online search
-
డెంగీ నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్లో డెంగీ వ్యాప్తి అనేది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో దోమల పెరుగుదల, పారిశుధ్య నిర్వహణ లోపాలతో డెంగీ వ్యాప్తికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ కేసులు పెరగగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ డెంగీ కేసుల్లో పెరుగుదల నమోదు కావడం ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో డెంగీ టెస్టింగ్, దీని ట్రీట్మెంట్కు సంబంధించిన సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే దానిపై ఆన్లైన్లో ప్రజలు వెతకడం పెరిగిపోయింది. ఈ జనవరి–మార్చి నెలల మధ్యలో పోల్చితే ఏప్రిల్– జూన్‌ల మధ్య డెంగీకి చికిత్సలో నిపు ణులైన డాక్టర్లకు 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్టు స్పష్టమైంది. భారత్‌లో స్థానిక సెర్చ్ ఇంజిన్ ‘జస్ట్ డయల్’ విడుదల చేసిన ‘కన్జూమర్ సెర్చ్ ట్రెండ్స్ డేటా’లో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. అంతేకాదు.. దోమ కాటు నివారణ కోసం దోమ తెరలకు కూడా భారీగా డిమాండ్ పెరిగినట్టు వెల్లడైంది. జాతీయ స్థాయిలో వీటి అమ్మకాలు ఒక్క సారిగా 64 శాతం పెరగగా...ఢిల్లీలో 709 శాతం, పుణెలో 216 శాతం, అహ్మదాబాద్‌లో 160 శాతం, బెంగళూరులో 122 శాతం, కోల్‌కతాలో 96 శాతం, ముంబైలో 31 శాతం, హైదరాబాద్‌లో 27 శాతం పెరుగుదల నమోదైనట్టుగా తెలుస్తోంది. దోమల సమస్య నియంత్రణకు ‘పెస్ట్‌కంట్రోల్ సర్వీసెస్’ను కూడా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా చూస్తే... దేశవ్యాప్తంగా పెస్ట్ కంట్రోల్ కేటగిరీలో ఆన్లైన్లో సెర్చింగ్ 24 శాతం పెరగగా, మెట్రోనగరాల్లో 25 శాతం, నాన్ మెట్రోనగరాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది.ఈ విషయంలో ఢిల్లీ 97 శాతం వృద్ధితో ప్రథమస్థానంలో నిలవగా, కోల్‌కతా 68శాతంతో, అహ్మదాబాద్ 45 శాతంతో, బెంగళూరు 19 శాతం, ముంబై 13 శాతం వృద్ధి సాధించింది.బల్లులు, నల్లుల నివారణకూ ఆన్లైన్ సెర్చింగ్దోమలతో పాటు బల్లులు, తేనెటీగలు, నల్లులు, పాము లు వంటి వాటి నియంత్రణకు అవసరమైన సర్వీసుల గురించి కూడా ఆన్లైన్ సెర్చింగ్ పెరిగింది. డెంగీ కేసుల వృద్ధి నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, దోమలు రాకుండా రెపెల్లెంట్ల వినియోగం, వేగంగా వైద్యసహాయం తీసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అవగా హన వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. -
టాప్‌లో ప్రియాంక... సల్మాన్!
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్త నెటిజన్లు సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాను ఓ ఆన్లైన్ సర్వే ద్వారా వెల్లడించింది ఓ సంస్థ. టాప్ టెన్ మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ ఉమెన్ సెలబ్రిటీలుగా ప్రియాంకా చోప్రా (39 లక్షల సెర్చ్‌లు) సన్నీ లియోన్ (31 లక్షలు), కత్రినా కైఫ్ (19 లక్షలు)లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణాది నుంచి హీరోయిన్ రష్మికా మందన్నా పదో స్థానం సంపాదించారు. మరోవైపు గ్లోబల్లీ మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ మేల్ సెలబ్రిటీ టాప్‌టెన్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ (21 లక్షలు), విరాట్æకోహ్లీ (21 లక్షలు), హృతిక్ రోషన్ (13 లక్షలు)లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ టాప్ టెన్ లిస్ట్‌లో సౌత్ నుంచి అల్లుఅర్జున్, విజయ్ దేవర కొండ, మహేశ్‌బాబులు వరుసగా 5, 8, 10 స్థానాల్లో నిలిచినట్లు ఆన్లైన్ సర్వే నిర్వహించిన సంస్థ పేర్కొంది విరాట్ కోహ్లీ, ∙కత్రినా కైఫ్, హృతిక్ రోషన్ మహేశ్ బాబు, సన్నీ లియోన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ -
నెట్టింట.. ఘుమాయిస్తున్న వంట
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయంలో దేశంలో గూగుల్ సెర్చింగుల్లో ‘వంటలే’ అగ్రస్థానం దక్కించుకున్నాయి. అనివార్యంగా లభించిన ఖాళీ సమయంలో వివిధ రుచుల వంటకాలు ఆస్వాదించేందుకు, వినోదం, ఆహ్లాదం వైపే భారతీయులు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. దేశంలో లాక్డౌన్ సమయంలో గూగుల్ సెర్చింగ్స్ ట్రెండ్స్‌ను ఇండియా టుడే సంస్థకు చెందిన ‘డాటా ఇంటెలిజెన్స్ యూనిట్(డీఐయూ) వెల్లడించింది. లాక్డౌన్ రోజుల్లో భారతీయులు సెర్చ్ చేసిన వాటిలో ఐదు అంశాల్లో ఎక్కువుగా పెరుగుదల కనిపించిందని తెలిపింది. 1వ స్థానంలో ‘రెసిపీ’ లాక్డౌన్ వేళలో భారతీయులు అత్యధి కంగా గూగుల్‌లో వెతికిన పదం ‘రెసిపీ’ ఇళ్లకే పరిమితం కావడంతో వివిధ రకాల వంటకాలు చేసుకునేందుకు ఎక్కువుగా మొగ్గు చూపారు. ఇందుకోసం గూగల్‌లో వివిధ రెసిపీలు తెలుసుకునేందుకు యత్నించారు. వంటల్లో కూడా అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపినవేంటంటే.. దహీ వడ(పెరుగు వడ) కోసం గూగుల్ సెర్చింగుల్లో 180 శాతం పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత దాల్గోనా కాఫీ, పానీపూరీ నిలిచాయి. వీటి సెర్చింగులు 120 శాతం పెరిగాయి. పురన్ పోలి(మహారాష్ట్ర వంటకం), ఊతప్పం, హుమ్ముస్, పాన్ కేకుల రెసిపీలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2వ స్థానంలో ‘నెట్‌ఫ్లిక్స్’ దేశంలో గూగుల్ సెర్చింగ్స్‌లో ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ వివరాలు తెలుసుకోవడం, కొత్త సబ్స్క్రిప్షన్లు తీసుకోవడంపై ఎక్కువుగా ఆసక్తి చూపారు. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అత్యధికంగా 2011లో విడుదలైన ‘కంటేజన్’, 1994లో విడుదలైన ‘ద మాస్క్’ సినిమాలు చూశారు. 3వ స్థానంలో ఆరోగ్యం కరోనా వైరస్ నేపథ్యంలో ఆరో గ్య సూత్రాలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో గూగుల్ సెర్చింగ్స్‌లో ‘ఆరో గ్యం’ మూడో స్థానంలో నిలిచింది. కరోనా సంక్రమించకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తదితర సమాచారం కోసం ఎక్కువుగా గూగుల్‌లో వెతికారు. 4వ స్థానంలో పోర్న్ గూగుల్ సెర్చిం గ్‌లలో అశ్లీల వెబ్ సైట్ల వీక్షణం కూడా పెరిగింది. అందుకే ‘పోర్న్’ నాలుగో స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో లూడో కాలక్షేపం కోసం ఆడుకునే ఆటలపై ప్రజలు ఆసక్తి చూపారు. అందుకే ‘లూడో’ ఐదో స్థానంలో నిలిచింది. -
షాకింగ్... సింధు కులం కోసం వెతికారు!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో అత్యధిక మంది వెతికారు. ఇదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన సంగతి వెల్లడైంది. బంగారు పతకం కోసం సింధు పోటీ పడిన సందర్భంలో.. గతంలో సాధించిన విజయాల గురించి కాకుండా ఆమె కులం ఏమిటో తెలుసుకునేందుకు కొంత మంది ప్రయత్నించారు. గూగుల్ సెర్చ్ లో ఆమె కులం కోసం వెతికారు. గూగుల్ సెర్చ్ బాక్స్ లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం థర్డ్ మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్ గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగులో వెతికారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. చిన్న వయస్సులో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత క్రీడాకారణిగా పీవీ సింధు ఘనతెక్కింది. 21 ఏళ్ల సింధు ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన మొదటి షట్లర్ గా కూడా నిలిచింది. -
‘డాట్ ఇన్’తో ‘డాట్ భారత్’ ఫ్రీ!
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో ఈ-మెయిళ్లు, వెబ్సైట్ అడ్రస్, ఆన్లైన్ సెర్చ్‌లను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త ఆలోచనతో వచ్చింది. ఇకపై ‘డాట్ ఇన్’ (.in) డొమైన్‌ను కొనేవారికి ‘డాట్ భారత్’ (.bharat) డొమైన్‌ను (ఏడాదిపాటు) ఉచితంగా ఇవ్వనుంది. ఇంగ్లీషు రానివారు కూడా సాంకేతికతను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు.. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి ఈ అవకాశం ఇవ్వాలని సర్కారు భావించింది. మరోవైపు, పైరసీని ప్రోత్సహిస్తున్న 73 వెబ్సైట్లను ఆపేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.