పత్తి ధర అదుర్స్‌ | Cotton Price Record 9055 In Gajwel Market Yard | Sakshi
Sakshi News home page

పత్తి ధర అదుర్స్‌

Published Sun, Nov 13 2022 1:09 AM | Last Updated on Sun, Nov 13 2022 8:25 AM

Cotton Price Record 9055 In Gajwel Market Yard - Sakshi

గజ్వేల్‌: గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తి ధర దూకుడు ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ–నామ్‌ కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటా రూ.9,040 పలకగా.. తాజాగా అదే వేగం కొనసాగుతోంది. శనివారం జరిగిన కొనుగోళ్లలోనూ క్వింటా గరిష్టంగా రూ.9,055 పలికింది. 13 మంది రైతులు 31.32 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా ఈ ధర పలికింది.

కనిష్టంగా రూ.8,771 పలికిందని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. సీజన్‌ ఆరంభం నుంచి ఈ–నామ్‌ ద్వారా ఇప్పటివరకు 77 మంది రైతులు 170.72 క్వింటాళ్ల పత్తిని విక్రయించారని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement