
ప్రియాంకా చోప్రా, సల్మాన్ ఖాన్
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్త నెటిజన్లు సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాను ఓ ఆన్‌లైన్ సర్వే ద్వారా వెల్లడించింది ఓ సంస్థ. టాప్ టెన్ మోస్ట్ సెర్చ్‌డ్ ఇండియన్ ఉమెన్ సెలబ్రిటీలుగా ప్రియాంకా చోప్రా (39 లక్షల సెర్చ్‌లు) సన్నీ లియోన్ (31 లక్షలు), కత్రినా కైఫ్ (19 లక్షలు)లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఇక ఈ జాబితాలో దక్షిణాది నుంచి హీరోయిన్ రష్మికా మందన్నా పదో స్థానం సంపాదించారు. మరోవైపు గ్లోబల్లీ మోస్ట్ సెర్చ్‌డ్ ఇండియన్ మేల్ సెలబ్రిటీ టాప్‌టెన్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ (21 లక్షలు), విరాట్æకోహ్లీ (21 లక్షలు), హృతిక్ రోషన్ (13 లక్షలు)లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ టాప్ టెన్ లిస్ట్‌లో సౌత్ నుంచి అల్లుఅర్జున్, విజయ్ దేవర కొండ, మహేశ్‌బాబులు వరుసగా 5, 8, 10 స్థానాల్లో నిలిచినట్లు ఆన్‌లైన్ సర్వే నిర్వహించిన సంస్థ పేర్కొంది
విరాట్ కోహ్లీ, ∙కత్రినా కైఫ్, హృతిక్ రోషన్
మహేశ్ బాబు, సన్నీ లియోన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment