Kharif cultivation
-
‘పెట్టుబడి’ గండం! సర్కారు సాయం కోసం రైతన్న ఎదురు చూపులు
సాక్షి, అమరావతి: జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత ఐదేళ్లూ మే/జూన్‌లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందచేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచి్చన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది.కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చడం మినహా డబ్బులు విడుదల చేయలేదు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో పెట్టుబడి సాయం పెంపు ఉంటుందని ఆశించిన రైతన్నలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో అయినా చర్చిస్తారనుకున్నారు. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం జరిపిన తొలి సమీక్షలో మాట వరసకైనా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఏటా సీజన్‌కు ముందుగానే చేతికి అందే తొలి విడత పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడిస్తారో అంతుబట్టక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ కంటే మిన్నగా.. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి z ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్తో కలిపి ఏటా మే/ జూన్‌లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి తోడుగా నిలిచారు. పీఎం కిసాన్ పరిధిలోకి రాని నాన్ వెబ్‌ల్యాండ్ భూ యజమానులతో పాటు వారసత్వంగా భూములు పొందినవారు, ఎక్వైర్డ్ ల్యాండ్ సాగుదారులతో సహా అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ.. ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు సూపర్‌సిక్స్‌లో హామీ ఇచ్చారు. పీఎం కిసాన్తో కలిసి రైతు భరోసా సాయాన్ని అందించినప్పుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తామిచ్చిన హామీ మేరకు రూ.20 వేలు సొంతంగా ఇస్తారా? లేక పీఎం కిసాన్తో కలిపి ఇస్తారా? అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులవుతోంది.గతంలో సీజన్‌కు ముందుగానే తొలివిడత సాయం రైతులకు చేతికొచ్చేది. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, దుక్కులు, నారుమడులు, నాట్లు వేసుకునేందుకు ఉపయోగపడేవి. ఈసారి మాత్రం తొలి విడత పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి వస్తుంది? ఎంత వస్తుంది? అనే సంగతి తేలకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదునులో పెట్టుబడి సాయం చేతికి రాకపోవడంతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల చుట్టూ ప్రదక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తొలి సంతకం పీఎం కిసాన్పైనే.. కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 2018–19 నుంచి ఏటా మూడు విడతల్లో కేంద్రం ఈ సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.14,717 కోట్లు జమ చేసింది. ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని జమ చేశారు. 2024–25 సీజన్లో రాష్ట్రంలో తొలి విడత సాయం కోసం 40.91 లక్షల మంది అర్హత పొందగా వీరికి రూ.824.61 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశారు.అన్నదాతా అంటూ నాడు మోసంతాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు హడావుడిగా ఓ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఆగమేఘాల మీద జీవో 28 జారీ చేశారు.ఆ జీవో ప్రకారం 2 హెక్టార్లలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా రూ.15 వేలు, రెండు హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు, కౌలురైతులు, అటవీ, దేవదాయ భూసాగుదారులకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రూ.9,225 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. రెండు విడతల్లో 43.26 లక్షల మందికి రూ.4 వేల చొప్పున రూ.2,440.29 కోట్లు మాత్రమే జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద కేంద్రం అందించింది రూ.675 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,765.29 కోట్లు జమ చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.అప్పులు చేయక తప్పదు గత ఐదేళ్లుగా ఖరీఫ్ సీజన్‌కు ముందే మే నెలలోనే పెట్టుబడి సాయం అందేది. దీంతో అప్పుల కోసం వ్యాపారులపై ఆధారపడాల్సిన అగత్యం ఉండేది కాదు. ఈ సొమ్ములు దుక్కి దున్నుకోవడం, నారు మళ్లు పోసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడేవి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఎప్పుడు జమ చేస్తారో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈసారి పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. –కె.ధనుంజయరావు, సింగుపాలెం, బాపట్ల జిల్లావెంటనే జమ చేయాలి ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. అదును దాటి పోకుండా జమ చేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఐదేళ్లు సీజన్‌కు ముందుగానే సాయం అందించారు. కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో వెంటనే పెట్టుబడి సాయం జమ చేయాలి. –కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపెట్టుబడి కోసం ఇబ్బందులుపదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 6 ఎకరాల్లో చీని, 4 ఎకరాల్లో టమోటా, 3 ఎకరాల్లో ఆముదం, కంది, 5 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందింది. ఈసారి ప్రభుత్వం పెట్టుబడి సాయం సకాలంలో ఇవ్వకపోవడంతో పంట సాగుకు ఇబ్బందిపడుతున్నా. –హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లా ప్రతి కౌలు రైతుకూ ఇవ్వాలి సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకూ సాయం జమ చేయాలి. భూ యజమానులకు రుణాలిస్తారు. కౌలు రైతులకు రుణాలు దక్కడం లేదు. వారికి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం పెట్టుబడి సాయమైనా జమ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. –పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
ఆశాజనకంగా ఖరీఫ్ సాగు
సాక్షి, అమరావతి: మూడు వారాలుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు కాస్త ఊపందుకుంది. జూన్‌లో రుతుపవనాలు మొహం చాటేయడం.. ఆగస్టులో వర్షాల జాడే లేక కలవరపాటుకు గురైన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పుణ్యమాని ఊపిరి పీల్చుకుంటున్నారు. లోటు వర్షపాతం భర్తీ కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై ఇస్తున్న విత్తనాలతో అవకాశం ఉన్నంత మేర పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా 58 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు పూర్తయింది. సీజన్ ముగిసే నాటికి కనీసం 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ జిల్లాల్లో కూడా నెలాఖరు నాటికి లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 31 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు వరి సాధారణ విస్తీర్ణం 38.80 ఎకరాలు కాగా.. ఇప్పటికే 30.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అపరాలు సాధారణ విస్తీర్ణం 7.87 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 4.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానంగా 3.60 లక్షల ఎకరాల్లో కందులు, 40 వేల ఎకరాల్లో మినుములు సాగవుతున్నాయి. నూనెగింజల సాగు విస్తీర్ణం 17.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 8.80 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వీటిలో ప్రధానంగా 7.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 97వేల ఎకరాల్లో ఆముదం పంటలు సాగయ్యాయి. ఇతర పంటల విషయానికి వస్తే 10 లక్షల ఎకరాల్లో పత్తి, 2.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 95 వేల ఎకరాల్లో చెరకు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈసారి వేరుశనగ, పత్తి తగ్గాయి. వరి సహా ఇతర పంటలు సాధారణ విస్తీర్ణంలోనే సాగవుతుండగా.. ఆముదం, సోయాబీన్, చిరుధాన్యాల సాగు కాస్త పెరిగింది. పరిస్థితిని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేసింది. తొలుత 5.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై మరో 77,880 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు 7,521 క్వింటాళ్ల విత్తనాన్ని ఇప్పటికే రైతులు తీసుకున్నారు. లక్ష్యం దిశగా సాగు సెప్టెంబర్‌లో కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయి సాధారణ స్థాయికి చేరుకుంది. 3 వారాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసే నాటికి కనీసం మరో 5 నుంచి 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. 8 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
సాగు.. బహు బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో గత మూడేళ్ల కంటే మిన్నగా దిగుబడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు. ఈ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్‌లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది. మేలు చేస్తున్న వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ప్రారంభమైంది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా మినహా సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1 శాతం అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3 శాతం అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మొక్క నిలదొక్కుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరుకుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఈ సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు ç3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.50 కోట్ల విలువైన పురుగుల మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. గతేడాది కంటే మిన్నగా సాగు ఇక సాగు నీటి విడుదల, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగు జోరు పెంచారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు కాగా, జూలై మూడో వారం ముగిసే నాటికి 26.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 25 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 8.30 లక్షల ఎకరాల్లో పత్తి, 5.6 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.32 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. ఈసారి అప్పు చేయాల్సిన అవసరం లేదు నాకు మూడెకరాల సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తున్నా. రైతు భరోసా కింద æరూ.7,500, పంట బీమా పరిహారంగా రూ.18 వేలు వచ్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో చిన్న ట్రాక్టరుకు రూ.70 వేలు సబ్సిడీ అందింది. ఈసారి సాగుకు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. మంచి వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేశాను. – సానబోయిన శ్యామసుందర్, కొత్తపేట, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నా నాకు 12 ఎకరాల పొలం ఉంది. ఎంటీయూ 1061 రకం వరి వేశాను. మాను దశలో ఉంది. పెట్టుబడి సాయం, పంటల బీమా చేతికొచ్చింది. పెట్టుబడికి ఇబ్బంది లేదు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నా. – జి.శ్రీనివాసరావు, ఎస్ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం జిల్లా సాగు ఊపందుకుంటోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. నెలాఖరుకు కనీసం 50 శాతం దాటే అవకాశాలున్నాయి. విత్తనాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రికార్డు స్థాయిలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ జోరుగా సాగుతోంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఉరిమిన ఉత్సాహం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏరువాక ఆరంభంతో అన్నదాతలు కాడెడ్లను అదిలిస్తూ ఉత్సాహంగా ఖరీఫ్ సాగులో నిమగ్నమయ్యారు. ఊరు దాటాల్సిన పనిలేకుండా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతుండటంతో పొలాల బాట పడుతున్నారు. పంటల సాగు కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నవరత్న పథకాలు గ్రామసీమల్లో వెలుగులు నింపుతున్నాయి. అన్నదాతకు సాయం.. ఇలా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన ద్వారా ఏటా రూ.13,500 చొప్పున మూడేళ్లలో రెండు కోట్లకుపైగా కుటుంబాలకు రూ.23,875.59 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. ఎకరం వరి సాగు చేసేందుకు పెట్టుబడి అంచనా వ్యయం రూ.25 వేలు కాగా రైతు భరోసా ద్వారా సగానికిపైగా సాయం అందుతోంది. ఇక మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. రూ.6,684.84 కోట్లను రైతులకు పంటల బీమా పరిహారం కింద చెల్లించారు. మూడేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.79,642.18 కోట్ల మేర ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది. సగటున రూ.20 కోట్ల లబ్ధి కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం గ్రామానికి 2020– 21లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.6,49,92,155 మేర లబ్ధి కలిగింది. గ్రామ జనాభా 4,378 కాగా లబ్ధిదారుల సంఖ్య 4,159. అంటే 95 శాతం జనాభాకు మేలు జరిగింది. పెట్టుబడుల కోసం తమ గ్రామస్తులు అప్పులు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ’సాక్షి’తో పేర్కొన్నారు. అన్ని పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4,500 – 5,000 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి మూడేళ్లలో సగటున రూ.20 కోట్ల వరకు ప్రయోజనం చేకూరిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 67% చిన్న రైతులే... ఖరీఫ్, రబీ సీజన్లలో సాధారణ సాగు విస్తీర్ణం 60 లక్షల హెక్టార్లు కాగా ఉద్యాన పంటలు 17 లక్షల హెక్టార్లలో సాగవుతుంటాయి. రైతు కుటుంబాలు దాదాపు 80 లక్షల వరకు ఉండగా 67 శాతం చిన్న రైతులే ఉన్నారు. వీరిలో ఒక్కో కుటుంబానికి 1.05 ఎకరాల లోపే ఉంది. మరో 20 శాతం కుటుంబాలకు మూడు ఎకరాల లోపు ఉంటుందని అంచనా. తక్కిన 13 శాతం కుటుంబాలకు మాత్రమే మూడు ఎకరాలకు మించి ఉంది. బడ్జెట్లో పెద్దపీట ఏటా బడ్జెట్లో వ్యవసాయశాఖకు కేటాయింపులను ప్రభుత్వం పెంచుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బడ్జెట్లో కనిష్టంగా 9.98 శాతం, గరిష్టంగా 12.54 శాతం కేటాయింపులు ఉండగా ఇప్పుడు 2022–23 బడ్జెట్లో 16.80 శాతం నిర్దేశించడం వ్యవసాయ రంగం పట్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. పథకాలే ఆదుకుంటున్నాయి... ఖరీఫ్‌లో సాగుకు ఏటా రూ.3 లక్షలు అప్పులు చేసి కనీసం రూ.50 వేలు వడ్డీ కింద చెల్లిస్తుంటా. కానీ ఇప్పుడు పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన అగత్యం లేదు. మూడు విడతలుగా వైఎస్సార్ రైతు భరోసా సాయం అందింది. నా భార్యకు పొదుపు సంఘంలో సున్నా వడ్డీ కింద రెండుసార్లు డబ్బులు వచ్చాయి. పిల్లాడి చదువుకు అమ్మ ఒడి అందింది. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. – తాడిబోయిన చంద్రశేఖర్, వల్లభాపురం, గుంటూరు జిల్లా. అప్పులు లేని సేద్యం.. వైఎస్సార్ రైతు భరోసాతోపాటు ఇన్పుట్ సబ్సిడీ రూ.6 వేలు అందాయి. నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. పంట నష్టపోతే పరిహారం ఇస్తున్నారు. పెట్టుబడి, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. – కడిమిశెట్టి విజయ భాస్కరరెడ్డి, గోర్స, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా. భయం లేదు... భరోసానే క్రమం తప్పకుండా రైతు భరోసా అందుతోంది. గత ఏడాది పంట నష్టపోతే రూ.12 వేలు ఇచ్చారు. బీమా పరిహారం రూ.35,044 అందింది. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చింది. మొత్తంగా మాకు ఏడాది వ్యవధిలో రూ.79,294 అందాయి. ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. పంట పోతే సొమ్ములు రావనే భయం కూడా లేదు. – పితాని అనసూయ, మహిళా రైతు, తాండవపల్లి, అమలాపురం, కోనసీమ. కౌలు కార్డుతో బ్యాంకు రుణం ప్రభుత్వం కౌలు కార్డు (సీసీఆర్సీ) జారీ చేయటంతో పంట సాగుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. గతంలో మాకు వడ్డీ వ్యాపారులే దిక్కు. పంట చేతికి రాకముందే వేధింపులు మొదలయ్యేవి. ఇప్పుడా దుస్థితి లేదు. –సయ్యద్ సుభాని, రైతు, పెదపులిపాక, పెనమలూరు. -
పంటలు కాపాడుకునేందుకే ముందుగా సాగునీరు
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టుకు సాగునీటిని ముందుగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారమే గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశామని గతంలో ఇది ఎప్పుడూ జరగలేదన్నారు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం స్పందన సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల.. జూన్ 10న కృష్ణాడెల్టాకు, గుంటూరు చానల్‌కు, గండికోట కింద, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగునీరు ఇస్తున్నాం. ఎస్సార్బీసీ కింద గోరకల్లు, అవుకుకు జూన్ 30న సాగునీరు ఇస్తున్నాం. ఎన్ఎస్పీ కింద జూలై 15న నీటిని విడుదల చేస్తున్నాం. ఈ షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ సలహా మండళ్లు... వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆర్బీకే స్థాయిలో తొలి శుక్రవారం, మండలస్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేయాలి. పంటల ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. పారదర్శకంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి. నాణ్యతకు మనం భరోసాగా ఉండాలి. పరీక్షించి రైతులకు అందించాలి. జూన్, జూలైలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి. ఆమేరకు అందుబాటులో ఉంచాలి. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి నెలా బ్యాంకర్ల సమావేశాలు ప్రతి నెలా జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి. రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌లో దాదాపు రూ.92 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ మేరకు అందించాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కౌలురైతు సీసీఆర్సీ కార్డులు పొందాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలి. సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ సాగు విధానాలపై ఐరాసకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో ఒప్పందం చేసుకుంది. సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలోనే తొలిసారి సహజ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేపట్టాం. జాతీయ రహదారులకు వేగంగా భూ సేకరణ.. రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 2,400 కి.మీ. మేర రోడ్లకు రూ.6,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 3,079 కి.మీ.కి సంబంధించి రూ.29,249 కోట్ల విలువైన మరో 99 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. 2,367 కి.మీ.కి సంబంధించి రూ.29,573 కోట్లతో మరో 45 ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. బెంగళూరు –విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి 332 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను రూ.17,500 కోట్లతో చేపడుతున్నాం. భూ సేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దాదాపు రూ.80 వేల కోట్లకు పైబడి పనులు చేపడుతున్నాం. ఈ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర జీఎస్డీపీ గణనీయంగా పెరగుతుంది. వీలైనంత త్వరగా భూములను కలెక్టర్లు సేకరించాలి. అత్యంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. రోడ్ల వివరాలతో ఫొటో గ్యాలరీలు.. రూ.2,500 కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ రోడ్ల కోసం సుమారు రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.1,400 కోట్లు కూడా ఇవ్వలేదు. నాడు– నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్ల వివరాలను ప్రజలకు తెలియచేస్తూ ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ, ఆర్అండ్ఆర్పై కార్యాచరణ సిద్ధం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రాధాన్యత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారు: మంత్రి అంబటి
-
ఏపీ: ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి జలాలు విడుదల
-
15.18 లక్షల హెక్టార్లలో మూషిక నిర్మూలన
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగులో అన్నదాతను కలవరపెడుతున్న మూషికాల ఆటకట్టించేందుకు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. గత రెండేళ్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదాతకు అండగా నిలిచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఏడాది పొడవునా వరి, వేసవిలో పప్పుధాన్యాలు సాగుచేస్తారు. ఏడాది పొడవునా పంటలు సాగుచేయడంతో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ ద్వారా వరిపంట నష్టాన్ని తగ్గించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించడం లక్ష్యంగా 2019–20 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లలో 25.95 లక్షల మంది రైతులకు లబ్ధి ఖరీఫ్‌లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, రబీలో నవంబర్ నుంచి మార్చి వరకు చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల గత రెండేళ్లలో హెక్టార్‌కు 5 నుంచి 7 క్వింటాళ్ల ధాన్యాన్ని సంరక్షించగలిగారు. 2019–20లో 13.05 లక్షల హెక్టార్లలో రూ.1.75 కోట్లతో చేపట్టగా 14.57 లక్షల మంది రైతులకు లబ్ధికలిగింది. 2020–21లో 12.03 లక్షల హెక్టార్లలో రూ.1.14 కోట్లతో చేపట్టగా 11.38 లక్షల మంది అన్నదాతలు లబ్ధిపొందారు. 2021–22 వ్యవసాయ సీజన్లో రూ.2.01 కోట్లతో 15.18 లక్షల హెక్టార్లలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించారు. దీనికి 14,376 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను వినియోగించనున్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణాలో 2.54 లక్షల హెక్టార్లు, గుంటూరులో 2.34 లక్షల హెక్టార్లు, తూర్పుగోదావరి 2.46 లక్షల హెక్టార్లు, పశ్చిమగోదావరిలో 2.02 లక్షల హెక్టార్లు చొప్పున మొత్తం 9.36 లక్షల హెక్టార్లలో రూ.1.25 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 8,915 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచారు. 2021–22లో కార్యాచరణ ఇలా.. ఎంపికచేసిన గ్రామాల్లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సామూహిæకంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. వ్యవసాయ క్షేత్రాలతోపాటు సాధారణ స్థలాలు, రోడ్లు, కాలువలు, మురుగుకాలువల తిన్నెలు, బీడు, బంజరు, ప్రభుత్వభూముల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ఆర్బీకేల వద్ద విషపు ఎరను తయారుచేసి సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు పంపిణీ చేస్తారు. విషపు ఎరలకు వ్యవసాయ క్షేత్రాల్లో అయ్యే ఖర్చును రైతులు, బంజరు, ప్రభుత్వ భూముల్లో అయ్యే ఖర్చును పంచాయతీలు భరించాల్సి ఉంటుంది. హెక్టార్‌కు 8 నుంచి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందులో నూకలు, వంటనూనె కలిపి ఎరను రైతులు పంట నష్టం జరిగే ప్రదేశాల్లో ఎలుకల బొరియల్లో ఉంచాలి. సామూహిక ఎలుకల నిర్మూలన కోసం ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం గడిచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సామూహిక ఎలుకల నిర్మూలనకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం.ఎలుకల నివారణ మందును ఆర్బీకే ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
వడివడిగా ‘ఈ పంట’ నమోదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి ఏ రాయితీ పొందాలన్నా ‘ఈ క్రాప్’ తప్పనిసరి కావడంతో రైతు భరోసా కేంద్రాల వద్ద పంటల నమోదుకు రైతన్నలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రతీ ఎకరం వివరాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పంట నమోదును చేపట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుతోపాటు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా పొందేందుకు ఈ క్రాపే ప్రామాణికం. అన్నిటికీ అదే ఆధారం కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ పంట నమోదు వేగం పుంజుకుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 92.21 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 57.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 22.05 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టారు. ఇప్పటివరకు ఈ క్రాప్ ఇలా.. వ్యవసాయ పంటల విషయానికి వస్తే 13 లక్షల ఎకరాల్లో వరి, 2.17 లక్షల ఎకరాల్లో ముతక ధాన్యాలు, 2.80 లక్షల ఎకరాల్లో అపరాలు, 9.91 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 6.74 లక్షల ఎకరాల్లో ఇతర పంటల వివరాల నమోదు (ఈ క్రాపింగ్) పూర్తి చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 34.62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలతో పాటు 7.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో కలిపి మొత్తం 42.15 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ పూర్తయింది. ఆర్బీ యూడీపీ యాప్‌లో ఎన్నో ప్రత్యేకతలు మరింత సాంకేతికత జోడించి కొత్తగా తెచ్చిన రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. యూడీపీ యాప్ ద్వారా ఈ–కేవైసీ చేస్తున్నారు. ఏ పంట వేశారు? ఎప్పుడు కోతకు వస్తుందో కూడా తెలిసేలా యాప్‌ను డిజైన్ చేశారు. పంట వివరాలను నమోదు చేయగానే డిజిటల్ కాపీని రైతులకు అందిస్తున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. ముందుగానే రైతులు వివరాలను నమోదు చేసుకోవడం వలన ఎన్ని సర్వే నెంబర్లలో ఈ పంట నమోదు చేశారు? ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో వెంటనే తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ పంట నమోదుకు దూరంగా ఉన్న భూముల వివరాలను కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేనివి, పూర్వీకుల నుంచి డాక్యుమెంట్ల ద్వారా వారసులకు దాఖలైనవి, నోటిమాట ఒప్పందాల ప్రకారం వారసులు సాగు చేస్తున్నవి, కౌలు, దేవదాయ, చుక్కల భూముల వివరాలను సైతం ఈ పంటలో నమోదు చేస్తుండడంతో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎలా నమోదు చేసుకోవాలంటే.. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యాప్‌పై రైతు భరోసా కేంద్రాల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. విత్తనం వేయగానే ప్రతీ రైతు ఆర్బీకేలో పంట వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న 15 రోజుల తర్వాత గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల్లో ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల ఫొటోలను తీస్తున్నారు. ఆ వివరాలతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ను రైతు స్మార్ట్ ఫోన్‌కు పంపిస్తున్నారు. గ్రామ పరిధిలో ఎంతమంది రైతులున్నారు? ఎవరు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో యా‹ప్లో కనిపిస్తుంది. ఈ క్రాప్‌పై అవగాహన కల్పించి దశల వారీగా నమోదును పెంచడానికి వ్యవసాయ శాఖ వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. ఈ క్రాప్ ఆవశ్యకతపై దండోరా వేయిస్తున్నారు. యాప్‌లో ఒకసారి నమోదు చేస్తే సీజన్ ముగిసే వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపకరిస్తుంది. పంట నమోదు తప్పనిసరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు పొందాలంటే పంటల నమోదు (ఈ క్రాప్) తప్పనిసరి. ఈ సారి కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆర్బీ యూడీïపీ యాప్‌లో నమోదు చేసుకుంటే రసీదు కూడా ఇస్తారు. ఈ రసీదు ఉంటే చాలు పంట రుణం, పంటల బీమా, పరిహారం ఏదైనా పొందొచ్చు. కనీస మద్దతు ధరకు దర్జాగా అమ్ముకోవచ్చు. ఖరీఫ్‌లో రైతులందరూ విధిగా తమ పంట వివరాలను ఆర్బీకే సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
వడివడిగా వ్యవసాయం
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగు వడివడిగా సాగుతోంది. సాగుకు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద తొలివిడత పెట్టుబడి సాయం అందించడం, ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడం, విస్తారంగా వానలు కురుస్తుండడంతో రైతులు ఉత్సాహంతో ఏరువాకకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 94.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 8.06 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా కృష్ణాలో 1,19,810 ఎకరాల్లో సాగవగా, అత్యల్పంగా తూర్పుగోదావరి జిల్లాలో 4,728 ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతున్నాయి. సాధారణానికి మించి వర్షపాతం.. సీజన్లో ఇప్పటి వరకు సగటున 140.8 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా, జూలై 11 నాటికే 157.9 ఎంఎం వర్షం కురిసింది. అంటే ఇప్పటికే 17.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పుడిప్పుడే .. గతేడాది పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అన్నదాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరి నారుమళ్లు పోయడం ఊపందుకుంది. ఈసారి మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలనే సాగు చేయాలని ఆర్బీకేల ద్వారా వ్యవసాయ శాఖ చేస్తోన్న విస్తృత ప్రచారం సత్ఫలితాలనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయాధికారులు సూచిస్తున్న రకాల సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. 2.83 లక్షల ఎకరాల్లో వరి సాగు వరిసాగు లక్ష్యం 39.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.83 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఆ తర్వాత వేరుశనగ సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటి వరకు 1.48 లక్షలు, ఇక పత్తి 14.81లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.84 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగిలిన ప్రధాన పంటల్లో చెరకు 50 వేలు, మొక్కజొన్న 37 వేలు, నువ్వులు 28వేలు, కందులు 13వేలు, ఉల్లి 11 వేలు,. రాగులు 10వేల ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తమ్మీద 28 వేల ఎకరాల్లో అపరాలు, 3.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలు, 1.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ సీడ్స్ సాగవగా, ఇతర పంటలు 2.62లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గడచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్ధేశించిన లక్ష్యానికి మించి సాగు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
Fertilizers: రైతన్నకు ఊరట.. బస్తాపై 300- 700 తగ్గింపు!
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఇదో శుభవార్త. అంతర్జాతీయంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా కంపెనీలు భారీగా పెంచిన ఎరువుల ధరలు మళ్లీ దిగి వచ్చాయి. రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచడంతో రైతులకు ఊరట లభించింది. తగ్గిన ధరలు మే 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. డీలర్లంతా తగ్గించిన ధరలకే ఎరువుల్ని విక్రయించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఫాస్పరస్, అమ్మోనియా, పొటాష్, నైట్రోజన్ ధరలు 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో డీఏపీ, కొన్నిరకాల మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరలను కంపెనీలు దాదాపు రెట్టింపు చేశాయి. గతేడాది రబీ సీజన్ ముగిసే నాటికి రూ.1,200 ఉన్న డీఏపీ బస్తా ధరను ఏప్రిల్ నెలలో రూ.2,400కు పెంచాయి. డీఏపీతో పాటు కొన్నిరకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కూడా రూ.100 నుంచి రూ.500 వరకు పెంచాయి. ఖరీఫ్‌లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఆధారంగా రాష్ట్రంలోని రైతులపై రూ.2,500 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి ధరలు పెంచితే ఎలా అంటూ రైతు సంఘాలు గగ్గోలు పెట్టాయి. సబ్సిడీని పెంచి రైతుపై భారం పడకుండా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తి మేరకు డీఏపీపై ఇచ్చే రూ.500 సబ్సిడీని రూ.1200కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు నెలలపాటు ఎగబాకిన ధరలు మళ్లీ దిగి వచ్చాయి. రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్–2020లో 18.39 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 21.70 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం 20.20 లక్షల టన్నులను రాష్ట్రానికి కేటాయించింది. 6.66 లక్షల టన్నుల పాత ఎరువులతో పాటు ఇటీవల 2.58 లక్షల టన్నులను కలిపి 9.24 లక్షల టన్నుల ఎరువులను జిల్లాలకు కేటాయించారు. గడచిన నెల రోజుల్లో 1.33 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 7.91 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూరియా 3.14 లక్షల టన్నులు, డీఏపీ 46 వేల టన్నుల, ఎంవోపీ 64 వేల టన్నులు, ఎస్ఎస్పీ 72 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 3.01 లక్షల టన్నుల మేర నిల్వలున్నాయి. తగ్గిన ధరలకే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కేంద్రం సబ్సిడీ పెంచడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గాయి. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.700 వరకు తగ్గాయి. ఈ ధరలు గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. డీలర్లు ఎవరైనా గతంలో పెంచిన ధరలకు ఎరువుల్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ -
Andhra Pradesh: వ్యవ'సాయమే' లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ముందస్తు వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేయించింది. అధికారం చేపట్టిన నాటినుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలోనూ రైతుల కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి అండగా నిలిచారు. మళ్లీ కోవిడ్ ఉధృతి పెరిగినప్పటికీ ఆ ప్రభావం వ్యవసాయ రంగంపైన, రైతులపైన పడకుండా రానున్న ఖరీఫ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో.. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2021–22) సంబంధించి వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,44,927 కోట్లుగా అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఇందులో పంట రుణాలు రూ.1,13,122 కోట్లు కాగా.. వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.31,805 కోట్లుగా ఉన్నాయి. 92.45 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు కొరత రాకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తోంది. మరోవైపు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌లో అంచనాలను మించి 92.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనా వేసింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు సైతం ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామాల్లోనే సరి్టఫైడ్ నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, ఎరువులతో పాటు రైతులకు ఏది కావాలన్నా ప్రభుత్వమే సమకూరుస్తుడంతో ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు. సాగుకు అండగా పెట్టుబడి సాయం వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. దీంతో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా అందించిన రైతు భరోసా సాయంతో కలిపి ఇప్పటివరకు రైతులకు రూ.17,029 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. సబ్సిడీపై విత్తనాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రానున్న ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. వివిధ రకాల పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.174.02 కోట్లను సబ్సిడీగా భరించనుంది. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకునేందుకు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. గత ఖరీఫ్ నుంచి రైతులకు ఏం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ అసిస్టెంట్లు, ఉద్యాన అసిస్టెంట్లు, సెరి కల్చర్ అసిస్టెంట్లు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొరత లేకుండా ఎరువులు ఈ ఖరీఫ్‌లో అన్నిరకాల ఎరువులు కలిపి 20.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. నాలుగంచెల్లో ఎరువులను నిల్వ ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు, మండల కేంద్రాలు, సబ్ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎరువులను నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టారు. జూన్ తొలి వారం నుంచి రైతులందరికీ ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ముందస్తుగా టెస్ట్ చేసి సర్టిఫైడ్ క్వాలిటీ పురుగు మందులను కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉన్న ఊరిలోనే రైతులకు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. అలాగే రైతులకు అవసరమైన పంట రుణాలను కూడా బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ–పంట పోర్టల్‌లో నమోదైన రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలను అందజేస్తాయి, -
మే 13న తొలివిడత రైతు భరోసా
సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్ సాగు నిమిత్తం వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. గతేడాది లబ్ధిపొందిన వారితో పాటు గత రెండేళ్లుగా లబ్ధిపొందని అర్హుల కోసం ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుకు గడువిచ్చింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రైతులకు పీఎం కిసాన్ సాయం రూ.6వేలతో పాటు రైతుభరోసా కింద రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500లు చొప్పున పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో అందిస్తోంది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానుల ఖాతాల్లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500లు, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేల చొప్పున జమచేస్తున్నారు. ఎలాంటి భూమి లేని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతు కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న రైతు కుటుంబాలకు ఈ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2019–20లో 46,69,375 మంది రైతు కుటుంబాలకు రూ.6,173కోట్లు.. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు సాయం అందించారు. అలాగే, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారు తొలి ఏడాదిలో 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఏటేటా పెరుగుతున్న ‘భరోసా’ తొలి ఏడాది పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2,525 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.3,648 కోట్లు సాయం అందించింది. గతేడాది కేంద్రం రూ.2,966 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,962 కోట్లు అందించింది. ఇక ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అర్హత పొందిన 54 లక్షల మంది లబ్ధిదారులకు 3 విడతల్లో రూ.7,290 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద రూ.3,060 కోట్లు, రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4,230 కోట్లు అందించనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అర్హత పొందిన రైతు కుటుంబాల్లో 51లక్షల మంది భూ యజమానులు కాగా, 3లక్షల మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారున్నారు. ఖరీఫ్ తొలి విడత సాయం మే 13న.. ఈ ఏడాది ఖరీఫ్ తొలి విడత సాయాన్ని మే 13న అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గత నెల 22 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆర్బీకే స్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఇందులో అర్హులై ఉండి గతంలో లబ్ధిపొందని వారిని గ్రీవెన్స్ పోర్టల్‌లో పొందుపర్చారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అనుసంధానం కాని ఖాతాలు కలిగిన రైతులను సంబంధిత బ్యాంకుల ద్వారా అనుసంధానించేందుకు అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు ఎవరైనా ఉంటే వారి కోసం ఏప్రిల్ 30 వరకు గడువునిచ్చారు. తుది జాబితాను మే 10న వెల్లడిస్తారు. అర్హులు సద్వినియోగం చేసుకోండి వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటివరకు అర్హత పొందని అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 30లోగా ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు అర్హత పొందిన వారి జాబితాలను ప్రదర్శిస్తున్నారు. వారిలో అనర్హులను గుర్తించి తెలియజేస్తే వారికి లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకుంటాం. – హెచ్ అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
రికార్డు స్థాయిలో ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు మరియు రుణాలను అందించడం వల్ల కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో కూడా రికార్డు స్థాయిలో సాగు సాధ్యమైందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రభుత్వం ప్రధాన పథకాలను సకాలంలో అమలు పరచడం, రైతులు కూడా సకాలంలో వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇది సాధ్యపడిందని తెలిపారు. ఖరీఫ్ సీజను గణాంకాల వివరాలు నమోదు కు అక్టోబరు 2, 2020 చివరి తేదీ కాగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1095.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగైనట్టు వెల్లడించారు. ► వరి పంట గత సంవత్సరం 365.92 లక్షల హె క్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 396.18 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది ఇదే సీజనుతో పోలిస్తే 8.27% సాగు విస్తీర్ణం పెరిగింది. ► కాయ ధాన్యాలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాగు 136.79 లక్షల హెక్టార్లుగా ఉండగా గత సంవత్సరం 130.68 లక్షల హెక్టార్లుగా ఉంది. 4.67% మేర సాగు విస్తీర్ణం పెరిగింది. ► తృణధాన్యాలు గత సంవత్సరం ఖరీఫ్‌లో 176.25 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఈ సంవత్సరం 179.36 లక్షల హెక్టార్లు సాగు లో ఉంది. 1.77% సాగు విస్తీర్ణం పెరిగింది. ► నూనె గింజలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 194.75 లక్షల హెక్టార్లలో సాగవ్వగా గత సంవత్సరం 174.00 లక్షల హెక్టార్లలో సాగైంది. అంటే 11.93% సాగు విస్తీర్ణం పెరిగింది. ► చెరుకు గత సంవత్సరం 51.71 లక్షల హెక్టార్లలో సాగుచేయగా ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 52.38 లక్షల హెక్టార్లలో సాగు అవుతోంది. 1.30% సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదయ్యింది. ► పత్తి గత సంవత్సరం 124.90 లక్షల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్‌లో 128.95 లక్షల హెక్టార్లలో సాగు నమోదయ్యింది.గత సంవత్సరంతో పోలిస్తే 3.24% సాగు విస్తీర్ణం పెరిగింది. ► జనపనార ఈ ఏడాది 6.97 లక్షల హెక్టార్లు కాగా... గత సంవత్సరం 6.86 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. 1.68% పెరిగిన సాగు విస్తీర్ణం. కలిసి వచ్చిన వర్షపాతం ► ఈ ఏడాది సెప్టెంబరు 3 నాటికి దేశంలో సాధారణ వర్షపాతం 730.8 మి.మి. కాగా ఈ సంవత్సరం 795.0 మి.మి. వర్షపాతం నమోదైంది. 9% ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
ఖరీఫ్.. సాగు బాగు
సాక్షి, అమరావతి: పుడమి తల్లికి పచ్చని తివాచీ పరిచినట్లుగా ఖరీఫ్ సాగు జోరుగా సాగుతోంది. తొలకరి పలకరించిన నాటి నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలలో వర్షపాతం సాధారణానికి మించి నమోదైంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 30.88 లక్షల హెక్టార్లలో(83 శాతం) పంటలు సాగవుతున్నాయి. ఈనెలాఖరు వరకు గడువున్నందున ఈ ఏడాది లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ చర్యలు, ముందుగానే అందిన వైఎస్సార్ రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా మేలైన విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతన్నలు హుషారుగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రికార్డు స్థాయిలో నూనెగింజల సాగు.. ► ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు లక్ష్యం 14.97 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 12.20 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 11.40 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. ► సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 20.76 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 16.03 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. గతేడాది కంటే లక్ష హెక్టార్లలో సాగు పెరిగింది. ► నూనె గింజల సాగు లక్ష్యం 7.66 లక్షలహెక్టార్లు కాగా ఇప్పటికే 7.84 లక్షల హెక్టార్లకు చేరింది. 7.50 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగులో ఉంది. ► పత్తి సాగు విస్తీర్ణం 6.08 లక్షల హెక్టార్లు కాగా 5.54 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. ► మిర్చి, ఉల్లి, పసుపు సాగు ఊపందుకుంది. సీజన్ ముగిసే నాటికి లక్ష్యానికి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ► కొన్ని పంటలకు అక్కడక్కడ తెగుళ్లు సోకినట్లు గుర్తించడంతో నివారణకు గన్నవరంలోని వ్యవసాయ సమగ్ర కాల్ సెంటర్ ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సుమారు పది లక్షల ఎకరాలలో ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు వేయనున్నారు. ఎరువుల కొరత లేదు.. ‘రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదు. ఖరీఫ్ సీజన్లో 11.54 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12.01 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 7.83 లక్షల టన్నుల నిల్వలున్నాయి. యూరియా 2.37 లక్షల టన్నులు, డీఏపీ 91వేల టన్నులు, మ్యూరేట్ పొటాషియం 74 వేల టన్నులు, ఎస్ఎస్పీ 6 వేల టన్నులు, కాంప్లెక్స్ 3.09 లక్షల టన్నులు, ఇతర ఎరువులు 6 వేల టన్నులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 2.71 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించి కేంద్ర ఎరువులు, రసాయన శాఖ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ వర్షపాతం ఇలా ► ఖరీఫ్ సీజన్లో కురవాల్సిన వర్షం 556 మిల్లీమీటర్లు ► ఇప్పటికి కురవాల్సిన వర్షం 412.5 మీల్లీమీటర్లు ► ఇప్పటిదాకా కురిసిన వర్షం 491.7 మిల్లీ మీటర్లు ► ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు మిగులు వర్షపాతంలో ఉన్నాయి. ► విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా స్వల్ప లోటులో ఉంది. -
నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం..
-
ఉరిమే ఉత్సాహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అన్నీ శుభ సూచికలు కనిపిస్తుండటంతో రైతన్నలు ఆనందోత్సాహాలతో ఏరువాక సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ), వాతావరణ నిపుణులు ప్రకటించారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.7,500 చొప్పున జమ చేయడంతో ఖరీఫ్‌లో అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగుకు అన్నదాతలు ఆనందోత్సాహాలతో కదులుతున్నారు. మరోవైపు కల్తీలు, నకిలీలకు ఆస్కారం లేకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నకిలీ విత్తనాలు/కల్తీల వల్ల నష్టపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీన్ని నివారించి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఎంత కావాలన్నా 48 గంటల్లోగా నాణ్యమైనవి సర్టిఫై చేసి సమకూరుస్తోంది. తమ ఊరిలోనే గడప వద్దే విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తాయి. వ్యయ ప్రయాసలు ఉండవు. మరోవైపు ప్రభుత్వం విత్తన చట్టాన్ని పటిష్టం చేసింది. ఎక్కడైనా నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోతే పరిహారం అందేలా విత్తన చట్టాన్ని పకడ్బందీగా రూపొందించింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకుంటే ప్రభుత్వమే ఆర్బీకేలా ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ తమకు మేలు చర్యలు కావడంతో అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని ఆనందంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడం, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలను అనుసరిస్తుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం.. నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకడం ద్వారా భారత్ భూభాగంపై ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈనెల 5వ తేదీ ఏరువాక పౌర్ణమి కాగా దాదాపు సకాలంలో అంటే జూన్ 10వతేదీలోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. గతేడాది జూన్ 16న నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అనుకూల వాతావరణ పరిస్థితులున్నందున నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ‘వచ్చే 12 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. సోమవారం సాయంత్రానికి గానీ రాత్రికిగానీ కేరళను తాకే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. ‘పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు సోమ లేదా మంగళవారం కేరళలో ప్రవేశిస్తాయి. తదుపరి ఇవి జూన్ రెండోవారం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. తదుపరి కోస్తాంధ్ర, తెలంగాణకు విస్తరిస్తాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారించిన తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఒకరోజు అటు ఇటుగా చెప్పవచ్చు’ అని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మంచి సంకేతమే.. ‘ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయి. జూన్ పదో తేదీకల్లా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపనవాలు రాకముందు ఈ సీజన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురవడం రివాజే. ఇలా జరగడం మంచి సంకేతమే’ అని ఐఎండీ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. అరేబియాలో అల్పపీడనం – నేడు, రేపు కోస్తా, సీమలో తేలికపాటి జల్లులు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తుపానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెంమీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
సాగు భళా.. రుణం వెలవెల
రైతును వరుణుడు కరుణిస్తున్నా... బ్యాంకులు మాత్రం దయ చూపడంలేదు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరుమీదున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇటువంటి తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ రైతును ఇబ్బంది పెడుతున్నాయి. గత వారం పది రోజులుగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ వర్షాలు లేక ఆగిన వరి నాట్లు ఇక పుంజుకోనున్నాయి. వారం రోజుల క్రితం వరకు 28 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 17 జిల్లాలకే పరిమితమైంది. – సాక్షి, హైదరాబాద్ సాగు విస్తీర్ణాలిలా... - ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 75.81 లక్షల (70%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 41.96 లక్షల (97%) ఎకరాల్లో సాగైంది. - ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.90 లక్షల (33%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో అవి ఊపందుకోనున్నాయి. - మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.26 లక్షల (66%) ఎకరాల్లో సాగైంది. - పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.11 లక్షల (78%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.20 లక్షల ఎకరాలు, ఇప్పటివరకు 6.19 లక్షల (85%) ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ దాని సాధారణ సాగులో 80 శాతం వేశారు. 40 లక్షల మందికి.. పెట్టుబడి సాయం.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈసారి రైతులకు పెట్టుబడికింద ఇచ్చే రైతుబంధు సొమ్ము సరఫరా ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 40 లక్షల మందికి రూ. 4,400 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుబంధు సొమ్ము వచ్చినట్లుగా తమకు మెసేజ్‌లు వచ్చాయని, కానీ బ్యాంకుల్లో సొమ్ము పడలేదని కొందరు రైతులు ఆందోళనతో వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశారు. మూడో వంతే రుణాలు.. సాగు విస్తీర్ణం 70 శాతం కాగా, పంట రుణాలు మాత్రం లక్ష్యంలో దాదాపు 34 శాతానికే పరిమితమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ. 29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.10 వేల కోట్లకే పరిమితమైందని తెలిపాయి. వాస్తవంగా పంటల సాగు కంటే అంటే మే నెల నుంచే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇప్పటికీ సాగు శాతంలో ఇచ్చిన రుణాలు సగమే. మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి. బ్యాంకుల వాదన ఇదీ.. 2015–16 సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు పేరుకుపోయిన రూ.777 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం తమకు చెల్లించలేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటంతో రిజర్వుబ్యాంకు నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అంటున్నారు. మరోవైపు పంటల రుణమాఫీపై తమకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, దీంతో రైతులు బకాయిలు చెల్లించడంలేదని చెబుతున్నారు. పాత రుణాలను రైతులు రీషెడ్యూల్ చేసుకోకపోతే నిబంధనల ప్రకారం తాము కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు. -
నైరుతి.. నత్తనడక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడి గాలిలోని తేమ అటువైపు వెళ్తుండటంతో రుతుపవనాలు మందకొడిగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందన్నారు. ఈ నెల 16 నాటికి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీ వరకూ నమోదు కావడం గమనార్హం. సాధారణం కంటే మూడు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ రెండ్రోజులు ఆలస్యంగా అంటే ఈ నెల 8న కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తర్వాత ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారుతోంది. పోనీ ఈ నెల 16వ తేదీనైనా కచ్చితంగా వస్తాయా? లేదా? అన్న అనుమానాలను కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారం సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది జూన్ 8నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఇప్పుడు మరింత ఆలస్యం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఖరీఫ్ సాగుపై ఆందోళన... నైరుతి రుతుపవనాలు ఇంకా కేరళ దాటి పైకి రాలేదు. తెలంగాణలోకి ఎప్పుడు వస్తాయో స్పష్టత రావడంలేదు. ఈపాటికి రుతువపనాలు వచ్చి వర్షాలు కురిస్తేనే రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ వేడి సెగలు కక్కుతుండటం, వర్షాలు లేకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతుండటంతో కొందరు రైతులు ఇవే రుతుపవనాల వర్షాలుగా భావించి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. కానీ అధిక ఉష్ణోగ్రతలతో అవి భూమిలోనే మాడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే సూచనలున్నాయి. గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయితే, ఈసారి అదనంగా 7 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉం టుందోనని రైతులను, వ్యవసాయాధికారులు ఆందో ళన చెందుతున్నారు. అనేకచోట్ల ఇప్పటికీ 40–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, రామగుండంలో 44, మెదక్, నిజామాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడితో భూమి సెగలు కక్కుతోంది. దుక్కి దున్నుతుంటే వేడి పైకి వస్తోందని రైతులు అంటున్నారు. ఉపరితల ఆవర్తనం.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
కొత్త రుణం ఒక్కటీ లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కనీసం ఒక్క కొత్త రుణం కూడా రైతులకు మంజూరు కాలేదు. ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలన విషయంగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పాత బాకీలు చెల్లించిన రైతులకే రెన్యువల్స్ చేసి ఖరీఫ్ పంట రుణాలు ఇస్తున్నాయి తప్ప మిగిలినవారెవ్వరికీ ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని బ్యాంకులు గత నెలలో సర్కారుకు పంపిన పంట రుణాల నివేదికలో వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. భూప్రక్షాళనలో ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మందికి పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకోకుండా రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారం సరిచూసుకున్నాకే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యం కాలేదు. ధరణి వెబ్సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ధరణి వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీని తీసుకొని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశించాలని రైతులు, వ్యవసాయాధికారులు కోరుతున్నారు. 30 శాతానికే పరిమితం..! రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 84.56 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 78 శాతం విస్తీర్ణంలో సాగైంది. కానీ పంట రుణం 30 శాతానికే పరిమితమైంది. ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు. కాగా, తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ.7,300 కోట్లే ఇచ్చాయి. సాగు విస్తీర్ణానికి, రుణాల విడుదలకు భారీ తేడా ఉంది. గత నెల 20 నాటికి పంట రుణాలు ఎన్ని ఇచ్చాయో సమగ్ర నివేదికను బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు రుణాలు తీసుకున్న రైతులంతా బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. వేరే ఏ రైతుకూ కొత్తగా పంట రుణం ఇవ్వలేదని బ్యాంకు నివేదిక చెబుతోంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. -
పత్తి దిగుబడులు మటాష్..!
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు.. నకిలీ విత్తనాలు.. గులాబీరంగు కాయ తొలుచు పురుగు.. ఈ మూడు అంశాలు రాష్ట్రంలో పత్తి దిగుబడులను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో ఎన్నో ఆశలతో పత్తి పంట వేసిన రైతన్న పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అకాల వర్షాలు, గులాబీరంగు పురుగు కారణంగా రాష్ట్రంలో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ నెలలో మార్కెట్‌కు పత్తి భారీగా తరలిరావాల్సి ఉండగా, ఆ పరిస్థితి ఏ మార్కెట్లోనూ కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్లో రోజుకు 20 వేల క్వింటాళ్ల పత్తి తరలిరావాలి. కానీ ఐదారు వేల క్వింటాళ్లకు మించి రావడం లేదని చెబుతున్నారు. ఈ సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని మొదట్లో అంచనా వేయగా, ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పండించిన పత్తిలో దాదాపు సగం వరకు ఇప్పటికే మార్కెట్‌కు రావాల్సి ఉంది. కానీ మార్కెటింగ్ శాఖ లెక్క ప్రకారం ఈ నెల 4 నాటికి 64.12 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) 13.34 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 50.78 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సగానికి తగ్గిన ఉత్పాదకత.. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తి వైపే మొగ్గారు. కానీ పత్తి రైతులకు తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. అక్టోబర్‌లో భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. 15 జిల్లాల్లో మూడో వంతు పత్తి కాయలోని గింజలు మొలకెత్తాయి. వర్షాలతో పత్తి నల్లరంగులోకి మారింది. దీంతో దిగుబడి గణనీయం గా పడిపోయింది. మరోవైపు పత్తికి గులాబీ రంగు పురుగు సోకింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ పురుగు ఉధృతమైంది. విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ వర్షాలు పడినా.. పురుగు నాశనం కాకపోగా.. మరింత విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండటంతో దిగుబడులు దారుణంగా పడిపోయాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టి పంటంతా సర్వనాశ నమైంది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్లు రావాలి. ఒక్కోసారి 13–14 క్వింటాళ్ల వరకు వస్తుంది. కానీ అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించలేదు. నకిలీలు.. అనుమతిలేని పత్తి విత్తనాలూ బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో గులాబీ పురుగు రాష్ట్రంలో పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను కుదేలు చేసింది. గులాబీ పురుగు ఉధృతితో తీవ్ర నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాలను కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో బీజీ–3 విత్తనం 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు. మూడు నెలల క్రితం ప్రభుత్వం వివిధ డీలర్ల నుంచి పత్తి సహా ఇతర విత్తనాల శాంపిళ్లను సేకరించింది. వాటిని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీకి పంపింది. డీఎన్ఏ పరీక్షల్లో 100కు పైగా శాంపిళ్ల విత్తనాల్లో మొలకెత్తే లక్షణం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో 95 శాతం పత్తి విత్తనాలే. మొత్తంగా ఈసారి పత్తి దెబ్బకు రాష్ట్రంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. -
19.78 కోట్ల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
► 5.40 కోట్ల ఎకరాల్లో వరి.. 2.45 కోట్ల ఎకరాల్లో పత్తి ► 2.87 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు.. జాతీయ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రుతుపవనాలు సకాలంలో రావడమే ఇందుకు కారణమని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 19.14 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ ఏడాది 19.78 కోట్ల ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది. మొత్తం సాగులో 5.40 కోట్ల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, పప్పుధాన్యాల పంటలు 2.87 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గతేడాది కంటే 73 లక్షల ఎకరాలు పెరిగింది. రాష్ట్రంలో మాత్రం పప్పుధాన్యాల సాగు పెద్దగా పుంజుకోలేదు. వీటి సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి 12.12 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేశారు. ఇక గతేడాది దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైతే, ఈసారి 2.45 కోట్ల ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణలో గతేడాది ఇదే కాలంలో 26.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే, ఈ ఏడాది ఇప్పటివరకు 42.17 లక్షల ఎకరాల్లో వేయడం గమనార్హం. -
అప్పు పుట్టదే?
♦ సమయం మీరినా అందని రుణాలు ♦ బ్యాంకుల చుట్టూ తిరిగినా నిష్ర్పయోజనం విధిలేక ప్రైవేట్ అప్పులు ♦ అందని కరువు సాయం ఇబ్బందుల్లో రైతులు ♦ నేడు కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం సాక్షి, సంగారెడ్డి: ఇప్పుడిప్పుడే వర్షాలు జోరందుకోవడంతో రైతులు ఖరీఫ్ సాగుపై దృష్టిసారించారు. అయితే చేతిలో పైకం లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడోవిడత రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు ఇవ్వడం లేదు. పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులు, పంట నష్ట పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం (డీసీసీ) జరగనుంది. ఈ సమావేశంలో ఖరీఫ్ రుణాల మంజూరు, రుణమాఫీ, పంటనష్ట పరిహారం చెల్లింపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకర్ల మీటింగ్తోనైనా ఖరీఫ్ రుణ మంజూరులో వేగం పెరిగితే బాగుంటుందన్న భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.1,770 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెల్సిందే. బ్యాంకుల వారీగా ఖరీఫ్ రుణ లక్ష్యాలను నిర్దేశించినా మంజూరృులో మాత్రం నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత రెండేళ్లుగా కరువు బారిన పడిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో రుణం కోసం బ్యాంకర్లు వైపు చూస్తున్నారు. సాగుకు అవసరమైన మేర పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయకపోవటంతో విత్తనాలు విత్తుకునే సమయం దాటిపోతుందనే భయంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని సాగు పనులు మొదలు పెడుతున్నారు. ఇకనైనా బ్యాంకర్లు రుణాల మంజూరును వేగవంతం చేస్తే మేలు జరుగుతుందని రైతు నాయకులు చెబుతున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూపులు.. మూడో విడత రుణమాఫీ డబ్బులు ఇంకా రైతులు ఖాతాలో జమకాలేదు. దీంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారు. 2014-15లో 3,96,191 మంది రైతుల ఖాతాల్లో రూ.483 కోట్లు రుణమాఫీ డబ్బులను జమచేయటం జరిగింది. అలాగే రెండవ విడతగా 2015-16 సంవత్సరానికి మరో రూ.483 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులను రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. కాగా మూడవ విడత రుణమాఫీ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమచేయలేదు. మూడో విడత రుణమాఫీ డబ్బులు సైతం రెండు విడతల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మూడో విడత రుణమాఫీకి సంబంధించి మొదటివిడతగా రూ.240 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి తమకు సమాచారం లేదని బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందని కరువు సాయం ఏడాదిగా రైతులు పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరువు కారణంగా ఆరుతడిపంటలతోపాటు బోరుబావులు కింద సాగు చేసిన పంటలు సైతం నష్టపోయాయి. గత ఏడాది ఖరీఫ్‌లో 33శాతానికిపైగా 2.72 లక్షల హెక్టార్లలో రూ.197.97 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పంటనష్టం దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అధికారులు జిల్లాలోని 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు రూ.197.97 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేశారు. కేంద్ర కరువు సహాయక బృందం అధికారులు కరువు సాయంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. దీంతో పరిహారం త్వరగానే అందుతుందని రైతులు భావించారు. అయినా ఇంత వరకు కరువు సాయం రైతులకు అందలేదు. -
అదునులో అత్తెసరు ఖరీఫ్ సాగు అరకొరే..!
♦ జూన్ 22 నాటికి 16.8 మి.మీ తక్కువ వర్షపాతం ♦ అన్నదాతలతో మేఘుడి దోబూచులాట ♦ కారుమబ్బులు.. చిరు జల్లులకే పరిమితం ♦ జూన్ ముగుస్తున్నా పదునెక్కని పొలాలు ♦ గిద్దలూరు ప్రాంతంలో మాత్రం ఒక మోస్తరు వర్షం ♦ వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపు మేఘాలు అన్నదాతలతో దోబూచులాడుతున్నారుు.. మురిపించి మొహం చాటేస్తున్నారుు. ఈ ఏడాది ప్రారంభంలో ముందస్తుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పదే పదే ప్రకటించినా ఇప్పటి వరకు జిల్లాలో చిరు జల్లులు మినహా పొలాలు పదునెక్కే వ ర్షం కురవలేదు. నైరుతి రుతుపవనాలు చినుకు రాల్చక అన్నదాత ఆశలపై నీళ్లు చల్లాయి. మే, జూన్ ప్రారంభంలో ఓ మోస్తరు వర్షాలు కురిసినా పొలాలు పదునెక్కలేదు. మరోసారి మంచి వర్షాలు పడితే ఖరీఫ్ సాగు ఆరంభిద్దామని అన్నదాతలు భావిస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గిద్దలూరు నియోజకవర్గం మినహా మరెక్కడా సరైన వర్షాలు కురవలేదు. చిరుజల్లులు తప్ప పదును వర్షం కురవలేదు. దీంతో పొలాలు ఇంకా బీళ్లుగానే ఉన్నారుు. ఖరీఫ్ సాగు అంతంతమాత్రంగానే సాగుతోంది. జనవరి నుంచి జూన్ 22వ తేదీ నాటికి 147.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 130.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో ఎక్కువ మంది అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకొని పచ్చిరొట్ట, పిల్లిపెసర తదితర పంటలు వేశారు. అక్కడక్కడా కంది, సజ్జ సాగు చేశారు. మరోమారు మంచి వర్షాలు కురిసి నేల పదునైతే గాానీ జిల్లా వ్యాప్తంగా కంది, పత్తి, పొగాకు, సజ్జ తదితర పంటలు సాగయ్యే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 66,026 హెక్టార్లలో పత్తి, 53,611 హెక్టార్లలో కంది, 32,185 హెక్టార్లలో వరి, 22,943 హెక్టార్లలో మిరప, 17,030 హెక్టార్లలో సజ్జ, పెసర, మినుము, వేరుశనగ, పొద్దు తిరుగుడు, చెరకు, పొగాకు తదిపంటలు సాగు కావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 2,35,857 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,043 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ♦ గిద్దలూరు నియోజకవర్గంలో మంచి వర్షం కురిసింది. చిన్నచిన్న కుంటలు, చెరువులకు అరకొర నీరు చేరింది. పదును కావడంతో పొలాలు దుక్కిలు దున్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం నువ్వులు, కంది, సజ్జలతో పాటు కొంత మేర పచ్చిమిరప సాగు చేస్తున్నారు. ♦ దర్శి నియోజకవర్గంలో పదును వర్షం కురిసింది. గతంలో వేసిన పెసర దెబ్బతినడంతో దాన్ని చెడగొట్టి కంది పంటను సాగు చేస్తున్నారు. ఇక ప్రధానంగా నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ పరిధిలో 1,70,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, 80 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఉంటుంది. నీళ్లొస్తే వరి నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండేళ్లుగా వర్షాల్లేకపోవడంతో ఎన్ఎస్పీ కింద పొలాలు బీడుగా ఉన్నాయి. ♦ అద్దంకి నియోజకవర్గంలో పదును వర్షం కురిసింది. బీటీ ప్రత్తి విత్తనాలు సాగు చేస్తున్నారు. కంది పంట వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. అక్కడ సజ్జ, జొన్న పంటలను సాగు చేశారు. మరింత వర్షం కురిస్తే కంది, పత్తి, పెసర సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ చీరాల నియోజకవర్గంలో కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. పదును కాలేదు. దీంతో పొలాలు బీళ్లుగానే ఉన్నారు. కొమ్మూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. నాగార్జున సాగర్ నీరొస్తేనే వరి సాగవుతుంది. మరోమారు వర్షం కురిస్తే పెసర, శనగ, మిరపతో పాటు పొగాకు నాటుతారు. ♦ యర్రగొండపాలెం మండలంలో వర్షాల్లేవు. వర్షం కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. మే నెలలో మాత్రమే కొద్దిపాటి వర్షం కురవడంతో దుక్కులు సిద్ధం చేశారు. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మంచి వర్షం కురిస్తే కంది, మిరప, ప్రత్తి సాగు చేస్తారు. ♦ కందుకూరు నియోజకవర్గంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. పచ్చిరొట్ట, జీలుగ, పిల్లి పెసర వేశారు. మరోమారు వర్షం కురిస్తే కంది సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ కనిగిరి నియోజకవర్గంలో కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. కురిసిన వర్షానికి పొలాలను సిద్ధం చేశారు. పదును వర్షం కురిస్తే కంది వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ కొండపి నియోజకవర్గంలో ఒక మోస్తరు వర్షం మాత్రమే కురిసింది. నువ్వు పంటకు అనుకూలంగా ఉండటంతో ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో సాగు చేశారు. మరోమారు వర్షం వస్తే కంది వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ మార్కాపురం నియోజకవర్గంలో వర్షం నామమాత్రంగానే కురిసింది. పొలాలు దుక్కులు దున్ని పెట్టుకున్నారు. మరోమారు పదును వర్షం వస్తే కంది, సజ్జ పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ♦ పర్చూరు నియోజకవర్గంలో ఇటీవల పదును వర్షం కురవడంతో దుక్కులు సిద్ధం చేసుకున్నారు. మరోమారు వర్షం కురిస్తే ప్రత్తి సాగు చేసేందుకు అనుకూలం. కారంచేడు ప్రాంతంలో సాగర్ నీళ్లు వస్తేనే వరి సాగు చేస్తారు. ♦ సంతనూతలపాడు నియోజకవర్గంలో పొలాలు పదును కావడంతో రైతులు దుక్కులు పూర్తి చేశారు. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. సాగర్ నీరు వస్తే వరి సాగు చేస్తారు. -
చి‘వరి’కి చుక్కెదురు!
♦ నల్లవాగు ప్రాజెక్టు కాల్వలు, తూములు అధ్వానం ♦ చివరి ఆయకట్టుకు నీటి సరఫరా ప్రశ్నార్థకం ♦ ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలు కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతన్నలకు కన్నీటి కష్టాలు తప్పేట్టు లేదు. కాల్వలు శిథిలస్థితికి చేరినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారుతోంది. తుంది. ప్రస్తుతం వర్షకాలం ప్రారంభం కావడంతో రైతులకు ఖరీఫ్ బెంగ పట్టుకుంది. ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్న రైతులు బోర్ల ద్వారా సాగు చేసే పరిస్థితి నెలకొంది. గతంలో కాల్వల మరమ్మతుల పేరిట నిధులు ఖర్చు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు స్వలాభం చూసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.14 కోట్లతో ప్రాజెక్టు కాల్వల సీసీ లైనింగ్ చేపట్టినా నాణ్యత లేకపోవడంతో శిథిలమయ్యాయి. పోచాపూర్, బీబీపేట, మార్డి, కృష్ణపూర్, అంతర్గాం తదితర చోట్ల కాల్వలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా చివరి ఆయకట్టు పరిధిలోని కల్హేర్, మార్డి, ఇందిరానగర్, కృష్ణపూర్ గ్రామాల వరకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొంది. నల్లవాగు ప్రాజెక్టును పూర్తిగా ఆధునికరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గతంలో హామీ ఇచ్చారు. వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇక ఇప్పట్లో పనులు జరిగే అవకాశమే లేదు. ప్రాజెక్టు నేపథ్యం నల్లవాగు ప్రాజెక్టు 1965లో రూ.90 లక్షలతో నిర్మాణం జరిగింది. అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రారంభించారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1,493 ఫీట్లు. ప్రాజెక్టు కూడి కాల్వ పరిధిలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణపూర్, మార్డి, ఇందిరానగర్, కల్హేర్‌లో 4,100 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ఎమర్జెన్సీ కెనాల్ కింద 60 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలోని బొక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు కాల్వలకు చెందిన తూములు, సైఫాన్లు దెబ్బతిన్నాయి. కట్టపై పలుచోట్ల పగుళ్లు ఏర్పడమే కాకుండా ప్రాజెక్టులో పూడిక నిండింది. పూడిక కోసం అధికారులు హైడ్రాలికల్ సర్వే చేపట్టినా పూడికతీత జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పంట రుణమేదీ ?
ఇంకా ఖరారు కాని ప్రణాళిక ఖరీఫ్ సాగుకు రైతుల సమాయత్తం {పభుత్వ సాయం కోసం ఎదురుచూపులు హన్మకొండ: రోహిణి కార్తె ప్రవేశంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. వర్షం పడితే విత్తనాలు వేసేందుకు సమాయత్తమయ్యారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంకా ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక సిద్ధం కాలేదు. జిల్లాలో దాదాపు ఏడు లక్షల మంది రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 5,02,819 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా అధికార యంత్రాంగం, లీడ్ బ్యాంకు ఇప్పటికీ ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక రూపొందించలేదు. ఏయే బ్యాంకులు ఎంత మంది రైతులకు, ఎంత విస్తీర్ణం మేరకు రుణాలిస్తాయో ఇప్పటి వరకు ప్రకటించలేదు. వర్షాలు సకాలంలో పడితే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడానికి, దుక్కులు దున్నడానికి డబ్బులు అవసరం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అరుుతే బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి 25 శాతం చొప్పున ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో 50 శాతం రుణ మాఫీ చేసింది. ఖరీఫ్ నాటికి మరో 25 శాతం రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరువు మండలాలు 11.. జిల్లాలోని 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అరుుతే వాస్తవానికి జిల్లా అంతటా కరువు నెలకొంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయూరు. ఈ ఏడాదైనా వ్యవసాయానికి ఆర్థిక చేయూతనందించాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణ ప్రణాళిక ప్రకటించాలని, రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖరీఫ్‌లో వరి 1.66 లక్షల హెక్టార్లు, జొన్న 168 హెక్టార్లు, మొక్కజొన్న 55 వేలు, పెసర 23 వేలు, మినుములు 1000 హెక్టార్లు, కందులు 12 వేలు, పత్తి 2.10 లక్షల హెక్టార్లు, మిర్చి 12 వేలు, పసుపు 15 వేల హెక్టార్లు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే పత్తి సాగును సగానికి తగ్గించి, ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీంతో ఖరీఫ్ పంట అంచనా ప్రణాళికలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
అక్కరకు రాని వర్షాలు లెక్కలోకా?
మచిలీపట్నం : అక్కరకు రాని వర్షాలు లెక్కలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపించింది. జూన్ మొదట్లో కురిసిన వర్షాలు ఖరీఫ్ సాగుకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా.. వాటినీ ప్రాతిపదికగా తీసుకోవటంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల పంటలకు నష్టపరిహారం మంజూరుకాక నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా అందని పరిహారం... కరువు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు నష్టపరిహారాన్ని అందించాలి. కరువు మండలాల్లో ఎకరం వరికి రూ.6 వేలు చొప్పున పంట నష్టపరిహారంగా చెల్లించాలి. పంట నష్టం జరిగినట్లు లేదా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు రికార్డులు రాయడమే తప్ప పరిహారం సకాలంలో అందించిన దాఖలాలు లేవు. మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్లీ కరువు మండలాల ప్రకటన వెలువడింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కరువు ఛాయలు అలముకున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇక్కట్లపాలయ్యారు. అష్టకష్టాలు పడి సాగుచేసిన పైరును కాపాడుకుంటే పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురిసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనావృష్టి, అతివృష్టి కారణంగా రైతులు నష్టపోయారు. ఈ తరుణంలో ఈ నెల 21న ప్రభుత్వం జిల్లాలో 14 కరువు మండలాలను గుర్తిస్తూ జీవో నంబరు ఒకటిని జారీ చేసింది. వర్షాభావం తదితర కారణాలతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసుకోలేని రైతులకు, చేసినప్పటికీ నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం సకాలంలో ఇస్తే రబీ సీజన్లో పంటలు వేసుకునేందుకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ పరిహారం ఎప్పటిలోగా అందిస్తారనేది ప్రశ్నార్థకమే. ప్రకటించింది పద్నాలుగే... జిల్లాలో 14 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, నందివాడ, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, నూజివీడు, బాపులపాడు, గన్నవరం, విస్సన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెంలను కరువు మండలాలుగా ప్రకటించారు. వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంకిపాడు, ఆగిరిపల్లి, పమిడిముక్కలలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. ఈ విషయంపై వ్యవసాయాధికారులను ప్రశ్నించగా.. వర్షాభావం ఒక్కటే కాదని, పంటలు సాగు చేసిన విస్తీర్ణం, ఆ పంటల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటిస్తారని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షం నమోదైంది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి నేలవాలి నీటిలో మునిగిపోయింది. రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉండగా కేవలం 14 కరువు మండలాలను ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు నష్టపోయిన రైతులకు అందని పరిస్థితి నెలకొంది. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరువు మండలాల జాబితాను రూపొందించాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. -
భరోసాకు ఎసరు
♦ ఎకరా వరికి బీమా రూ.17,750కే పరిమితం ♦ కుదించిన ఏఐసీ, ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ♦ విపత్తుల్లో వచ్చేది అరకొర పరిహారమే ♦ ఖరీఫ్ సాగుపై విరక్తి చెందుతున్న రైతాంగం పీకల లోతు మునిగినవారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎవరైనా చేయందిస్తారు. ప్రస్తుత పాలకులు మాత్రం ఆపదకాలంలో మొండి చేయి చూపి వారిని మరింత ముంచేస్తున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతును ఆదుకోవాల్సింది పోయి.. వారు సాగంటనే భయపడేలా చేస్తున్నారు. తాజాగా బీమా భరోసాను కూడా కుదించి వేసి వ్యవసాయాన్ని గాలిలో దీపంగా మార్చివేస్తున్నారు. అమలాపురం : జిల్లాలో ఖరీఫ్ సాగు జూదంగా మారింది. అనావృష్టితో సాగు ఆరంభంలో నీటి కోసం పడరాని పాట్లుపడడం.. తీరా పంట చేతికి వచ్చే సరికి అతివృష్టితో చేలు భారీ వర్షాలు, తుపానుల బారిన పడి నీట మునగడం పరిపాటిగా మారింది. గడచిన ఆరేళ్లలో ఐదేళ్లు రైతులకు ఖరీఫ్ పంట పూర్తిగా దక్కిన దాఖలాలు లేవు. అయినా రైతులు సాగు చేస్తున్నారంటే పంట మీద మక్కువ ఓ కారణం కాగా పంట దెబ్బ తింటే బీమా (ఇన్సూరెన్స్) పరిహారం వస్తుందనే భరోసా మరో కారణం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా లేకుండా చేస్తున్నారుు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ), రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎకరాకు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా బీమా చేయించుకుని పంట నష్టపోతే పరిహారం అందించేది. బ్యాంకుల నుంచి పొందిన వ్యవసాయ రుణం మొత్తానికి బీమా ప్రీమియం చేయించుకుని పరిహారం అందించేవారు. బీమా కంపెనీ ఇప్పుడు దీనిని ఎకరాకు కేవలం రూ.17,750కి కుదించివేస్తూ ప్రతిపాదన పంపగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. వరికి ఇంతకుమించి బీమా చేయించవద్దని ప్రభుత్వం అన్ని బ్యాంకులకూ సర్క్యులర్ పంపించింది. జిల్లాలోనే పెట్టుబడి అధికం రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా మన జిల్లాలో వరిసాగుకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. అందుకే ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా రూ.29 వేలు చేస్తూ జిల్లా కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కమిటీ గతంలో అభ్యంతరం తెలిపినా జిల్లా కమిటీ సిఫార్సు మేరకు బ్యాంకులు ఈ మేరకు రుణాలందిస్తున్నారుు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకు మేనేజర్లు పెట్టుబడికి అయ్యే ఖర్చుమీద 30 శాతం అదనంగా రుణం ఇచ్చే అవకాశముంది. అంటే ఎకరాకు రైతులు రూ.37,700 వరకు రుణం పొందవచ్చు. గతంలో అయితే ఈ మొత్తం రుణం మీద బ్యాంకులు బీమా చేరుుంచేవి. ఇప్పుడు ఎకరాకు రూ.17,750కి మాత్రమే బీ మా చేయించాలని చెప్పడంతో బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు పైబడి 30 శాతం రుణం ఇచ్చేందుకు వెనుకడుగు వేయవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మొత్తం రుణానికి బీమా ప్రీమియం చెల్లించినా రూ.17, 750ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిహారం అంది స్తారని దేవగుప్తం సహకార సంఘం అధ్యక్షుడు జున్నూరి బాబి ‘సాక్షి’కి తెలిపారు. బీమా భరోసా లేకపోవడం, పంట నష్టపోతే ప్రభుత్వం తక్షణం పరిహారం అందించకపోవడం తో రైతులు ఖరీఫ్ సాగుకు ఆసక్తి చూపడం లేదు. గడువు పెంచుతారా? ఖరీఫ్ బీమా ప్రీమియం గడువు జూలై 31తో ముగిసిపోయిం ది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 41 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. మధ్యడెల్టాలో అయితే 20 శాతం కూడా పూర్తి కాలేదు. మెట్ట, ఏజెన్సీల్లో మరీ తక్కువ. ఈ నేపథ్యం లో బీమా గడువు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రైతు గుండెల్లో ఎల్‌నినో గుబులు
కడప అగ్రికల్చర్ : ఎల్‌నినో...రైతును వెంటాడుతున్న వాతావరణ భూతం.. 2014-15లో కరువుతో అల్లాడిన రైతన్న 2015-16 ఖరీఫ్ సాగుపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినా, మరోవైపు ఎల్‌నినో ప్రభా వం వల్ల వర్షపాతం తగ్గవచ్చని, అందులోనూ సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తగ్గుతుం దని చెబుతున్నారు. ఈ ఏడాది కరువు తప్పదా అనే ప్రశ్న..? రైతన్నను వెంటాడుతోంది. ఎల్‌నినో అంటే....: మహాసముద్రాలపై ఉపరితల ఉష్ణోగ్రతలు(వేడిమి) పెరగడం వల్ల నీళ్లు అమిత వేడిగా మారిపోతాయి. సముద్రాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయి. ఇలాఉష్ణోగ్రతలు అనుకోకుండా పెరగడం వల్ల, సముద్రపు నీరు ఆవిరి రూపంలో వెళ్లి నీరులేని మేఘాలు ఏర్పడతాయి. దీని మూలంగా మేఘాలలో తేమ లేకపోవడం వల్ల వాతావరణంలోను, వర్షపాతంలోను స్థిరత్వం ఉండదు. దీంతో కరువు వస్తుంది. దీన్నే ఎల్‌నినో అంటారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో వల్ల ఒక్కోసారి కరువు కాట కాలు రావచ్చు, అనుకోకుండా అకాల వర్షాలు, ఉన్న మేఘాలన్నీ ఒకే ప్రాంతంలో నీటిని కుమ్మరించడం వల్ల వరదలు రావడం భారీగా నష్టం సంభవించడం జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చినుకురాలితే చిరునవ్వు...లేదంటే కన్నీరే... జిల్లాలో మెజార్టీ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కష్ట నష్టాలకోర్చి వ్యవసాయాన్ని చేపడుతూనే ఉన్నారు. జిల్లాలో 85 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. చినుకురాలితే రైతన్న మోములో చెప్పలేనంత చిరునవ్వు...లేదంటే కంట కన్నీరు తప్పని పరిస్థితి. తాజాగా వినిపిస్తున్న ఎల్‌నినోతో అన్నదాతను భయం వెంటాడుతోంది. జిల్లాలో వ్యవసాయం తీరు తెన్నులు.. జిల్లాలో ప్రధానంగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్లు పూర్తిగా, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో కొన్ని మండలాల్లో వర్షం వస్తేనే భూములు పచ్చని పైర్లతో కళకళలాడేది. లేకపోతే బీళ్లుగానే ఉంటాయి. జిల్లాలో మొత్తం 3,84,679 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఏటా 1,27,394 హెక్టార్లలో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, రాగి, మినుము, పెసర, అలసంద, కూరగాయలు తదతర ఆహార పంటలు సాగవుతుండగా, ఆహారేత పంటలు 1,07,763 హెక్టార్లలో సాగవుతున్నాయి. మిగిలిన భూమిలో పలురకాల పంటలున్నాయని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలసాగుకు తెచ్చిన పెట్టుబడితోపాటు నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. లేదంటే పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక నరకయాతన తప్పదు. మూడేళ్లుగా...వర్షపాతాల్లో హెచ్చుతగ్గులు...: జిల్లాలో సాధారణ వర్షపాతానికి, కురుస్తున్న వర్షపాతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వర్షపాతం రికార్డులను పరిశీలిస్తే మూడేళ్లుగా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సాధారణ వర్షపాతం 699.6 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉంటుంది. 2012-13 లో ఖరీఫ్‌లో 570.5 మిల్లీ మీటర్లు కురిసింది. 2013-14లో అకాల వర్షాలతో 708.7 మిల్లీ మీటర్లు కురిసి పంటలను నష్టపోయారు. 2014-15లో 464.9 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో 2015-16 ఈ ఖరీఫ్‌లోను వర్షపాతంలో 10 శాతం లోటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో జిల్లా రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఈనెల సాధారణ వర్షపాతం 69.0 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 47.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఖరీఫ్ కన్నీటీ గాథ ఇది... గత ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,79,536 హెక్టార్లు కాగా అరకొర వర్షాల కారణంగా కేవలం 43,576 హెక్టార్లలోను, రబీలో సాధారణ సాగు భూమి 2,05,143 హెక్టార్లు ఉండగా ఇందులోను అరకొర వర్షాలకు కేవలం 56,433 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆ సీజన్లో దాదాపు నెల రోజులపాటు వర్షం కురవకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 28 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించింది. -
పంట విరామం దిశగా కోనసీమ రైతులు
తీరప్రాంత మండలాల్లో తరచూ ముంపు రాజమండ్రి : సాగు సమ్మె చేసి నాలుగేళ్లు కావస్తున్నా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడం, సాగు కష్టతరంగా మారడంతో ప్రస్తుత ఖరీఫ్ సాగుకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించేందుకు కోనసీమ రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం, కొద్దిపాటి వర్షానికే మురుగునీటి కాల్వలు పొంగిపొర్లడం, తీరప్రాంత మండలాల్లో సముద్రం పోటెత్తినప్పుడు చేలను ఉప్పునీరు ముంచెత్తి పంట నష్టపోవడం కోనసీమ రైతులకు పరిపాటిగా మారింది. తీరంలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి తదితర మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. నాలుగేళ్లు కావస్తున్నా అదే పరిస్థితి ధాన్యం దిగుబడి రికార్డుస్థాయిలో వచ్చినా కొనే దిక్కులేక నష్టపోయిన కోనసీమ రైతులు 2011లో సాగుసమ్మె చేశారు. ఈనిర్ణయం అప్పటి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేసింది. ఇది జరిగి నాలుగేళ్లు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. సాగుచేసి నష్టాలను చవి చూసేకంటే వదులుకుంటే మేలనే అభిప్రాయం రైతులను పంట విరామానికి పురికొల్పుతోంది. సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం, మలికిపురం, మండలాల్లో గత ఏడాది 3 వేల ఎకరాల్లో సాగును రైతులు వదులుకున్నారు. ఈ ఏడాది కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. వీరికి మరికొన్ని గ్రామాల రైతులు తోడవడంతో కోనసీమలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు పంటను వదులుకునే పరిస్థితి నెలకొంది. దీనిపై తీర మండలాల రైతు సంఘాల నేతలు, రైతులు సమావేశాలు ఏర్పాటు చేసి, పంట విరామమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. -
కొత్త ఆయకట్టు 1.20లక్షల ఎకరాలు
ఖరీఫ్ ఆయకట్టు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీరందాల్సిన కొత్త ఆయకట్టుపై నీటి పారుదల శాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది. పనులు పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ 1.20 లక్షల ఎకరాల మేర సాగునీరందించి, రబీ నాటికి దాన్ని మరింత పెంచాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ మేరకు దేవాదుల, మంథని, గూడెం సహా ఆదిలాబాద్ జిల్లాలోని పలు మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని కొత్త ఆయకట్టుపై అధికారులకు సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. బుధవారం ఆయన రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలవల్ల వచ్చే నీటిని వ్యవసాయ భూములకు మళ్లింపు అంశంతోపాటు ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు కింద చిన్న చిన్న పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసి ఖరీఫ్‌లో 72వేల ఎకరాలకు సాగు నీరివ్వాలని ఆదేశించారు. కరీం నగర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మంథని ఎత్తిపోతల కింద 12వేల ఎకరాలకు, గూడెం ఎత్తిపోతల ద్వారా మరో 30వేల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి కింద 300 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే వేములవాడలోని 50వేల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలున్నాయని, దీనికోసం వెంటనే ప్రతిపాదనలు పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టు నుంచి 4 వేల ఎకరాలు, గొల్లవాగు నుంచి 5 వేల ఎకరాలు, కొమురంభీమ్ నుంచి 1,500 ఎకరాలకు నీరు అందించాలని సూచించారు. గూడెం ఎత్తిపోతల పథకం ట్రయల్న్ రవిజయవంతంగా పూర్తయినందున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించడానికి రంగం సిద్ధం చేయాలని సూచించారు. -
వడివడిగా ఖరీఫ్
సాగులోకి 85,912 ఎకరాలు ఊపందుకున్న వ్యవసాయ పనులు సాధారణ వర్షపాతం నమోదు కరీంనగర్‌అగ్రికల్చర్ : ఆశలసాగు వడివడిగా సాగుతోంది. ఆశించిన వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. అధికారుల అంచనాల కంటే పంటల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాత నమోదు కాగా 27 మండలాల్లో అధిక వర్షం కురిసింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం పంట లసాగు వేగంగా జరుగుతోంది. ప్రధానంగా రైతులు పత్తి, వరినాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.66 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 85,912 ఎకరాలు (34,365 హెక్టార్లు) వివిధ పం టలు సాగయ్యాయి. గత ఖరీఫ్‌లో 4,92,286 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది జూన్‌లో ఇదే సమయానికి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 3వేల ఎకరాల సాగు కూడా మించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 102.2 మి.మీ. వర్షం కురవగా రైతన్నలు ఆనందంతో పంటలసాగు ప్రారంభించారు. అత్యధికంగా 76,120 ఎకరాలు(30,448 హెక్టార్లు) పత్తి, 4,062 ఎకరాలు (1,625 హెక్టార్లు) వరి సాగు మొదలుపెట్టారు. 6,145 ఎకరాలలో (2,458 హెక్టార్లు) మొక్కజొన్న నాటుకున్నారు. కందులు 1,887 ఎకరాలు, ఇతర పంటలు 962 ఎకరాల్లో సాగయ్యూరుు. వర్షం.. హర్షం జిల్లాలో జూన్ 1 ఖరీఫ్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 85.6 మిల్లీమీటర్లకు గాను 102.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 57 మండలాలకు గాను 27 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 12 మండలాల్లో సాధారణ, 15 మండలాల్లో లోటు, 3 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదయ్యింది. కరీంనగర్ డివిజన్లోని 10 మండలాల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 72.7 మి.మీకు గాను 85.6 మిమీ వర్షం కురిసింది. హుజూరాబాద్ డివిజన్లోని 8 మండలాల్లో 64.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను 99.7 మిమీ కురిసింది. జగిత్యాల డివిజన్లోని 14 మండలాల్లో 94.4 మిమీ సాధారణ వర్షపాతానికి 71.7 మిమీ వర్షం కురిసింది. సిరిసిల్ల డివిజన్లోని 9 మండలాల్లో 91.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను 99 మిమీ వర్షం కురిసింది. పెద్దపల్లి డివిజన్లో 9 మండలాల్లో 99.7 మిమీ సాధారణ వర్షపాతానికి 120.7 మిమీ వర్షం కురిసింది. మంథని డివిజన్లోని 7 మండలాల్లో 85.6 మిమీ సాధారణ వర్షపాతానికి 102.2 మిమీ వర్షం కురిసింది. లోటు వర్షపాతం నమోదైన మండలాలు తిమ్మాపూర్, చిగురుమామిడి, గొల్లపల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, ధర్మపురి, కోనరావుపేట, చందుర్తి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వెల్గటూర్, రామగుండం అత్యంత లోటు సైదాపూర్, జగిత్యాల, మేడిపల్లి -
సాగుకు సన్నద్ధం
12 వేల ఎకరాల్లో తగ్గనున్న వరి 6.37 లక్షల నుంచి 6.25 లక్షల ఎకరాలకు కుదింపు రాజధాని నిర్మాణం, పట్టణీకరణ పెరగడమే కారణం సేంద్రియ పద్ధతిలో సాగుకు ఏర్పాట్లు మచిలీపట్నం : జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. 8.72 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశెనగ, పత్తి, మిరప, చెరుకు, నువ్వుల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పులు రాకపోవటం, కాలువలకు సాగునీటిని ఎప్పటికి విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేని కారణంగా సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 12 వేల ఎకరాల్లో తగ్గనున్న వరి సాగు... జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 6.25 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా 6.37 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా రాజధాని నిర్మాణం, పట్టణీకరణ పెరగటం తదితర అంశాల నేపథ్యంలో 6.25 లక్షల ఎకరాల్లో వరిసాగుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పత్తి 1.39 లక్షల ఎకరాల్లో, చెరుకు 30,600, మిర్చి 27,500, మొక్కజొన్న 16,250, పెసర 12,500, కందులు 6,250, మినుము 6,250, వేరుశెనగ 2,872, నువ్వులు 1,250 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరి, చెరుకు తదితర పంటల్లో సాగు విస్తీర్ణాన్ని కొంతమేర తగ్గించారు. ఈ ఏడాది 30 వేల మట్టి నమూనాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించారు. భూమిలో నత్రజని, భాస్వరం తదితర లోపాలతో పాటు సూక్ష్మధాతు లోపాలను గుర్తించి రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పించనున్నారు. జింకు 3,500 టన్నులు, జిప్సం 6 వేలు, బోరాక్స్ 80 టన్నులను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. దీనిలో 878 టన్నుల జిప్సం, జింకులను రైతులకు అందజేశారు. సేంద్రియ విధానంలో సాగు ఈ ఏడాది సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 2014 ఖరీఫ్ సీజన్లో 12,900 టన్నుల జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను పంపిణీ చేయగా.. ఈ ఏడాది 17,500 టన్నుల పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 11,038 టన్నుల విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వాటిలో 3,212 టన్నుల విత్తనాలను రైతులకు అందజేశారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో చేయటంతో పాటు వెదజల్లే పద్ధతిలో సాగును పెంచాలని నిర్ణయించారు. 2014 ఖరీఫ్‌లో వెదజల్లే పద్ధతి ద్వారా 43 వేల ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది దీనిని 62 వేల ఎకరాలకు పెంచారు. శ్రీ వరిసాగు పద్ధతిలో గత ఏడాది 2,435 ఎకరాల్లో చేయగా, ఈ ఏడాది దీనిని 6,250కి పెంచాలని నిర్ణయించారు. డ్రమ్ సీడర్, సీడ్ డ్రిల్ పద్ధతిలో 25 వేల ఎకరాల్లో వరిసాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరిలో బీపీటీ 5204, ఎంటీయూ 1061 వంగడాలను 29,797 క్వింటాళ్లు, వేరుశెనగ 100 క్వింటాళ్లు, పెసర 1,000 క్వింటాళ్లు, మినుము 1,500 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేయాలని నిర్ణయించారు. 1.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం... ఈ ఖరీఫ్‌లో 1.39 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరుగుతుందని అంచనా వేయగా 1.98 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని నిర్ధారించారు. వీటిలో 1.20 లక్షల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. మైకో, నూజివీడు, కావేరీ, తులసీ సీడ్స్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్క ప్యాకెట్టు 450 గ్రాముల బరువు ఉంటుంది. ఒకచోట ఒక విత్తనాన్నే నాటాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు రెండు విత్తనాలను వేస్తారని దీంతో విత్తన ప్యాకెట్ల అవసరం పెరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో అన్ని పంటలకు కలిపి 3,01,379 టన్నుల ఎరువులు అవసరమని నిర్ధారించారు. -
ఖరీఫ్ సాగుకు జలగండం!
♦ వట్టిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, 428 టీఎంసీల నీటి కొరత ♦ వర్షాలు కురిసినా ఆగస్టు వరకు ఆయకట్టుకు నీటిపై చెప్పలేని స్థితి ♦ తాగునీటి అవసరాలకు సరిపడే నీరొచ్చాకే ఖరీఫ్‌పై ప్రభుత్వ నిర్ణయం ♦ సకాలంలో వర్షాలు రాకుంటే 15 లక్షల ఎకరాలపై ప్రభావం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణా, గోదావరి నది పరీవాహక పరిధిలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోయి నిర్జీవంగా మారడం ఖరీఫ్ సాగును కలవరపెడుతున్నాయి. నిర్ణీత సమయానికే వానలొచ్చినా ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి మట్టాలను చేరుకోవాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందేనన్న సంకేతాలు సైతం ఖరీఫ్‌ను ఆందోళనలోకి నెడుతున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులుంటాయన్న ఆందోళన ఓ వైపు, ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలు మరోవైపు సాగును ప్రశ్నార్థకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగుపై ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. 428 టీఎంసీల మేర కొరత.. తీవ్ర నీటి ఎద్దడి దృష్ట్యా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టుల్లో కనీస మట్టాల దిగువకు వెళ్లి నీటిని వాడేయడంతో ఆయా ప్రాజెక్టుల్లో మట్టాలు గణనీయంగా తగ్గాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో వాస్తవ నీటి నిల్వలు 681 టీఎంసీలు కాగా ప్రస్తుతం 253 టీఎంసీల మేర మాత్రమే నిల్వలున్నాయి. మరో 428 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలతో పోల్చిచూసినా 45 టీఎంసీల మేర తక్కువగా నిల్వలు ఉన్నాయి. జూన్‌లో సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిండాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నిండాకే దిగువకు నీరు చేరే అవకాశాలుంటాయి. అది జరగడానికి నెలక న్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు మొదటివారానికి గానీ ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవేళ పూర్తిగా వర్షాభావ పరిస్థితులే నెలకొంటే ఖరీఫ్ మొత్తంపైనా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. పదిహేను లక్షల ఎకరాలపై ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పక్షంలో ఆ ప్రభావం మొత్తంగా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండగా, జూరాల కింద లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టం అవుతుంది. దీనికి తోడు ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఇచ్చంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద కొత్తగా ఈ ఖరీఫ్‌కు 6.2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించారు. ఒకవేళ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే ఈ ఆయకట్టుకు గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు అంటున్నారు. -
ఖరీఫ్‌కు రెడీ
- సాగు అంచనా 6.58 లక్షల హెక్టార్లు - విత్తనాలు, ఎరువులకు సన్నాహకం - ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు. రుతుపవనాలు ఖరీఫ్ ఆరంభానికి ముందే జిల్లాకు తాకనున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుండడంతో సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది 5.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. ఖరీఫ్ లక్ష్యం 6.58 లక్షల హెక్టార్లుగా ఉంటుందని ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో అత్యధికంగా పత్తి, సోయాబీన్ పంటలు సాగవుతాయని వారి అంచనా. పత్తి 3,50,500 హెక్టార్లలో, సోయాబీన్ లక్షా 35 వేల హెక్టార్లు, వరి 60 వేల హెక్టార్లు, కందులు 50 వేల హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లు, జొన్న 25 వేల హెక్టార్లు, పెసళ్లు 11 వేల హెక్టార్లు, మినుములు 10 వేల హెక్టార్లు, నువ్వులు 1500 హెక్టార్లు, ఇతర ధాన్యాలు 5 వేల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ కమిషనరేట్‌కు వారం రో జుల క్రితం ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు. సబ్సిడీపై విత్తనాలు.. ప్రభుత్వం రైతులకు రాయితీపై వివిధ రకాల విత్తనాలు అందించనుంది. ఇందులో పత్తి విత్తనాలు 21 లక్షల ప్యాకెట్లు, సోయాబీన్ 85 వేల క్వింటాళ్లు, వరి 31,500 క్వింటాళ్లు, కందులు 2 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 1,500 క్వింటాళ్లు, పెసళ్లు 300 క్వింటాళ్లు, జొన్న 150 క్వింటాళు,్ల బజరా 150 క్వింటాళ్లు, మినుములు 100 క్వింటాళ్లు, నువ్వులు 10 క్వింటాళ్లు, ధైంచా 3 వేల క్వింటాళ్లు తదితర విత్తనాలు 3,700 క్వింటాళ్ల వరకు అవసరమవుతాయని ప్రతిపాదనలు ఇచ్చారు. పత్తి విత్తనాలు మినహా మిగతావన్నీ 33 శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. కాగా.. సోయా విత్తనాల ధర గతేడాది క్వింటాల్‌కు రూ.7,800 ఉండగా, రాయితీ 33 శాతంతో రూ.5,226 చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది రూ.6,700లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 33 శాతం రూ.2,230 సబ్సిడీ పోను రూ.4,470 రైతులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు 2 వేల సోయాబీన్ విత్తనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎరువులు.. పంట సాగు అవసరాల మేరకు ఖరీఫ్‌లో మూడు లక్షల టన్నుల వరకు ఎరవులు అవసరమని గుర్తించారు. ఇం దుకోసం 1,26,435 మెట్రిక్ టన్నుల యూరియా, 35,800 మెట్రిక్ టన్నుల డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు 38 వేల టన్నులు, పొటాష్ 30 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. -
ఏడిపిస్తున్న యెవుసం..
నేల తల్లిని నమ్ముకుని బతుకు ఈడుస్తున్న రైతుకు కష్టకాలం వచ్చి పడింది. కాడిని వదిలి కూలీగా మారాల్సిన దుస్థితి వచ్చింది. ఏటా అతివృష్టి.. అనావృష్టి.. ఏదో ఒకదాని బారిన పడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. సాగుకు దిగుదామంటే బ్యాంకులు రుణాలివ్వక.. వరుణుడు కరుణించక.. ప్రభుత్వాలూ ఆదుకోక.. ఆందోళన చెందుతున్నారు. పంట కోసం చేసిన అప్పుల కుంపటిని వేగలేక ‘చితి’కి పోతున్నారు. కొత్త అప్పు చేయలేక.. చేద్దామన్నా ఇచ్చేవారు లేక సాగుకు గుడ్‌బై చెబుతున్నారు. ఖరీఫ్‌లో నష్టాలనే ఎదుర్కొన్న రైతులు రబీ సాగుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ రుణాలు లేక.. కరెంటు కోతలు భరించలేక.. ప్రాజెక్టుల నుంచి నీరొచ్చే మార్గం లేక వ్యవసాయ శాఖ వేసిన అంచనా తారుమారైంది. 90 వేల హెక్టార్లు సాగు చేస్తారనుకుంటే 19 వేల హెక్టార్లకే పరిమితం కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో అన్నదాతను ఈ ఏడాది ప్రారంభం నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. గతేడాది అతివృష్టితో నష్టపోతే ఈ ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సాగు నుంచి ప్రారంభమైన కష్టాలు.. రబీలోనూ తప్పడం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో రుతు పవనాలు వస్తే ఈ ఏడాది రెండున్నర నెలల పాటు ఆలస్యంగా వచ్చాయి. వాతావరణ శాఖ వారు ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం జూన్ మాసంలో విత్తనాలు వేసుకున్న రైతులు వర్షాలు కురవక వేసిన విత్తనాలు ఎండకు మాడిపోయాయి. ఇలా జిల్లాలో రెండు నుంచి మూడేసి సార్లు రైతులు విత్తనాలను విత్తుకున్నారు. ఖరీఫ్ కష్టాలను ఎదుర్కొని తీవ్ర నష్టాల్లో మునిగిన రైతన్న రబీ సాగులో వ్యవసాయమంటేనే నిరసక్తత చూపుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలో ఈ ఏడాది రబీలో 90,110 హెక్టార్లలో సాగువుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. ఇప్పటివరకు 19 వేల 434 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాగు సమయం గడుస్తున్నా.. రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా సగం వరకు కూడా సాగు కాకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం. గతేడాది ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో సాగవ్వగా ఈసారి ఇప్పటి వరకు 19 వేల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆరుతడి పంటలు సాగు వేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం సాగు చేయడానికి సాహసించడం లేదు. పంటల సాగుకు పూ ర్తి పదును, వర్షాలు లేకపోవడం, మరోపక్క చెరువులు, కుంటలు, డ్యామ్‌లలో నీరు అడుగంటడం, దీనికితోడు వేసవిలో వచ్చే విద్యుత్ కోతలు ఇప్పటి నుంచే అమలవుతుండడం.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున రబీ సాగుకు రైతన్నలు ముందడుగు వేయడంలేదు. దీనికితోడు డిసెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షాపాతం 1088.6 మిల్లీమీటర్లకు గాను 734.9 మి.మీ కురిసింది. 33 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. ఫలితంగా భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పంటలు సాగు చేసి నష్టపోవడంకంటే సాగు చేయకపోతేనే మేలని రైతులు భావిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గతేడాది రబీలో లక్ష హెక్టార్ల వరకు సాగవ్వగా.. ఈ ఏడాది మొత్తం సాగు ఈ రబీలో 25 వేల హెక్టార్లు దాటేలా లేదు. బోసిపోతున్న జలాశయాలు.. గతేడాది అధిక వర్షాలతో జలకళ సంతరించుకున్న జలాశయాలు.. ఈ ఏడాది బోసిపోతున్నాయి. గత ఖరీఫ్‌లో అతివృష్టితో నీటి నిల్వలు పెరిగిపోయి దిగువ ప్రాంతానికి లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణం కంటే తక్కువగా కురవడంతో రబీ సాగుకు పంటలకు నీరు అందించే స్వర్ణ ప్రాజెక్టు నుంచీ నీరు అందించలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వేల హెక్టార్లలో సాగవ్వాల్సిన పంటలు వందల హెక్టార్లకు పడిపోయాయి. -
వర్షార్పణం
సాక్షి, సంగారెడ్డి: కాలం పగబట్టింది.. దెబ్బమీద దెబ్బ తీస్తూ అన్నదాత నడ్డి విరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వానల్లేక నిలువునా ఎండిపోయి కర్షకులకు కన్నీళ్లే మిగిల్చాయి. నామమాత్రంగా పండిన మక్కలు, వడ్లను అమ్ముకుని తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టి కొంతలో కొంత ఉపశమనం పొందుదామనుకున్న పుడమి పుత్రుల ఆశలపై వాన దేవుడు నీళ్లు చల్లాడు. రెండు నెలలుగా ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా విజృంభించాడు. దీంతో పంటలు కోసి ఆరబోసిన రైతులు.. ధాన్యాన్ని మార్కెట్లకు తరలించిన అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న ధాన్యం నిల్వలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పొలాల్లోని వరి పంటలు నేలకొరిగాయి. జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవ ర్గాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించింది. మిగతా చోట్ల కూడా మోసర్తు వర్షం కురిసింది. సంగారెడ్డిలో సాయంత్రం రెండు గంటలపాటు జనజీవనం స్తంభించిపోయింది. జోగిపేట, నర్సాపూర్‌లోని మార్కెట్ యార్డుల వద్ద ఎండబోసిన మక్కలు, వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూస్తూ ఏమీ చేయలే క చేష్టలుడిగిన రైతులు కంటతడి పెట్టారు. మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కూడా వాన జల్లులు కురిశాయి. -
కష్టకాలం
సాక్షి, ఖమ్మం: నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఆశతో ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతన్నకు ఆ తర్వాత నిరాశేమిగిలింది. విత్తునాటడానికే చినుకులు రాలకపోవడంతో అప్పుడుప్పుడు కురిసే జల్లులతోనే 3,31,494 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, మధిర, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. విద్యుత్ కోతలతో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, టేకులపల్లి, గుండాల, బూర్గంపాడు, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ తదితర మండలాల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి చేతికి అందే దశలో ఎండిపోతోంది. ఆయా మండలాల్లో పత్తి పంట కూడా వాడిపోవడంతో దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగు చేసిన మిరప తోటలు ఆశాజనకంగా లేవు. వర్షాభావంతో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు ఎదురవుతాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర (వీఎంల)లో గత నెలలో అత్యధికంగా 6.33 మీటర్లకు నీటిమట్టం పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. దళారీ చేతిలో రైతు దగా అరకొరగా చేతికి అందిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత కుంగదీస్తోంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు దక్కపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఖమ్మంలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే తెరిచారు. ఈ కేంద్రంలోనూ వ్యాపారుల దందానే కొనుసాగుతండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర రూ.4,050 అయితే దళారులు రూ.3వేల నుంచి రూ. 3,500 వరకే పెడుతున్నారు. రుణమాఫీకి ఎదురుచూపులు.. ఈ ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,400 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4.81 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారు. రూ.724 కోట్లు రెన్యూవల్స్ చూపించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,700 కోట్లు రుణమాఫీ కావాలి. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ కింద జిల్లాకు రూ.427.85 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ.285 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. నూతన రుణాలు, రుణమాఫీ అంటూ కాగితాల్లోనే ప్రభుత్వం అంకెల గారిడి చేసింది. కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణం.. జిల్లాలో 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఏ ఒక్కటీ నమోదుకాకపోవడం గమనార్హం. మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన మొగిలి నాగేశ్వరరావు (30) పత్తి సాగుతో అప్పులపాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పినపాక నియోజకవర్గంలో ఈ సీజన్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వాపురం మండంలోని అమెర్ధ పంచాయతీ చండ్రలబోడు గ్రామానికి చెందిన ఎనిక తిరుపతి(40), గుండాల మండలం దామర గూడెం వాసి పాయం పాపయ్య(30), నడిమిగూడెంకు చెందిన పాయం రాంబాబు(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామ రైతు తమ్మినేని వెంకటేశ్వరరావు (40), తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం శివారు అజ్మీరాతండాకు చెందిన భూక్యా సామ్యా (35), ఏన్కూరు మండలం రాయమాధారానికి చెందిన జబ్బ శ్రీనివాసరావు (30), జూలూరుపాడు మండలం భీమ్లాతండాకు చెందిన బాదావత్ వెంకట్రామ్(45), పాల్వంచ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తాటి శ్రీను(39) బలవన్మరణానికి పాల్పడ్డారు. వర్షాభావం వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, దమ్మపేట, ముల్కలపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, గుండాల, చర్ల, వేలేరుపాడు, కొణిజర్ల మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు. -
కరెంట్.. కన్నీరు
నర్సంపేట : ఖరీఫ్ సాగు కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరువు పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని వణికిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో మురిపెంలా కురిసిన తొలకరి చినుకులు రైతుల్లో ఆశలు రేపి... ఆ తర్వాత మొహం చాటేశారుు. వర్షాభావం నేపథ్యంలో కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా వెనుకడుగు వేయడంతో పంట భూములన్నీ ఖాళీగా ఉన్నారుు. ఆశతో మరికొందరు రెట్టింపు పెట్టుబడి పెట్టి పలు పర్యాయూలు విత్తనాలు నాటి, బిందె సేద్యంతో పంటలు కాపాడుకున్నారు. అదును దాటిన తర్వాత కొంత నయమనిపించేలా కురిసిన వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించారుు. జిల్లాలో సాధారణ వర్షపా తం 703.09 మిల్లీమీటర్లు కాగా... 531.04 మి.మీల వర్షం కురిసింది. ఇది కూడా పంటల సాగు సవుయుం మించిన తర్వాత నమోదైన వర్షపాతమే. జిల్లా లో మొత్తం 5,02,132 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా... 4,06,558 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. కానీ.. తాజా పరిస్థితులు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. వర్షాలు కురవకపోవడానికి తోడుగా కరెంట్ కోతలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చే స్తున్నారుు. పట్టుమని మూడు గంటలు కూడా కరెం ట్ సరఫరా కాని పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పొలాలు నెర్రెలుబారుతున్నారుు. మక్క, పత్తి, సోయ, వరి పంటలు ఎండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంటలకు నీరు పెట్టాలని పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతు న్నా... విద్యుత్ సరఫరా ప్రతిబంధకంగా మారడం తో రైతులు గుండలవిసేలా రోదిస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంట్ సరఫరా గగనంగా వూరడంతో రైతన్నలు సాగుపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తు తం జిల్లాలో 70 శాతం మేర వరి అక్కరకు రాకుండా పోరుునట్లు వ్యవసాయ అధికారుల అంచనా. బోసిబోరుున ధాన్యాగారం జిల్లాలోనే ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సంపేట ప్రాంతం వరి సాగు లేక బోసిపోరుుంది. ఖరీఫ్‌లో అనుకున్న సవుయూనికి వర్షాలు కురిస్తే పాఖాల, వూధన్నపేట, రంగాయు చెరువుల్లోకి నీరు చేరుతాయుని ఆశించి రైతులు నారు వుడులు సిద్ధ చేసుకున్నారు. వర్షాలు లేక నారు వుడులు ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు. పాకాల సరస్సు కింద 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉండగా... ప్రస్తుతం ఎక్కడ చూసినా బీడు భూవుులే కనిపిస్తూ ఎండిపోరుున ఆనవాళ్లతో నారు వుడుల గుర్తులు ఉన్నారుు. -
సోయా పొట్టే కదాని.. తగలబెట్టకండి
బాల్కొండ: ఖరీఫ్‌లో సాగుచేసిన సోయా పంట నూర్పిళ్లు ప్రస్తుతం రైతులు చురుగ్గా చేపడుతున్నారు. సోయా పంటను ప్రస్తుత సంవత్సరం నేరుగా నూర్పిడి చేయడంతో పాటు కోత కోసి కుప్ప వేసి హర్వేస్టర్‌తో నూర్పిడి చేస్తున్నారు. ఇలా నూర్పిడి చేయడంతో సోయా విత్తనాలు ఓ వైపు, సోయా పొట్టు మరోవైపు వేరవుతుంటాయి. కాని సోయా పొట్టును రైతులు సాధారణంగా తగలబెడతారు. సోయా పొట్టే కదాని రైతులు నిర్లక్ష్యంగా పంట భూములను శుభ్రం చేయాలనే ఆలోచనతో తగుల బెడుతుంటారు. సోయా పొట్టులో భూమిలో భూసారం పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. సోయా పొట్టును కుప్పలుగా చేసి పంట భూమి వద్ద పెద్ద గుంతను తవ్వి గుంతలో వేయాలి. మంచిగా మాగిన తర్వాత తీసి వేస్తే భూసారం పశువుల పేడ వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా పెంచుతుంది. ఎకరా సోయా పంట లో వెళ్లే పొట్టు ఓ లారీ పశువుల పేడతో సమానం. ఖరీఫ్‌లో పశువుల పేడ లారీ సుమారు రూ.15 వేల ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులు, సోయా పొట్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. తవ్విన గుంతలో సోయా పొట్టు వేసిన త ర్వాత బాగా నీరు పట్టాలి. అలా చేయడం వల్ల అది మంచి ఎరువుగా తయారవుతుంది. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా సాగయ్యే పంట కాబట్టి సోయాలో అనేక పోషకాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. సోయా పొట్టును తగుల పెట్టడం వల్ల పొట్టుతో పాటు భూమికి చేటు అవుతుందంటున్నారు. వేడి వల్ల భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. వాటి తో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పంట పండించే నేలలో నిప్పు పెట్టరాదంటున్నారు. భూసారం కూడా తగ్గుతుందంటున్నారు. భూమి వదులుగా మారుతుంది. సోయా పొట్టును మంచి ఎరువుగా మలుచుకొని పసుపు సాగుచేసే భూమిలో వేయాలి. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూసారం పెరిగి పంట దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రైతులారా ఆలోచించండి..! -
సోయా.. గయా...
వేల్పూర్ /బాల్కొండ : తీవ్ర వర్షాభావం, తెగుళ్లు వెరసి సోయాబీన్ పంటను దెబ్బతీశాయి. తక్కువ పెట్టుబడితో సాగుచేసే పంట కావడం వలన ఈ ఖరీఫ్‌లో సోయా సాగు వైపు రైతులు అధికంగా దృష్టిసారించారు. అయితే ఈసారి దిగుబడులు సగానికి తగ్గడంతో కష్టాలే మిగిలేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2 నుంచి 4 క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. వేల్పూరు, బాల్కొండ మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు సోయాబీన్ పంటను సాగుచేశారు. వారం రోజుల నుంచి సోయా పంట నూర్పిళ్లు చురుగ్గా చేపడుతున్నారు. కొందరు రైతులు నేరుగా హార్వేస్టర్తో నూర్పిడి చేపడుతుండగా, మరికొందరు కోత కోసి కుప్ప వేసి నూర్పిడి చేపడుతున్నారు. ఎకరానికి 2 నుంచి 4 క్వింటాళ్ల కంటే ఎక్కువ పంట దిగుబడి రావడం లేదని రైతులు తెలిపారు. విత్తనాల ఖర్చు తడిసి మోపెడు.. సోయా పంటను జూన్ మాసం చివరలో విత్తుతారు. 100 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా, తక్కువ నీటితో పంటను సాగు చేయవచ్చు. కాని ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతులు కుదేలయ్యారు. తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడులు తడిసి మోపెడైనట్లు రైతులు తెలిపారు.ఆకుముడత, రసం పీల్చే తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. మొదట్లో పంటవేసే సమయంలో వర ్షం లేక విత్తనాలు మొలకె త్తలేదు. దాంతో రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి మళ్లీ విత్తారు. రెండుసార్లు విత్తనాలు విత్తాల్సి రావడంతో ఆర్థికంగా వారిపై భారం పడింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి నెలకొన్నప్పటికీ, అడపా దడపా కురిసిన వర్షాలకు పంట మంచిగానే మొలకెత్తింది. కాని తెగుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పంటను తెగుళ్లు నాశనం చేశాయి. ఎకరాకు ఎంత లేదన్నా దాదాపు 15 వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని వాపోతున్నారు. విత్తనాల మాయేనా..! సోయా దిగుబడి భారీగా తగ్గడంపై విత్తనాల మాయేనా అంటూ రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీపై సోయా విత్తనాలు లేవని చివరి వరకు ప్రచారం చేసిన అధికారులు, చివరికి సబ్సిడీపై సోయా విత్తనాలను అందించారు. చివరికి అందించిన విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు మొలకెత్త లేదని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. నీరు పెట్టినా కూడా విత్తనాలు మొలకెత్త లేదని రైతులు అప్పుడే వాదించారు. కాని వారి మాట పట్టించుకునేవారు కరువయ్యారు. తీరా ఇప్పుడు దిగుబడులు తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాల కొనుగోలుకు ఎకరాకు రూ. 3 నుంచి 5 వేల వరకు ఖర్చు అయ్యిందని, తెగుళ్లు వ్యాపించడం వలన అధికంగా క్రిమిసంహారక మందులు వాడాల్సి వచ్చిందన్నారు. దీంతో పెట్టుబడులు పెరిగినట్లు చెప్పారు. కలుపు తీయడం, నీరు పెట్టడం, యంత్రాల ఖర్చు మొత్తం కలిపితే ఎకరాకు 15 వేల పెట్టుబడి అయిందని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం దిగుబడి చూస్తే పంట కోసిన యంత్రాలకు కిరాయి చెల్లించేంత డబ్బులు సైతం రాావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఈ ఖరీఫ్‌లో సోయాబీన్ సాగు అన్నివిధాలుగా నష్టాలను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడులు, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది.తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. పంటకు మార్కెట్లో ఎక్కువ ధర లభించినా, పెట్టుబడి ఖర్చులైనా వచ్చేవి. ప్రభుత్వం సోయా రైతులను ఆదుకోవాలి. - బద్ధం హరికిషన్, రైతు వేల్పూర్ -
సాగర్ అదనపు జలాలు ప్రశ్నార్థకం
రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో వెంగళరాయసాగర్ అదనపు జలాల విషయం గమనిస్తే ఇట్టే అర్ధమవుతుంది. పాలకులెవరైనా... తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పడమే తప్ప... చేసింది అంతంతమాత్రంగానే ఉంది. సాగర్ అదనపు జలాలు ఐదు వేల ఎకరాలకు అందించాలని ఎనిమిదేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ అదనపు జలాలు మాత్రం సాగుకు అందడం లేదు. దీంతో బొబ్బిలి, సీతానగరం మండలాల్లోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి : వెంగళరాయసాగర్ అదనపు జలాలు వచ్చే ఏడాది ఖరీఫ్ సాగుకు కూడా అందే పరిస్థితులు కానరావడం లేదు. భూసేకరణ నత్తనడకగా సాగడం, భూసేకరణ కోసం అవసరమైన డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పాటు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయలోపం అన్నదాతకు శాపంగా మారాయి. బొబ్బిలి, సీతానగరం మండలాలకు వెంగళరాయసాగర్ జలాశయం ద్వారా అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే సదుద్దేశంతో 2006 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రూ.5 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత ఆ పనులకు విఘాతం ఏర్పడడంతో ఏడేళ్ల వరకు ప్రతిపాదనలు, అంచనాలు, టెండ ర్లు దశ అంటూ నాన్చి చివరకు అంచనాలను రూ.11 కోట్లకు తీసుకువచ్చారు. చివరకు గత ఏడాది నిధులు మంజూరై విడుదలయ్యూయి. దాంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు వస్తుంద ని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ అదనపు జలాలను హైలెవల్ కెనాల్ ద్వారా మూడు వేల 600 ఎకరాలకు, గొల్లపల్లి లింకు ఛానల్ ద్వారా 700 ఎకరాలకు, 5ఏఆర్ మైనర్ కాలువ ద్వారా 677 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమా రు 40.35 ఎకరాల స్థలం కావాలని గుర్తించా రు. ఇప్పటికే 20.29 ఎకరాలను సాగునీటి అధికారులకు అప్పగించారు. వాటికి సంబంధించి చెల్లింపులు కూడా రైతులకు చేశారు. ఇంకా 20.06 ఎకరాలకు భూసేకరణ జరగాల్సి ఉంది. వీటి చెల్లింపులకుగాను రూ.28 లక్షలు కావాలని భూసేకరణ విభాగం నీటి పారుదల శాఖకు అడిగింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వా ల్సి ఉంది. ఇప్పటి వరకు బొబ్బిలి పట్టణ శివారున ఉండే భైరవసాగరం గట్టు ఎత్తు, వెడల్పు చేయడం, రెండు కల్వర్టులను ఏర్పాటు చేశారు. వాకాడ గ్రామం వద్ద కిలోమీటరు కాలువను తవ్వి వదిలేశారు. వాస్తవానికి హైలెవల్ కెనాల్ ద్వారా 13 కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాల్సి ఉంది. సీతానగరం మం డలం లచ్చయ్యపేట, వెన్నెల బుచ్చంపేట, కోటసీతారాం పురం, బొబ్బిలి మండలం కింతలివానిపేట, కలవరాయి, వాకాడవలస, చింతాడ, రాముడువలసకు సాగునీరు అందాలి. గొల్లపల్లి లింక్ ఛానల్ ద్వారా భైరవసాగరం, గొల్లపల్లి వెంగళరాయగారి చెరువుల కింద ఉన్న 700 ఎకరాల ఆయకట్టుకు నీరందాలి. 5ఏఆర్ మైనర్ కాలువల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాలి. దీని వల్ల గున్నతోట వలస, రంగరాయపురం, మెట్టవలసకు 677 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తు తం భైరవసాగరం వద్ద మొదలు పెట్టిన పనిని అసలు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడం వల్ల చెల్లింపులు సరిగా జరగక వివాదం నెలకొ ని పనులు మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి. అదనపు ఆయకట్టులో రెండు స్లూయిస్ కల్వర్టులు, పది రోడ్డు కల్వర్టులు, కిలోమీటరు పొడవునా వయూడక్ట్ వంటివి ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి ఈ పనులేవి సగభాగం కూడా పూర్తి కాలేదు. కిలోమీటరు కాలువ తప్పించి ప్రగతి లేకపోవడంతో వచ్చే ఖరీఫ్‌కు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. రూ.11 కోట్లకుఇప్పటికి రూ.28 లక్షలే ఖర్చయినట్టు అధికారు లు చెబుతున్నారు. నిధులున్నా పనులు జరగక పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
కరువు కోరల్లోనే..
- 70శాతం చెరువుల్లో నీరు కరువు - 24శాతం అంతంత మాత్రమే - పూర్తిగా నిండింది 6.20శాతమే - భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం - పరిస్థితి ఇలాగే ఉంటే రబీ పంటలకు కష్టమే సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరువు కొట్టుమిట్టాడుతోంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు కేవలం భూమి తడపడానికి, మెట్ట పంటలకు ప్రాణం పోయడానికే సరిపోయింది. చెరువుల్లోకి పెద్దగా నీళ్లు వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువే. జిల్లాలోని సుమారు 70శాతం చెరువులు నీళ్లులేక బోసిపోయాయి. దీంతో చెరువులనే ఆధారం చేసుకొని ఖరీప్‌లో సాగు చేస్తున్న వరిపైరు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రబీ పంటపై పూర్తిగా ఆశలు వదుకోవాల్సిందే. జిల్లా నుంచి కృష్ణానది పారుతున్నా ఇక్కడి పొలాలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కేవలం రెండు, మూడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు మాత్రమే నీరు అందుతోంది. జిల్లాలోని దాదాపు 55మండలాలు కేవలం చెరువులు, కుంటల ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో చెరువులను మూడు డివిజన్లుగా విభజించారు. వాటి పరిధిలో మొత్తం 6,055 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (40హెక్టార్లలో విస్తరించినవి) 681 ఉన్నాయి. వీటి కింద 60,456 హెక్టార్లు సాగవుతోంది. చిన్న చెరువులు 5,374 దాకా ఉన్నాయి. వీటి కింద 41,732 హెక్టార్ల పంట సాగవుతోంది. అయితే ఈ ఏడాది చెరువుల్లోకి పెద్దగా నీరు రాకపోవడంతో అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వరి పంట పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగు అంతంతే..! ఈ ఏడాది వర్షాలు దాగుడుమూతలు ఆడడంతో పంట సాగు అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో సరాసరిగా అన్ని పంటలు కలిపి 7,38,731.4 హెక్టార్లు సాగయ్యేది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 5,16,266 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాధారణంతో పోల్చితే దాదాపు 30శాతం పైగా సాగు తక్కువగా నమోదైంది. ఇక వరి విషయానికొస్తే అతి దారుణమైన గణాం కాలు నమోదయ్యాయి. జిల్లాలో వరి 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 33,557 హెక్టార్లు మా త్రమే సాగైంది. అది కూడా జూరాల, ఆర్డీఎస్ పరిధిలోని చోటుచేసుకున్న గణాంకాలే సూచిస్తున్నాయి. అయితే ఈ సారి చిన్న, పెద్ద చెరువులేవీ పూర్తిస్థాయిలో నిండలేదు. దాదాపు 70శాతం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. దీంతో ఈసారి వరి పంట కేవలం 33,557 హెక్టార్లలో మా త్రమే సాగైంది. వాస్తవానికి జిల్లాలో 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా కేవలం 30.65శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అది కూడా మున్ముందు సరైన వర్షా లు కురవకపోతే వాటి పరిస్థితి కూడా అంతే సంగతులు. మహబూబ్‌నగర్ డివిజన్ కాస్త నయం ఈ ఏడాది కురిసిన వర్షాలు కూడా అంతంత మాత్రమే. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు మాత్రమే కాస్త ఉపసమనం కలిగించాయి. అయినప్పటికీ ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 28 శాతం లోటుంది. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురిశాయి. ఈ డివిజన్ పరిధిలో 302 పెద్దవి, 2183 చిన్న చెరువులున్నాయి. వీటిలో 15 పెద్ద చెరువులు, 329 చిన్న చెరువులు పూర్తిగా నిండాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ డివిజన్ పరిధిలో 46 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 157 పెద్దవి, 1,068 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 222 పెద్దవి, 2,123 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు నిండలేదు. -
పురుగు మందుల ధరల పరుగు
భారీగా పెంచిన కంపెనీలు ఆందోళనలో రైతులు యలమంచిలి : పురుగుమందు కంపెనీలు ధరలు పెంపుతో ‘మూలిగే నక్కమీద తాటికాయ వేసిన’ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. వర్షాల్లేక ఖరీఫ్ సాగు నిరాశాజనకంగా ఉంది. ఎట్టకేలకు ఇటీవల అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో రైతులు సాగు పనులకు వీలు చిక్కిందని రైతులు సంబరపడుతున్నారు. కానీ పురుగు మందుల ధరలు పెరుగుదల చూసి దిగులు చెందుతున్నారు. ఇప్పటికే వరి నారుకు, ఇతర వాణిజ్య పంటలకు తెగుళ్ల నివారణకు వీటి అవసరం ఉంది. పొరుగు జిల్లాల కంటే జిల్లాలో పురుగు మందుల ధరలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కొంతమంది పెద్ద రైతులు పక్క జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. సన్న, చిన్నకారు రైతులు గత్యంతరం లేక పెంచిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. దీనికి నకిలీ పురుగు మందులు తోడయ్యాయి. వీటిని వాడితే అటు పురుగులు చావక, ఇటు పంటలను కాపాడుకోలేక సతమతమవుతున్న పరిస్థితులున్నాయి. జిల్లాలో ఏటా రూ.200 కోట్ల వరకు పురుగు మందుల విక్రయం జరుగుతోంది. వరితో పాటు వాణిజ్య పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణకు పురుగు మందులను రైతులు వాడుతున్నారు. కొంతమంది జిల్లాస్థాయిలో సిండికేట్ అయి ధరలను పెంచి విక్రయిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు దీనిపై సరిగ్గా దృష్టి సారించడం లేదని అంటున్నారు. పురుగు మందుల ధరలు పెంచకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
ప్రత్యామ్నాయమే
1.59,978 హెక్టార్లలోనే ఖరీఫ్ సాగు 19,700 హెక్టార్లలో ఆరుతడి పంటలకు కార్యాచరణ 8800 కింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు ఖరీఫ్ సాగు నెమ్మదిగా సాగుతోంది. వర్షపాతం సాధారణం కంటే 66 శాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతమే పంటలు చేపట్టారు. దీంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 15వ తేదీ వరకు వ్యవసాయాధికారులు, రైతులు వర్షాల కోసం ఆశతో ఎదురుచూశారు. అదను దాటిపోతుండడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే స్వల్పకాలిక వంగడాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖ రూరల్ : జిల్లాలో 2,80,783 హెక్టార్లలో ఖరీఫ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా వర్షాభావ పరిస్థితులతో 1,59,978 హెక్టార్లలోనే పంటలు సాగవుతున్నాయి. అదీ జలాశయాల నుంచి సాగునీటి విడుదలతో వాటి పరిధిలోనే ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఆగస్టులో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. ఇంతవరకు కేవలం 68.5 మిల్లీమీటర్లే కురిసింది. దీంతో మిగతా ప్రాంతాల్లో ఆరు తడి పంటలు, స్వల్ప కాలిక వంగడాలే గత్యంతరం. ఆగస్టు 15వ తేదీ వరకు వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు. వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు కేటాయింపులకు ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. విజయనగరంలో ఉన్న గోదాముల్లో ఈ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళ,బుధవారాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల రైతులు అధికారుల దృష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సరఫరా చేయాలని కోరారు. దీంతో మండలాల వారీ అవసరాలను గు ర్తించి సరఫరాకు అధికారులు చర్యలుచేపడుతున్నారు. అయితే బ్యాంకర్లు రు ణాలివ్వకపోవడంతో కొందరు రైతులు పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నా రు. స్వల్పకాలిక పంటలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మందు పిచికారీ చేస్తున్నారా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచీ విత్తనం విత్తుకుని, పంట దిగుబడి వచ్చే వరకు పంటలను కాపాడుకోవడానికి రైతులు చేయని ప్రయత్నం ఉండదు. చీడపీడల బారి నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం విస్మరిస్తుంటారు. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ వివరించారు. జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పతి, సోయాబీన్ పంటలపై రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు తదితర తెగుళ్ల నివారణకు పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. రకరకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసే సందర్భాల్లో జాగ్రత్తలు వహించకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. మందులు చల్లే సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి, సోయా పంటలు సాగవుతున్నాయి. మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
సాగర్‌పైనే భారం
శావల్యాపురం : మండలంలోని రైతులు వరి నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో సాగర్ జలాశయం కళకళలాడుతోంది. దీంతో రైతులు వరి సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల ఖాయమని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్లు రాగానే నాట్లు వేసేందుకు వీలుగా బోర్లు, బావులు కింద ఉన్న పొలాల్లో నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. * శావల్యాపురం, బొందిలిపాలెం, మతుకుమల్లి, గుంటిపాలెం, శానంపూడి, కారుమంచి, చినకంచర్ల, వేల్పూరు, పోట్లూరు గ్రామాల్లో బావుల కింద, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు బీపీటీ, ఎన్‌ఎల్‌ఆర్ రకాల వరి నారు పోస్తున్నారు. * జూలై-సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ సాగుకు, అక్టోబర్-నవంబర్ మధ్య రబీకి అను కూలంగా ఉంటుంది. * ఆగస్టు నెల సగం గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు ఆలస్యమైపోతుం దని రైతులు నారుమళ్లు పోస్తున్నారు. * మండలంలో మొత్తం ఏడు వేల హెక్టార్ల సాగుభూమి ఉండగా, సుమారు ఐదు వేల హెక్టార్లు మాగాణి పరిధిలో ఉంది. ప్రధానంగా రైతులు మాగాణిపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మండలంలో కేవలం 500 ఎకరాలకు సరిపడ నారు మాత్రమే పోసినట్టు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పత్తి సాగు వైపు మొగ్గు ... * మెట్ట పంటల విషయంలో మండల రైతులు పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతు న్నారు. * ఎక్కువగా పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నీటి ఎద్దడి తట్టు కోవడం, నీటి అవసరాలు కూడా తక్కువగా ఉండడంతో పత్తి పంటకు ఆదరణ ఉంది. * ప్రస్తుతం మిర్చికి, కూరగాయల ధరలకు రెక్కలు రావటంతో చిన్న, సన్నకారు రైతులు వంగ, దోస, బెండ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. * ఇప్పటికే రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం జీవం పోసింది. జాగ్రత్తలు పాటించాలి ... నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాగర్‌లో నీటిపై ఆశాభావంతో రైతులు నారు పోస్తున్నారు. నీరు అందుబాటులో ఉంటేనే నారుమళ్లు పోయాలి. లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. బీపీటీ వేయాలనుకున్న రైతులు, అగ్గి తెగులు, దోమపోటు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యం గా బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449, జేజేలు 384 రకాలు మంచి దిగు బడులు ఇస్తాయి. - హరిప్రసాద్, వ్యవసాయాధికారి -
ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సాగర్ నీటివిడుదల
మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ పరిధిలోని మొదటిజోన్ కు ఆగస్టు 10వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నీటిని విడుదల చేసేందుకు ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళిక రూపొం దించారు. ఖరీఫ్ సాగుకు గాను ఈ నీటివిడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఉంటుంది. విడతల వారీ నీటి విడుదల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్ఎస్పీ అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించి, ఆపై నీటివిడుదల కొనసాగించనున్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, అధికారులతో సీఈ యల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటివిడుదలపై వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మననీరు-మన ప్రణాళిక’ అనే లక్ష్యంతో సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు రైతులతో ఈ అవగాహన సదస్సు నిర్వహించినట్లు యల్లారెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3,04,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 16,000 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలోకి ఇప్పటి వరకు 125 టీఎంసీల వరదనీరు చేరిందన్నారు. ఎగువ కృష్ణా నుంచి వచ్చే వరదను అంచనా వేసి రెండోజోన్‌కు నీటి విడుదలపై మరో 10రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు సాగునీటి తీరువాను ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. మెయిన్ కెనాల్, మేజర్ల కాల్వలు, తూములను రైతులు ఎవరైనా స్వార్థం కోసం ధ్వంసం చేస్తే చట్టరీత్యా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఫీ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ ఎస్ఈ నాగేశ్వరరావు, ఎడమకాల్వ నీటిసంఘం మాజీ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి,ఈఈ రత్తయ్య, ఏఓ జయప్రద ఉన్నారు. -
కోతలతో యాతన
కామారెడ్డి: కరెంటు రైతులను కంటతడి పెట్టిస్తోంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం కరెంటు కోతలతో మరిన్ని కష్టాలపాలవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర గడచినా భారీ వర్షాలు లేకపోవ డం రైతులకు శాపంగా మారింది. కనీసం భూగర్భజలాలపై ఆధారపడి సేద్యం చేద్దామనుకున్నా కరెంటు కోతలు వాతలు పెడుతున్నాయి. ఏడు గంటల పాటు కరెం టు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఐదు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి డివిజన్లోని దోమకొండ, మాచారెడ్డి, కామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, భిక్కనూరు తదితర మండలాలలో కరెం టు కోతలు ఎక్కువయ్యాయి. పగటిపూట ఐదు గంటలు సరఫరా ఉండాల్సిన సమయంలో నాలుగైదు మార్లు ఆటంకాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. ఏడు గంటలు కరెంటు ఇవ్వాలని అధికారులను కోరితే పై నుంచి ఎంత వస్తే అంత ఇస్తామని చేతులెత్తేస్తున్నారని రైతులు అంటున్నారు. వరి నాట్లకు ఆటంకం ఖరీఫ్ వరి నాట్లు వేయడానికి రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మడి నిండా నీళ్లుంటేనే దున్నడంతోపాటు రొప్పడం సాధ్యమవుతుంది. కోతలతో పారిన మడి పారుతోందని రైతులు అంటున్నారు. రోజుకొక మడిని సిద్ధం చేయలేకపోతున్నారు. ఏడు గంటల పాట నిరంతరాయంగా కరెంటు సరఫరా అయితేనే నాట్లు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది. వర్షాలు కురిస్తే వర్షపు నీటితో కలిపి దున్నడం, రొప్పడం వంటి పనులు సులువుగా అయ్యేవి. వర్షాల జాడ లేకపోవడంతో నాట్లు వేయడం గగనంగా మారింది. రోడ్డెక్కుతున్న రైతాంగం కోతలతో రైతులు చేసేదేమిలేక రోడ్డెక్కుతున్నారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం దోమకొండ, సదాశివనగర్ మండలాలలో రైతులు రోడ్డెక్కి కరెంటు కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేయడానికి కోతలు ఇబ్బందులు పెడుతున్నాయని, కనీసం ఏడు గంటల కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. సరఫరా మెరుగు కాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని రైతులు అంటున్నారు. -
రుణ ఆశలు..అడియాసలే!
ఖరీఫ్‌లో సాగుకు లక్ష్యం రూ.700 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చింది రూ.3.03 కోట్లు డ్వాక్రా లక్ష్యం రూ.580 కోట్లు మంజూరైంది రూ.24 కోట్లు జిల్లా రుణ ప్రణాళికా లక్ష్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ తప్పుడు హామీలు కారణంగా రుణ లక్ష్యం నీరుగారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, స్వయం ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారికి కష్టకాలమే గోచరిస్తోంది. బ్యాంకు రుణాల మీద కోసం ఎదురుచూసే వారిలో అత్యధికులకు రుణాలు అందని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం చేరుకోవడం అసాధ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో 2014-15 వార్షిక రుణ ప్రణాళికను గతేడాది కంటే 12 శాతం అదనంగా రూ.7260.21 కోట్లతో రూపొందించారు. ఇందులో ప్రాధాన్యతా రంగాల కింద రూ.5,377 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,883 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాలని నిర్ధేశించారు. 2013-14 ప్రణాళిక రూ.6465.58 కోట్లు లక్ష్యం కాగా 2014 మార్చి నాటికి రూ.6786.17 కోట్లు(105 శాతం) సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత వార్షిక రుణ లక్ష్యాలపై సందేహాలు ముసురుకున్నాయి. లక్ష్యం చేరేనా! ప్రభుత్వ చర్యలు రుణ లక్ష్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా రైతాంగం తీవ్ర ంగా నష్టపోతోంది. 2013-14లో వ్యవసాయ రుణాలు రూ.1412.89 కోట్లు లక్ష్యంగా కాగా అంతకు మించి రూ.1997.38 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం 2014-15 వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి మొత్తం రూ.1653 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్ధేశించగా అందులో రూ.960 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలుగా (గతేడాది కంటే రూ.160 కోట్లు అధికం) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించగా, ఇందు లో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు రుణాలు ఇవ్వాలని భావిస్తుండగా, రెన్యువల్స్‌కు 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది, ప్రభుత్వ చర్యలతో నష్టం తెలుగుదేశం ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించడంతో జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా సర్కారు మాత్రం ఇప్పటి వరకు రుణాలు రద్దు చేయలేదు. గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి ఇచ్చిన రూ.1040 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెన్యువల్స్ రుణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 1668 మంది రైతులకు రూ.3.03 కోట్లు రుణాలుగా అందించారు. మహిళల రుణాలు డౌటే జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. సర్కారు లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంతో 9758 సంఘాలకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాస్తవానికి జూన్ నెలాఖరు నాటికే రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 3 వేల సంఘాలకు రూ.24 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తర హా పరిశ్రమలకు గతేడాది కంటే 19 శాతం అధికంగా రూ.734 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణమిచ్చిన దాఖలాలు లేవు. దీంతో రుణ ఆశలు...అడియాసలే అన్న ఆందోళన లబ్దిదారుల్లో వ్యక్తమవుతోంది. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
-
డెడ్ స్టోరేజీకి నిజాంసాగర్!
సాక్షి ప్రతినిది, నిజామాబాద్: ప్రాజెక్టు నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగు కోసం నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారా? లేదా? అన్న అం శంపై అధికారులు ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదు. జిల్లా నీటిపారుదల అధీకృత సంస్థ (డీఐఏ బీ) సమావేశం జరి గితేగాని, నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో ఖరీఫ్ ఆశలు గల్లంతైనట్టే కనిపిస్తోంది. జిల్లా ను కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పడిన చిరుజల్లులు పంటలను ఏ మాత్రం దక్కించలేని పరిస్థితి. జిల్లాలో సాధారణ వర్షపాతం 849 మి.మీటర్లు. ఈ సమయానికి 359.50 మి.మీ కురియాల్సి ఉంది. 2012 జులై 27 నాటికి 284 మి.మీ నమోదు కాగా, 2013 జులై 27 వరకు 681.9 మి.మీ కురిసింది. ఈసారి మాత్రం ఆదివారం నాటికి కేవలం 128.1 మి.మీ వర్షపాతం నమోదైంది. 64 శాతం తక్కువ వర్షం పడింది. దీంతో ప్రధాన ప్రాజెక్టులలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే, నిర్మాణ సమయంలో దీని సామర్థ్యం 28 టీఎంసీలు, 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీలు, 1405 అడుగులే, ఇపుడు నీటి నిల్వ 1392.60 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 5 టీఎంసీలకు పడిపోయింది. డీఐఏబీ సమావేశంపై ఆశలు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్ని, రెంజల్, బోధన్, ఎడపల్లి, ఆర్మూరు, జక్రాన్‌పల్లి తదితర మండలాల రైతులు ఇ ప్పటికే వరి సాగు చేశారు. ఈ సీజన్లో 8,01,902 ఎకరాలలో వివిధ పంటలు వేస్తారనేది వ్యవసాయశాఖ ప్రణాళిక కాగా, 3,11,562 ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా. ఈ క్రమంలోఇంకా నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో నిజాంసాగర్‌పై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అధికారులు, తగ్గిన నీటిమట్టం నేపథ్యంలో ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. బోధన్ సమీపంలోని బెల్లాల్‌కు తాగునీటి అవస రాలకు మాత్రం నీటిసరఫరా ఉంటుందని చెబుతున్నారు. తాగునీటి అవసరాల అనంతరమే సాగునీరు అని అంటున్నారు. డిఐఏబీ సమావేశంలోనైన నిర్ణయం జరుగు తుందన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. అప్పుడే నిర్ణయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్ కోసం నీటిని విడుదల చేసే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. డీఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల ద్వారా రైతులకు మేలు చేసే విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్ష జరిపారు. ప్రభుత్వం ఆదేశం, డీఐఏబీ నిర్ణయం మేరకు ఆగస్టు నెలాఖరులోగానీ, సెప్టెంబర్ మొదటి వారంలోగానీ నీటి విడుదల ఉంటుందని అనుకుంటున్నాము. - సత్యశీలా రెడ్డి, ఈఈ, నిజాంసాగర్ ప్రాజెక్టు -
ఉపశమనం
జిల్లా అంతటా వర్షం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు నారుమడులకు, వరినాట్లు పూర్తి చేసిన పొలాలకు మేలు ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. అన్నదాతకు ఉపశమనం లభించింది. జిల్లా అంతటా రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు జీవం పోసుకుంటున్నాయి. నాట్లు వేసిన పొలాలు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సాగుపై రైతన్నలకు ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం : ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వేసవి తరువాత రెండు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురుపట్టడంతో ఖరీఫ్ సీజన్‌కు వాతావరణం అనుకూలంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదలకాకపోయినా వెదజల్లే పద్ధతి ద్వారా దాదాపు 25వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిచేశారు. వర్షాధారంగానే దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు నారుమడులు పోశారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాలకు, నారుమడులకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల సమీపిస్తుండటంతో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు. వాతావరణం ఇలాగే కొనసాగితే వర్షాధారంగా అయినా పంటలు సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు. 41,250 ఎకరాల్లో వరినాట్లు ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. జూన్, జూలైల్లో వర్షపాతం తక్కువగా నమోదవటంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. వెదజల్లే పద్ధతి, బోరునీటి ఆధారంగా 41,250 ఎకరాల్లో వరినాట్లు ఇప్పటివరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెడన, గుడ్లవల్లేరు, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, ఘంటసాల, మొవ్వ, ఉంగుటూరు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. జూలై 27వ తేదీ నాటికి జిల్లాలో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 144.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో పైరు, నారుమడులకు పోషకాలు సక్రమంగా అందక, నీరు లేక పైరు ఎండిపోయే దశకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పైరుకు ప్రాణం పోసినట్లయింది. ఇప్పటి వరకు 18,750 ఎకరాల్లో వరినారుమడులు పోశారు. ఈ వర్షాల వల్ల మిగిలిన ప్రాంతాల్లోనూ నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. చెరకు మొక్కల ఎదుగుదలకు దోహదం ఈ ఖరీఫ్ సీజన్లో 37,500 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా 40వేల ఎకరాలకు ఈ సాగు పెరిగింది. మొక్కతోటల్లో వర్షాలు లేకపోవటంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. వర్షాలు కురుస్తుండటంతో చెరకు తోటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ జేడీ బి.నరసింహులు, డీడీ బాలునాయక్ తెలిపారు. పత్తికి మేలు పశ్చిమ కృష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల, గంపలగూడెం, తిరువూరు, మైలవరం, జి.కొండూరు తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 75వేల ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. ఈ ఖరీఫ్ సీజన్లో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా. వర్షాభావం కారణంగా పత్తిసాగు గణనీయంగా తగ్గింది. పత్తిని పక్కనపెట్టిన రైతులు సుబాబుల్ సాగుపై మక్కువ చూపుతున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో పత్తి మొక్కల్లోనూ ఎదుగుదల లోపించింది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు కురవకపోవటంతో మారాకు దశలో ఉన్న పత్తి మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి మొక్కల ఎదుగుదలకు మేలు చేస్తాయని, ఇదే వాతావరణం కొనసాగితే మొక్కలు త్వరితగతిన ఎదుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు జిల్లాలో ఆదివారం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పమిడిముక్కలలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎ.కొండూరు-64.8, రెడ్డిగూడెం-61.4, కలిదిండి-57.4, తిరువూరు-54.2, ముదినేపల్లి-45.6, విస్సన్నపేట-42.6, నూజివీడు-38.6, బంటుమిల్లి-37.6, ముసునూరు-36.2, కైకలూరు-36.2, చాట్రాయి-35.2 మైలవరం-35.0, కంకిపాడు-31.2, జి.కొండూరు 30.4, పామర్రు-28.6, గన్నవరం-27.6, ఆగిరిపల్లి-26.2, చల్లపల్లి-24.4, బాపులపాడు-24.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయవాడ-24.0, గూడూరు-24.0, ఘంటసాల-22.4, ఉయ్యూరు-21.4, మచిలీపట్నం-20.6, గంపలగూడెం-20.4, పెదపారుపూడి-19.2, కోడూరు-18.2, పెనమలూరు-15.8, గుడివాడ-14.8, వీరులపాడు-11.6, గుడ్లవల్లేరు-11.2, కృత్తివెన్ను-10.2, ఉంగుటూరు-10.2, మోపిదేవి-9.2, నందివాడ-8.2, మొవ్వ-6.8, అవనిగడ్డ-6.4, వత్సవాయి-5.8, తోట్లవల్లూరు-5.4, పెడన-5.2, కంచికచర్ల-5.2, ఇబ్రహీంపట్నం-5.0, నాగాయలంక-4.4, నందిగామ-4.4, పెనుగంచిప్రోలు-4.0, చందర్లపాడు-3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి సంగారెడ్డి: వర్షాభావంతో జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. అదనుదాటడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు సగానికి పడిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.52 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. పొద్దుతిరుగుడు, ఆము దం పంటలను ప్రత్యామ్నాయ పంటలుగా రైతులకు సూచిస్తోంది. వచ్చే ఆగస్టు చివరి వారం వరకు పొద్దుతిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పొద్దుతిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం పల్లెల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు వ్యవసాయశాఖ 15 ప్రచార రథాలను సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రచార రథాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా పంటల సాగు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాగుకు నోచుకోని1.89 లక్షల హెక్టార్లు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 4.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. అయితే రైతులు ఇప్పటి వరకు 2.51 లక్షల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్న, పత్తి, వరి తదితర పంటలు సాగు చేయగలిగారు. వర్షాభావం వల్ల 1.89 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఖరీఫ్‌లో పంటల సాగు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఖరీఫ్‌లో 97,730 పత్తి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రైతులు 72,301 హెక్టార్లలో పత్తి సాగు చేయగలిగారు. 15,869 హెక్టార్లలో జొన్న సాగు చేయాల్సి ఉండగా 7,367 హెక్టార్లలో జొన్న వేశారు. 1,10,662 హెక్టార్లలో మొక్కజొన్న సాగు కావాల్సి ఉండగా 71,677 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగు చేశారు. గతంలో పోలిస్తే మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్‌లో సగానికి పడిపోయింది. వరి సాగు సైతం ఆశించిన స్థాయిలో లేదు. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 81,383 హెక్టార్లకుగాను 30వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వర్షాలు వచ్చేనెలలో సైతం ఆశించినస్థాయిలో కురవకపోతే పంటల ఎదుగుదల, సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ఆశలు ఖరీఫ్‌లో వర్షాభావంతో రైతులు 1.89 లక్షల హెక్టార్లలో పంటలు వేయలేదు. దీంతో వ్యవసాయశాఖ 1.52 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. మిగతా 37వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సాగుచేయవచ్చని వ్యవసాయశాఖ అంచనా. ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి 1.15 లక్షల హెక్టార్లలో పొద్దతిరుగుడు, 37వేల హెక్టార్లలో ఆముదం సాగును వ్యవసాయశాఖ సూచిస్తోంది. 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు వీలుగా.. 5,733 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 1848 క్వింటాళ్ల ఆముదం విత్తనాలను సిద్ధం చేస్తోంది. పొద్దతిరుగుడు, ఆముదం పంటలు వచ్చేనెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చు. దీనిపై వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పించి వందశాతం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయించేందుకు సన్నద్ధమవుతోంది. -
ఖరీఫ్.. కటకట
కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సాగుకు ప్రభుత్వంతోపాటు ప్రకృతి కూడా సహకరించడం లేదు. ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఆశించిన వర్షం కురవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రుణమాఫీపై ఎటూ తేల్చకుండా కాలయపన చేస్తున్నారు. మార్గదర్శకాల కోసం మొదట కోటయ్య కమిటీని వేశారు.. నిధుల సమీకరణ కోసమంటూ మరో కమిటీని నియమించారు. ఇది పని పూర్తిచేసి రైతులకు రుణమాఫీ అయ్యే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం బ్యాంకర్లను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. అయితే వారు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదిలా ఉండగా బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న అన్నదాతల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. రికవరీల కోసం బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. శిరివెళ్ల మండలంలో దాదాపు 200 మందికి నోటీసులు అందాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెట్టుబడుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రుణాలు దొరకక అల్లాడుతున్నామని పలువురు రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో కాడి వదిలేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగానికి తగ్గిన సాగు.. ఇంతవరకు సరైన వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగులో పురోగతి కనిపించడం లేదు. అంతంత మాత్రం తేమలో విత్తనాలు వేసినా అవి మొలకెత్తలేదు. మొలకెత్తిన పైర్లు వానలు లేక ఎండిపోతున్నాయి. అరకొర పదనులో ఈ ఏడాది 1.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. అలాగే 33 వేల హెక్టార్లలో వేరుశనగను విత్తారు. అక్కడక్కడ మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు సాగు చేశారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ. కాగా, 66.5 మి.మీ నమోదైంది. జూలై నెలలో 117 మి.మీకు గాను 85 మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెరువుల్లో చుక్క నీరు లేదు. అలాగే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2.56 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంతంత మాత్రం తేమలో పంటలు వేయడంతో కొద్ది రోజుల బెట్టను తట్టుకోలేక ఎండిపోతున్నాయి. జిల్లాలో దాదాపు 25 మండలాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తి నిరాశజనకంగా మారింది. చాగలమర్రి మండలంలో ఈ నెల అత్యల్ప వర్షపాతం నమోదయింది. కేవలం 4.6 మి.మీ. వర్షం మాత్రమే ఇక్కడ కురిసింది. అలాగే వెల్దుర్తి, బేతంచెర్ల, ఉయ్యాలవాడ మండలాల్లో అతి తక్కువగా వర్షాలు కురిశాయి. మద్దికెర, పాణ్యం, క్రిష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, పగిడ్యాల, గోనెగండ్ల, జూపాడుబంగ్లా, ఎమ్మిగనూరు, నందవరం, ఓర్వకల్లు, దేవనకొండ, దొర్నిపాడు, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, రుద్రవరం తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. జిల్లాలో 88645 హెక్టార్లలో వరిని పండించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాద స్థాయిలో భూగర్భజలాలు ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో బావులు, బోర్ల కింద దాదాపు 20 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోతుండటంతో పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లో 10.77 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు మే నెలలో 11.13 మీటర్లకు పడిపోయాయి. జూన్ నెలలో 11.40 మీటర్లకు తగ్గిపోయాయి. -
ఇంకా.. 5 రోజులే..
ఆ తర్వాత వర్షాలు కురిసినా వృథా జూలై దాటితే ప్రత్యామ్నాయమే ఏజెన్సీలో సగానికి మించి వరి నాట్లు మైదానంలో నారుమళ్లకే పరిమితం అనకాపల్లి/నర్సీపట్నం రూరల్: జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2.16 లక్షల హెక్టార్లు. ప్రస్తుతం 74,860 హెక్టార్లలో పంటలున్నాయి. వీటిలో జనవరి నుంచి సాగవుతున్న చెరకు విస్తీర్ణం 38,329 హెక్టార్లు మినహాయిస్తే పట్టుమని పాతిక వేల హెక్టార్లలోనూ ఖరీఫ్ పంటలు లేవు. వరి పరిస్థితి దయనీయంగా ఉంది. దీని సాధారణ విస్తీర్ణం 96,519 హెక్టార్లు. ఇప్పటివరకు మన్యంలోనే కాకపోవడం గమనార్హం. అవి వస్తేనే గాని కొత్తవాటికి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం గతేడాది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాయితీ పెంపుపై గత డిసెంబర్ వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఆ ఏడాది ఎస్సీలకు సంబంధించి 1425 యూనిట్లు లక్ష్యంగా అధికారులు ప్రతిపాదించారు. సబ్సిడీ ఎంతన్న విషయాన్ని తేల్చకపోవడంతో జనవరి వరకు ఒక్కటీ మంజూరు కాలేదు. మైనార్టీల విషయంలోనూ అదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల నిరుద్యోగుల కోసం 5750 యూనిట్లను లక్ష్యాంగా నిర్దేశించారు. బ్యాంకు రుణం, లబ్ధిదారుని వాటా, సబ్సిడీ ఇలా మొత్తంగా వీటికి రూ.34.49 కోట్లు కేటాయించారు. వీటిలో మంజూరైన యూనిట్లకు సబ్సిడీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రుణ లక్ష్యాలు, మంజూరులో భారీ వ్యత్యాసముంటోంది. ఈ ఏడాది లేనట్టేనా! : వాస్తవానికి ఏటా ఏప్రిల్, మేలో యూనిట్ల మంజూరు, నిధుల లక్ష్యం నిర్దేశించి మూడు నెలల్లో రుణాలను మంజూరు చేస్తుంటారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలవుతున్నా.. ఇప్పటి వరకు ఏ శాఖకు రాయితీ రుణ లక్ష్యాలను నిర్దేశించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సబ్సిడీ రుణాలు అందించే పరిస్థితులు లేవని అధికారులు సైతం చెబుతున్నారు. గతేడాదికి సంబంధించిన రుణాల రాయితీ నిధులు మంజూరైతేనే గాని కొత్తవి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే రుణాల కోసం నిరుద్యోగులు సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు వారికి ఎటువంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు. యూనిట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు స్వయం ఉపాధిని కల్పించుకోలేకపోతున్నారు. -
నెలన్నర ఆలస్యంగా ఖరీఫ్ సాగు
•అక్టోబర్ వరకు వర్షాలు కురిస్తేనే పంటలు చేతికి •వరుణుడిపైనే భారం వేసిన రైతులు దౌల్తాబాద్: మండలంలో వర్షాధారంగా సాగు నెలన్నర ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పడి పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను వేస్తారు. కానీ ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా సకాలంలో విత్తనాలు పడలేదు. జూలై మూడవ వారంలో మాత్రమే కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. జూలై నెలలో సాధారణ వర్షపాతం 234 మిల్లీమీటర్లు కాగా మూడు వారాలు ముగి సినా కేవలం 55 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అదికూడా మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడింది. ఈ వర్షాలకు వేసిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుమూడేళ్ళుగా సకాలంలో వేసిన పంటలు కాతపూత దశలో వర్షాభావం కారణంగా కొంతవరకు దెబ్బతిన్నాయి. ప్రస్థుతం నెలన్నర ఆలస్యంగా వేసిన విత్తనాలు మొలిచి పంటపండాలంటే కాతపూత దశలో వర్షాలు కురువాల్సిందే. కనీసం అక్టోబర్ నెలాఖరు వరకు వర్షాలు పడితేనే ఈ పంటలు గట్టెక్కుతాయి. అయినప్పటికీ రైతులు వరుణు దేవునిపై భారం వేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు సరిగ్గా మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తనాలు వేశారు. దీంతో పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతున్నది. ఇక ముందైనా సరైన వర్షాలు కురవకపోతే రైతులు తీవ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచివున్నది. -
తరుముకొస్తున్న బీమా
31లోపు ప్రీమియం చెల్లించాలి గడువు పొడిగించాలనిరైతు నేతల విజ్ఞప్తి తమకు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు అయోమయంలో అన్నదాతలు గుడివాడ : అన్నదాతను వరుస సమస్యలు గుక్కతిప్పుకోనివ్వడంలేదు. ఇప్పటికే రుణ‘మాయ’లో చిక్కుకున్న రైతన్న ఖరీఫ్ సాగుకు కొత్త అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ధీమాను పెంచే పంటల బీమా పథకం ప్రీమియం చెల్లిం పునకు గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31వ తేదీతో పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించాలని వ్యవసాయాధికారులు కోరినా ఎవరూ చెల్లించే పరిస్థితిలో లేరు. జిల్లావ్యాప్తంగా 6.30 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పంటరుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోవటం వల్లే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. వెంటనే రుణాలు మాఫీ అవుతుందా.. లేదా.. ఎంత రుణం మాఫీ అవుతుంది.. తదితర విషయాలు తెలియక రైతులు తికమకపడుతున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్ సమయం కాస్తా పూర్తి అవుతున్నా ఇంతవరకు బ్యాంకుల నుంచి రైతులు పైసా రుణం పొందలేదు. ఇప్పటి వరకు జిల్లా వాసులంతా బ్యాంకుల నుంచి పొందే వ్యవసాయ రుణం నుంచే పంటల బీమాకు ప్రీమియం చెల్లించటం ఆనవాయితీ. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు రైతుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏటా ఖరీప్‌కు ఏప్రిల్ నుంచి జూలై ఆఖరు వరకు వ్యవసాయ రుణాలు పొందుతుంటారు. ప్రీమియం చెల్లింపు ఇలా.. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని కొత్త పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పంట ఆయా స్టేజీల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా బీమా కంపెనీల నిబంధనలకు లోబడి రైతులకు పరిహారం చెల్లిస్తారు. ఇందుకోసం ప్రతి రైతు తీసుకున్న రుణంలో 12.5 శాతం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో రైతులు 5 శాతం చెల్లించాలి. ప్రభుత్వం 7.5 శాతం చెల్లిస్తుంది. వరి రైతుకు బ్యాంకుల నుంచి ఎకరాకు రూ.18,260 వ్యవసాయ రుణం పొందవచ్చు. దీని ప్రకారం ఎకరానికి పంటల బీమాకు ప్రీమియంగా రూ.2,283 బీమా కంపెనీకి చెల్లించాలి. రైతు వాటా(5 శాతం) రూ.913 చెల్లించాలి. ప్రభుత్వం 7.5శాతం చొప్పున రూ.1,370 చెల్లిస్తుంది. ప్రతి రైతు బ్యాంకు నుంచి రుణం పొందినప్పుడు గానీ, లేదా నేరుగా అయినా ప్రీమియంను చెల్లించి పంటల బీమా సదుపాయం పొందవచ్చు. కౌలు రైతులు కూడా ప్రీమియం చెల్లించి ఈ పంటల బీమాను పొందవచ్చు. గడువు పొడిగిస్తే మేలు నిత్యం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతన్నకు బీమా ధీమా లేకపోతే తీరని నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల రైతులు కొత్తగా రుణాలు పొందలేక పోయారు. పాత బకాయిలు చెల్లించని కారణంగా కొత్త రుణాలు ఇవ్వటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటల బీమా పథకానికి మరో రెండు నెలలు గడువు పొడిగించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్చేస్తున్నారు. గడువు పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు లేవు ఈ నెల 31వ తేదీతో పంట బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు గడువు ముగుస్తుంది. ఆసక్తి గల రైతులు నేరుగా అయినా చెల్లించుకోవచ్చు. గడువు పొడిగిస్తూ మాకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. వెంటనే ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందాలని రైతులకు సూచిస్తున్నాం. - నర్సింహులు, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ -
మేఘమా మురిపించకే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2014 ఖరీఫ్ సీజన్‌కు కార్యాచరణను రూపొందించారు. 3,20,761 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు వేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా వరి, సోయా సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పసుపు, చెరుకును పండిస్తారు. ఈ నేపథ్యంలో 3.21 లక్షల హెక్టా ర్లకుగాను 12,4625 హెక్టార్లలో వరి, 70910 హెక్టార్లలో సోయా, 57,630 హెక్టార్లలో మొక్కజొన్న, 11508 హెక్టార్లలో పసుపు వేయనుండగా.. మిగతా హెక్టార్లలో కందులు, పెసర, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఏపీ సీడ్స్, హాకా, ఏపీ అయిల్‌ఫెడ్ ద్వారా 70 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 3,650 క్వింటాళ్ల మొక్కజొన్నలతోపాటు మొత్తం 79,800 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2,42,685 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న వ్యవసాయశాఖ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అందుకు భిన్నంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగును కొనసాగించలేక, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లలేక రైతులు అయోమయంలో ఉన్నారు. తగ్గిన వర్షపాతం.. ప్రాజెక్టులపైనే భారం గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చితే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి, సోయా తదితర పంటలకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలనుకున్నా ప్రాజెక్టులపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆశాజనకంగానే ఉన్నా ఆయకట్టు రైతులు భవిష్యత్ పరిణామాలకు భయపడుతు న్నారు. సాధారణ వర్షపాతం జిల్లాలో 849 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 233.6 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉంది. 2012లో ఇదే సీజన్లో 178.70 మి.మీటర్లు, 2013 సంవత్సరంలో 301.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 91.80 మి.మీ. నమోదైంది. 59 శాతం వర్షపాతం మైనస్‌గా ఉం డటం రైతులకుఆందోళన కలిగిస్తోంది. ఇదిలా వుంటే శ్రీరాంసాగర్‌లో 1091 ఫీట్లకు 1067.60 ఫీట్ల వరకు నీరు ఉన్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. నిజాంసాగర్‌లో1405 ఫీట్లకు 1392.78 ఫీట్లుగా నమోదు కాగా.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాజెక్టుల నీరు ఏ మేరకు వినియోగం అవుతుందన్న చర్చ జరుగుతోంది. -
‘మధుకన్డ్’కావరం
గెడ్డలకు అడ్డంగా గట్లు వేస్తున్నారు. నీటి మార్గాలను మళ్లిస్తున్నారు. చెరువులు నిండకుండా అడ్డుకుంటున్నారు. అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. మధుకాన్ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. పోలవరం కాలువ తవ్వకాల కోసం గెడ్డల్ని కప్పెడుతున్నారు. రైతుల పాలిట సైంధవుల్లా తయారయ్యారు. రెండువేల ఎకరాల్లో ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేశారు. మధుకాన్ సంస్థ అధినేత టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. నక్కపల్లి: మండలంలో పోలవరం కాలువ నిర్మాణం చేపడుతున్న మధుకాన్ కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల జగన్నాథపురం, గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం, రమణయ్యపేట, డొంకాడ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లోకి నీరు చేరక పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల్లోకి వచ్చే నీటి మార్గాలకు కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయడంతో నీరు దిగువ ప్రాంతాలకు రావడం లేదు. ఫలితంగా ఆయకట్టు భూముల్లో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగేళ్లుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ తూర్పు, పడమర దిశగా తవ్వుతున్నారు. నక్కపల్లి మండలంలో ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పంట కాలువలు, కొండ గెడ్డలున్నా యి. కాలువ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఎ న్నో ఏళ్లుగా ఉన్న గెడ్డలకు అడ్డంగా మట్టి పోశా రు. వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లో పడిన నీరు దిగువకు పోయేలా మార్గాలను ఏర్పాటు చేయకపోవడంతో నీరంతా పోలవ రం కాలువలో చే రి నిలిచిపోతోంది. వందలాది ఎకరాలు ఆయకట్టు కలిగిన చెరువుల్లోకి చుక్క నీరు రావడం లేదు. జగన్నాథపురంలో పెద్ద చెరువు కింద 250 ఎకరాలు, నేరెళ్ల చెరువు కింద 120, ఉద్దండపురం పెద్దచెరువు కింద 350, గుల్లిపాడు ఈదుల చెరువు కింద 220, కొత్త చెరువు కింద 250, తిరపతమ్మ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు కురి స్తేనే ఈ చెరువులు నిండి ఆయకట్టు పొలాలు సాగవుతుంటాయి. నాలుగేళ్లుగా మధుకాన్ కాంట్రాక్టర్లు చెరువుల్లోకి నీరు రాకుండా గట్టు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల సగానికి పైగా ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. చెరవుల్లోకి నీరు వెళ్లే మార్గాలను యథావిధిగా పునరుద్ధరించాలని గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం రైతు లు ఇటీవల రెండు పర్యాయాలు మధుకాన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గతంలో పడిన వర్షాలకు చెరువుల్లో నీరు చేరితే నారు పోసేవారమని, విత్తనాలున్నా నీరులేక వేయలేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధుకాన్ కాంట్రాక్టర్లతో మాట్లాడి చెరువుల్లోకి నీరు చేరే మార్గాలను యధావిధిగా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. -
అదును దాటుతున్నా జాడలేని వానలు
కామారెడ్డి: చినుకు కోసం జిల్లా రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మొదట్లోనే వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షాకాలం మొదలై నెల దాటినా విత్తనాలు వే యడానికి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. గతేడాది ఈ పాటికి భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంట లు జల సిరిని ధరించగా, ఈ ఏడాది ఇప్పటికీ చినుకులే తప్ప భారీ వర్షాల జాడలేకుండాపోయింది. ప్రతీ రోజు కమ్ముకొచ్చే మేఘాలను చూసి రైతులు ఆశపడుతున్నా, వరుణుడు మాత్రం కరుణించడం లేదు. ఈ యేడు జూన్ ఒకటి నుంచి జూలై రెండు వరకు సాధారణ వర్షపాతం 178.1 మిల్లీమీటర్లు కాగా, కేవలం 57.7 మిల్లీమీటర్ల వర్షపా తం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కన్నా 68 శాతం తక్కువగా కురిసింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తొలకరి జల్లులు కూడా కురవలేదంటే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఎత్తిపోతున్న బోర్లు వర్షాభావ పరిస్థితులతో బోర్లు ఒక్కొక్కటిగా ఎత్తిపోతున్నా యి. నిన్న మొన్నటిదాకా బోర్ల మీద కొంత ఆశ ఉన్న రై తులు భూగర్భజలాల మట్టం పడిపోతుండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. గత యేడాది భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు పొంగిపొరలా యి. దీంతో భూగర్భజలాలు వృద్ధి చెంది పెద్దగా ఇబ్బం దులు లేకుండా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు సాగయ్యా యి. ఈసారి వర్షాకాలంలోనే వానల జాడలేకపోవడం భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీస వర్ష పాతం కూడా నమోదు కాకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. బావులు, బోర్లవద్ద ఖరీఫ్ సాగుకోసం విత్తనాలు వేద్దామని ఆలోచన చేసిన రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే విత్తనం వేసిన వారు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రైతునెత్తిన ‘వడ్డీ’బండ
‘కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడి’ందన్న చందంగా తయారయింది చంద్రబాబు నాయుడు హామీని నమ్మిన రైతన్నల పరిస్థితి. రుణాలు చెల్లించవద్దంటూ బహిరంగంగా పిలుపివ్వడంతో అదంతా నిజం అనుకొని బ్యాంకుల జోలికి వెళ్లకుండా ఓట్లు కుమ్మరించిన అన్నదాతలకు అడియాశలే మిగిలాయి. ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డా’మని తెలుసుకున్న హలధారులు హాహాకారాలు చేస్తున్నారు. ‘మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు కొట్ట’మన్నట్టుగా బాబు నైజం బయటపడుతుండడంతో విజయహాసం చిందించిన తెలుగు తమ్ముళ్లు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. సాక్షి, ఒంగోలు: అన్నదాతకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కొత్త ప్రభుత్వం తొలిసంతకం రైతుకు మేలు చేయకపోగా.. ముప్పు తిప్పలు పెడుతోంది. పాత రుణాల మాఫీతో కొత్తగా ఖరీఫ్ సాగు పెట్టుబడులొస్తాయని ఆశించిన రైతుకు భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల కింద బ్యాంకుల నుంచి తీసుకున్న వాటి చెల్లింపునకు జూన్ 30వ తేదీతో గడువు తీరింది. అంటే, జూలై ఒకటో తేదీ నుంచి ప్రతీరైతుపై గడువు మీరిన బకాయి వడ్డీ భారం పడుతుంది. రిజర్వుబ్యాంకు, ఎస్ఎల్బీసీ (స్టేట్‌లెవల్ బ్యాంకర్ల కమిటీ) నిబంధనల మేరకు పంటరుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లించిన వారికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వడ్డీరాయితీ పథకం వర్తిస్తోంది. ఆ మేరకు రైతు తాను తీసుకున్న రుణంపై 7 శాతం వడ్డీమాత్రమే చెల్లించేవాడు. అయితే, గడువు మీరిన బకాయిపై కచ్చితంగా 11.07 శాతం వడ్డీ చెల్లించాల్సిందే.. రుణం తీసుకున్న నాటి నుంచి ఇదేవడ్డీ లెక్కను బ్యాంకర్లు వర్తింపజేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రికవరీనే లక్ష్యంగా తమపని తాము చేసుకుపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే గడువు మీరిన బకాయిలకు సంబంధించి రికవరీ నోటీసుల జారీకి సన్నాహాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎన్నికల అజెండా హామీ ప్రకారం తొలిసంతకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తారా..? మొండిచేయి చూపిస్తారా..? అనే సందేహాలతో రైతుసంఘాల నేతలు ఉద్యమాలకు సిద్ధపడుతున్నారు. 5 లక్షల మంది ఎదురు చూపులు: జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతురుణాలు మాఫీ కావాల్సి ఉంది. బ్యాంకర్ల అభిప్రాయం మేరకు రైతు రుణమాఫీ పథకం గడువు మీరిన బకాయిలకే వర్తిస్తోందని.. రెగ్యులర్ బకాయిల మాఫీ కుదరదని చెబుతున్నారు. దీంతో రైతులు కిందటేడాది పంట రుణాలు చెల్లిస్తేనే.. ఖరీఫ్ సాగు పెట్టుబడికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం హామీపై నమ్మకం పెట్టుకున్న రైతులంతా బ్యాంకులకు కిందటేడాది తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించలేదు. ఫలితంగా వారికి వడ్డీరాయితీ వర్తించకపోగా.. అసలు రుణ మొత్తంతో పాటు 11.07 శాతం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.గ్రామాల్లో చాలామంది రైతులు ఇప్పటికే బయట తెచ్చిన అప్పులకు సంబంధించి వడ్డీలకు వడ్డీలు కడుతూ ఆర్థికభారంతో కునారిల్లుతున్నారు. సహకార బ్యాంకుల బకాయిలిలా... జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే రూ. 488.67 కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుంది. మార్చి ఆఖరు వరకు సేక రించిన గణాంకాల ప్రకారం బ్యాంకుల పరిధిలో స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు తీసుకున్న 85,198 మంది రైతులు మొత్తం రూ.426.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరిలో గడువుమీరిన బకాయిదారులు 28,611 మంది ఉండగా...చెల్లించాల్సిన బకాాయిలు రూ.93.16 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక, భూమి తనఖా, ఈపీఏడీబీ కింద 15,427 మంది రైతులు మొత్తం రూ.63.19 కోట్లు బకాయిలు పడ్డారు. పీడీసీసీబీ రుణాల మాఫీ జరిగితే.. మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ ప్రకటనల నాటి నుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని.. బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చీకట్లు
జిల్లాలో అప్రకటిత కరెంట్‌కోత అన్నివర్గాల ప్రజలకు గుదిబండగా మారింది. చీకటిపడితే చాలు పట్టణాల్లో అంధకారం అలుముకుంటోంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చిరువ్యాపారులు, పారిశ్రామికవర్గాల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు వరుణుడు కరుణించకపోవడం.. విద్యుత్ కోతలు మొదలు కావడంతో ఖరీఫ్ వరిసాగు ముందుకు సాగడం లేదు. రైతన్న రోడ్డెక్కి గగ్గోలుపెడుతున్నా.. గోడు వినేవారు లేరు. - జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు - అవసరం 15 మి.యూ.. - సరఫరా 10 మి.యూ - సంకటస్థితిలో రైతన్నల ఖరీఫ్ సాగు - ఇబ్బందుల్లో వ్యాపారులు, పరిశ్రమలు సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో విద్యుత్ వాడకం పెరగడం.. సరఫరా తగ్గిపోవడంతో కోతలు మరింత ఉధృతమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గం టల కోతలు అమలవుతున్నాయి. తద్వారా తాగునీటికి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణవాసులు దోమలతో కుస్తీపడుతూ కునుకులేకుండా గడుపుతున్నారు. వ్యవసాయరంగానికి ఆరుగంటల విద్యుత్ అందిస్తున్నామని అధికారు లు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. కనీసం మూడుగంటలు కూడా కరెంట్ సరఫరా కావడం లేదు. అధికారులు రెండు గ్రూపులుగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. గ్రూప్-‘ఏ’ ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 దాకా తిరిగి రాత్రి 10.00 నుంచి తెల్లవారుజామున 1.00 వ రకు, గ్రూప్-‘బీ’ ప్రకారం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 4.00 దాకా, మళ్లీ తెల్లవారుజామున 1.00 నుంచి 4.00 వరకు సరఫరా చేయాలని చార్ట్ తయారుచేశారు. ఇదిలాఉండగా, సంబంధిత సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా ఉంటేనే రైతులకు అందుతోంది.. లేదంటే అంతే సంగతులు. కోతలు.. వాతలు కరెంట్ సరఫరా లేకపోవడం వల్లే కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్ అధికారులు తేల్చేస్తున్నారు. జిల్లా అవసరాలకు 15 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, ప్రస్తుతం 10.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్, సరఫరాకు అంతరాయం ఉండటంతో కోతలే అనివార్యమని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు విద్యుత్‌ను నిలిపేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కోత విధిస్తున్నారు. అలాగే మునిసిపాలిటీల్లో ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4.00 వరకు పవర్‌కట్ ఉంటుంది. మండలకేంద్రాల్లో ఉదయం 8.00 నుంచి 12.00 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2.00నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విద్యుత్‌కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజు మొత్తం పవర్‌హాలిడే ప్రకటించారు. అదే అదనుగా భావించిన విద్యుత్‌శాఖ అధికారులు లోటును పూడ్చుకోవడానికి ఉచిత క రెంట్‌కు కోత విధిస్తున్నారు. తద్వారా వ్యవసాయానికి రెండుగంటలు కూడా సక్రమంగా అందకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోతల కారణంగా చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. అడ్డూఅదుపులేని కోతల కారణంగా చేతినిండా పనిలేక కార్మికులు అల్లాడుతున్నారు. దీంతో వెల్డింగ్, జిరాక్స్ మిషన్లు, రిపేరింగ్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కరెంట్ లేక వచ్చినా ఆర్డర్లను సమయానికి ఇవ్వలేకపోతున్నామని చిన్న పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. జనరేటర్లు పెట్టి నడిపిస్తే లాభం రాకపోగా.. తీవ్రం గా నష్టపోవాల్సి వస్తోందని దిగులుచెందుతున్నారు. -
వచ్చే వచ్చే వాన జల్లు
- జిల్లాను పలకరించిన నైరుతి రుతుపవనాలు - ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న కర్షకులు - ఎండల నుంచి ఉపశమనం - జిల్లాలో సగటు వర్షపాతం 2.8 మి.మీ. నమోదు ఏలూరు/భీమవరం : ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా జల్లులు కురిశారు. భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలు చల్లదనంతో కాస్తంత సేదతీరగా.. అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. మెట్టలో ఎండిపోతున్న నారుమడులు, నాట్లు జీవం పోసుకునే అవకాశం కలిగింది. చెరకు, ఆరుుల్‌పామ్ తదితర పంటలు చేజారిపోతున్నాయన్న తరుణంలో కురిసిన చిరుజల్లులు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించారుు. విస్తారంగా కురిస్తేనే గట్టెక్కేది జూన్‌లో జిల్లాలో సగటున 104 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 18 మి.మీ. మాత్రమే నమోదైంది. శనివారం కొన్నిచోట్ల రెండు గంటలపాటు వర్షం కురిసినా.. మరింతగా వర్షం పడితే తప్ప ఖరీఫ్ సాగు ముందుకెళ్లే పరిస్థితి లేదు. అరునా.. భవిష్యత్‌పై ఆశతో రైతులు పొలాలను దుక్కిదున్ని, నారుపోసే పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్టలో ఎండిపోయే స్థితికి చేరిన నారుమళ్లు మూన తిరగడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నారు. డెల్టాలోని రైతులంతా ఖరీఫ్ పనుల్లో తలమునకల య్యూరు. ఈ ఏడాది 2.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 12 వేల హెక్టార్లలో నారుమడులు పోయూల్సి ఉంది. మెట్ట ప్రాంతంలో ఇప్పటివరకు 4,000 హెక్టార్లలో నారుమడులు వేశారు. చాగల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు వంటి కొన్నిప్రాంతాల్లో నాట్లు పడినప్పటికీ అవి వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఇకనుంచి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ గండం గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. -
వానమ్మా.. రావమ్మా!
అన్నదాత చూపు.. ఆకాశం వైపు - వర్షాకాలం ఆరంభమైనా కానరాని వాన - నిరాశపర్చిన నైరుతి రుతుపవనాలు - వెలవెలబోతున్న జలాశయాలు - ఆందోళన చెందుతున్న రైతులు ‘‘వానమ్మా.. ఓ వానమ్మా.. యాడున్నవమ్మా..! తొలకరి జల్లులతో మురిపించావు.. నల్లటి మబ్బులతో మరిపించావు. హమ్మయ్యా.. ఈయేడు నీళ్లకు తిప్పలు ఉండవని సంబురపడుతుండగనే తలతిప్పుకు పోయావు. పోనిలే.. విత్తు వేసుకునే సమయానికైనా వస్తావని ఎదురుచూస్తే.. పత్తా లేవు. పొలం దున్నడం మొదలుపెట్టి.. ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడం దాకా.. అరువుదెచ్చుకోనైనా అన్నీ సిద్ధం చేసుకున్నం. కానీ ఏం లాభం..? అసలు నువ్వేలేంది.. ఇవన్నీ ఉట్టియే కదా..! పొద్దుగల్ల లేవంగనే మొదలు మొగులునే జూస్తున్నం.. ఇయ్యళ్లన్న చినుకు రాకపోతుందా అని. ఓ దిక్కు విత్తుకునే కాలం గడిసిపోతుంది.. దినదినం పరేషాన్ ఎక్కువైతుంది. ఆరుగాలం కష్టాలు పడుతూ.. అందరికీ అన్నం పెట్టడమే తెలిసినోళ్లం.. మాపై కోపమెందుకే తల్లీ..!’’ అంటూ అన్నదాత కోటిఆశలతో ఆకాశంకేసి చూస్తున్నడు. చినుకు జాడలేక పోవడంతో చింత పెంచుకుంటున్నడు. కామారెడ్డి/నిజాంసాగర్: కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రై తన్నను జాడలేని వానలు ఆందోళన పెట్టిస్తున్నా యి. ఓవైపు సాగు సమయం మించిపోతున్నా.. చినుకులు కురవకపోవడంతో కర్షకులు కలవరపడుతున్నారు. తొలకరి జల్లులతో మురిపించిన వర్షం.. మళ్లీ కనిపించడం లేదు. కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. నీటిచుక్కలు మాత్రం కురవడం లేదు. బండెడు ఆశతో ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు నిరాశపర్చాయి. గత ఏడాది ఈ సమయానికి వ ర్షాలు కురిసి.. పల్లెలు పంటసాగులో నిమగ్నమయ్యా యి. ప్రతీసారి జూన్ రెండోవారానికి వానలు వచ్చేవి. ఇప్పుడు మూడోవారం కావస్తున్నా వర్షాల జాడలేదు. సీజన్ తొలినాళ్లలోనే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముం దు ఎలాంటి ఇబ్బందులుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తు మొలకెత్తేనా..! ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు భూములను దు క్కి చేసి విత్తనాలను అలికినా.. విత్తు మొలకెత్తడం లేదు. చినుకులు రాకపోవడంతో మొలకలు రావ డం కష్టంగా మారనుంది. వరితో పాటు పలు పంటలు వర్షాధారంపైనే పండిస్తారు. సోయా, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల సాగుకూ సమయం ఆసన్నమైంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగుకు సమాయత్తమైన రైతులు సైతం వర్షాల కోసం వేచిచూస్తున్నారు. నారుమడుల కోసం విత్తనాలను విత్తుకున్నారు. పడిపోయిన వర్షపాతం వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా వానల కురవకపోవడంతో జిల్లాలో వర్షపాతం నమోదు పడిపోయింది. జూన్ ఆరంభం నుంచి నెలాఖరు వరకు జిల్లాలో 181 మిల్లీమీటర్ల సాధార ణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది జూన్ మూడోవారం నాటికి జిల్లాలో 171.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పోలిస్తే ఈ నెలలో రెండింతల కన్నా తక్కువగా వర్షం కురిసింది. నిరుడు మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈసారి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ పెద్దదిక్కు శ్రీరాంసాగర్లతో పాటు ఏ ప్రాజెక్టులోనూ చుక్కనీరు చేరలేదు. తగ్గనున్న సాగు విస్తీర్ణం..! ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఇందులో ముఖ్యంగా వర్షాధార పంటలైన సోయా, మొక్కజొన్న 2లక్షల హెక్టార్లలో సాగవుతాయని భావించారు. అయితే ఇప్పటి వరకు వర్షాల జాడలేకపోవడంతో వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. మరో వారం దాకా వర్షాలు కురవకుంటే వరి, సోయా పంటల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గవచ్చని భావిస్తున్నారు. వరణుడి కరుణ కోసం గ్రామాల్లో దేవతామూర్తులకు పూజలు చేస్తూ.. బోనాలు సమర్పిస్తున్నారు. వనభోజనాలకూ వెళ్తున్నారు. -
రుణమో రామ‘చంద్ర’..!
చెన్నూర్ : రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత రుణాలు మాఫీ అయ్యి కొత్తవి ఇస్తే ఖరీఫ్ సాగు చేసుకుందాని రైతులు గంపెడాశతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళిక ఆర్బీఐ నుంచి రాకపోవడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలపైనా ఆర్బీఐ నుంచి బ్యాంకర్లకు ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతోంది. రైతులు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గత ఏడాది ఇదే మాసంలో రుణ ప్రణాళిక సిద్ధం చేసి 80శాతానికి పైగా రుణాలు అందజేశారు. ఈ ఏడాది అదే మాదిరిగా రుణాలు అందజేస్తారని రైతులు ఆశించగా.. నిరాశే ఎదురవుతోంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు చూపు ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ రైతుల ఖాతాలకు చేరాలంటే మరో రెండు నెలలు పటే అవకాశం ఉంది. అప్పటికి ఖరీఫ్ సీజన్ సగానికి పైగా పూర్తవుతుంది. ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు అధిక వడ్డీ వసూలుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందితే వడ్డీ తక్కువ ఉండడమే కాకుండా పంట నష్టం సంభవిస్తే రుణం మాఫీ అవుతుంది. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణం తీసుకుంటే వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతులు అంటున్నారు. వెంటనే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కోరుతున్నారు. ఏడు వేల మందికి రుణ మాఫీ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ వల్ల చెన్నూర్‌లోని ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, దక్కన్ గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకు, కోటపల్లి మండలం దక్కన్ గ్రామీణ బ్యాంకు, కిష్టంపేట ఎస్బీహెచ్లో చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన ఏడు వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. సుమారు రూ.45 కోట్లకు పైగా మాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు అంటున్నారు. రుణ మాఫీకి సంబంధించిన రైతుల వివరాలను బ్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్క చెన్నూర్ పట్టణంలోని సహకార బ్యాంకులోనే 1,244 మంది రైతులకు రూ.5.80 కోట్లు రుణం మాఫీ అవుతుందని బ్యాంకర్లు అంటున్నారు. -
నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో..
- ఖరీఫ్ సాగుపై జాగ్రత్తలు అవసరం - నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి - వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే.. ఆది నుంచే అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. సాగుకు అవసరమయ్యే ప్రతి వస్తువు కొనుగోలులో, చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లలో అత్యంత జాగ్రత్తలు అవసరం. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలి. విత్తన ఎంపిక నుంచి, పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంభించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాత పడ్డ ఆరుగాలం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. రైతన్న మోమున ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే ఆ దిశగా అడుగులు వేయాలి. - నిజామాబాద్ వ్యవసాయం విత్తనాలు కొనే ముందే - వ్యవసాయ శాఖ లెసైన్సు పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. - సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి. - బస్తాపై రకం పేరు, లాట్ నంబరు, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి. - కొనుగోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. - పైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - విత్తనాన్ని ఎన్నుకొనే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం ఎంతో మంచిది. - మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధ్రువీకరించన విత్తనాలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తాపై నీలి వర్ణం(బ్లూ) ట్యూగు ఉందో లేదో గమనించాలి. ఈ ట్యాగు బస్తాకు కుట్టి సీల్ చేసి ఉంటుంది. దీనిపై వివరాలు పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేయాలి. - ఫుల్ సీడ్ (లేబుల్ విత్తనం) కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై లేత ఆకుపచ్చ ట్యాగ్ కుట్టి ఉంటుంది. - దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్తనాలను రైతులు కేవలం ఆయా కంపనీల నమ్మకం మీదే కొనుగోలు చేయాలి. ట్యాగుపైన వివరాలు పూర్తిగా తెలుసుకొని వ్యాపారి నుంచి సరైన బిల్లు తీసుకొని కొనుగోలు చేయాలి. - ఎలాంటి విత్తనం కొనుగోలు చేసినా తప్పక బిల్లు తీసుకోవాలి. బిల్లుపై పేరు, విత్తన రకం, తేదీ తదితర వివరాలు ఉన్నవో లేదో రైతులు సరి చూసుకోవాలి. - పంటసాగు పూర్తయ్యే వరకు తప్పని సరిగా బిల్లును దాచి ఉంచాలి. - బిడిల్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగు ఉందో లేదో చూడాలి. ఈ ట్యాగుపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యు నాణ్యత వంటి వివరాలు ఉంటాయి. - గడువు దాటిపోయిన విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - పంట మొలకెత్తే దశలో కానీ, పూత దశలో కానీ లోపం కనిపిస్తే వెంటనే మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలి. - పత్తి విత్తనాల్లో జిన్నింగ్ చేసి ప్యాకింగ్ చేసిన వాటిని కొనుగోలు చేయరాదు. ఎరువుల విషయంలో.. - నాణ్యమైన ఎరువులనే వాడాలి. పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. అక్కడక్కడ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు పెట్టుబడులు సైతం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే ఆస్కారం ఉంది. - లెసైన్సు దుకాణంలోనే ఎరువులు కొనుగోలు చేయాలి. - కొనుగోలు చేసిన ఎరువుకు సరైన బిల్లు పొందాలి. బిల్లును జాగ్రత్తగా దాచాలి. - డీలర్ బుక్కులో విధిగా రైతు సంతకం చేయాలి. మిషను కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనాలి. చేతితో కుట్టినట్లయితే దానిపై సీసంతో సీల్ ఉందో లేదో చూడాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి. - రైతు తప్పని సరిగా బస్తాను తూకం వేయించి తీసుకోవాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తీసుకోవద్దు. ఎరువు వినియోగం అనంతరం ఖాళీ సంచులను పడేయడం, అమ్మివేయడం చేయకూడదు. - ఇటీవల రైతులు సూక్ష్మ పోషకాలపై ఆసక్తి చూపుతున్నారు. అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా అధికారుల సిఫారసు మేరకు కొనాలి. - కొనుగోలు చేసిన ఎరువు విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి. కల్తీని ఇలా గుర్తించవచ్చు.. - చెమ్మగిల్లి ఉన్న ఎరువుల్లో ప్రామాణికం, నాణ్యత లోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్ప ఒక ఎరువులోని గుళికలన్నీ ఒకే రంగులో ఉంటాయి. - అన్య పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీ ఎరువుగా గుర్తించాలి. - సాధారంగా యూరియా, సంకీర్ణ ఎరువులు, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ గుళికల రూపంలో ఉంటాయి. 15:15:15 లేదా 20:20:0 రేణువుల రూపంలోనూ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. - 5 మి.లీ. పరిశుభ్రమైన నీరు (డిస్టిల్డ్ వాటర్) ఒక చెంచా ఎరువును బాగా కలిపిన తర్వాత అడుగున ఏమీ మిగలక స్వచ్ఛమైన ద్రావణం తయారవ్వాలి. ఈ ద్రావణం పరీక్ష యూరియా, అమ్మోనియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్లకు వర్తిస్తుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, అమ్మోనియం క్లోరైడ్ క్లోరైడ్ ఎరువులకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీరు వాడాలి. - 15:15:15, 28:28:0, 19:19:19, 17:17:17, 14:28:14, యూరియా 24:24:0 ఎరువులను పరీక్షించడానికి 5 మి.లీ. పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును బాగా కలిపితే ఆ ద్రావణం మడ్డీగా ఉంటుంది. - కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల తయారీలో మూల పదార్థ ఎరువుల పూత చుట్టేందుకు ఇసుక రేణువులను ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా డీఏపీ 17:17:17, 15:15:15: మొదలైన ఎరువులకు వాడతారు. ఈ ఎరువులు నీటిలో కరిగిన తర్వాత కనబడే ఇసుకను చూసి దీనిని కల్తీగా గుర్తించి ఉపయోగించకూడదు. పురుగుల మందుల్లో... - చీడపీడల నివారణలో వాడే క్రిమి సంహారక మందుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ సూచించే మందులనే కొనాలి. - లెసైన్సు లేని దుకాణాల నుంచి కొనరాదు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. - లేబుల్ లేని మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను కొనరాదు. మందు లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషను విషయాలు పరిశీలించాలి. - తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లు పొందాలి. - ఎరువుల మందుల్లో విషపూరిత పదార్థం స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపుతో మరో రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణ ఇలా ఉంటుంది. అత్యంత విషపూరితం ఎరుపు రంగు, అతి విషపూరితం పసుపు రంగు, విషపూరితం నీలరంగు, స్వల్ప విషపూరితం ఆకుపచ్చ రంగు. - మందుల నిల్వలోనూ కొన్ని సూచనలు పాటించాలి. - వాడిన మందు సీసా,డబ్బా, ప్యాకెట్ సంచులను విధిగా ధ్వంసం చేసి లోతైన గుంటలో పూడ్చేయాలి. మందులు కలిపిన వాడిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. సస్యరక్షణ మందులు - విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులు వాడరాదు. - గడువు దాటిపోయిన సస్య రక్షణ మందులను కొనుగోలు చేయరాదు. - కారుతున్న, సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు. - లెసైన్సు లేని డీలర్లు సస్యరక్షణ మందులు విక్రయిస్తుంటే వెంటనే సమీప వ్యవసాయాధికారికి తెలియజేయాలి. బిల్లులు పొందాలి రైతులు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏది కొనుగోలు చేసినా సంబంధిత దుకాణదారు నుంచి పూర్తి వివరాలతో తప్పకుండా బిల్లు పొందాలి. నకిలీదని తేలినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చు. కనుక విత్తనాలు, ఎరువుల కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి అనుమానం కలిగినా సమాచారం అందించాలి. - నర్సింహా, జేడీఏ, నిజామాబాద్ -
రుణమాయేనా..!
ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇప్పుడు కమిటీ, జీవోల పేరుతో కాలయాపన రుణాలు చెల్లించాలని బ్యాంకుల ఒత్తిడి బంగారం వేలానికి ప్రకటనలు ఖరీఫ్ ఖర్చుల కోసం అన్నదాతల ఎదురుచూపులు ‘నేను మారలేదు.. మీరు మారిపోతే నేరం నాది కాదు...’ అని ఓ సినీ కవి చెప్పినట్టుంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు. రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆయన..అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ నైజాన్ని చాటుకున్నారు. కమిటీ, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారు. రుణాలన్నీ రద్దవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. రుణాల కోసం తాకట్టుపెట్టిన బంగారంవేలం వేస్తున్నట్లు కొన్ని బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సాగు ఖర్చులకే అప్పుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు... పాత బకాయిలు తీర్చేదెలా.. అంటూ ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం : ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించవద్దని టీడీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది. రైతు రుణాలను రద్దు చేసేందుకు విధివిధానాలను ఖరారు చేయాలని జీవో నంబరు 31 విడుదల చేసింది. మరోవైపు రుణాలు చెల్లించాలని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీచేస్తున్నాయి. జిల్లాలో సుమారు మూడు లక్షల మంది రైతులు బ్యాంకులకు రూ.9,137 కోట్లు బకాయిలు ఉన్నారు. రుణాలన్నీ రద్దు చేస్తారని ఆశపడుతున్న రైతులు... ఇప్పుడు షరతులు విధిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో ప్రకటనతో గందరగోళం.. అధికారపక్షం రోజుకో రకం ప్రకటన చేస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల వివరాలను సేకరిస్తామని చెప్పటం రైతుల్లో కలకలం రేపింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకునేది తక్కువే. వాణిజ్య బ్యాంకుల్లో మాత్రమే ఈ విధంగా రుణాలు ఇస్తారు. అయితే వ్యవసాయ రుణాలు తీసుకునే మహిళల్లో 30 శాతం మందికి మాత్రమే వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ హామీ నుంచి తప్పుకోవడానికే ఇటువంటి దొడ్డిదారులు వెతుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఒక విధంగా.. సీమాంధ్రలో మరో విధంగా.. తెలంగాణలో లక్ష రూపాయల లోపు రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. బంగారం తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకుంటే రద్దు చేయబోమని ప్రకటించారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు అన్ని రకాల రుణాలు రద్దు చేయాలని, పంట రుణం చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వ్యవసాయ రుణాలమాఫీపై టీడీపీ ఇచ్చిన హామీకి భిన్నంగా జీవోను జారీ చేసినా ఆ పార్టీ నేతలు నోరుమెదపడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు అన్ని రుణాలను రద్దు చేస్తామని ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. ఆయన మంత్రిగా నియమితులైన తర్వాత... రుణాల రద్దుపై అధ్యయనం కోసం కమిటీ వేసినా, విధివిధానాల ఖరారు కోసం జీవో జారీ చేసినా స్పందించడం లేదు. ఖరీఫ్‌కు కష్టాలు తప్పవా..! ఈ నెల ఒకటో తేదీ నుంచి ఖరీఫీ సీజన్ ప్రారంభమైంది. వాతావరణం అనుకూలిస్తే నెలాఖరులోపు నారుమడులు, ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతారు. జూన్, జూలై నెలల్లోనే రైతులు వ్యవసాయ రుణాలు అధికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రుణమాఫీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ నెల 22వ తేదీలోగా ప్రాథమిక నివేదిక వస్తుందని, అనంతరం పూర్తిస్థాయి నివేదిక అందుతుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ చొప్పున రుణమాఫీపై ఆగస్టు మొదటి వారం వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. నివేదికలు అందిన తర్వాత తాము ఎన్నిరోజుల్లో చర్యలు తీసుకుంటామనే దానిపైనా అధికార పక్షం స్పష్టమైన ప్రకటన చేయలేదు. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లిం చకుంటే ఈ ఖరీఫ్ సీజన్ కోసం మళ్లీ కొత్త రుణాలు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను తమకు పంపలేదని, ప్రభుత్వ నిర్ణయం కోసమే తాము ఎదురుచూస్తున్నామని పలు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యే శరణ్యం రెండు ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో పత్తి సాగు చేశాను. ఇందుకోసం పెద్దాపు రంలోని సహకార బ్యాంకులో రూ.12,600 ఒకసారి, మరోసారి 27,000 రుణం తీసుకున్నా. మొదటి రుణానికి వడ్డీతో కలిపి రూ.14,986, రెండోదానికి రూ.31,364 చెల్లించాలి నోటీసులు అందాయి. డబ్బు కట్టే పరిస్థితుల్లో లేను. రుణమాఫీ చేయకుండా.. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఆత్మహత్యే శరణ్యం. - ఎస్.జగన్మోహన్రావు, పెద్దాపురం రోడ్డున పడతాం.. నేను రెండు ఎకరాల పత్తి సాగు చేశాను. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. పంట సాగు పెట్టుబడి కోసం ఇంట్లో ఉన్న బంగారం వస్తువులు తాకట్టు పెట్టి బ్యాంకులో రూ.75,000 వేలు తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో రూ.83,504 చెల్లించాలని నోటీసులు పంపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. - తాళ్ల నాగేశ్వరరావు, రైతు, పెద్దాపురం -
ఖరీఫ్‌నకు సిద్ధం
సదాశివనగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు దున్నిస్తే పం టల సాగుకు అన్ని విధాల ప్రయోజనం ఉం టుందని రైతులు భావిస్తున్నారు. దీంతో రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించి పంట భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు అనుకూలిస్తే మొక్కజొన్నతో పాటు పత్తి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. రెండేళ్లు గా అన్నదాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నా డు. దీనికి తోడు ఏటేటా పెరుగుతు న్న విత్తనాలు, ఎరువుల ధరలు రైతన్నను మరింత కుదేలు చేస్తున్నాయి. ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో సదాశివనగర్ మండలంలో 3వేల 250 హెక్టార్లలో పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారుల అంచనా. అందుబాటులో విత్తనాలు, ఎరువులు నిజామాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సమకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, తొగర్లు, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందుబాటులో పెడుతున్నారు. అందుకోసం వివిధ కంపెనీలతో ఇప్పటికే అధికారులు సంప్రదింపులు జరిపారు. ఏపీఎస్ఎస్డీసీ కంపెనీకి 25 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ఆర్డర్ చేయగా ఇప్పటికే వారు 75 వందల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సిద్ధంగా పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా హెచ్ఏసీఏకు 20 వేల క్వింటాళ్లకు ఆర్డర్ ఇవ్వగా 6500 క్వింటాళ్లు సమకూర్చినట్లు చెబుతున్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్‌కు 25 వేల క్వింటాళ్లకు ఆర్డర్ ఇవ్వగా ఏమీ సమకూర్చలేదని తెలుస్తోంది. అదే విధంగా మొక్కజొన్న విత్తనాలు 3650 క్వింటాళ్లు, తొగర్లు 100 క్వింటాళ్లు, మినుములు 200 క్వింటాళ్లు, తొగర్లు 200 క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు 1750 క్వింటాళ్లు, జనుము 340 క్వింటాళ్లు మాత్రమే సమకూర్చినట్లు సమాచారం. ఎంత అవసరం గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని రైతుకు సకాలంలో ఎరువులను అందించేందుకు వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా యూరియా -135438 మెట్రిక్ టన్నులు, డీఏపీ-21033 మెట్రిక్ టన్నులు, ఫొటాష్(ఎంఓపీ)16811 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్-69403 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నిలువలు యూరియా 10723 మెట్రిక్ టన్నులు , డీఏపీ 2942.350 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1826.500 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌లో నిల్వ ఉండగా పోటాష్ ఏమీ లేదు. {పైవేటు డీలర్ల వద్ద యూరియా 9778.690 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4932.200 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)1717 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్14431.200 మెట్రిక్ టన్నులు ప్రవేటు డీలర్ల వద్ద నిల్వ ఉంది. వీటితో పాటు వివిధ కంపెనీల్లో యూరియా 4711 మెట్రిక్ టన్నులు, డీఏపీ 318.800 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)13.200మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్- 13357 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. -
ఖరీఫ్.. ఖతం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగు..ఖతమైంది. ఆగస్టు మాసం పూర్తి కావడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఇక ముగిసిందని చెప్పవచ్చు. ఈ సారి సాధారణ సాగుకంటే 56,136 హెక్టార్లు తగ్గింది. వరుణుడు కరుణించకపోవడం.. సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి విడుదలపై నెలకొన్న సందిగ్ధత.. చివరకు నీటి విడుదల చేయడం తదితర కారణాలతో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. సీజన్ ప్రారంభంలో వరుణుడు కొంత కరుణించినప్పటికీ తరువాత ముఖం చాటేయడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. దీంతో నాన్ ఆయకట్టు ప్రాంతంలో మెట్టపంటలను సాగుపై దృష్టిసారించారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 93 వేల 445 హెక్టార్లకు గాను ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711 హెక్టార్లలో సాగు చేశారు. అయినప్పటికీ గత ఖరీఫ్ కంటే 30వేల 113 హెక్టార్లలో పతి పంట సాగు తగ్గింది. గత ఖరీఫ్‌లో 2,97,824 హెక్టార్లలో సాగు కావడం విశేషం. సాగు ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5,08,938 హెకార్లు కాగా ఇప్పటి వర కు 4,52,802 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగుకు నోచుకున్నాయి. ఇంకా 56,136హెక్టార్లు సాగుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కొంత మేరకు వరి సాగు అయ్యే ఆవకాశం ఉంది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,10,034 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసుకున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో వరి పంట 1,17,059హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 1,12,674 హెక్టార్లలో సాగుకు నోచుకుంది. అదే విధంగా గత ఖరీఫ్‌లో పత్తి 2,97,824 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711హెక్టార్లలో సాగు చేశారు. దీంతో పత్తి 30,113 హెక్టార్లలో తగ్గినట్లయ్యింది. ఇతర కంది, పెసర, మొక్కజొన్న పంటల సాగు మోస్తరుగా ఉంది. వాణిజ్య పంటల ఊసేలేదు. గత ఖరీఫ్‌లో పంటల సాగు సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువగా సాగుకు నోచుకున్నప్పటికీ కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూశారు. ప్రస్తుత ఖరీఫ్‌లోనైనా ప్రకృతి కరుణిస్తే పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చి ఆర్థికంగా లాభాల బాటలో పయనిస్తామని ఆశలో ఆన్నదాతలు ఉన్నారు. 15వేల హెక్టార్ల వరిసాగు పెరిగే అవకాశం : జేడీఏ, బి.నర్సింహారావు ఆయకట్టులో ప్రస్తుతం నాట్లు వేసేందుకు రైతులు నార్లు సిద్ధం చేస్తున్నారు. వీరు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. మరో 15వేల హెక్టార్ల వరిసాగు పెరుగుతుందని భావిస్తున్నాం. వరి సాగు చేయదలుచుకుంటే డ్రమ్‌సీడర్ ద్వారా నేరుగా నాటు వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి. -
ప్రత్యామ్నాయ ప్రణాళిక
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం పది శాతానికి మించకపోవడంతో ప్రత్యే క ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లాలో 2.12 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానం గా వరి 92,885 హెక్టార్లలో సాగుచేయాలని నిర్ణయించారు. వరుణుడు కరుణించకపోవడంతో ఇంతవరకు కేవ లం 12వేల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. అదీ ఏజెన్సీలోనే. ఇక్కడి 11 మండలాల్లో మాత్రమే వర్షాలు అనుకూలించాయి. మైదానంలో పరిస్థితి దయనీయంగా ఉంది. నారుమళ్లు ఎండిపోతున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 450 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఇంతవరకు 225 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. సాధారణ వర్షపాతంలో కేవలం సగం మాత్రమే కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 80వేల హెక్టార్లలో వరినాట్లు కోసం పోసిన నారుమళ్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. ఈ సమయానికి ఉబా పనుల్లో రైతులు బిజీగా ఉండాలి. వరి నాట్లు వేయాలి. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా రైతులు ముందడుగు వేయలేకపోతున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే నారుమళ్లు సైతం పనికిరాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో అడపా దడపా వర్షాలు కురిసినా ఎద పద్ధతిలో వరి స్వల్పకాలిక రకాల సాగుకు ప్రణాళిక రూపొందించారు. మెట్టభూముల్లో మొక్కజొన్న, చోడి, అపరాలు, జొన్న పంటలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో వరి ఎంటీయూ-1010, 1001, పుష్కల, వసుంధర రకాలు 2,610 క్వింటాళ్లు, మొక్కజొన్న-173, చోడి -177, అపరాలు-3,600, జొన్న- 7 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని సకాలంలో రైతులకు పంపిణీకి అనుకూలంగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. వ్యవసాయాధికారుల ప్రత్యేక ప్రణాళిక కార్యరూపం దాల్చాలంటే ఎంతోకొంత వర్షం అనుకూలిస్తేనే సాధ్యమవుతుంది.