రాగుల వంటలు | Oats cuisine special story | Sakshi
Sakshi News home page

రాగుల వంటలు

Published Sun, Dec 30 2018 1:29 AM | Last Updated on Sun, Dec 30 2018 1:29 AM

Oats cuisine special story - Sakshi

రాగి లడ్డు
కావలసినవి:  మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పునెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పుఏలకుల పొడి – పావు టీ స్పూను, మరిగించిన పాలు – పావు కప్పుజీడి పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)బాదం పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)ఎండు కొబ్బరి తురుము – అలంకరించడానికి తగినన్ని

తయారీ: 
ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగిన తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. రాగి పిండి జత చేసి మరోమారు దోరగా వేయించాలి. బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు వేయించాలి. వేడి పాలు జత చేసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి, దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసిన పరిమాణంలో లడ్డూలు తయారుచేసుకోవాలి. 

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
రాగులు (Finger Millet)
నియాసిన్‌ ((Niacin)mg (B3)    1.1
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.19
థయామిన్‌ (Thiamine) mg (B1)    0.42
కెరోటిన్‌ (Carotene)ug        42
ఐరన్‌  (Iron)mg        5.4
కాల్షియం (Calcium)g        0.33
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.27
ప్రొటీన్‌(Protein)g        7.1
ఖనిజాలు  (Minerals) g        2.7
పిండిపదార్థం  (Carbo Hydrate) g    72.7
పీచు పదార్థం  (Fiber) g        3.6
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    20.19

రాగి మురుకులు
కావలసినవి: రాగి పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూనుబియ్యప్పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంతనూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, వేడి నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని

తయారీ: ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, వాము, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. వేడి నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. మురుకుల గొట్టంలో పిండి ఉంచి, కాగిన నూనెలో మురుకులు చుట్టాలి. బాగా వేగిన తరవాత పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

రాగి సేమ్యా ఖీర్‌
కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు, కొబ్బరిపాలు – 2 కప్పులుకొబ్బరి తురుము – పావు కప్పు, బెల్లం పొడి – అర కప్పుఏలకుల పొడి – చిటికెడు, జీడి పప్పు పలుకులు – 20
నెయ్యి – తగినంత

తయారీ: స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి.

రాగి – ఉల్లి చపాతీ
కావలసినవి:  రాగి పిండి – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుఉప్పు – తగినంతసన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1పెరుగు – 2 టీ స్పూన్లుకొత్తిమీర – అర కప్పు నూనె – తగినంత

తయారీ:  వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీలా ఒత్తాలి. రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి. ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి. పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది.

రాగి కేక్‌
కావలసినవి: రాగి పిండి –  ముప్పావు కప్పుగోధుమ పిండి – ముప్పావు కప్పుబేకింగ్‌ పౌడర్‌ – ఒక టీ స్పూనుబేకింగ్‌ సోడా – అర టీ స్పూనుఉప్పు – చిటికెడుకోకో పొడి – 2 టేబుల్‌ స్పూన్లుబెల్లం పొడి – ఒక కప్పుకొబ్బరి పాలు – ముప్పావు కప్పువెనిలా ఎసెన్స్‌ – ఒక టేబుల్‌ స్పూనుకరిగించిన బటర్‌ – 150 మి.లీ.పెరుగు – పావు కప్పుటాపింగ్‌ కోసం...కొబ్బరి పాలు – ఒక కప్పుకోకో పొడి – 3 టేబుల్‌ స్పూన్లుపంచదార – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: 
కేక్‌ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్‌ చేయాలి. రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి. కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి.ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్‌ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి.ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు బాగా గిలకొట్టాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్‌ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్‌ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement