సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ సమయంలో దేశంలో గూగుల్ సెర్చింగుల్లో ‘వంటలే’ అగ్రస్థానం దక్కించుకున్నాయి. అనివార్యంగా లభించిన ఖాళీ సమయంలో వివిధ రుచుల వంటకాలు ఆస్వాదించేందుకు, వినోదం, ఆహ్లాదం వైపే భారతీయులు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. దేశంలో లాక్‌డౌన్ సమయంలో గూగుల్ సెర్చింగ్స్ ట్రెండ్స్‌ను ఇండియా టుడే సంస్థకు చెందిన ‘డాటా ఇంటెలిజెన్స్ యూనిట్(డీఐయూ) వెల్లడించింది. లాక్‌డౌన్ రోజుల్లో భారతీయులు సెర్చ్ చేసిన వాటిలో ఐదు అంశాల్లో ఎక్కువుగా పెరుగుదల కనిపించిందని తెలిపింది.
1వ స్థానంలో ‘రెసిపీ’
- లాక్‌డౌన్ వేళలో భారతీయులు అత్యధి కంగా గూగుల్‌లో వెతికిన పదం ‘రెసిపీ’
- ఇళ్లకే పరిమితం కావడంతో వివిధ రకాల వంటకాలు చేసుకునేందుకు ఎక్కువుగా మొగ్గు చూపారు.
- ఇందుకోసం గూగల్‌లో వివిధ రెసిపీలు తెలుసుకునేందుకు యత్నించారు. వంటల్లో కూడా అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపినవేంటంటే..
- దహీ వడ(పెరుగు వడ) కోసం గూగుల్ సెర్చింగుల్లో 180 శాతం పెరుగుదల కనిపించింది.
- ఆ తర్వాత దాల్‌గోనా కాఫీ, పానీపూరీ నిలిచాయి. వీటి సెర్చింగులు 120 శాతం పెరిగాయి.
- పురన్ పోలి(మహారాష్ట్ర వంటకం), ఊతప్పం, హుమ్ముస్, పాన్ కేకుల రెసిపీలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
2వ స్థానంలో ‘నెట్‌ఫ్లిక్స్’
- దేశంలో గూగుల్ సెర్చింగ్స్‌లో ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ రెండో స్థానంలో నిలిచింది.
- నెట్‌ఫ్లిక్స్ వివరాలు తెలుసుకోవడం, కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకోవడంపై ఎక్కువుగా ఆసక్తి చూపారు.
- నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అత్యధికంగా 2011లో విడుదలైన ‘కంటేజన్’, 1994లో విడుదలైన ‘ద మాస్క్’ సినిమాలు చూశారు.
3వ స్థానంలో ఆరోగ్యం
- కరోనా వైరస్ నేపథ్యంలో ఆరో గ్య సూత్రాలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో గూగుల్ సెర్చింగ్స్‌లో ‘ఆరో గ్యం’ మూడో స్థానంలో నిలిచింది.
- కరోనా సంక్రమించకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తదితర సమాచారం కోసం ఎక్కువుగా గూగుల్‌లో వెతికారు.
4వ స్థానంలో పోర్న్
- గూగుల్ సెర్చిం గ్‌లలో అశ్లీల వెబ్ సైట్ల వీక్షణం కూడా పెరిగింది. అందుకే ‘పోర్న్’ నాలుగో స్థానంలో నిలిచింది.
5వ స్థానంలో లూడో
- కాలక్షేపం కోసం ఆడుకునే ఆటలపై ప్రజలు ఆసక్తి చూపారు. అందుకే ‘లూడో’ ఐదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment