సాక్షి ప్రతినిది, నిజామాబాద్: ప్రాజెక్టు నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగు కోసం నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారా? లేదా? అన్న అం శంపై అధికారులు ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదు. జిల్లా నీటిపారుదల అధీకృత సంస్థ (డీఐఏ బీ) సమావేశం జరి గితేగాని, నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో ఖరీఫ్ ఆశలు గల్లంతైనట్టే కనిపిస్తోంది. జిల్లా ను కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పడిన చిరుజల్లులు పంటలను ఏ మాత్రం దక్కించలేని పరిస్థితి. జిల్లాలో సాధారణ వర్షపాతం 849 మి.మీటర్లు.
ఈ సమయానికి 359.50 మి.మీ కురియాల్సి ఉంది. 2012 జులై 27 నాటికి 284 మి.మీ నమోదు కాగా, 2013 జులై 27 వరకు 681.9 మి.మీ కురిసింది. ఈసారి మాత్రం ఆదివారం నాటికి కేవలం 128.1 మి.మీ వర్షపాతం నమోదైంది. 64 శాతం తక్కువ వర్షం పడింది. దీంతో ప్రధాన ప్రాజెక్టులలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే, నిర్మాణ సమయంలో దీని సామర్థ్యం 28 టీఎంసీలు, 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీలు, 1405 అడుగులే, ఇపుడు నీటి నిల్వ 1392.60 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 5 టీఎంసీలకు పడిపోయింది.
డీఐఏబీ సమావేశంపై ఆశలు
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్ని, రెంజల్, బోధన్, ఎడపల్లి, ఆర్మూరు, జక్రాన్‌పల్లి తదితర మండలాల రైతులు ఇ ప్పటికే వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో 8,01,902 ఎకరాలలో వివిధ పంటలు వేస్తారనేది వ్యవసాయశాఖ ప్రణాళిక కాగా, 3,11,562 ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా. ఈ క్రమంలోఇంకా నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో నిజాంసాగర్‌పై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అధికారులు, తగ్గిన నీటిమట్టం నేపథ్యంలో ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. బోధన్ సమీపంలోని బెల్లాల్‌కు తాగునీటి అవస రాలకు మాత్రం నీటిసరఫరా ఉంటుందని చెబుతున్నారు. తాగునీటి అవసరాల అనంతరమే సాగునీరు అని అంటున్నారు. డిఐఏబీ సమావేశంలోనైన నిర్ణయం జరుగు తుందన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.
అప్పుడే నిర్ణయం
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్ కోసం నీటిని విడుదల చేసే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. డీఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల ద్వారా రైతులకు మేలు చేసే విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్ష జరిపారు. ప్రభుత్వం ఆదేశం, డీఐఏబీ నిర్ణయం మేరకు ఆగస్టు నెలాఖరులోగానీ, సెప్టెంబర్ మొదటి వారంలోగానీ నీటి విడుదల ఉంటుందని అనుకుంటున్నాము. - సత్యశీలా రెడ్డి, ఈఈ, నిజాంసాగర్ ప్రాజెక్టు
డెడ్ స్టోరేజీకి నిజాంసాగర్!
Published Mon, Jul 28 2014 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement