కరెంట్.. కన్నీరు | farmers getting sadness the cause of power cut | Sakshi
Sakshi News home page

కరెంట్.. కన్నీరు

Published Tue, Oct 7 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

farmers getting sadness the cause of power cut

నర్సంపేట : ఖరీఫ్ సాగు కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరువు పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని వణికిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో మురిపెంలా కురిసిన తొలకరి చినుకులు రైతుల్లో ఆశలు రేపి... ఆ తర్వాత మొహం చాటేశారుు. వర్షాభావం నేపథ్యంలో కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా వెనుకడుగు వేయడంతో పంట భూములన్నీ ఖాళీగా ఉన్నారుు. ఆశతో మరికొందరు రెట్టింపు పెట్టుబడి పెట్టి పలు పర్యాయూలు విత్తనాలు నాటి, బిందె సేద్యంతో పంటలు కాపాడుకున్నారు.

అదును దాటిన తర్వాత కొంత నయమనిపించేలా కురిసిన వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించారుు. జిల్లాలో సాధారణ వర్షపా తం 703.09 మిల్లీమీటర్లు కాగా... 531.04 మి.మీల వర్షం కురిసింది. ఇది కూడా పంటల సాగు సవుయుం మించిన తర్వాత నమోదైన వర్షపాతమే. జిల్లా లో మొత్తం 5,02,132 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా... 4,06,558 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. కానీ.. తాజా పరిస్థితులు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు.

 వర్షాలు కురవకపోవడానికి తోడుగా కరెంట్ కోతలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చే స్తున్నారుు. పట్టుమని మూడు గంటలు కూడా కరెం ట్ సరఫరా కాని పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పొలాలు నెర్రెలుబారుతున్నారుు.  మక్క, పత్తి, సోయ, వరి పంటలు ఎండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంటలకు నీరు పెట్టాలని పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతు న్నా... విద్యుత్ సరఫరా ప్రతిబంధకంగా మారడం తో రైతులు గుండలవిసేలా రోదిస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంట్ సరఫరా గగనంగా వూరడంతో రైతన్నలు సాగుపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తు తం జిల్లాలో 70 శాతం మేర వరి అక్కరకు రాకుండా పోరుునట్లు వ్యవసాయ అధికారుల అంచనా.  

 బోసిబోరుున ధాన్యాగారం
 జిల్లాలోనే ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సంపేట ప్రాంతం వరి  సాగు లేక బోసిపోరుుంది. ఖరీఫ్‌లో అనుకున్న సవుయూనికి వర్షాలు కురిస్తే పాఖాల, వూధన్నపేట, రంగాయు చెరువుల్లోకి నీరు చేరుతాయుని ఆశించి రైతులు నారు వుడులు సిద్ధ చేసుకున్నారు. వర్షాలు లేక నారు వుడులు ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు. పాకాల సరస్సు కింద 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉండగా... ప్రస్తుతం ఎక్కడ చూసినా బీడు భూవుులే కనిపిస్తూ ఎండిపోరుున ఆనవాళ్లతో నారు వుడుల గుర్తులు ఉన్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement