనరీ ఫెస్ట్
50 దేశాలకు చెందిన చెఫ్‌ల పాకశాస్త్ర ప్రదర్శన ఐఐహెచ్‌ఎమ్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహణ నగరంలోకలినరీ ఫెస్ట్.. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ (UWYC) ఎక్స్పీరియన్స్" పేరుతో కలిరీఫెస్ట్ జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది యువ పాకశాస్త్ర నిపుణులు తమ దేశాల నుండి సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఆహార ప్రియులు వివిధ ప్రపంచ వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.సాక్షి, సిటీబ్యూరో: నగరం మరో సారి వివిధ దేశాలకు చెందిన పససందైన రుచులకు వేదికగా మారనుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ లండన్ భాగస్వామ్యంతో నగరంలోని ది గ్లాస్ ఆనియన్ వేదికగా యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ గ్యాస్ట్రోనమిక్ ఎక్స్పీరియన్స్ నిర్వహించనున్నారు. ఈ కలినరీ ఫెస్ట్‌లో 50కి పైగా దేశాల నుంచి ప్రముఖ చెఫ్‌లు అంతర్జాతీయ వంటకాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో 10 మంది చెఫ్‌లు హైదరాబాద్‌లో విభిన్న రుచుల సమ్మేళనాన్ని సృష్టించనున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!ఫిబ్రవరి 3న జరగనున్న ఈ ఫెస్ట్‌లో భారత్‌తో పాటు అల్బేనియా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తైమూర్–లెస్టే, నైజీరియా, ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన చెఫ్‌లు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఇదీ చదవండి: గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రంలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించారు. కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంట్లో వారితో కలిసి వంట చేయడమే కాకుండా భోజనం కూడా చేశారు.వారి ఇంట్లో భోజనం చేయాల్సిందిగా.. రాహుల్ గాంధీని ఆ జంట ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ సోమవారం వారి వద్దకు వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు.दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024 కాగా షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేశారు.‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాహూ పటోలే జీ చెప్పినట్లు, దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు. వాళ్లు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో మధ్యాహ్నం గడిపాను.తను నన్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన ఇంటికి చాలా గౌరవంగా ఆహ్వానించాడు. వంటగదిలో అతనికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర, వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశాం. దళితలుకు రాజ్యాంగ అనేక హక్కులను కల్పించింది. అయితే ప్రతి భారతీయుడు సోదర భావాన్ని కలిగి ఉన్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
Neha Nialang: 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా... సహజమైన పద్ధతిలో
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది. మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్‌లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది. సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్‌కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్‌లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్‌లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్‌లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్‌ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్‌గా తీసుకునేది కాదు. వృథా కానివ్వద్దని.. లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి. ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్‌లు తయారు చేసేది. దలాడే ఫుడ్స్.. నేహ తయారుచేసిన జామ్‌లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ. ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది. ‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది. -
నెట్టింట.. ఘుమాయిస్తున్న వంట
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయంలో దేశంలో గూగుల్ సెర్చింగుల్లో ‘వంటలే’ అగ్రస్థానం దక్కించుకున్నాయి. అనివార్యంగా లభించిన ఖాళీ సమయంలో వివిధ రుచుల వంటకాలు ఆస్వాదించేందుకు, వినోదం, ఆహ్లాదం వైపే భారతీయులు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. దేశంలో లాక్డౌన్ సమయంలో గూగుల్ సెర్చింగ్స్ ట్రెండ్స్‌ను ఇండియా టుడే సంస్థకు చెందిన ‘డాటా ఇంటెలిజెన్స్ యూనిట్(డీఐయూ) వెల్లడించింది. లాక్డౌన్ రోజుల్లో భారతీయులు సెర్చ్ చేసిన వాటిలో ఐదు అంశాల్లో ఎక్కువుగా పెరుగుదల కనిపించిందని తెలిపింది. 1వ స్థానంలో ‘రెసిపీ’ లాక్డౌన్ వేళలో భారతీయులు అత్యధి కంగా గూగుల్‌లో వెతికిన పదం ‘రెసిపీ’ ఇళ్లకే పరిమితం కావడంతో వివిధ రకాల వంటకాలు చేసుకునేందుకు ఎక్కువుగా మొగ్గు చూపారు. ఇందుకోసం గూగల్‌లో వివిధ రెసిపీలు తెలుసుకునేందుకు యత్నించారు. వంటల్లో కూడా అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపినవేంటంటే.. దహీ వడ(పెరుగు వడ) కోసం గూగుల్ సెర్చింగుల్లో 180 శాతం పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత దాల్గోనా కాఫీ, పానీపూరీ నిలిచాయి. వీటి సెర్చింగులు 120 శాతం పెరిగాయి. పురన్ పోలి(మహారాష్ట్ర వంటకం), ఊతప్పం, హుమ్ముస్, పాన్ కేకుల రెసిపీలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2వ స్థానంలో ‘నెట్‌ఫ్లిక్స్’ దేశంలో గూగుల్ సెర్చింగ్స్‌లో ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ వివరాలు తెలుసుకోవడం, కొత్త సబ్స్క్రిప్షన్లు తీసుకోవడంపై ఎక్కువుగా ఆసక్తి చూపారు. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అత్యధికంగా 2011లో విడుదలైన ‘కంటేజన్’, 1994లో విడుదలైన ‘ద మాస్క్’ సినిమాలు చూశారు. 3వ స్థానంలో ఆరోగ్యం కరోనా వైరస్ నేపథ్యంలో ఆరో గ్య సూత్రాలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో గూగుల్ సెర్చింగ్స్‌లో ‘ఆరో గ్యం’ మూడో స్థానంలో నిలిచింది. కరోనా సంక్రమించకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తదితర సమాచారం కోసం ఎక్కువుగా గూగుల్‌లో వెతికారు. 4వ స్థానంలో పోర్న్ గూగుల్ సెర్చిం గ్‌లలో అశ్లీల వెబ్ సైట్ల వీక్షణం కూడా పెరిగింది. అందుకే ‘పోర్న్’ నాలుగో స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో లూడో కాలక్షేపం కోసం ఆడుకునే ఆటలపై ప్రజలు ఆసక్తి చూపారు. అందుకే ‘లూడో’ ఐదో స్థానంలో నిలిచింది. -
పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది
చిగురుండగా చింత ఏల?చిత్ర చిత్ర చింత వంటలు ఇక వంట గదంతా చింతాకు చితాచితాడైనింగ్ టేబులంతా పుల్లగా ఫుల్లుగా...ఎంజాయ్ చేయండి!!! చింత చిగురు పులిహోర కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింత చిగురు – ఒక కప్పు; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వేయించిన పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – 15; ఎండు మిర్చి – 5; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేప – 2 రెమ్మలు; పచ్చి మిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి) తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి, వేడిగా ఉండగానే ఒక పెద్ద పాత్రలోకి ఆరబోయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, వేయించిన పల్లీలు వేసి వేయించాక, ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ►పొడి చేయాలి చింతచిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి ►చింత చిగురు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి ►అన్నంలో వేసి కలియబెట్టాలి ►ఉప్పు, జీడి పప్పులు జత చేసి మరోమారు కలిపి, గంటసేపటి తరవాత తినాలి. చింత చిగురు చారు కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ►బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వరుసగా వేసి వేయించాలి ►చింత చిగురు ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి చారును మరిగించాలి ►వేడి వేడి అన్నంలో కమ్మని నేయి వేసుకుని, అప్పడంతో నంచుకుని తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. చింత చిగురు పొడి కావలసినవి: చింత చిగురు – 100 గ్రా; పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; ధనియాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి రెబ్బలు – 2; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►చింత చిగురులోని కాడలను తీసేసి, చింత చిగురును శుభ్రంగా కడగాలి ►పొడి వస్త్రం మీద ఆరేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పల్లీలు, ధనియాలు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక చింత చిగురు వేసి బాగా పొడిపొడిగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►పదార్థాలన్నీ చల్లారాక, ముందుగా పల్లీల మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పొడి చేయాలి ►వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా వేయించిన చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►పొడిపొడిలా ఉండేలా జాగ్రత్తపడాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – దోసకాయ కూర కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు, దోసకాయలు – పావు కేజీ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు; బెల్లం పొడి – అర టీ స్పూను తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►దోసకాయ తొక్క తీసి సన్నగా ముక్కలు తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ►దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►ముక్కలు బాగా మగ్గిన తరవాత చింత చిగురు, పసుపు జత చేసి కలియబెట్టి మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత కరివేపాకు, బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు పప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు, చింతచిగురు – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చిమిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండుమిర్చి – 4; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; వెల్లుల్లి రెబ్బలు – 5 తయారీ: ►కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాక తరవాత దింపేయాలి ►చింత చిగురును శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింత చిగురు వేసి పచ్చి వాసన పోయేవరకు దోరగా వేయించాలి ►పసుపు, ఉప్పు జత చేయాలి ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదపాలి ►ఉడుకుతున్న చింత చిగురులో పప్పు వేసి బాగా కలపాలి ►కరివేపాకు, కొత్తిమీర వేసి కలియబెట్టి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – కొబ్బరిపచ్చడి కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత చిగురు – అర కప్పు; పచ్చిమిర్చి – 6; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ►స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, చింత చిగురు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ►ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి దింపి చల్లార్చాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా కొబ్బరి ముక్కలు వేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ మిక్సీ పడితే, పచ్చడి మెత్తగా వచ్చి, రుచిగా ఉంటుంది ►అన్నంలో వేడి వేడి నెయ్యి జత చేసి కలుపుకుంటే రుచిగా ఉంటుంది. చింత చిగురు మాంసం కావలసినవి మటన్ – 500 గ్రాములు (అర కేజీ); కొత్తిమీర – ఒక కట్ట; ధనియాల పొడి – టీ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొబ్బరి తురుము – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; పుదీనా ఆకులు – కప్పు; ఆవాలు – టీస్పూన్; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; చింతచిగురు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►వెడల్పాటి బాణలి స్టౌమీద ఉంచి, వేడయ్యాక నూనె వేయాలి ►నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించాలి ►దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక మటన్ వేసి కలపాలి. పైన మూత ఉంచి, ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►తర్వాత దీంట్లో అర కప్పు నీళ్లు, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, కారం వేసి ఉడకనివ్వాలి ►మటన్ ముక్క ఉడికేంత వరకు ఉంచి, చింతచిగురు వేసి కలపాలి ►ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►గ్రేవీ లేకుండా ముక్క బాగా వేగినదీ లేనిదీ సరిచూసుకుని కొత్తిమీర చల్లి, దింపేయాలి. చింత చిగురు చికెన్ కావలసినవి: చికెన్ – అర కేజీ; చింతచిగురు – 150 గ్రాములు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూన్; కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – రెండు చిన్న ముక్కలు; ఏలకులు – 2 ; లవంగాలు – 3 తయారీ: ►చింత చిగురు కడిగి, నీళ్లన్నీ పోయేవరకు జల్లెడలో వేసి ఉంచాలి ►పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి ►దీంట్లోనే ఉల్లిపాయ తరుగు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. చికెన్ వేసి కలిపి మూత ఉంచి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ►తర్వాత మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి ►మూత పెట్టి పావు గంట సేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి ►గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలిపి, చివరగా చింత చిగురు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు వేగాక దించాలి. చింత లేనట్లే! చింత చెట్టులో అనేక ఔషధాలు ఉన్నాయి. చింత పండు, చింత చిగురు, చింత బెరడు... అన్ని భాగాలూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సంస్కృతంలో దీనిని చించా అంటారు. ►విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చింతపండు దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా చూస్తుంది. ►రోగనిరోధక శక్తికి సి విటమిన్ అవసరం. ►చింత చిగురు జీర్ణశక్తిని పెంచి, జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ►పులుపు రుచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ►కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ►చింత చిగురుని కుండలో పెట్టి మూత పెట్టేసి, పొయ్యి మీద ఉంచితే, ఆ వేడికి అవి మాడినట్లుగా అవుతాయి. ఆ ఆకులను పొడి చేసి, జల్లెడ పట్టిన మెత్తటి పొడిలో నువ్వుల నూనె కలిపి, కాలిన గాయాల మీద పూసుకుంటే గాయాలు త్వరగా మానతాయి. కొత్త చర్మం త్వరగా వస్తుంది. ►జలుబు చేసినప్పుడు చింతపండు రసంలో చెంచాడు నెయ్యి, అర చెంచాడు మిరియాల పొడి చేర్చి, కాచి వేడివేడిగా తాగితే ముక్కుదిబ్బడ త్వరగా తగ్గుతుంది. ►చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీసి, పల్చగా చేసి, కొద్దిగా మిరియాలు, లవంగాలు, ఏలకులు చేర్చి తాగిస్తే ఆకలి మందగించినవారికి ఆకలి పుడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ►జ్వరం, జలుబు, అజీర్ణ వ్యాధులను చింతపండు బాగా తగ్గిస్తుంది. ►ఎటువంటి అనారోగ్యం వచ్చినా చింతపండు చారుతో అన్నం తినిపిస్తే అది మంచి పథ్యంగా పనిచేస్తుంది. ►జ్వరం వచ్చినప్పుడు చింతపండు నీళ్లలో లవంగాలు, ఏలకులు, కర్పూరం వేసి కాచి, మూడు చెంచాల చొప్పున ఇస్తుంటే వేడి తగ్గుతుంది. ►క్యాన్సర్ నుంచి రక్షించే పదార్థాల కోసం చేసే పరీక్షల్లో చింతపండుకి క్యాన్సర్ రక్షణ గుణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల నిత్యం చింతపండు వాడటం ఆరోగ్య రక్షణకు అవసరం. ►జీర్ణమండల ఆరోగ్యానికి అవసరమైన పెక్టిన్ అనే పదార్థం చింతపండులో అధికంగా ఉంది. -
పంట వంటలు
కొత్త పంటలు కోతకు వచ్చాక వచ్చే తొలి పండుగ సంక్రాంతి.కొత్త పంటలతో సంక్రాంతి పిండివంటలు చేసుకుని ఆరగించడం మన సంప్రదాయం.కొత్తబియ్యంతో పాటు పెసలు, మినుములు, నువ్వుల వంటి అపరాలు కూడా..సంక్రాంతి నాటికి ఇంటికి చేరుతాయి. భోగినాడు బూరెలు, సంక్రాంతినాడు కొత్తబియ్యం పరవాన్నం...కనుమనాడు మినుముతో చేసిన వంటలు తినాలంటారు.ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో... పండుగ రోజుల్లో ఆరగించి ఆస్వాదించే కొత్త పంటల పిండివంటలు మీ కోసం... బెల్లం పరమాన్నం కావలసినవి: బియ్యం – అర కప్పు చిక్కటి పాలు – ఒకటిన్నర కప్పు పాత బెల్లం తురుము – పావు కప్పు నీళ్లు – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు – 6 లేదా 8 తయారీ: ముందుగా బియ్యం శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాలు, బియ్యం కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ బెల్లం కరిగించాలి. ఇప్పుడు పాలలో ఉడికిన అన్నాన్ని బెల్లం నీళ్లలో వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడగానే నెయ్యి, జీడిపప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బూరెలు కావలసినవి: బియ్యం – 1 కప్పు మినçప్పప్పు – 1 కప్పు ఉప్పు – తగినంత కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు బెల్లం తురుము – ముప్పావు కప్పు ఏలకుల పొడి – అర టీ స్పూన్ నీళ్లు – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని పాకం పట్టించుకోవాలి. లేత పాకం రాగానే కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఏలకుల పొడి, నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, మినప్పప్పు గ్రైండర్లో రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని పాత్రలోకి వేసుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని నూనె పాన్‌లో వేసుకుని వేడి కాగానే కొబ్బరి ఉండలను బియ్యం–మినప్పిండిలో ముంచి బూరెలు వేసుకోవాలి. కొయ్యరొట్టె కావలసినవి: బియ్యప్పిండి – 2 కప్పులుశనగపప్పు – అర కప్పు(రెండు గంటల ముందు నానబెట్టాలి)ఉల్లిపాయ తరుగు – 1 కప్పు / క్యారెట్ తురుము – 1 కప్పు కొత్తిమీర తురుము – అర కప్పు / పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు / నూనె – 2 టేబుల్ స్పూన్లుఉప్పు – తగినంత / వేడి నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా నానబెట్టిన శనగపప్పును మిక్సీ బౌల్లో వేసుకుని, మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్లో బియ్యప్పిండి, శనగపప్పు ముద్ద, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పు వేసుకుని అందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్లు వేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను బాల్స్‌లా చేసుకుని, కొద్దిగా చేతులకు నూనె రాసుకుని... ఆ బాల్స్‌ని రొట్టెలా అత్తుకుని... నూనెలో దోరగా వేయించుకోవాలి. రైస్ హల్వా కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / బెల్లం తురుము – 2 కప్పులు క్కటి పాలు – 1 కప్పు / కొబ్బరి పాలు – 3 కప్పులుఏలకుల పొడి – 1 టీ స్పూన్ / నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు / డ్రై ఫ్రూట్స్ – కొన్ని తయారీ: ముందుగా పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురుము, కొబ్బరి పాలు పాన్‌లో వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చెత్తను తొలగించేందుకు ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. పాన్‌ను శుభ్రం చేసుకుని బియ్యప్పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా బెల్లం–కొబ్బరిపాల మిశ్రమాన్ని వేస్తూ ఉండలుగా మారకుండా గరిటెతో తిప్పాలి. మీడియం మంటపైనే ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడేలా గరిటెను ఉపయోగిస్తూ అడుగంటకుండా జాగ్రత్త పడాలి. మిశ్రమం గట్టిపడటం మొదలైన తర్వాత... చిక్కటి పాలు జోడించి గరిటెతో తిప్పాలి. మళ్లీ దగ్గర పడుతున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం మరింత దగ్గర పడగానే మిగిలిన నెయ్యి కూడా వేసి గరిటెతో తిప్పి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని, డ్రై ఫ్రూట్స్‌తో పాటు సర్వ్ చేసుకుంటే హల్వా ముక్కలు భలే టేస్టీగా ఉంటాయి. కొబ్బరి అన్నం కావలసినవి: అన్నం – 2 కప్పులు / నూనె – 3 టీ స్పూన్లు / ఆవాలు – అర టీ స్పూన్ / జీలకర్ర – అర టీ స్పూన్ / జీడిపప్పు – 2 టీ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ / అల్లం తురుము – అర టీ స్పూన్ / ధనియాల పొడి – అర టీ స్పూన్/ కరివేపాకు – 2 రెమ్మలు / కొబ్బరి తురుము – 1 కప్పు / ఇంగువ – చిటికెడు / నిమ్మరసం – 1 టీ స్పూన్/ ఉప్పు – తగినంత / కొత్తిమీర – కొద్దిగా తయారీ: ముందుగా పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే... అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, ధనియాల పొడి, కరివేపాకు, ఇంగువ వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉప్పు వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా వేసుకుని బాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నిమ్మరసం వేసుకుని మరోసారి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తురుము వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దద్ధోజనం కావలసినవి: అన్నం – 2 కప్పులు / గడ్డ పెరుగు – ఒకటింపావు కప్పులుతాజా మీగడ – 2 టేబుల్ స్పూన్లు/ నూనె – 1 టేబుల్ స్పూన్శనగపప్పు – 1 టీ స్పూన్/ మినప్పప్పు – 1 టీ స్పూన్/ ఆవాలు – 1 టీ స్పూన్జీలకర్ర – 1 టీ స్పూన్/ కరివేపాకు – 12 లేదా 15/ ఎండు మిర్చి – 2ఇంగువ – చిటికెడు/ మెంతులు – అర టీ స్పూన్/ ఉప్పు – తగినంతదానిమ్మ గింజలు – 2 టేబుల్ స్పూన్లుకొత్తి మీర – 2 రెమ్మలు (అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఒక బౌల్లో అన్నం, గడ్డ పెరుగు, తాజా మీగడ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నూనె వేసుకుని, వేడి చేసుకుని, శనగపప్పు, మినçప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, మెంతులు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పెరుగు అన్నంలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రవ్వ పులిహార కావలసినవి: బియ్యం రవ్వ – 2 కప్పులు / నీళ్లు – ఒకటిన్నర కప్పునిమ్మకాయ – 1/ పచ్చిమిర్చి – 2 లేదా 3 / నూనె – 2 టేబుల్ స్పూన్లుఆవాలు – 1 టీ స్పూన్ / జీలకర్ర – 1 టీ స్పూన్ / మెంతులు –పావు టీ స్పూన్ / శనగపప్పు – 2 టీ స్పూన్లు / మినప్పప్పు – 2 టీ స్పూన్లు / వేరుశనగలు – 1 టేబుల్ స్పూన్ / ఎండు మిర్చి – 1 / జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్ / ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు / పసుపు – 1 టీ స్పూన్అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని... రవ్వను పాన్‌లో వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యం, నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వెయ్యించాలి. ఇప్పుడు నిమ్మరసంలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని నానబెట్టాలి. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఆ వేడి మిశ్రమంలో బాగా కలపాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో ఉడికిన బియ్యం రవ్వ, తాలింపు మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం–పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. కట్టు పొంగలి కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – అర కప్పు / నీళ్లు – 3 కప్పులు / ఉప్పు – తగినంత / అల్లం తురుము – 1 టీ స్పూన్ / నెయ్యి – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు / జీలకర్ర – 1 టీ స్పూన్ / ఇంగువ – చిటికెడు / కరివేపాకు – 10 లేదా 12 / పచ్చిమిర్చి – 2(పొడవుగా కట్ చేసుకోవాలి) / జీడిపప్పు –10 లేదా 12 / మిరియాలు– 10 (కొద్దిగా దంచి) తయారీ: ముందుగా పెసరపప్పుని దోరగా వేయించాలి. తర్వాత ఆ పెసరపప్పులో శుభ్రం చేసిన బియ్యం, నీళ్లు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ మరింత మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని వేడికాగానే... జీలకర్ర , కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, మిరియాల పొడి వేసుకుని బాగా వేయించాలి. వెంటనే ఆ మిశ్రమాన్ని బియ్యం–పెసరపప్పు మిశ్రమంపైన వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. పాల తాలికలు కావలసినవి: బియ్యప్పిండి – అర కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్ / ఉప్పు – చిటికెడు / పాలు – రెండు కప్పులు / కొబ్బరి తురుము – పావు కప్పు / ఏలకుల పొడి – అర టీ స్పూన్/ బెల్లం – పావు కప్పు+ 1 టేబుల్ స్పూన్ / నీళ్లు – అర కప్పు తయారీ: ముందుగా పావు కప్పు నీళ్లు వేడి చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు వేసుకుని బెల్లం పాకం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని నెయ్యి ఉపయోగిస్తూ తాలికలు రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాలు వేడి చేసుకుని... తాలికలు విరిగిపోకుండా మెల్లగా గరిటెతో ముందుకు వెనక్కి తిప్పుతూ.. పాలు బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసుకుని కలుపుకుని కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు తీసుకుని స్టవ్‌పైన పాకం తయారు చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన పాల తాలికల్లో వేడి వేడి బెల్లం పాకం కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ జోడించి సర్వ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. దిబ్బరొట్టె కావలసినవి: బియ్యం – 1 కప్పు / మిన్నప్పప్పు – అర కప్పు / బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ / పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూన్ / జీలకర్ర – పావు టీ స్పూన్ / నూనె – 1 టేబుల్ స్పూన్ / ఉల్లిపాయ తరుగు – 3 టీ స్పూన్లు / ఉప్పు – తగినంతకరివేపాకు – ఒకటి లేదా రెండు రెమ్మలు తయారీ: ముందుగా బియ్యం, మిన్నప్పప్పు నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు, బేకింగ్ సోడా కూడా వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసుకుని పిండిని దళసరిగా రొట్టె వేసుకుని, ఆ పాత్రకు సరిపడా మూత పెట్టి, దానిపైన నిప్పులు వేసుకోవాలి. దానివల్ల రెండు వైపులా దోరగా వేగుతుంది. అయితే నిప్పులు వేసుకుని అవకాశం లేనివాళ్లు ఆ పాత్రకు మూత పెట్టుకుని, ఆ దిబ్బరొట్టె అడుగున బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి మరోవైపు కూడా వేయించుకోవాలి. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – పావు కప్పునీళ్లు – తగినంత / బెల్లం – ముప్పావు కప్పు / జీడిపప్పు – 10 లేదా 15నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు+రెండు టీ స్పూన్లు / కిస్మిస్ – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. అందులో రెండున్నర కప్పులు వేసుకుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు, ముప్పావు కప్పు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఉడికిన పప్పుఅన్నంలో వేసుకుని మరో రెండు నిమిషాలు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి... కొద్దిగా నీళ్లు వేసుకుని మరోసారి ఉడికించుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు పులిహోర కావలసినవి: అన్నం – 5 లేదా 6 కప్పులు/ చింతపండు – ఒక కప్పు / నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఎండు మిర్చి, పచ్చిమిర్చి – 3 చొప్పున (ముక్కలు చేసుకోవాలి) / వేరుశనగలు – అర కప్పు / మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ / శనగప్పప్పు – 1 టేబుల్ స్పూన్ / కరివేపాకు – 2 రెమ్మలు/ ఆవాలు – 1 టీ స్పూన్/ పసుపు – అర టీ స్పూన్ ఇంగువ – చిటికెడు / ఉప్పు – తగినంత తయారీ: ముందుగా చింతపండు శుభ్రం చేసుకుని మంచినీళ్లలో నానబెట్టి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో వేరుశనగలు, మినప్పప్పు, శనగప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి–ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ... దోరగా వేగిన తర్వాత నానబెట్టిన చింతపండు గుజ్జు అందులో వేసుకుని ఉడకనివ్వాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఉప్పు కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం కుతకుతలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో అన్నం, చింతపండు మిశ్రమాన్ని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పునుగులు కావలసినవి: దోసె పిండి – 1 కప్పు / బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ / ఉల్లిపాయ ముక్కలు – 3 టీ స్పూన్లు / అల్లం తురుము – పావు టీ స్పూన్ / కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు / జీలకర్ర – అర టీ స్పూన్ / ఉప్పు – తగినంత / నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, దోసె పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే... కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు కొబ్బరి చట్నీలో నంజుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి. రవ్వ పాయసం కావలసినవి: నెయ్యి – 1 టేబుల్ స్పూన్ / కిస్మిస్ – 1 టీ స్పూన్జీడిపప్పు – 2 టీ స్పూన్లు / బియ్యం రవ్వ – 3 టేబుల్ స్పూన్లుపాలు – 2 కప్పులు / పంచదార – పావు కప్పు / ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా నేతిలో కిస్మిస్, జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నేతిలోనే బియ్యం రవ్వ వేసుకుని, గరిటెతో తిప్పుతూ దోరగా వేయించి అందులో పాలు, పంచదార వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాస్త చిక్కపడిన తర్వాత ఏలకుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / నీళ్లు – ఒకటిన్నర కప్పులు / నువ్వుల నూనె – రెండున్నర టీ స్పూన్లు / నూనె – రెండు టీ స్పూన్లు / ఆవాలు – 1 టీ స్పూన్ / మినప్పప్పు – 1 టీ స్పూన్ / కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు / ఎండుమిర్చి – 2 / పచ్చిమిర్చి –2 ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్రలో నీళ్లు, రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె, ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా తిప్పుతూ నీళ్లు మొత్తం ఆవిరి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఐదు లేదా ఏడు నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో నూనె వేసుకుని వేడికాగానే మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉండ్రాళ్లపైన ఈ మిశ్రమాన్ని వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. చలిమిడి కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు (బియ్యం నానబెట్టుకుని అప్పటికప్పుడు మిక్సీలో పిండి చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది) / బెల్లం – అర కప్పు / కొబ్బరి కోరు – పావు కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బెల్లం మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యప్పిండి, బెల్లం, కొబ్బరి కోరు, నెయ్యి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా సిద్ధం చేసుకుంటే సర్వ్ చేసుకునేందుకు, తినేందుకు అందంగానూ సులభంగానూ ఉంటాయి. మినపగారెలు కావలసినవి: మినప్పప్పు – 250 గ్రాములు / అల్లం– 2 అంగుళాల ముక్క / పచ్చిమిరపకాయలు – 6 / కరివేపాకు– ఒక రెమ్మ/ ఇంగువ – అర టీస్పూన్/ ఉప్పు– తగినంత / నెయ్యి– ఒక టీస్పూన్ / నూనె– వేపుడుకు తగినంత తయారీ: మినప్పప్పును గంటసేపు నానబెట్టి, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. గారెల కోసం రుబ్బుకొనే పిండి కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నెయ్యి పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి, మూకుడులో నూనె మరిగించుకోవాలి. పిండిని వత్తుకుని, మధ్యలో రంధ్రం చేసి, వేయించుకోవాలి. గారెలు బాగా వేగి రంగు మారిన తర్వాత మూకుడులోంచి తీసి, వేరే పాత్రలోకి తీసుకోవాలి. వేడి వేడి గారెలు కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. చంద్రకాంతాలు కావలసినవి: పెసరపప్పు– ఒక కప్పు / పంచదార– ఒక కప్పు / పచ్చి కొబ్బరి – ఒక చెక్క (తురుముకోవాలి) / జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్ / ఏలకుల పొడి – ఒక టీ స్పూన్ / పచ్చకర్పూరం– చిటికెడు తయారీ: పెసరపప్పును గంటసేపు నానబెట్టుకోవాలి. నీరు ఒంపేసిన తర్వాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి తురుము, పంచదార ఈ పిండిలో కలుపుకోవాలి. దళసరి పాత్రను స్టౌ మీద పెట్టి, అది వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాత్రలో వేసుకుని, అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. హల్వాలా మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో జీడిపప్పు, పచ్చకర్పూరం, ఏలకుల పొడి వేసుకోవాలి. ఒక పీట లేదా చెక్క బల్ల మీద తెల్లని దళసరి వస్త్రాన్ని తడిపి పరుచుకోవాలి. దాని మీద ఈ మిశ్రమాన్ని మందపాటి బిళ్లలుగా వత్తుకుని పేర్చుకోవాలి. ఇప్పుడు వీటిని స్టౌ మీద మూకుడు పెట్టి, అందులో నెయ్యివేసి మరిగించాలి. వీటిని నేతిలో వేయించుకోవాలి. బంగారు రంగులోకి రాగానే తీసేయాలి. వేడివేడిగా తిన్నా, బాగా చల్లారిన తర్వాత తిన్నా చంద్రకాంతాలు చాలా రుచిగా ఉంటాయి. -
సజ్జలతో వంటలు
సజ్జ ఉల్లిపాయ ముత్తియాస్ కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూను, అల్లం + వెల్లుల్లి + పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను, పంచదార – పావు టీ స్పూను, బేకింగ్ సోడా – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – తగినంత, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూను, కొత్తిమీర – అలంకరించడానికి తగినంత, క్యారట్ తురుము – అలంకరించడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, ఉల్లి తరుగు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద, పంచదార, బేకింగ్ సోడా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి పిండిని ముద్దగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పొడవుగా సన్నగా ఒత్తాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి జాగ్రత్తగా కలపాలి. అర కప్పు నీళ్లు జత చేసి, కొద్దిగా కలిపి, సన్నటి మంట మీద సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికాయా లేదా అని టూత్ పిక్‌తో గుచ్చి పరిశీలించాలి. ఉడికిన వెంటనే దింపేసి కొత్తిమీర, క్యారట్ తురుములతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సజ్జలు (Pearl Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.3 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.25 థయామిన్ (Thiamine) mg (B1) 0.33 కెరోటిన్ Carotene)ug 132 ఐరన్ (Iron)mg 8.0 కాల్షియం (Calcium)g 0.05 ఫాస్పరస్ (Phosphorous)g 0.35 ప్రొటీన్ (Protein)g 11.6 ఖనిజాలు (Minerals) g 2.3 పిండిపదార్థం (Carbo Hydrate) g 67.1 పీచు పదార్థం(Fiber) g 1.2 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.91 సజ్జ పకోడీ కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు, సెనగ పిండి లేదా గోధుమ పిండి – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తురుము – పావు కప్పు, పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప కారం – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. సజ్జ పకోడీలను టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు – ఒక కప్పు, పెసలు – ఒక కప్పు, బియ్యం – గుప్పెడు, జీలకర్ర – అర టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, తరిగిన పచ్చి మిర్చి – 4, అల్లం తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె లేదా నెయ్యి – అట్లు కాల్చడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టి, ఒంపేయాలి. గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి. రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. సజ్జ హల్వా కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు,బెల్లం పొడి లేదా పటిక బెల్లం పొడి – ఒక కప్పునెయ్యి – 2 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి – అర టీ స్పూనుజీడి పప్పులు – తగినన్నికిస్మిస్ – తగినన్ని తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్లలో పటిక బెల్లం పొడి వేసి కరిగించి, వేయించుకుంటున్న పిండిలో పోసి కలుపుతుండాలి (బెల్లం పొడి వాడుతుంటే, మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి. ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి). బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యేవరకు కలిపి దింపేయాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్లో హల్వా పోసి సమానంగా సర్దాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి. తయారుచేసుకున్న హల్వా మీద అలంకరించి వేడివేడిగా అందించాలి. సజ్జ తెప్లా కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు, గోధుమ పిండి – అర కప్పునూనె – 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – చిటికెడు,పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి + ఉప్పు కలిపిన ముద్ద – 2 టీ స్పూన్లుకొత్తిమీర – 2 టీ స్పూన్లు, పంచదార పొడి – ఒక టీ స్పూనుపెరుగు – పిండి కలపడానికి తగినంత, ఉప్పు – తగినంత తయారీ: ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి దింపేయాలి. ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి, పచ్చిమిర్చి మిశ్రమం ముద్ద జత చేసి కలపాలి. వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి. పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. పరాఠాల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఒత్తుకున్న తెప్లాలను (పరాఠా మాదిరిగా) రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. కొత్తిమీరతో అలంకరించి చట్నీతో అందించాలి. -
రాగుల వంటలు
రాగి లడ్డు కావలసినవి: మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పుఏలకుల పొడి – పావు టీ స్పూను, మరిగించిన పాలు – పావు కప్పుజీడి పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)బాదం పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)ఎండు కొబ్బరి తురుము – అలంకరించడానికి తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగిన తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. రాగి పిండి జత చేసి మరోమారు దోరగా వేయించాలి. బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు వేయించాలి. వేడి పాలు జత చేసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి, దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసిన పరిమాణంలో లడ్డూలు తయారుచేసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? రాగులు (Finger Millet) నియాసిన్ ((Niacin)mg (B3) 1.1 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.19 థయామిన్ (Thiamine) mg (B1) 0.42 కెరోటిన్ (Carotene)ug 42 ఐరన్ (Iron)mg 5.4 కాల్షియం (Calcium)g 0.33 ఫాస్పరస్ (Phosphorous)g 0.27 ప్రొటీన్(Protein)g 7.1 ఖనిజాలు (Minerals) g 2.7 పిండిపదార్థం (Carbo Hydrate) g 72.7 పీచు పదార్థం (Fiber) g 3.6 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 20.19 రాగి మురుకులు కావలసినవి: రాగి పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూనుబియ్యప్పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంతనూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వేడి నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని తయారీ: ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, వాము, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. వేడి నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. మురుకుల గొట్టంలో పిండి ఉంచి, కాగిన నూనెలో మురుకులు చుట్టాలి. బాగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రాగి సేమ్యా ఖీర్ కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు, కొబ్బరిపాలు – 2 కప్పులుకొబ్బరి తురుము – పావు కప్పు, బెల్లం పొడి – అర కప్పుఏలకుల పొడి – చిటికెడు, జీడి పప్పు పలుకులు – 20 నెయ్యి – తగినంత తయారీ: స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. రాగి – ఉల్లి చపాతీ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుఉప్పు – తగినంతసన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1పెరుగు – 2 టీ స్పూన్లుకొత్తిమీర – అర కప్పు నూనె – తగినంత తయారీ: వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీలా ఒత్తాలి. రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి. ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి. పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. రాగి కేక్ కావలసినవి: రాగి పిండి – ముప్పావు కప్పుగోధుమ పిండి – ముప్పావు కప్పుబేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూనుబేకింగ్ సోడా – అర టీ స్పూనుఉప్పు – చిటికెడుకోకో పొడి – 2 టేబుల్ స్పూన్లుబెల్లం పొడి – ఒక కప్పుకొబ్బరి పాలు – ముప్పావు కప్పువెనిలా ఎసెన్స్ – ఒక టేబుల్ స్పూనుకరిగించిన బటర్ – 150 మి.లీ.పెరుగు – పావు కప్పుటాపింగ్ కోసం...కొబ్బరి పాలు – ఒక కప్పుకోకో పొడి – 3 టేబుల్ స్పూన్లుపంచదార – 2 టేబుల్ స్పూన్లు తయారీ: కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి. రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి. కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి.ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి.ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు బాగా గిలకొట్టాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. -
జొన్నల వంటలు
జొన్న బూందీ లడ్డు కావలసినవి: గోధుమపిండి/సెనగ పిండి – ఒక కప్పు, జొన్న పిండి – ఒకటిన్నర కప్పులు ల్లం పొడి – 2 కప్పులు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను, కిస్మిస్ – తగినన్ని జీడి పప్పులు – తగినన్ని, నెయ్యి /నువ్వుల నూనె – వేయించడానికి తగినంత తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి/సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? జొన్నలు (Great Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.8 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.13 థయామిన్(Thiamine) mg (B1) 0.37 కెరోటిన్ (Carotene)ug 47 ఐరన్ (Calcium)g 0.03 కాల్షియం (Phosphorous)g 0.28 ఫాస్పరస్(Protein)g 10.4 ప్రొటీన్ (Minerals) g 1.6 ఖనిజాలు (Carbo Hydrate) g 72.4 పిండిపదార్థం (Fiber) g 1.3 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.69 జొన్న చుడువా కావలసినవి: జొన్న అటుకులు – ఒక కప్పు, నూనె – 3 టీ స్పూన్లు, మినప్పప్పు – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూనుపల్లీలు – ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూనుఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. జొన్న బాక్రావాడి మసాలా కావలసినవి: జొన్న పిండి – 50 గ్రా., సెనగ పిండి – 50 గ్రా., గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ఒక టీ స్పూను, వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లుసోంపు పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి – ఒక టీస్పూనుజీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ఉప్పు – తగినంతమిరప కారం – ఒక టీ స్పూను, గసగసాల పొడి – ఒక టీ స్పూనుచాట్ మసాలా – ఒక టీ స్పూను, నూనె – ఒక టేబుల్ స్పూను, నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది. రోల్ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్నలు – జీడిపప్పు గోరుమీఠీలు కావలసినవి: జొన్న పిండి – 100 గ్రా., పెసర పిండి – 50 గ్రా. ఇడ్లీ రవ్వ – 50 గ్రా., మిరియాల పొడి – 10 గ్రా. ఉప్పు – తగినంత, జీడి పప్పులు – 20 గ్రా., నూనె – 250 గ్రా., నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో జొన్న పిండి, పెసర పిండి, ఇడ్లీ రవ్వ వేసి అన్నీ కలిసేలా కలపాలి. మరుగుతున్న నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. జీడిపప్పు పలుకులు జత చేసి మరోమారు కలపాలి. చేతితో చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ, బొటన వేలితో ఒత్తుతూ గోరు మీఠీలు తయారుచేయాలి. అలా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్న షర్బత్ కావలసినవి: జొన్నలు – పావు కప్పుచల్లటి నీళ్లు – 3 కప్పులుమిరియాలు – 10నిమ్మ కాయ ముక్కలు – 3బెల్లం పొడి – అర కప్పునిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లుతాజా బత్తాయి రసం – ఒక కప్పు ఐస్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా జొన్నలను మంచి నీళ్లలో శుభ్రంగా కడిగి, నీళ్లను ఒంపేయాలి. ఒక పాత్రలో తగినన్ని మంచి నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కడిగిన జొన్నలు జత చేసి బాగా కలియబెట్టి, మంట తగ్గించి పది నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. మిరియాలు, నిమ్మ కాయ ముక్కలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బాగా చల్లారాక వడకట్టాలి. నిమ్మ రసం, బత్తాయి రసం, ఐస్ ముక్కలు జత చేసి బాగా కలిపి చల్లగా అందించాలి. జొన్నల కార బూందీ కావలసినవి: జొన్న పిండి – ఒక కప్పుగోధుమ పిండి లేదా సెనగ పిండి – ఒక కప్పుకి కొద్దిగా తక్కువనూనె – తగినంత, జీడిపప్పులు – 10 గ్రా.మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు, నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి/సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు. -
వరిగల వంటలు
వరిగ సమోసా కావలసినవి: వరిగ పిండి – ఒక కప్పు గోధుమ పిండి – ఒక కప్పు ఉప్పు – తగినంత బంగాళ దుంపలు – 2 నూనె – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – పావు కప్పు ఉడికించిన బఠాణీ – పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి – 3 కరివేపాకు – ఒక రెమ్మ తయారీ: ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా ముద్ద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి. ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఉడికించిన బఠాణీ, ఉడికించిన బంగాళ దుంప, ఉప్పు జత చేసి అన్ని కలిసేలా బాగా కలియ»ñ ట్టి దింపేయాలి. ఒత్తుకున్న చపాతీలను సమోసా ఆకారంలో చుట్టి, అందులో బంగాళదుంప మిశ్రమం కొద్దిగా ఉంచి మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాటో సాస్‌తో వేడి వేడి సమోసాలు అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? వరిగలు(Proso Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.3 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.18 థయామిన్ (Carotene)ug 0 కెరోటిన్ (Iron)mg 5.9 ఐరన్ (Calcium)g 0.01 కాల్షియం (Calcium)g 0.01 ఫాస్పరస్ (Phosphorous)g 0.33 ప్రొటీన్ (Protein)g 12.5 ఖనిజాలు (Minerals) g 1.9 పిండిపదార్థం (Carbo Hydrate) g 68.9 పీచు పదార్థం(Fiber) g 2.2 పిండిపదార్థము పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 31.31 వరిగ ఇడ్లీ కావలసినవి: వరిగ ఇడ్లీ రవ్వ – ఒక కప్పు మినప్పప్పు – ఒక కప్పు ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వరిగ ఇడ్లీ రవ్వ, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ పిండిని ఇడ్లీ రేకులలో ఇడ్లీలుగా వేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటుంది. వరిగ కాజా కావలసినవి: వరిగ పిండి – అర కప్పు, గోధుమ పిండి – అర కప్పు నూనె – డీప్ ఫ్రైకి తగినంత, పాకం కోసం బెల్లం పొడి – అర కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండిలో కొంత భాగం వేసి కలపాలి. వేడి నూనె జత చేసి మెత్తటి ముద్దలా తయారుచేసుకోవాలి. రొట్టెలాగ అంగుళం మందంలో పొడవుగా ఒత్తి, రోల్ చేయాలి. ఆ రోల్‌ని ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న కాజాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. బెల్లం పొడిని ఒక పెద్ద గిన్నెలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. ఏలకుల పొడి వేసి దింపేయాలి. వేయించి ఉంచుకున్న కాజాలను పాకంలో వేసి సుమారు అర గంట సేపు మూత పెట్టి ఉంచాలి. బాగా పాకం పీల్చుకున్న కాజాలను ప్లేట్లో ఉంచి అందించాలి. వరిగ బర్ఫీ కావలసినవి: వరిగ పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పు నెయ్యి – ఒక టేబుల్ స్పూను, నీళ్లు – పావు కప్పు ఏలకుల పొడి – అర కప్పు, బాదం పప్పులు – 10 తయారీ: ఒక ప్లేటుకి నెయ్యి పూసి పక్కన ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. వరిగ పిండి వేసి పచ్చి వాసన పోయి, సువాసన వచ్చేవరకు వేయించాలి. కరిగించిన బెల్లం పాకం, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి. బాగా గట్టిపడుతుండగా, నెయ్యి జత చేస్తూ ఆపకుండా కలిపి, బాగా ఉడకగానే దింపేయాలి. నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసి సమానంగా పరిచి, పైన బాదం పప్పులు వేయాలి. కొద్దిగా చల్లారుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేయాలి. చల్లారాక ప్లేట్లో ఉంచి అందించాలి. -
అండుకొర్రల వంటలు
అండు కొర్రల కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు అండు కొర్రల రవ్వ – ఒక కప్పు ఉప్పు – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – అర కప్పు తరిగిన పచ్చి మిర్చి – 4 అల్లం తురుము – అర టీ స్పూను వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను తరిగిన టొమాటో – 1 కరివేపాకు – రెండు రెమ్మలు పసుపు – కొద్దిగా నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించాలి. గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? అండుకొర్రలు (Browntop Millet) నియాసిన్ (Niacin)mg (B3) 18.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.027 థయామిన్ (Thiamine) mg (B1) 3.2 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 0.65 కాల్షియం (Calcium)g 0.01 ఫాస్పరస్ (Phosphorous)g 0.47 ప్రొటీన్ (Protein)g 11.5 ఖనిజాలు(Carbo Hydrate) g 69.37 పిండిపదార్థం (Fiber) g 12.5 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 5.54 అండు కొర్రల పొంగలి కావలసినవి: అండు కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పుకొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంతమిరియాల పొడి – పావు టీ స్పూను జీలకర్ర – ఒక టీ స్పూను, జీడి పప్పులు – 10కరివేపాకు – 2 రెమ్మలు, నెయ్యి/నూనె – తగినంత తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఊతప్పం కావలసినవి: అండు కొర్రలు – పావు కప్పు మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఅల్లం పచ్చిమిర్చి ముద్ద – ఒక టీ స్పూను ఉప్పు – తగినంత, నూనె – తగినంతటొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఉప్మా కావలసినవి: అండు కొర్రల రవ్వ – 3 కప్పులు, నూనె – రెండు టేబుల్ స్పూన్లుపచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను, మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – 4, క్యారట్ తరుగు – పావు కప్పు, టొమాటో తరుగు – పావు కప్పుకరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత తయారీ: స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి (నూనె వేయకూడదు) దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యారట్ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. -
కొర్రల వంటలు
కొర్ర మామిడి అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక గ్లాసుడుమామిడి తురుము – అర కప్పు అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు మినప్పప్పు – 2 టీ స్పూన్లు ఎండు మిర్చి – 4 తరిగిన పచ్చి మిర్చి – 5 ఆవాలు – ఒక టీ స్పూను మెంతులు – పావు టీ స్పూను పసుపు – పావు టీ స్పూను ఇంగువ – పావు టీ స్పూను కరివేపాకు – 3 రెమ్మలు తయారీ: కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి. ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. రెండు గంటల పాటు బాగా ఊరిన తరవాత తినాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? కొర్రలు (Foxtail Millet) నియాసిన్ l (Niacin)mg (B3) 0.7 రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11 థయామిన్ (Thiamine) mg (B1) 0.59 కెరోటిన్ (Carotene)ug 32 ఐరన్(Iron)mg 6.3 కాల్షియం (Calcium)g 0.03 ఫాస్పరస్(Phosphorous)g 00.29 ప్రొటీన్ (Protein)g 12.3 ఖనిజాలు (Minerals) g 3.3 పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6 పీచు పదార్థం(Fiber) g 8.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57 కొర్ర దోసె కావలసినవి: కొర్రలు – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పుఉప్పు – తగినంత, మెంతులు – పావు టీ స్పూను నూనె – తగినంత తయారీ: మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రైండర్లో మినప్పప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు బాగా ఊరిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసె మాదిరిగా వేయాలి. చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. కొర్ర కొబ్బరి అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక కప్పుకొబ్బరి తురుము – ఒక కప్పుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతనెయ్యి – 2 టీ స్పూన్లుపోపు కోసంజీలకర్ర – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లుమినప్పప్పు – 1 టీ స్పూనుఅల్లం తురుము – ఒక టీ స్పూనుపచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూనుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కరివేపాకు – 2 రెమ్మలు జీడిపప్పులు – 10 తయారీ: కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి అన్నం ఉడికించాలి. వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి. కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. కొర్ర ఇడ్లీ కావలసినవి: కొర్రల రవ్వ – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పు నెయ్యి/నూనె – తగినంత, ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి. కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి సుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లీరేకులకు నెయ్యి/నూనె పూసి, పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి. కొర్ర రొట్టెలు కావలసినవి: కొర్ర పిండి – 100 గ్రా., ఉప్పు – తగినంత, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత తయారీ: కొర్ర పిండిని శుభ్రంగా జల్లించి పక్కన ఉంచాలి. వేడి నీళ్లను కొద్దికొద్దిగా జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉంచాలి. తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి జత చేస్తూ, గుండ్రంగా ఒత్తాలి. ముందుగా వేడి చేసిన పెనం మీద రెండు పక్కలా నెయ్యి వేసి కాల్చి తీయాలి. వేడిగా కూరలతో గాని, పప్పుతో గాని తింటే రుచిగా ఉంటాయి. కొర్రల తీపి పొంగలి కావలసినవి: కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, కొబ్బరి పాలు – 2 కప్పులుబెల్లం పొడి – ఒక కప్పు, ఏలకుల పొడి – పావు టీ స్పూనునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, జీడి పప్పులు – 10 ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి. ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికించిన పెసరపప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి. కొర్రల హల్వా కావలసినవి: నెయ్యి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు కొర్ర పిండి – ఒక కప్పు బెల్లం పొడి – ఒక కప్పు జీడి పప్పులు – 10 కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను బాదం పప్పులు – ఒక టేబుల్ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా, బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టౌ మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హల్వాలో వేసి కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి. కొర్ర సాంబారు అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక గ్లాసు కంది పప్పు – ఒక గ్లాసుచింతపండు గుజ్జు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ మొదలైనవి)నెయ్యి లేదా నూనె – 2 టీ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుబిసిబేళబాత్ మసాలా – 2 టీ స్పూన్లుపోపు కోసంఆవాలు – ఒక టీ స్పూనుకరివేపాకు – 2 రెమ్మలుఎండు మిర్చి – 2పచ్చిమిర్చి – 2– జీడిపప్పు – 10ఇంగువ – పావు టీ స్పూనుఉల్లి తరుగు – పావు కప్పు తయారీ: కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో విడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి. కూరగాయ ముక్కలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఐదుగ్లాసుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు, జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి. బిసిబేళబాత్ మసాలా వేసి కలపాలి. మెత్తగా ఉడికించిన కొర్రబియ్యం, కంది పప్పు మిశ్రమాన్ని జత చేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీర, నెయ్యి వేసి కలియబెట్టి, అప్పడాలు, కారబ్బూందీ, పిండి వడియాలతో వేడివేడిగా వడ్డించాలి. కొర్ర బిస్కెట్లు కావలసినవి: కొర్ర పిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను నెయ్యి – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – అర కప్పు వెనిలా ఎసెన్స్ – కొద్దిగా, ఉప్పు – చిటికెడు తయారీ: ముందుగా కొర్ర పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లెడ పట్టాలి. నెయ్యిని ప్లానిటరీ మిక్సర్‌లో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి. వెనిలా ఎసెన్స్ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్ కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్ చేయాలి. 150 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్ చేసి బయటకు తీయాలి. కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. కొర్ర వెజిటబుల్ బిర్యానీ కావలసినవి: కొర్రలు – పావు కేజీతరిగిన ఉల్లిపాయ – 1క్యారట్ తరుగు – పావు కప్పుబీన్స్ తరుగు – పావు కప్పుఅల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 4పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూనుటొమాటో తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుకొత్తిమీర – అర కప్పుతరిగిన బంగాళ దుంప – 1నిమ్మ రసం – 2 టీ స్పూన్లుపెరుగు – ఒక టేబుల్ స్పూనునెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లుధనియాల పొడి – ఒక టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబిర్యానీ మసాలా – 2 టీ స్పూన్లుగరం మసాలా – ఒక టీ స్పూనుఉడకబెట్టడానికి నీళ్లు – తగినన్ని తయారీ: కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంటల సేపు నానబెట్టాలి. పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు, పెరుగు, క్యారట్ తరుగు, బీన్స్ తరుగు వేసి దోరగా వేయించాలి (క్యారట్ బీన్స్ తక్కువగా వేగాలి. బీన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది). స్టౌ మీద పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతుండగానే ఉప్పు, నెయ్యి/నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి దోరగా వేయించాలి. నానబెట్టిన కొర్ర బియ్యాన్ని వేసి కలపాలి. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఒకసారి వార్చుకోవాలి. వార్చిన తరవాత కొద్దిగా చల్లటి నీళ్లు జల్లి పక్కన పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించాలి. టొమాటో తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. టొమాటో వేగుతుండగానే, వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలు సగం వేసి వేయించాలి. బఠాణీ జత చేయాలి. ఆ తరువాత ఉడికించిన కొర్ర బియ్యం ఈ కూరల మీద పొరగా ఒక వరుస వేయాలి. నిమ్మ రసం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి సమానంగా పైన చల్లాలి. చిన్న పాత్రలో కొద్దిగా పాలు, మిఠాయి రంగు వేసి కలిపి, మసాలా పొడి మీద చల్లాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగు, పుదీనా తరుగు పైన వేసి మూత పెట్టి, పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తరవాత కొర్ర బిర్యానీ వేసుకునేటప్పుడు ఒక పక్క నుండి తీసుకోవాలి. కొర్రలు – క్యాబేజీ ముత్తియాస్ కావలసినవి: తురిమిన క్యాబేజీ – ఒక కప్పుకొర్ర పిండి – ఒక కప్పుపెరుగు – 5 టేబుల్ స్పూన్లునిమ్మ రసం – ఒక టీ స్పూనుఅల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూనుపసుపు – అర టీ స్పూను బేకింగ్ సోడా – చిటికెడుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి/నూనె – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనుకరివేపాకు – 4 రెమ్మలుకొత్తిమీర – అలంకరించడానికి తగినంత తయారీ: ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ, కొర్ర పిండి, పెరుగు, నిమ్మ రసం, అల్లం పచ్చి మిర్చి ముద్ద, పసుపు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్ని పోపులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి సాస్‌తో ప్లేట్లో ఉంచి అందించాలి. కొర్ర బ్రెడ్ కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్ ఇంప్రూవర్ – 0. 05 గ్రా. గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి. -
నాన్‌వెజ్ పచ్చళ్లకు ఆన్లైన్ దారి
రాజు పికిల్స్.కామ్ పాఠకుల నుంచి స్టార్టప్ డైరీ కాలమ్‌కు విశేష స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్టార్టప్స్ సంస్థలు తమ సేవల గురించి పాఠకులకు అందించేందుకు స్టార్టప్స@సాక్షి.కామ్‌కు మెయిల్స్ పంపిస్తున్నాయి. అయితే స్థలాభావం కారణంగా వాటిల్లో నుంచి ఉపయుక్తమైన కొన్నింటిని ఎంపిక చేసి విడతల వారీగా ప్రచురిస్తున్నాం. ఈవారం ‘స్టార్టప్ డైరీ’లో రాజు పికిల్స్.కామ్, జీరోకాస్ట్ హైరింగ్.కామ్ గురించి! –హైదరాబాద్, బిజినెస్ బ్యూరో చదివింది ఇంటరే. పైగా గృహిణి. తెలిసిందల్లా నోరూరే వంటలు చేయడం. అందులోనూ మాంసాహార పచ్చళ్లలో అందె వేసిన చేయి. అదే వ్యాపార అవకాశంగా మలుచుకుందామె. రాజు పికిల్స్.కామ్ పేరిట ఆన్లైన్లో పచ్చళ్లను విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ దాట్ల సౌజన్య మాటల్లోనే.. ⇔ మాది తూర్పు గోదావరిలోని భీమవరం. మావారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాం. భీమవరం పచ్చళ్లకు బాగా ఫేమస్ కావటంతో ఎప్పుడు నేను ఊరెళ్లినా సరే ఇక్కడి చుట్టుపక్కల వాళ్లు వచ్చేటప్పుడు పచ్చళ్లు తీసుకురమ్మని చెప్పేవాళ్లు. చాలాసార్లు తీసుకొచ్చా కూడా. ఒకసారి అనుకోకుండా ఊరి నుంచి తీసుకొచ్చే బదులు మనమే తయారు చేసి విక్రయిస్తే పోలే అనిపించింది. ఇంకేముంది మా వారి సహకారంతో 2015 మార్చిలో రాజు పికిల్స్.కామ్‌ను ప్రారంభించా. ⇔ రాజు పికిల్స్లో కేవలం చికెన్, మటన్, రొయ్యలు, నాటుకోడి పచ్చళ్లుంటాయి. వెజిటేబుల్ పచ్చళ్లు తయారు చేయాలంటే అన్ని కాలాల్లో సెట్‌కాదు. పైగా మార్జిన్స్ కూడా తక్కువ. మియాపూర్‌లోని మా ఇంట్లో తయారు చేస్తాం. పచ్చళ్లలో వాడే కారం, మసాలాలు, దినుసుల వంటివన్నీ భీమవరం నుంచి దిగుమతి చేసుకుంటాం. ⇔ ధరలు కిలోకు చికెన్ రూ.875, నాటుకోడి రూ.1,600, మటన్, రొయ్యలు రూ.1,200గా నిర్ణయించాం. 45–60 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం నెలకు 140 కిలోల పచ్చళ్లను డెలివరీ చేస్తున్నాం. సుమారు 80–100 మంది కస్టమర్లు ఆర్డర్లిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల నుంచే కాకుండా యూఎస్, యూకే, కెనడా దేశాల నుంచి కూడా ఆర్డర్లొస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా మా కస్టమర్లుగా ఉన్నారు. ⇔ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నాం. సరుకుల డెలివరీ కోసం ఫెడెక్స్, డెల్హివరీ కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఫేస్బుక్, పలు మీడియా సంస్థల ప్రచారంతో ఇతర దేశాల్లోని కస్టమర్లనూ అకర్షించగలిగాం. -
నచ్చుథాయ్!
అంతా మన పద్ధతే... అన్నం కూడా అరిటాకులోనే. కాకపోతే కారపు కూరల్లోనూ కాస్త బెల్లం! నిమ్మఆకు ఎగస్ట్రా!! రుచి డబుల్ ఎక్స్ట్రా!! నోటికి హాయ్ అనిపించేథాయ్ వంటలు తింటే మీకు తప్పకుండా నచ్చి తీరు‘థాయ్’. గ్రీన్ కర్రీ చికెన్ కావల్సినవి ఉల్లికాడలు - 4 అల్లం తరుగు - టేబుల్ స్పూన్ నిమ్మకాయ - 1 (తొక్క పై భాగాన్ని కొబ్బరికోరుతో సన్నగా తురమాలి. దీనిని లెమన్ జెస్ట్ అంటారు) ఉల్లిపాయ తరుగు - 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర - టీ స్పూన్ ధనియాలు - టీ స్పూన్ లవంగాలు - 4 గ్రీన్ కర్రీ కోసం... సన్‌ఫ్లవర్ ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు గ్రీన్ కర్రీ పేస్ట్ (ఉల్లికాడలు, కొత్తిమీర, పాలకూర, పుదీనా) - 180 గ్రా.లు తులసి ఆకుల తరుగు - టీ స్పూన్ కొబ్బరి పాలు - అర లీటరు బోన్‌లెస్ చికెన్ - అర కేజీ చికెన్‌ను ఉడికించిన నీళ్లు - అర లీటరు బెల్లం - 100 గ్రా.లు ఉప్పు - తగినంత తయారీ: జీలకర్ర, లవంగాలు, ధనియాలు వేయించి, పొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక గ్రీన్ కర్రీ పేస్ట్, మసాలా(జీలకర్ర, లవంగాలు, ధనియాల పొడి) వేసి వేగించాలి. చికెన్‌ను ఉడికించిన నీళ్లు పోసి మరిగించాలి. చికిన్ను వేసి, నీళ్లు సగం అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. బెల్లం, సాస్, ఉప్పు వేసి బాగా మరిగించి చివరగా తులసి ఆకులు వేసి సర్వ్ చేయాలి. ఈ కర్రీ అన్నం, రోటీ, పూరీల కాంబినేషన్‌కు బాగుంటుంది. నూడుల్ అండ్ ష్రింప్ సలాడ్ కావల్సినవి: నూడుల్స్ (సన్నగా ఉండేవి) - 120 గ్రా.లు ఉల్లికాడలు - 75 గ్రా.లు రొయ్యలు - 4 వెల్లుల్లి రెబ్బలు - 5 పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు టొమాటో గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు బెల్లం - రెండున్నర టేబుల్ స్పూన్లు పాలకూర తరుగు - టేబుల్ స్పూన్ మిర్చి సాస్ (పండుమిరప పేస్ట్ వాడచ్చు) - టేబుల్ స్పూన్ ఉప్పు నీళ్లు - టేబుల్ స్పూన్ నిమ్మరసం - టీ స్పూన్ ఉప్పు - తగినంత తయారీ: గిన్నెలో నీళ్లను మరిగించి, అందులో నూడుల్స్ వేసి ఉడికించి, జల్లిలో పోసి వడకట్టాలి. జల్లిలో ఉన్న వేడి నూడుల్స్ పైన చల్లని నీళ్లు పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నూడుల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోవు. వీటిని ఒక పక్కగా ఉంచాలి.శుభ్రపరుచుకున్న రొయ్యలను మరుగుతున్న నీళ్లలో వేసి, ఉడికించి, వడకట్టి, పక్కన ఉంచాలి.చిన్న గిన్నెలో బెల్లం తరుగు, నిమ్మరసం, మిర్చి సాస్ వేసి కలపాలి. బెల్లం మొత్తం కరగనివ్వాలి. మరొక గిన్నెలో మిగిలిన పదార్థాలన్నీ వేసి, మిర్చి సాస్ మిశ్రమం కూడా కలిపి కొద్ది సేపు ఉంచాలి. పదార్థాలన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకొని సర్వ్ చేయాలి. కార్న్ ఫ్రిటర్స్ కావల్సినవి మొక్కజొన్న గింజలు - 200 గ్రా.లు మొక్కజొన్న పిండి - 4 టేబుల్ స్పూన్లు పండుమిరప పేస్ట్ - టీ స్పూన్ పంచదార - అర టీ స్పూన్ నిమ్మ ఆకుల తరుగు - చిటికెడు ఉల్లికాడల తరుగు - టీ స్పూన్ అల్లం తరుగు - టీ స్పూన్ ఉప్పు - తగినంత రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత తయారీ: గిన్నెలో అన్ని పదార్థాలు వేసి కలిపి, తగినన్ని నీళ్లు జతచేసి, ముద్దలా చేయాలి. అన్నీ పదార్థాలు సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి.చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా వత్తుకోవాలి. ఈ మిశ్రమానికి దాదాపు 12 పీసులు అవుతాయి.ఇలా చేసుకున్న ముద్దలను ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చేంతవరకు రెండువైపులా వేయించాలి.ఇలా వేయించుకున్న ఫిటర్స్ని వేడి వేడిగా తేనె లేదా చిల్లీ సాస్ లేదా ఏదైనా పచ్చడితో వడ్డించాలి. బనానా ఫ్రిటర్స్ కావల్సినవి బాగా మగ్గిన అరటిపండు - 1 కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లేక్స్ పౌడర్ లేదా బ్రెడ్ పొడి (కార్న్ ఫ్లేక్స్‌ని పొడి చేయవచ్చు. బ్రెడ్ క్రంబ్స్‌ని పొడి చేసి వాడచ్చు) - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - చిటికెడు చల్లని నీళ్లు - కప్పుడువేయించిన తెల్ల నువ్వులు - అర టీ స్పూన్ తేనె - టీ స్పూన్ కోకోనట్ ఐస్‌క్రీమ్/నచ్చిన ఐస్‌క్రీమ్ - 1 స్కూప్ రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత తయారీ తొక్కతీసిన అరటిపండును నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఉప్పు, కార్న్ ఫ్లోర్, కార్న్ పొడిలో నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. కట్ చేసిన అరటిపండును పిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. తీసి, ప్లేట్‌పై పెట్టి, తేనె వేసి, వేయించిన నువ్వులను పైన చల్లాలి. వెంటనే ఏదైనా ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేయాలి. లెమన్ కొరియాండర్ సూప్ కావల్సినవి: కాలీఫ్లవర్ తరుగు - టేబుల్ స్పూన్ క్యారట్ తరుగు - టేబుల్ స్పూన్ బేబీ కార్న్ తరుగు - టేబుల్ స్పూన్ ఉల్లికాడల తరుగు - టేబుల్‌స్పూన్ టొమాటో ముక్కలు - టేబుల్ స్పూన్ కూరగాయలు ఉడికించిన నీళ్లు (క్యారెట్, క్యాబేజీ, పాలకూర.. మొదలైన కూరగాయలు టేబుల్ స్పూన్ చొప్పున) - లీటరు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర పేస్ట్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్ సోయా సాస్ - టేబుల్ స్పూన్ వేయించిన వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్ వేయించిన ఉల్లిపాయ తరుగు - టేబుల్‌స్పూన్ ఉప్పు - తగినంత పంచదార - ఒకటిన్నర టేబుల్ స్పూన్ తెల్ల మిరియాల పొడి - చిటికెడు మొక్కజొన్న పిండి - మిశ్రమం చిక్కగా కావడానికి తగినంత; నిమ్మరసం - టీ స్పూన్ తయారీ: కూరగాయలను ఉడికించిన నీళ్లను వడకట్టాలి. ఈ నీళ్లలో కొత్తిమీర పేస్ట్, ఇతర కూరగాయల ముక్కలు కలిపి బాగా మరిగించాలి. ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత సాస్, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేసి కలుపుతూ ఉడకనివ్వాలి. తర్వాత మొక్కజొన్న పిండి కలిపి, మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా నిమ్మరసం వేసి, కొత్తిమీర తరుగు చల్లి దించాలి. కర్టెసీ: అరుణ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వివంతా బై తాజ్, బేగంపేట్, హైదరాబాద్ -
స్వీట్‌క్రాంతి
ఈ వంటలు మీరు వండితే మీకు ఎన్ని ప్రశంసలో... స్వీట్ వైఫ్ స్వీట్ మదర్ స్వీట్ సిస్టర్ స్వీట్ డాటర్ స్వీట్ డాటర్ ఇన్ లా స్వీట్ మదర్ ఇన్ లా మీవారు వండితే...స్వీటెస్ట్ హజ్బెండ్ మీవారితో వండించగలిగితే ఆహా.. ఓహో.. అప్పుడు స్వీట్ క్రాంతే!! నువ్వులు బెల్లం బొబ్బట్లు కావల్సినవి: తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - వేయించ డానికి సరిపడా తయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, పూరీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి ఉంచాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. లేదా రోట్లో దంచినా మంచిదే. దీంట్లో యాలకులపొడి వేసి క లిపి ఉంచాలి.మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి, తీయాలి. పాల తాలికలు కావల్సినవి: పచ్చి బియ్యపుపిండి (బియ్యం నానబెట్టి, వడకట్టి, గ్రైండ్ చేయాలి) - 4 కప్పులు; నీళ్లు - 2 లీటర్లు; చిక్కగా మరిగించిన పాలు - లీటరు బెల్లం తురుము - కిలో; సగ్గుబియ్యం - 100 గ్రాములు జీడిపప్పు పలుకులు - 75 గ్రాములు (సగం పొడి చేసుకోవాలి) యాలకుల పొడి - టీ స్పూను బాదంపప్పులు, కిస్మిస్లు - ఒక్కో చెంచా (లేకపోయినా ఫర్వాలేదు) నెయ్యి - 100 గ్రాములు తయారి: గుప్పెడు బెల్లం తురుము విడిగా ఉంచి, మిగిలిన బెల్లంలో మూడువంతుల యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి, తీగపాకం పట్టి, పక్కన ఉంచాలి.బియ్యప్పిండిలో మిగిలిన యాలకుల పొడి, బెల్లం తురుము, సగం నెయ్యి, జీడిపప్పు పొడి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి, గట్టి ముద్ద చేసి ఉంచాలి. జీడిపప్పును నేతిలో దోరగా వేయించి పక్కన ఉంచాలి.కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. మురుకుల గిద్దె(కుడక)లో బియ్యప్పిండి ముద్ద పెట్టి, మరుగుతున్న నీళ్లలో వత్తాలి. కడిగిన సగ్గుబియ్యం కూడా వేసి, మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.కుకర్ వేడి తగ్గాక మూత తీసి, బెల్లం పాకం పోసి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి.చివరగా పాలు పోసి మళ్లీ కలిపి, కొద్దిగా ఉడికించి దించేయాలి. కమ్మని పాల తాలికలు రెడీ. పాకం గారెలు కావల్సినవి: మినప్పప్పు -అర కిలో బెల్లం తురుము - అర కిలో నీళ్లు - తగినన్ని నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత తయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి. గోధుమరవ్వ హల్వా కావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పు పాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పు యాలకుల పొడి - చిటికెడు జీడిపప్పు పలుకులు - 10 కిస్మిస్ - 10 పంచదార - 2 కప్పులు నెయ్యి - 4 పెద్ద చెంచాలు కుంకుమపువ్వు - కొద్దిగా తయారి: మందపాటి గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద పెట్టాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు, నీళ్లు కలిపి మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. (కావాలనుకుంటే దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. చెరకురసం పరమాన్నం కావల్సినవి: కొత్త బియ్యం - 1 గ్లాసు చెరకురసం - రెండు గ్లాసులు యాలకుల పొడి - చిటికెడు నెయ్యి - 4 పెద్ద చెంచాలు జీడిపప్పు పలుకులు - 15-20 కిస్మిస్ - 10 తయారి: జీడిపప్పును కొద్దిగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి, రెండు గ్లాసుల నీళ్లు పోసి అరగంట నానబెట్టి, తర్వాత ఉడికించాలి. అన్నం పూర్తిగా అయ్యాక చెరకురసం పోసి, నీరంతా ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. దీంట్లో యాలకులపొడి, నెయ్యి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలిపితే చెరకురసం పరమాన్నం సిద్ధం. (తీపిదనం ఎక్కువ కావాలనుకున్నవారు చెరకురసంతో పాటు బెల్లం కూడా కలిపి అన్నాన్ని ఉడికించవచ్చు.) కావాలనుకుంటే ఇంకా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ కలుపుకోవచ్చు. పూర్ణం బూరెలు కావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులు మినప్పప్పు - కప్పు కొత్త బియ్యం - 2 కప్పులు బెల్లం తురుము - 2 కప్పులు నెయ్యి - అర కప్పు నూనె - వేయించడానికి సరిపడా తయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, అందులో తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరై, పప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. (ఉడికిన శనగపప్పులో నీళ్లు ఒంపేసి, బెల్లం, యాలకులపొడి, నెయ్యి వేసి, ఉడికించి, చల్లారాక రోట్లో మొత్తగా రుబ్బుకోవచ్చు) చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. నువ్వులన్నం (పులగం) కావల్సినవి: కొత్త బియ్యం - పావు కేజీ నల్ల నువ్వులు - పెద్ద చెంచాడు ఉప్పు - తగినంత; నీళ్లు - 3 గ్లాసులు తయారి: ముందురోజు రాత్రి నువ్వులను కొద్దిగా వేయించి, రోట్లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యం వేసి, కొద్దిగా దంచుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా బియ్యానికి నువ్వుల పొడి పట్టేంతవరకు దంచి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతిరోజు ఉదయం గిన్నెలో నీళ్లు పోసి, మరిగాక, ఉప్పు వేయాలి. అందులో సిద్ధంగా ఉంచిన బియ్యం పోసి, కలిపి ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా అయ్యేంతవరకు ఉంచి, దించాలి. మరీ మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పైన చల్లి, ఉడికించుకోవచ్చు.మరిగించిన పాలలో బెల్లం కలిపి, కరిగించాలి. నువ్వులన్నాన్ని బెల్లం ముక్క లేదా తయారు చేసుకున్న బెల్లం పాలు కాంబినేషన్‌తో వడ్డించాలి. నోట్: కొన్ని చోట్ల కొత్తబియ్యం, పెసరపప్పు కలిపి వండి... పైన కొబ్బరి తురుము, బెల్లం తురుము, నెయ్యి కాంబినేషన్‌తో వడ్డిస్తారు. -
పండగన్నాలు
దసరా సరదాల పండుగ. అందుకే దసరాకి వండే వంటలూ సరదాగానే ఉంటాయి. అన్నం వండి వార్చుతారు... ఆ అన్నానికి రకరకాల పదార్థాలు జత చేసి... కొత్త కొత్త అన్నాలు తయారుచేస్తారు. వాటినే కొందరు సద్దులు అంటారు... మరికొందరు దేవనాగరభాషలో చిత్రాన్నం, దద్ధ్యోదనం అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిస్తేనేం... ఈ అన్నప్రసాదాలు నాలుక మీద పడగానే... అన్నదాతా సుఖీభవ... అనే మాట రాకమానదు. అచ్చమైన ఈ తెలుగువారి వంటలను శరన్నవరాత్రుల సందర్భంగా... రోజుకో రకం వండుకుని కడుపారా ఆతిథ్యమిద్దాం. పులిహోర కావల్సినవి: కప్పు అన్నం, తగినంత చింతపండు గుజ్జు, ఉప్పు తయారి: చింతపండు గుజ్జులో తగినంత ఉప్పు వేసి కొద్దిగా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి పోపు పెట్టుకోవాలి. (శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు.. వంటివి పోపులో చేర్చుకోవచ్చు) పోపు కోసం: పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, నాలుగు పచ్చిమిర్చి (నిలువుగా కోయాలి), నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు రెమ్మ, కొద్దిగా పసుపు, తగినంత నూనె తయారి: బాణలిలో నూనె వే డయ్యాక పై దినుసులను వేసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. పెరుగన్నం కావల్సినవి:కప్పు అన్నం, కప్పు పెరుగు, తగినంత ఉప్పు తయారీ: అన్నంలో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. చివరగా బాణలిలో కొద్దిగా నెయ్యి/నూనె వేసి పోపు పెట్టుకోవాలి. అదనంగా జీడిపప్పు చేర్చుకోవచ్చు. పరమాన్నం కావల్సినవి: కప్పు బియ్యం, మూడు కప్పుల పాలు, కప్పు నీళ్లు, కప్పు బెల్లం, మూడు టీ స్పూన్లు నెయ్యి తయారి: అన్నం ఉడుకుతుండగా దాంట్లో తరిగిన బెల్లం, నెయ్యి వేయాలి. మరికాసేపు ఉడికించి దించాలి. దీంట్లో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కలుపుకోవచ్చు. సజ్జ ముద్దలు/ సజ్జల లడ్డూలు కావల్సినవి: సజ్జల పిండి - 2 కప్పులు, బెల్లం - కప్పు (తురిమినది), సోంపు - 2 టీ స్పూన్లు, నెయ్యి - 2 టీ స్పూన్లు తయారి:సజ్జ పిండిలో తగినన్ని నీళ్లు కలిపి, ముద్ద చేయాలి. తగినంత ముద్ద తీసుకొని, చపాతీ చేసినట్టుగా చేత్తో రొట్టె చేసి, పెనం మీద వేసి కాల్చాలి. మరీ గట్టిగా కాకుండా రెండు వైపులా కాల్చి, ప్లేట్లో వేయాలి. వేడి ఉండగానే చేత్తో రొట్టెను చిన్న చిన్న ముక్కలు చేసి, (చేత్తో చేయలేని వారు రోట్లో రొట్టె, బెల్లం వేసి దంచవచ్చు) బెల్లం, సోంపు, నెయ్యి వేసి, గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. ఇలా తయారుచేసిన సజ్జ ముద్దలను అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకని చిన్నపిల్లలు, గర్భవతులకు తప్పక పెడతారు. 3-4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సజ్జ రొట్టెకు బదులుగా గోధుమ రొట్టెతో ముద్దలు కడతారు. పల్లి పొడి కావల్సినవి: 2 కప్పుల పల్లీలు కప్పు బెల్లం (తురిమినది) కప్పు పంచదార (పైన చల్లడానికి) తయారి: పల్లీలను వేయించి, పొడి చేయాలి. దీంట్లో బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. చివరగా పంచదార కలపాలి. నువ్వుల పొడి కావల్సినవి: కప్పు నువ్వులు కప్పు పంచదార(గ్రైండ్ చేయాలి) తయారి: నువ్వులను వేయించి, పొడి చేసి, పంచదార పొడి కలపాలి. పెసర పొడి కావల్సినవి: కప్పు పెసరపప్పు కప్పు పంచదార 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తయారి: పెసరప్పును దోరగా వేయించాలి. తర్వాత మిక్సర్ గ్రైండ్‌లో వేసి పొడి చేయాలి. దీంట్లో పంచదార పొడి, వేడి వేడి నెయ్యి వేసి కలపాలి. నోట్: ఈ పొడులను లడ్డూల్లాగ కూడా కట్టుకోవచ్చు. -
భూనబోనం
ఆషాఢం... మూఢం... కాదు కాదు.. ఆషాఢం... బోనం... ఇల్లిల్లూ పచ్చగా కళకళలాడే మాసం... బోనాల కిరీటాలతో నిండిన శిరస్సులతో మెరిసిపోయే మాసం... భూ...నభోనమంతా మురిసిపోయే మాసం... తెలంగాణ ఆడపడుచుల పట్టు పరికి ణీలతో మిలమిల మెరిసే మాసం... బోనాలకు చద్దులు ఎలాగూ చేసుకుంటారు... వాటితో పాటు మరిన్ని వంటలు చేసుకుందాం... అందరితో కలిసి హాయిగా కడుపారా ఈ బోనాలను ఆరగిద్దాం... బగారన్నం కావలసినవి: బియ్యం - 200 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 10; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి - 4; బిర్యానీ ఆకు - 3; లవంగాలు - 6; ఏలకులు - 4; దాల్చిన చెక్క - 3 చిన్న ముక్కలు; షాజీరా - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టి నీళ్లు తీసేయాలి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడేవరకు వేయించి, లవంగాలు, ఏలకులు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేయించి బియ్యానికి తగినట్టుగా (పాత బియ్యం ఒకటికి ఒకటిన్నర) నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించాలి బియ్యం బాగా ఉడికి, నీరంతా ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి దింపేయాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి). మసాలా పూరీలు కావలసినవి: మైదా పిండి - 3 కప్పులు; సెనగ పిండి - 2 కప్పులు; కరివేపాకు - 3 రెమ్మలు; మెంతి కూర తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; కారం - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; గరం మసాలా - 1 టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; షాజీరా - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడా తయారీ: ఒక గిన్నెలో జల్లించిన మైదాపిండిలో కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా తడిపి నూనె వేసి కలిపి మూతపెట్టి ఉంచాలి వేరే గిన్నెలో సెనగ పిండి తీసుకుని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర తరుగు వేయాలి కొద్దిగా నీళ్లు కలిపి పలుచగా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు జత చేసి తగినన్ని నీళ్లు జల్లుకుంటూ కాస్త గట్టిగా ముద్దలా తడిపి పెట్టుకోవాలి అరగంట తర్వాత రెండూ విడివిడిగా మృదువుగా పిసికి ఉండలుగా చేసుకోవాలి సెనగ పిండి ముద్ద చిన్నగా, గోధుమ పిండి ముద్ద కాస్త పెద్దగా చేసుకోవాలి గోధుమ పిండి ముద్ద చేతిలోకి తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకుని మధ్యలో సెనగ పిండి ముద్ద పెట్టి అన్నివైపుల నుండి మూసేసి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి బాణలిలో నూనె వేసి వేడి చేసుకోవాలి ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి తీసేయాలి ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకు నిలవ ఉంటాయి. వడప్పలు కావలసినవి: బియ్యప్పిండి - అర కేజీ; సెనగ పప్పు - అర కప్పు; నువ్వులు - 2 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; పచ్చి కారం ముద్ద - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: సెనగ పప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంట సేపు నాననివ్వాలి పల్లీలు వేయించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా నల క్కొట్టి పెట్టుకోవాలి గిన్నెతో పిండి కొలుచుకుని ఒకటికి సగం నీళ్లు లెక్కతో తీసుకుని మరిగించాక, ఇందులో పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులు, పల్లీలు, సెనగ పప్పు, గరిటెడు నూనె, తగినంత ఉప్పు వేయాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు జల్లించిన బియ్యప్పిండి వేసి కలిపి దింపేసి మూత పెట్టాలి చల్లారిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలిపి కొద్దికొద్దిగా తీసుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి నిమ్మకాయంత ఉండలు చేసుకుని ప్లాస్టిక్ కాగితం లేదా పూరీ ఒత్తుకునే మిషనులో మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి (వీటిని సన్న మంట మీద నిదానంగా వేయిస్తే లోపలి వరకు బాగా ఉడికి కరకరలాడుతూ ఉంటాయి). మూడు పప్పుల గారెలు కావలసినవి: మినప్పప్పు - కప్పు; పెసర పప్పు - కప్పు; సెనగ పప్పు - కప్పు; పచ్చి మిర్చి - 3; కరివేపాకు - 4 రెమ్మలు; జీలకర్ర - 2 టీ స్పూన్లు; కారం - 2 టీ స్పూన్లు; అల్లం - చిన్న ముక్క; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: ముందుగా పప్పులన్నీ కలిపి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి కనీసం మూడు గంటలు నానబెట్టాక, తీసి జల్లెడలో వేయాలి నీరంతా పోయాక మిక్సీలో వేసి సగం బరకగా, సగం మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బిన పిండిలో సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి బాణలిలో నూనె వేడి చేసుకోవాలి రుబ్బిన పిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని ప్లాస్టిక్ కవర్ లేదా తడి చేసుకున్న అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండువైపులా కాల్చుకోవాలి. -
మధుర గోదావరి
పన్నెండేళ్లకోసారి గోదావరి మాత పరవశిస్తుంది... తన చెంతకు వచ్చేవారిని ఉత్తచేతులతో ఎందుకు పంపుతుంది ఆ తల్లి... తనలో స్నానం చేసి పునీతులవుతున్న వారందరికీ నోరు తీపి చేస్తుంది... మళ్లీ మళ్లీ తలచుకునేలా ఆదరిస్తుంది... పుష్కర నదీ తీరంలోని వారికి ఇదొక పండుగ... ఎక్కడెక్కడి వారూ పుట్టింటికి వస్తుంటారు... వచ్చినవారిని తియ్యగా పలకరించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన దొరికే మధుర రుచులు వారి నోటికి అందించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటలు ఈ వారం అందరి కోసం... తాపేశ్వరం మడత కాజా కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - కొద్దిగా; ఏలకుల పొడి - టీ స్పూను; వంటసోడా - చిటికెడు తయారీ: ఒక పాత్రలో కొద్దిగా నూనె, మైదా పిండి , ఉప్పు వేసి కలపాలి వంటసోడా జత చే సి మరోమారు కలపాలి తగినన్ని నీళ్లు పోసి పిండి మెత్తగా కలిపి, సుమారు గంటసేపు నాననివ్వాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఏలకుల పొడి జతచేయాలి బాగా నానిన మైదా పిండికి పొడిగా ఉన్న బియ్యప్పిండి కొద్దిగా జత చేసి బాగా మర్దనా చేయాలి చిన్న ఉండ తీసుకుని చపాతీ మాదిరిగా పల్చగా ఒత్తాలి ఒత్తిన చపాతీ మీద నూనె పూసి, ఆ పైన పొడి బియ్యప్పిండి చల్లాలి ఆ పైన మరో చపాతీ ఉంచాలి. దాని మీద కూడా నూనె రాసి బియ్యప్పిండి వేయాలి ఈ విధంగా మొత్తం మూడు చపాతీలు ఒకదాని మీద ఒకటి వేయాలి చివరి దాని మీద నూనె, పిండి వేశాక నెమ్మదిగా రోల్ చేయాలి అంచుల్లో విడిపోకుండా కొద్దిగా నూనె పూయాలి చాకు సహాయంతో చిన్న చిన్న కాజాలు కట్ చేయాలి వాటి మధ్యభాగంలో అప్పడాలకర్రతో నెమ్మదిగా ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో కాజాను వేసి మీడియం మంట మీద కాజాలు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి వాటిని వేడి వేడి పాకంలో వేసి సుమారు 20 నిమిషాలు నానిన తర్వాత తీసేయాలి కొద్దిగా వేడి తగ్గాక వడ్డించాలి. పెద్దాపురం వారి బెల్లం పాలకోవా కావలసినవి: పాలు - లీటరు; బెల్లం తురుము - పావు కేజీ; నెయ్యి - కొద్దిగా తయారీ: పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో పోసి స్టౌ మీద చిన్న మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి ఎప్పటికప్పుడు అంచుల దగ్గర కలుపుతుండాలి నెమ్మదిగా పాలు చిక్కబడటం మొదలయ్యాక మరింత వేగంగా పాలు కలుపుతుండాలి బాగా చిక్కబడగానే బెల్లం తురుము వేసి ఆపకుండా కలపాలి మిశ్రమం బాగా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసి కలిపి వెంటనే దించేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటూ పాలకోవా మాదిరిగా తయారుచేసి పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి గట్టి పడ్డాక వాటిని గాలిచొరని డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.. ఆత్రేయపురం పూతరేకులు కావలసినవి: బియ్యం - పావు కేజీ; పంచదార - పావు కేజీ; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - పావు కేజీ; నూనె - కొద్దిగా తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా పల్చగా చేసి ఒక వెడల్పాటి పళ్లెంలో పోయాలి పూతరేకు కుండను కట్టెల పొయ్యి మీద బోర్లించి, కుండంతా పట్టేలా నూనె రాసి, పళ్లెంలో పల్చటి వస్త్రాన్ని ముంచి, దానిని కుండ మీద వెనుక నుంచి ముందుకు వేగంగా లాగాలి రెండు నిమిషాలు కాలగానే జాగ్రత్తగా చేతితో కాని, అట్లకాడతో కాని పూతరేకును తీసి పక్కన ఉంచాలి ఈ విధంగా అన్ని రేకులూ తయారుచేసుకుని పక్కన ఉంచాలి నీరు బాగా పిండేసిన ఒక పొడి వస్త్రం మీద పూతరేకులను ఉంచి వెంటనే తీసేయాలి ఒక రేకు మీద ముందుగా నెయ్యి వేసి, ఆ పైన పంచదార పొడి వేయాలి పైన మరో పూతరేకు ఉంచి నెయ్యి, పంచదార పొడి వేసి పైన మరో పూతరేకు ఉంచాలి ముందుగా రెండుపక్కలా మడతలు వేసి వాటిని వరసగా మడవాలి అప్పటికప్పుడు తయారుచేసి తింటే రుచిగా ఉంటాయి. ధవళేశ్వరం జనార్దనస్వామి జీళ్లు కావలసినవి: బెల్లం తురుము - కేజీ (బూరుగపూడి బెల్లం శ్రేష్ఠం); నెయ్యి - 100 గ్రా; ఏలకుల పొడి - 3 టీ స్పూన్లు; బాగా మందంగా ఉన్న మేకు - 1 (గోడకు గాని, తలుపుకు కాని బిగించాలి) తయారీ: ఒక మందపాటి పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి బెల్లం కరిగి ఉండ పాకం వచ్చాక మరి కాసేపు ఉంచి దించేయాలి గరిటెతో బాగా కలపాలి ఒకమాదిరి గట్టిగా అయిన తర్వాత ఆ మిశ్రమం పొడవాటి పలుచటి కడ్డీ మాదిరిగా తయారవుతుంది అప్పుడు ఆ మిశ్రమాన్ని మేకుకి వేసి పొడవుగా లాగుతుండాలి సుమారు పావు గంట సేపు లాగిన తర్వాత బెల్లం గట్టి పడుతుంది అప్పుడు వెడల్పాటి బల్ల మీద ఉంచి గుండ్రంగా రోల్ చేసి బియ్యప్పిండి, నువ్వుపప్పు అద్దుతూ రోల్ చేయాలి మనకు కావలసిన పరిమాణంలోకి వచ్చేవరకు రోల్ చేసి చాకు సహాయంతో చిన్న సైజులోకి జీళ్లను కట్ చేయాలి బాగా ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసి నిల్వ చేసుకోవాలి. కాకినాడ కోటయ్య కాజా కావలసినవి: మైదా - మూడు కప్పు; సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా - చిటికెడు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి బేకింగ్ సోడా జత చేసి మరో మారు కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా మెత్తగా వచ్చేలా కలపాలి (గట్టిగా ఉండకూడదు) కలిపిన తర్వాత పిండి చేతికి అంటుతుంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని సుమారు పావుగంట సేపు బాగా మర్దనా చేయాలి. (ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి కాజాలు) పిండి బాగా సాగుతుండాలి పైన తడి వస్త్రం వేసి సుమారు మూడు గంటలసేపు నాననివ్వాలి వేరొక పాత్రలో కేజీ పంచదారకు తగినన్నీ నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి బాగా చిక్కటి పాకం వచ్చేవరకు కలపాలి ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి మైదా మిశ్రమాన్ని తీసుకుని మరోమారు బాగా మర్దనా చేయాలి పళ్లెం మీద కొద్దిగా పొడి పిండి వేసి మైదాపిండి మిశ్రమాన్ని దాని మీద దొల్లించి సన్నగా, పొడవుగా గొట్టం ఆకారంలో చేతితో ఒత్తాలి చాకుతో చిన్న చిన్న కాజాల మాదిరిగా కట్ చేయాలి వాటికి మళ్లీ రెండువైపులా బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, నూనె కాగిన తర్వాత ఒక్కో గొట్టం కాజాను వేసి వేయించాలి (మీడియం మంట మీద తయారుచేయాలి) ఒక్కో కాజా బాగా పొంగుతాయి కాజాలు బంగారు వర్ణంలోకి మారాక తీసేసి పంచదార పాకంలో వేయాలి సుమారు 30 సెకండ్ల పాటు పాకంలో మునిగేలా చూడాలి. (లేదంటే అవి పాకం పీల్చుకోవు) ప్లేట్లోకి తీసుకుని వెంటనే వాటి మీద కొద్దిగా నెయ్యి వే సి చేత్తో కిందకు పైకి బాగా కలపాలి. (వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేయడం వల్ల అవి కాజాలకు అంటి మంచి రుచి వస్తాయి). -
‘వావ్’ అంజలి...
బాపట్ల: బాపట్ల పట్టణంలో కూచిపూడి వంటల ఘుమఘుమలతో ఏర్పాటు చేసిన కోన అండ్ కూచిపూడి రెస్టారెంట్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి అంజలి, ఎమ్మెల్యే కోన రఘుపతి, మాటల రచయిత కోన వెంకట్, కూచిపూడి వెంకట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెస్టారెంట్ బ్రోచర్‌ను విడుదల చేశారు. అంజలి వంటకాలను రుచిచూశారు. అభిమానులతో కొద్దిసేపు సందడి చేశారు. అంజలి మాట్లాడుతూ తెలుగంటే ఇష్టమని, తెలుగు వంటలంటే ప్రాణం.. అని చెప్పారు. చక్కటి చిత్రాలను అభిమానులకు అందించటమే తన డ్రీమ్‌గా పేర్కొన్నారు. గీతాంజలి వంటి సినిమాలు చేసేందుకు అవకాశం కల్పించిన కోన వెంకట్ వంటి వారిని ఎప్పటికి మరిచిపోనన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ఆంధ్రా పుడ్ ఫ్రైండ్స్ పేరుతో పది నగరాల్లో కోన అండ్ కూచిపూడి వంటకాలు రుచి చూపేందుకు రెస్టారెంట్లును ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ సినీ రంగంలో అగ్రభాగంలో ఉన్న కోన వెంకట్ వంటి వారు స్వగ్రామానికి ఎదో చేయాలనే సంకల్పంతో రెస్టారెంట్‌ను ప్రారంభించటం అభినందనీయమన్నారు. ఇదే రెస్టారెంట్ మెగా సీటీల్లో ఏర్పాటు చేస్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ స్వస్థలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధికి తమ వంతు కృషిగా ఈ రెస్టారెంట్ నెలకొల్పినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, కోన రమాదేవి, కోన నీరజ, కోన నిఖిల్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
ఏ రుచైనా వెరైటీనే...
పిల్లలు నిన్న మొన్నటి దాకా పండగ వంటలు తిన్నారు. సెలవలు పూర్తయి స్కూల్స్‌కి బయలుదేరబోతున్నారు. వాళ్లకి ఈ వెరైటీ చైనీస్ వంటల్ని సిద్ధం చేసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టండి... ఇష్టంగా తింటారు. సేకరణ: డా. వైజయంతి పురాణపండ మష్రూమ్ మంచూరియా కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు తాజా మష్రూమ్స్ - పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను సోయా సాస్ - అర టీ స్పూను నూనె - తగినంత ఉప్పు - తగినంత వేయించడానికి: అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను ఉల్లి తరుగు - పావు కప్పు ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు నూనె - 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ - ఒకటిన్నర టీ స్పూన్లు చిల్లీ సాస్ - అర టేబుల్ స్పూను టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మష్రూమ్లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి) ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు , 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి) ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి వెడల్పాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వే యించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి. వెజ్ హక్కా నూడుల్స్ (హక్కా నూడుల్స్ ఇండియన్ చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఇతర నూడుల్స్ కంటె చాలా రుచిగా ఉంటాయి. ఇవి పల్చగా ఉండే రైస్ నూడుల్స్. చైనాలోని హక్కా అనే తెగ వారి నుంచి ఈ పేరు వచ్చింది. అయితే ఒక విధంగా ఇది భారతీయుల వంటకమే!) కావలసినవి: క్యారట్ - 1; బీన్స్ - గుప్పెడు; మష్రూమ్స్ - అర కప్పు; ఉల్లి కాడల తరుగు - పావు కప్పు; బఠాణీ - అర కప్పు; గ్రీన్ క్యాప్సికమ్ - 1; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - అర టీ స్పూను; నూనె - టీ స్పూను; హక్కా నూడుల్స్ - ఒక ప్యాకెట్; ఎండు మిర్చి - 6; వెల్లుల్లి రేకలు - 4; సోయా సాస్ - కొద్దిగా తయారీ: ముందుగా కూరలన్నిటినీ సన్నగా తరగాలి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, కూరముక్కలు జత చేసి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి హక్కా నూడుల్స్‌కి తగినన్ని నీళ్లు జత చేసి వేరుగా ఉడికించాలి నీళ్లు ఒంపేసి, నూడుల్స్‌ను చన్నీళ్లలో రెండు మూడు సార్లు జాడించాక, నూనె జత చేసి, బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల నూడుల్స్ అతుక్కుపోకుండా విడిగా ఉంటాయి ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి మంట పెంచి, ఉల్లి కాడల తరుగు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి సుమారు మూడు నిమిషాలు వేయించాలి మష్రూమ్స్, క్యారట్ తరుగు, బఠాణీలు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు జత చేసి ఐదారు నిమిషాలు వేయించాలి బంగారు వర్ణంలోకి మారుతుండగా సోయా సాస్ వేసి కలపాలి. హక్కా నూడుల్స్ వేసి కింద నుంచి పైకి బాగా కలపాలి ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి, స్టౌ మీద నుంచి దింపేయాలి ఉల్లికాడల తరుగుతో అలంకరించి అందించాలి. -
ఆరోగ్య వంటలు
జ్ఞానం మనం పెంచుకుంటే మనమే బాగుంటాం. మనకున్న జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెడితే... ఎందరికో మేలు చేసినవాళ్లమవుతాం. ఈ విషయాన్ని నందిత షా బాగా నమ్ముతారు. అందుకే తనకు తెలిసిన మంచి సంగతుల్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారామె. వృత్తిరీత్యా డాక్టర్ అయిన నందిత... వైద్యం మాత్రమే చేయరు. వైద్యం అవసరమే ఎవరికీ లేకుండా చేయాలని తపన పడతారు! రోగులు ఎక్కువమంది వస్తే హాస్పిటల్ బాగా నడుస్తుందని ఏ డాక్టరైనా అనుకుంటారు. కానీ తన హాస్పిటల్ ఎప్పుడూ ఖాళీగా ఉండాలని కోరుకునే డాక్టర్ ఎవరైనా ఉంటారా? ఉంటారు. కాదు, ఉన్నారు. ఆవిడే నందిత షా. రోగుల్ని ప్రేమించే నందిత... రోగాల పేరెత్తితే మాత్రం విసుక్కుంటారు. అసలు రోగం ఎందుకు రావాలి, ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన దగ్గరకు రాకుండా దాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడతారు. అలాగని ఆమె కేవలం మాటల మనిషి కాదు. చేతల మనిషి. చేరాలనుకున్న గమ్యాన్ని అందుకోవడం కోసం జీవితాన్నే అంకితం చేసే మనిషి! లక్ష్యం మారిందలా... కొందరు జీవించడానికి తింటారు. కొందరు తినడమే జీవితం అన్నంతగా ఆహారాన్ని ప్రేమిస్తుంటారు. అసలు అదే పెద్ద రోగం అంటారు నందిత. అలాంటి వారిలో మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. అది పెరిగి పెరిగి... చివరకు ఓ పెద్ద ఉద్యమంలా తయారైంది. 1981లో... ముంబైలోని సీఎం పీహెచ్ మెడికల్ కాలేజీ నుంచి హోమియోపతి డాక్టర్ పట్టా పుచ్చు కున్నారు నందిత. వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఉత్సాహంగా వైద్యం చేయసా గారు. కొన్నాళ్లు గడిచేసరికి ఆమె ఒక విషయం గమనించారు. అదేంటంటే... ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులే ఆమె దగ్గరకు వస్తున్నారు. చక్కెర వ్యాధి ఒక్కసారి వచ్చిం దంటే జీవితాంతం వెంటాడు తూనే ఉంటుంది. అంతకాలం మందులు వాడటం చిన్న విషయం కాదు. అందుకే చాలామంది హోమియోపతిని ఆశ్రయిం చడం మొదలు పెట్టారు. ఆ విషయం అర్థం అయినప్పటి నుంచి నందిత మనసు మధు మేహం చుట్టూ తిరగసాగింది. దాని గురించి బాగా అధ్యయనం చేశారామె. ఆ భయంకర మైన వ్యాధికి అసలు కారణం అనారోగ్య కరమైన ఆహారపుటలవాట్లే అని అర్థం చేసుకున్నారు. వాటిని మార్చి తీరాలని బలంగా నిశ్చయించుకున్నారు. నాటి నుంచీ నందిత నడిచే మార్గంలో మార్పు వచ్చింది. అంతవరకూ రోగులకు వైద్యం చేయడమే తన కర్తవ్యమనుకున్న ఆమెకు మరో కొత్త గమ్యం ఏర్పడింది. భారత దేశాన్ని మధుమేహ రహిత దేశంగా మార్చడమే ఆమె లక్ష్యమైంది. ఆహార ఉద్యమ సారథి... ‘‘ఆరోగ్యంగా జీవించడంలోనే ఆనందం ఉంది. ఆరోగ్యమే లేనప్పుడు మనకేది ఉన్నా, ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ లక్ష్యం కావాలి’’ అంటారు నందిత. మన దేశం నుంచి మధుమేహాన్ని తరిమికొట్టాలని నిర్ణ యించుకున్న ఆమె... ఆ వ్యాధికి కారణ మవుతున్న ఆహారపుటలవాట్ల మీద యుద్ధం ప్రక టించారు. ఆహార ఉద్యమాన్ని లేవదీశారు. డయా బెటిస్ని తిప్పి కొడదాం అనే నినాదంతో ‘రివర్స డయా బెటిస్’ అనే కార్యక్రమానికి తెర తీశారు. దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటి లోనూ వర్కషాపులు, సెమినార్లు ఏర్పాటుచేసి... ఆహారపు టలవాట్లు మధుమేహానికి, గుండె వ్యాధులకు ఎలా కారణమవుతున్నాయో చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాదు... సహజ సిద్ధమైన దినుసులతో రుచికరమైన ఆహారాన్ని ఎలా వండుకోవాలో నేర్పించడం మొదలుపెట్టారు నందిత. ఆవిడ వంటకాలను రుచి చూసినవాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. రుచులకు దూరం కాకుండా, అనారోగ్యాన్ని మాత్రమే దూరంగా పెట్టే ఆ ఆహార విధానాలను ఆమె వద్ద నుంచి నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అలా ఇరవయ్యేళ్లలో కొన్ని వేల మందిని, వారి జీవన విధానాలను మార్చేశారు నందిత. ‘‘ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే నోరు కట్టేసుకోవడం కాదు. కావలసినంత తినొచ్చు. కావలసినన్నిసార్లు తినొచ్చు. కానీ ఆ తినేది ఏంటి అన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి’’ అని చెప్పే నందిత... ఆహారం కోసం ప్రకృతి మీద ఆధారపడితే చాలంటారు. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన ఆహారం తిన్నంతవరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావనే ఆమె... ఆ విషయం గురించి తెలియజేయడానికి 2005లో ‘షారన్ (SHARAN - Sanctuary of health and reconnection to animals and nature) అనే సంస్థను కూడా స్థాపించారు. మరికొందరు వైద్యులు, వాలంటీర్లతో కలిసి తన లక్ష్యసాధనలో మునిగిపోయారు. షారన్ పేరుతో ఆరువిల్లె (తమిళనాడు), అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో వెజిటేరియన్ రెస్టారెంట్లు కూడా తెరిచారు. సహజసిద్ధంగా పండించిన ఆహార పదార్థాలను దేశమంతా సరఫరా చేస్తున్నారు. డెన్మార్క, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్లతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా తన భావనలను, విధానాలను విస్తరించిన నందిత... త్వరలోనే మధుమేహరహిత భారతదేశాన్ని చూపి స్తాను అంటారు విశ్వాసంతో. రోగులను అనారోగ్యాల బారి నుంచి కాపాడా లనుకునే వైద్యులు చాలామంది ఉంటారు. కానీ అసలు అనారోగ్యమన్నదాన్నే రూపుమాపాలని ఆలో చించే నందిత షా లాంటివాళ్లు ఎక్కడా కనిపించరు. ఆమె లక్షల్లో ఒకరు. లక్ష్యసాధనలో ఆమెకు సాటి రారెవ్వరూ! - సమీర నేలపూడి ఆరోగ్యానికి హాని కలగకూడదన్న ఉద్దేశంతో చక్కెర, నెయ్యి లాంటి కొన్ని పదార్థాలను వినియోగించవద్దని వైద్యులు అంటారు కదా! కానీ నందిత వాటిని వాడొద్దని చెప్పరు. అవి లేకుం డానూ వండరు. ప్రతి పదార్థం గురించీ ఆమెకు స్పష్టంగా తెలుసు. ఏది ఎంత తింటే ప్రమాదం ఉండదో అంత వరకే వినియోగించి వండుకోవడం ఎలానో నేర్పుతారామె. ఆమె వంటకాలకి డిమాండ్ బాగా పెరిగింది. విదేశాల నుంచి సైతం వచ్చి రకరకాల రెసిపీలు నేర్చుకుని వెళ్తుంటారు చాలామంది. ‘షారన్’ వెబ్సైట్ చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఇంకా తెలుసు కోవాలంటే నందిత నడిపే వర్కషాప్కి వెళ్లడమే. ఒక్క రోజులో బోలెడు నేర్పుతారామె. -
బ్లాక్ ఐడ్ బీన్ రైస్
-
పోహా ఆలూ టిక్కి
-
సంజీవ్ కపూర్ వంటిల్లు 8th Aug 2013