గజ్వేల్ : మెతుకుసీమగా ఖ్యాతి గడించిన జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ప్రస్తుతం భూ గర్భజలాలు అడుగంటి కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిన కారణంగా వరిసాగు గణనీయంగా తగ్గి.. పత్తి, మొక్కజొన్ననే ప్రధాన పంటలుగా ఆవిర్భవించాయి.. కొన్నేళ్లుగా ఈ రెండు పంటలే అత్యధిక విస్తీర్ణం లో సాగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. పత్తికి సంబంధించి ఈసారి సీజన్ ఆరంభంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 1.73 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
ఇందుకోసం 7.18 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని భావించారు. అధికారులు భావించినట్టుగానే.. 7 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయాయి. ప్ర స్తుతం 1.25 లక్షల హెక్టార్ల వరకు పత్తి సాగులోకి వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతోంది. విత్తన రూపే ణా రైతుల రూ. 60 కోట్లకుపైగా, ఎరువులు, దున్నకాలు, కూలీల ఇతర పెట్టుబడుల రూపేణా మరో రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేశారు. 10 రోజుల క్రితం వర కు మైనస్ వర్షపాతం ఉండటం వల్ల ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వ చ్చింది. ఫలితంగా కోట్లల్లో నష్టం వాటిల్లింది.
ముచ్చటగా మూడోసారి వేసిన విత్తనాలతో మొక్కలు మొలిచా యి. ఇవీ ఎండుపోతాయని రైతులంతా ఆందోళనలో మునిగిన తరుణంలో వానలు కురుస్తున్నాయి. ఫలి తంగా జిల్లాలోని అన్ని చోట్లా పత్తి పంట తేరుకుంటున్నది. ఆరంభంలో వర్షాభావం తలెత్తి...నష్టాల పాలుజేసినా ప్రస్తుతం తెల్ల‘బంగారం’ తేరుకోవడంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఇక పంటకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మెరుగైన యాజమాన్య పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు.
తెల్ల‘బంగారం’.. వీడని మమకారం
Published Sat, Sep 6 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement