షాకింగ్... సింధు కులం కోసం వెతికారు! | people searched PV Sindhu caste in online | Sakshi
Sakshi News home page

షాకింగ్... సింధు కులం కోసం వెతికారు!

Published Sun, Aug 21 2016 1:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

షాకింగ్... సింధు కులం కోసం వెతికారు!

షాకింగ్... సింధు కులం కోసం వెతికారు!

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో అత్యధిక మంది వెతికారు. ఇదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన సంగతి వెల్లడైంది. బంగారు పతకం కోసం సింధు పోటీ పడిన సందర్భంలో.. గతంలో సాధించిన విజయాల గురించి కాకుండా ఆమె కులం ఏమిటో తెలుసుకునేందుకు కొంత మంది ప్రయత్నించారు. గూగుల్ సెర్చ్ లో ఆమె కులం కోసం వెతికారు. గూగుల్ సెర్చ్ బాక్స్ లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం థర్డ్ మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్ గా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగులో వెతికారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. చిన్న వయస్సులో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత క్రీడాకారణిగా పీవీ సింధు ఘనతెక్కింది. 21 ఏళ్ల సింధు ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన మొదటి షట్లర్ గా కూడా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement