Water reserves
-
నగరానికి నీటి ముప్పు
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే నగరానికి నీటిముప్పు పొంచి ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టి తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్ నీటిమట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్ తప్పనిసరి అవుతుంది. జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం వరకు ఎలాంటి పంపింగ్ లేకుండా నగరానికి తాగునీటిని తరలించవచ్చు. వేసవినాటికి జలాశయంలో నీటిమట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పంపింగ్ చేపట్టినా డెడ్‌స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణాజలాల తర లింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సగంనీరు సాగర్ నుంచే... మహానగరవాసుల దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్న తాగునీటిలో సగానికి పైగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు ప రిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్‌హౌస్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటిమట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణాజలా ల పంపింగ్ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు జరిగేవి. గత ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ వట్టిపోతోంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం గతేడాది ఇదే రోజు నాటికి 571.900 అడుగులు ఉండగా, ఈసారి మాత్రం 520 అడుగులకు పడిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామ ర్థ్యం పరిశీలిస్తే గతేడాది 261.300 టీఎంసీలు ఉంటే, ఈ సారి మాత్రం 149.820 టీఎంసీలకు చేరింది. వాస్తవంగా నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీటిని అందించడానికి ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే అక్కడ పంపులను నడపడం సాధ్యం కాదు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకుగాను 505 అడు గుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం కూడా జరగడంతో అత్యవసర పంపింగ్‌తో కూడా నగరానికి నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం కనిస్తోంది. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహానగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 560 నుంచి 590 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలిస్తున్నారు. కృష్ణా నుంచి 290 ఎంజీడీలు, గోదావరి నుంచి 160 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. హిమాయత్‌సాగర్ నుంచి వచ్చే వేసవిలో అవసరాల మేరకు పాతనగరానికి నీటిని అందించి, కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. -
ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే..
సాక్షి, అమరావతి: ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో ఒక రాష్ట్రం వాడుకోని కోటా జలాలను మరుసటి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి ఆ రాష్ట్రానికే అనుమతిస్తే.. మరో రాష్ట్రం హక్కులను దెబ్బతీసినట్లవుతుందని తెలంగాణ సర్కార్‌కు కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. కోటాలో వాడుకోకుండా మిగిలిన నీళ్లు క్యారీ ఓవర్ జలాలే అవుతాయని స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెగేసి చెప్పింది. రెండు రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకొని.. ఏకాభిప్రాయం ద్వారా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని సూచించింది. గతేడాది జూన్ 6న ఇదే అంశాన్ని అటు తెలంగాణ సర్కార్‌కు.. ఇటు కృష్ణాబోర్డుకు సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. అయినా సరే.. తెలంగాణ సర్కార్ కోటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకుంటామంటూ వితండవాదన మళ్లీ తెరపైకి తెస్తూ వివాదం రాజేస్తుండటం గమనార్హం. నీటి నిల్వపై నేరుగా ప్రభావం నాగార్జునసాగర్‌లో కోటాలో వాడుకోని జలాలను మరుసటి సంవత్సరం వాడుకుంటామని తెలంగాణ సర్కార్ ఇటీవల కృష్ణాబోర్డును కోరింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనకు కృష్ణాబోర్డు అంగీకరిస్తే.. సాగర్‌లో నీటినిల్వపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొత్త నీటి సంవత్సరంలో వచ్చే వరద జలాలతో నిండాక.. మిగులు జలాలను దిగువకు వదిలేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ సర్కార్ కోటాలో వాడుకోని నీటిని మరుసటి సంవత్సరం వాడుకోవడానికి అనుమతిస్తే ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందన్నది స్పష్టమవుతోంది. కేంద్ర జలసంఘం తెగేసిచెప్పినా సరే.. కృష్ణాజలాల్లో 2021–22లో కోటాలో వాడుకోకుండా మిగిలిన 47.79 టీఎంసీలను 2022–23లో నాగార్జునసాగర్ కింద వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్ కృష్ణాబోర్డును కోరింది. దీనిపై కృష్ణాబోర్డు సీడబ్ల్యూసీని సంప్రదించింది. కోటాలో వాడుకోని నీళ్లన్నీ క్యారీ ఓవర్ జలాలే అవుతాయని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కార్ అదే ప్రతిపాదనను తెరపైకి తేవడంపై కృష్ణాబోర్డు అసహనం వ్యక్తం చేస్తోంది. (చదవండి: ‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ) -
నాగార్జునసాగర్ @ 200 టీఎంసీలు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 59,778 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 545.3 అడుగులకు చేరింది. మూసీ ప్రవాహంతో సాగర్‌కు దిగువన కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. పులిచింతలకు 10,400 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి పాలేరు, కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 42,025 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ.. 36,750 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలానికి తగ్గిన వరద శ్రీశైలంలోకి వరద ప్రవాహం మరింత తగ్గింది. ప్రాజెక్టులోకి 58,264 క్యూసెక్కులు చేరుతుండటంతో ఒక గేటును మూసివేశారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 59,317 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.6 అడుగుల్లో 196.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కృష్ణా బేసిన్లో ఎగువన వర్షాలు తెరిపి ఇచ్చాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి ప్రవాహం తగ్గిపోవడంతో వాటి గేట్లు మూసేశారు. విద్యుదుత్పత్తిని కూడా నిలిపేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రం 28,196 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. మంగళవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింతగా తగ్గనుంది. -
చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
అలాస్కా: చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపైనుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని, ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు. -
9.50 లక్షల ఎకరాల్లో గోదా‘వరి’!
సాక్షి, అమరావతి: గోదావరి పరవళ్లు డెల్టా రైతుల్లో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. నదిలో సహజసిద్ధ ప్రవాహం పెరగడంతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నందున ఈ ఏడాది గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జలవనరులశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రూపంలో 46.5 టీఎంసీలతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో రాష్ట్ర వాటా కింద మరో 46.5 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తాగునీటి అవసరాల కింద 7 టీఎంసీలతోపాటు ప్రవాహ, ఆవిరి నష్టాలుగా మరో మూడు టీఎంసీలు పోయినా 83 టీఎంసీలతో గోదావరి డెల్టాలో రబీ పంటలకు పుష్కలంగా నీటిని అందించవచ్చని చెబుతున్నారు. నాడు నాలుగేళ్లు కష్టాలే.. 2014 నుంచి 2018 వరకు రబీలో పంటల సాగు డెల్టాలో సవాల్‌గా మారింది. వర్షాలు సరిగా లేక గోదావరిలో నీటి లభ్యత తగ్గడం, సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలను సమర్థంగా వినియోగించుకోకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా రబీలో సాగు చేసిన పంటలు లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. గతంలో నీటి కొరతను ఆసరాగా చేసుకుని డ్రెయిన్లు, మురుగునీటి కాలువల నుంచి తోడి పంటలకు సరఫరా చేసినట్లు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 9.50 లక్షల ఎకరాలు సాగుకు సిద్ధం గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పంట నూర్పిళ్లు పూర్తయ్యాయి. రబీలో సాగుకు ఈనెల 1 నుంచే అధికారులు నీటిని విడుదల చేస్తు న్నారు. ఉభయ గోదావరిలో విస్తరించిన డెల్టాలో 10,13,161 ఎకరాలకుగానూ 9.50 లక్షల ఎకరాల్లో ఈసారి రబీ పంటలు సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధవళేశ్వరం.. కళకళ - గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం 9,091 క్యూసెక్కుల ప్రవాహం రాగా డెల్టాకు 5,100 క్యూసెక్కులు విడుదల చేసి 3,991 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. గతేడాది ఇదే రోజు ధవళేశ్వరం బ్యారేజీలో ప్రవాహం 7,452 క్యూసెక్కులే కావడం గమనార్హం. - ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరిలోకి ఇప్పటికీ సహజసిద్ధ ప్రవాహం కొనసాగుతోంది. - గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో సహజసిద్ధ ప్రవాహం ద్వారా 46.5 టీఎంసీలు లభిస్తాయని అధికారుల అంచనా. - సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. ఇందులో ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ జలవిద్యుదుత్పత్తి సంస్థ) వాటా ద్వారా రాష్ట్రానికి మరో 46.5 టీఎంసీలు లభిస్తాయి. - ఈ ఏడాది గోదావరిలో నీటి లభ్యత పెరగడం, రాష్ట్ర ప్రభుత్వం నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్న నేపథ్యంలో రబీలో సాగుకు ఎలాంటి ఇబ్బంది లేదని గోదావరి డెల్టా సీఈ శ్రీధర్ ‘సాక్షి’కి చెప్పారు. -
తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం
(సాక్షి ప్రతినిధి, కర్నూలు): తుంగభద్ర జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి ఏటా అన్యాయమే జరుగుతోంది. విడుదల చేసిన నీళ్లు రాష్ట్రానికి చేరే విషయంలో మరింత దారుణంగా ఉంటోంది. కర్ణాటక రైతులు అడుగడుగునా నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో రాష్ట్ర రైతులు ఎండిన కాలువలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్ణాటక జల చౌర్యం, అధికారుల నిర్లిప్తత వెరసి రాష్ట్రంలోని తుంగభద్ర ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి రాష్ట్ర (ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు) రైతుల తాగు, సాగు అవసరాల కోసం 56.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 24 టీఎంసీలు కేటాయించారు. అయితే గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా కోటా మేర నీళ్లు హెచ్చెల్సీ, ఎల్ఎల్సీకి వదల్లేదు. ఇదీ హెచ్చెల్సీ పరిస్థితి హెచ్చెల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికరజలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీబోర్డు మాత్రం ఏటా సగటున 18 టీఎంసీలు మాత్రమే ఇస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తున్నారు. వాస్తవానికి ఆమేర కూడా అందించ లేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్చెల్సీకి మళ్లించేలా జీవో జారీ చేశారు. అందులో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో ఏటా 20 టీఎంసీల నికరజలాలు సీమ రైతులు కోల్పోతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకూ 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ పైపులు వేసుకుని మోటర్ల ద్వారా వాడేసుకుంటున్నారు. హెచ్చెల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కర్నూలుకు, పీబీసీ (పులివెందుల బ్రాంచ్ కెనాల్), మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా వైఎస్సార్ జిల్లాకు తుంగభద్రజలాలు చేరాలి. ప్రధాన కాలువ ద్వారా అనంతపురంలోని పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యామ్‌కు నీరు చేరుతుంది. అయితే విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడంలేదని రైతులు ఏటా ఆందోళనలకు దిగుతున్నారు. పీబీసీ ఆయకట్టుకు 8 ఏళ్లుగా చుక్కనీరు అందడంలేదు. విడుదలయ్యే అరకొర నీరు తాగునీటి అవసరాలకే సరిపోతోంది. ఫలితంగా పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్ఎల్సీ పరిస్థితి ఇదీ ఎల్ఎల్సీ (లోలెవల్ కెనాల్)కి డ్యామ్ నుంచి 24 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఈ నీటిపై ఆధారపడి కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. గత ఏడేళ్లుగా కేటాయింపులు పరిశీలిస్తే 6 టీఎంసీల నుంచి 15 టీఎంసీల లోపే ఉన్నాయి. ఇందులో కూడా 3.5 టీఎంసీలు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన నీటినే సాగుకు వినియోగించాలి. దీంతో ఎల్ఎల్సీ కింద ఎప్పుడూ సగం మేర ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ ఏడాది పరిస్థితులు మరీ దారుణం టీబీడ్యాంలో నీటి నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతేడాది ఈ సమయానికి 94.01 టీఎంసీలు ఉంటే, ప్రస్తుతం డ్యాంలో 24.44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది డ్యాంలో ఇన్‌ఫ్లో 54,380 క్యూసెక్కులు, ఉంటే ఈ ఏడాది 14,683 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దీంతో ఎల్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు వర్షాలు కూడా లేకపోవడంతో ఈ ఏడాది పంటలు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీసూర్యనారాయణా..కూల్ కూల్!
సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేనంతగా.. ఈసారి సూర్యనారాయణుడు రౌద్రరూపాన్ని చూపిస్తున్నాడు. భగభగా మండుతూ.. రాష్ట్రంలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. దీంతో మండుతున్న ఎండలు.. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో దాదాపు 80 శాతం కరువుఛాయలు కనిపిస్తున్నాయని.. భూగర్భజల మట్టం దారుణంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ నెలాఖరుకు భూగర్భజలాలు మరింత తగ్గిపోయి రాష్ట్రంలో సగటున 15 మీటర్ల లోతుకు వెళతాయని అంచనా. ఠారెత్తిస్తున్న ఎండలతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. పశువులకు తగినన్ని నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాలదిగుబడి తగ్గిపోగా, గడ్డిరేటు రెట్టింపైంది. దీంతో వానలు వచ్చే వరకు రాష్ట్రంలో బతుకు వెళ్లదీయడం అత్యంత దుర్భరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్యలు ఒక ఎత్తయితే.. ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 55 మంది ఎండదెబ్బకు ప్రాణాలు వదలడం గమనార్హం. 28 జిల్లాల్లో పాతాళానికి గంగమ్మ ఎండల తీవ్రత భూగర్భజలాలపై ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ.. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో గంగమ్మ 28 జిల్లాల్లో పాతాళానికి చేరిపోయింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 25.72 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. వికారాబాద్‌లో 20.46, సిద్దిపేటలో 20.04, సంగారెడ్డిలో 23.47 మీటర్ల లోతుకెళ్తే గానీ నీటిచుక్క కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో మాత్రమే 10 మీటర్లకు పైన నీళ్లున్నాయి. గతేడాదితో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగాయి. అది కూడా ఒక మీటరులోపే. రాష్ట్ర సగటును పరిశీలిస్తే.. గత వేసవిలో ఈ సమయానికి 12.77 మీటర్ల లోతులో నీళ్లుంటే ఇప్పుడు 1.37 మీటర్ల లోతుకు వెళ్లి 14.14 మీటర్లకు చేరాయి. 16% లోటు వర్షపాతం రాష్ట్రంలో జూన్, 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు 16% లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో 42% లోటు కనిపిస్తుండగా, సంగారెడ్డిలో అత్యధికంగా 45% లోటు వర్షపాతం నమోదయింది. మెదక్‌లో కూడా సాధారణంతో పోలిస్తే 41శాతం తక్కువ వర్షం పడింది. రాష్ట్రం మొత్తం మీద సగటు వర్షపాతం 877.31 మిల్లీమీటర్లు కాగా, పడింది కేవలం 737.40 మిల్లీమీటర్లే. సాగర్ నీటిమట్టం ఆందోళనకరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది. ఇందులో మన అవసరాలకు వాడుకునే వీలున్నది 1.2 టీఎంసీలు మాత్రమే. అదే గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 512.90 అడుగుల మేర నీళ్లున్నాయి. అప్పుడు అవసరాలకు వినియోగించుకునే నీళ్లు 3 టీఎంసీలుగా ఉంది. 2017–18లో ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజి స్థాయికి వెళ్లింది. ఆ ఏడాది మేలో 508 అడుగులకు చేరింది. 505 అడుగులకు చేరే వరకు నీటి వినియోగం జరిగింది. 2016–17లో ఈ సమయానికి 510 అడుగుల కనీస స్థాయిలో నీళ్లున్నాయి. అయితే, ఈసారి మిషన్‌భగీరథ అవసరాలకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈమేరకైనా నీళ్లున్నాయి. ఆవిరి నష్టాలను కూడా ముందుగానే గుర్తించిన అధికారులు కొంతమేర నివారించే ప్రయత్నం చేశారు. మార్చి–ఏప్రిల్ నెలల్లో ఆవిరి నష్టం నెలకు 0.75 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకుంటుంది. ఇది ఒకనెల హైదరాబాద్ తాగునీటి అవసరాలతో సమానం. కాగా, మే నెలలో ఈ ఆవిరి నష్టం 1.5 టీఎంసీలకు చేరడం ఆందోళనకరం. జూరాల నుంచి సాగర్‌కు 3 టీఎంసీల నీరు విడుదల చేస్తే సాగర్ ప్రాజెక్టు చేరింది 1.1 టీఎంసీలే. ఇందులో 1 టీఎంసీ నీటి ప్రయాణ నష్టం కాగా, మరో టీఎంసీ ఆవిరి అయిపోవడం గమనార్హం. శ్రీశైలందీ అదే పరిస్థితి! శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 885 అడుగులు కాగా ఇప్పుడు 807.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టులో గత మూడేళ్లతో పోలిస్తే ఫరవాలేదనే స్థాయిలో నీళ్లున్నాయి. సింగూరు ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టులో 21.91 టీఎంసీల గరిష్ట నీటిసామర్థ్యానికిగాను కేవలం 0.68 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. అదే గత ఏడాది 8 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ఏడాది మహా రాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాలేదు. నిజాంసాగర్‌లో ఈ ఏడాది 0.63 టీఎంసీల నీరుం డగా, గతేడాది ఇదే సమయానికి 2.61 టీఎంసీలున్నాయి. సింగూరు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఇక్కడా నీళ్లు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే గతేడాది ఇది 6.81 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి కొంత ఇన్‌ఫ్లో ఉండడంతో ఆ కొద్దిమేరనైనా నీళ్లున్నాయి. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద మనం ఎక్కువగా ఆధారపడే సాగర్, సిం గూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎల్ఎండీలలో నీటి నిల్వలు అధమస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తక్కువే రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.70 లక్షల ఎకరాల్లో సాగైనట్లు (89%) వ్యవసాయశాఖ నివేదిక తెలిపింది. అత్యధికంగా పప్పుధాన్యాల సాగయ్యాయి. పప్పుధాన్యాల రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 3.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రబీ వరి సాధారణ విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 17.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు నివేదిక తెలిపింది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన పప్పుధాన్యాల సాగు 103% నమోదు కావడం గమనార్హం. ఇక నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.30 లక్షల (74%) ఎకరాల్లో సాగు జరిగింది. అందులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, 2.80 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 126% రబీ పంటలు సాగయ్యాయి. అక్కడ సాధారణ సాగు విస్తీర్ణం 49 వేల ఎకరాలు కాగా, 62 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలావుంటే రబీ మొక్కజొన్న పంటను కత్తెరపురుగు దెబ్బతీసింది. దీని ప్రభావంతో 8 జిల్లాల్లో మొక్కజొన్న దిగుబడి చాలా తగ్గింది. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), నిర్మల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెరపురుగు వ్యాపించింది. అకాల వర్షాలకు గాను మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. రబీ నాటికి 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ తెగ ఖర్చవుతోంది రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో గృహ అవసరాలకుగానూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మే నెలలో గత 10 రోజుల్లోనే దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. మే 1వ తేదీన రాష్ట్రంలో 7,221 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రాగా, 10వ తేదీన 8,147 మెగావాట్లకు చేరింది. 11న కొంత మేరకు తగ్గి 8,053 మెగావాట్లకు చేరింది. అయితే, వ్యవసాయ పనులు లేకపోవడంతో కొంత డిమాండ్ తగ్గినట్టు కనిపిస్తున్నా.. వ్యవసాయ వినియోగం సగటు 3,500 మెగావాట్లను కలిపితే అది 11,500 మెగావాట్లు దాటనుంది. అయితే, రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకు 10,500 మెగావాట్లు మాత్రమే ఉంది. కానీ, మే నెలలో ఏకంగా వ్యవసాయ వినియోగం లేకుండా 8,147 మెగావాట్లకు చేరడం గమనార్హం. భానుడు దంచేస్తున్నాడు ►రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎంతగా అంటే గ్రామాల్లో నీటిచెల్మలు కూడా లేక పక్షులు చనిపోతున్నాయి. ఇతర మూగజీవాలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి. చాలా జిల్లాల్లో భూగర్భజలాలు పడిపోతుండటం తో నీళ్లు రావడమే గగనమైపోయింది. పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో ఉన్న బోర్లు వట్టిపోతున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా జిల్లాలో రోజుకు 4లక్షల లీటర్ల పాల దిగుబడి తగ్గిపోయింది. మూగజీవాలకు నీళ్లు కరువయ్యాయి. గడ్డి తగ్గిపోయింది. ట్రాక్టర్ గడ్డి రూ.5వేల నుంచి రూ.8వేలకు పెరిగింది. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమను ఎండలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని 50% పౌల్ట్రీ ఉత్పత్తులు ఈ జిల్లా నుంచే ఉండడం గమనార్హం. ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే10వ తేదీన హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 3,102 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గతంలో 2018 మే30న 2,958 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా, ఇప్పుడు 104 మెగావాట్లు పెరిగింది. ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా>కు అంతరాయం కలుగుతోంది. ►మహబూబ్‌నగర్‌లో ట్రాక్టర్ గడ్డి రూ.15వేలు పలుకుతోంది. వలస కార్మికులు నిలువ నీడ లేని పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ►రంగారెడ్డి జిల్లాలో 191 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదయింది. భూగర్భజలాలు 18.43 మీటర్ల లోతుకు వెళ్లాయి. 24 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 200 గ్రామాలు డేంజర్ జోన్లోకి వెళ్లాయి. ►నల్లగొండ జిల్లాలో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ భూగర్భజలాలు 14.89 మీటర్లకు పడిపోగా, వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 31 మండలాలుండగా, 25 మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్ గడ్డి రూ.8వేల నుంచి 12వేలు పలుకుతోంది. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో వడదెబ్బకు 55 మంది వరకు చనిపోయారు. ఇక్కడ 43–46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ►ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ భూగర్భ జలాలు లోపలికి వెళ్లాయి. గత ఏడాదితో పోలిస్తే అరమీటరుకు పైగా ఎక్కువగానే గంగమ్మ పాతాళంలోకి చేరింది. ►నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1015.7 మిల్లీమీటర్లు కాగా, కురిసింది కేవలం 850.9 మిల్లీమీటర్లే. ఇక భూగర్భజలాలు గతేడాది 15.32 మీటర్ల లోతున ఉంటే ఇప్పుడు 17.05 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. ►వరంగల్ జిల్లాలో పది మీటర్లకు అటు ఇటుగా భూగర్భజలాలున్నాయి. అయితే, వర్షపాతం మాత్రం 70 శాతం కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున బోర్లు ఎండిపోయే పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటికి కూడా కష్టమవుతోంది. -
మిగులు నీళ్లన్నీ మావే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరంతా తమవేనని తెలంగాణ రాష్ట్రం కృష్ణాబోర్డుకు స్పష్టం చేసింది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లినందున, సాగర్‌లో కనీస మట్టాలకు ఎగువన ఉన్న 31.6 టీఎంసీల నీటి వాటా కింద తమకు దక్కేవని తెలిపింది. ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి ఎలాంటి వాటా ఉండదని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. గతంలో బోర్డు చేసిన కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగాన్ని దాని దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు ఏపీకి 33.40 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే ఆ రాష్ట్రం 33.39 టీఎంసీల నీటిని వినియోగించిందని వెల్లడించారు. తెలంగాణకు 46.90 టీఎంసీల మేర కేటాయింపులు చేయగా, ఇందులో 31.71 టీఎంసీల మేర వినియోగించగా, మరో 15.19 టీఎంసీల మేర వాడుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఎలాంటి నీటి లభ్యత లేకపోగా, సాగర్‌లో మాత్రం 31.64 టీఎంసీల మేర ఉందని తెలిపారు. ఇందులో తెలంగాణ వినియోగించుకోవాల్సిన నీటి వాటాతో పాటు 13 టీఎంసీలను తెలంగాణ అవసరాలకు రిజర్వ్‌లో ఉంచారని, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 28.19 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని లెక్కల ద్వారా తెలిపా రు. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటి వరకు 577.99 టీఎంసీలకుగాను ఆంధ్రప్రదేశ్ 401.218 టీఎంసీలు (69.42 శాతం), తెలంగాణ 176.778 టీఎంసీలు (30.58 శాతం) వినియోగించుకుందని, రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ దామాషా ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతంగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కల దృష్ట్యా సాగర్‌లో లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతుందని పేర్కొంది. శ్రీశైలంలో తగ్గుతున్న నిల్వ శ్రీశైలంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ 885 అడుగుల మట్టానికి గానూ ప్రస్తుతం 828.20 అడుగుల మట్టంలో 47.68 టీఎంసీల నిల్వలున్నాయి. నిజానికి శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా ఇప్పటికే దానికి దిగువన 5 టీఎంసీల మేర ఇరు రాష్ట్రాలు నీటి వినియోగం చేసేశాయి. మంగళవారం సైతం శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా ఏపీ 960 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా తెలంగాణ 2.400 క్యూసెక్కుల నీటిని తరలించుకున్నాయి. శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా ఇప్పటివరకు కృష్ణా బోర్డు భేటీపై స్పష్టత రాలేదు. -
దిగుతారా.. ఆగుతారా..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఆరంభానికి ముందే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. మరో ఆరు నెలల వరకు డ్యామ్ నీటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడే నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరాయి. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా నేడో రేపో ఆ మట్టానికి నిల్వలు చేరనున్నాయి. ప్రస్తుతం కేవలం 834.20 అడుగుల్లో వినియోగార్హమైన నీటి లభ్యత కేవలం 0.20 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ లభ్యత నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. గతేడాది 101.. ఇప్పుడు 54 టీఎంసీలు ఏపీలోని కేసీ కెనాల్, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు కింది అవసరాలతో పాటు సాగర్ కింది అవసరాలకు శ్రీశైలం ప్రధాన నీటి వనరుగా ఉంది. అయితే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు తమ సాగు, తాగునీటి అవసరాలకు గణనీయంగా నీటిని మళ్లించుకోవడంతో ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. గతేడాది 885 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 858.70 అడుగుల మట్టంలో 101.92 టీఎంసీల మేర నిల్వలుండగా.. ప్రస్తుతం 834.20 అడుగుల మట్టంలో 54.15 టీఎంసీల మేర నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్నది కేవలం 0.20 టీఎంసీలు. ఈ నీటితో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల కింది అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేది కాదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దిగువకు వెళ్లాలని ఏపీ ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోంది. తమ అవసరాలకు అనుగుణంగా కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఏపీ విన్నవించింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా జూలై నెలాఖరు వరకు లభ్యత నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున ఆచితూచి వాడుకోవాలని సూచించింది. బోర్డు భేటీలోనే స్పష్టత: కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశంపై కృష్ణా బోర్డు నిర్ణయమే కీలకం కానుంది. భేటీపై స్పష్ట త లేదు. గతనెలలో భేటీ ఉంటుందని భావించగా, తుంగభద్ర బోర్డు భేటీ కారణంగా అది జరగలేదు. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన కోరినంత మేర నీటి నిల్వలు లేనట్టయితే దిగువకు వెళ్లయినా నీటిని కేటాయించాలన్న ఏపీ వినతిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. లేకుంటే సాగర్‌పైనే.. శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు వెళ్లలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నీటిపైనా ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాగర్‌లో 534.8 అడుగుల మట్టంలో 177.66 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 46 టీఎంసీలు. ఈ నీటినే రెండు రాష్ట్రాలు సర్దుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలో తెలంగాణకు ఇంకో 29 టీఎంసీలు, ఏపీ మరో 5 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. మరో 13 టీఎంసీల నీటిని తెలంగాణ అవసరాల కోసం రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరు ఇరు రాష్ట్రాల అవసరాలను తీర్చడం కష్టమే. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి తోడటం ఖాయమేననిపిస్తోంది. -
తెలంగాణకు 52.50 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 52.50 టీఎంసీలను కేటాయిస్తూ కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం ఆదేశాలిచ్చారు. ఇందులో 33 టీఎంసీల నీటిని సాగర్ఎడమ కాల్వ కింది అవసరాలకు, మరో 12 టీఎంసీల నీటిని ఎంఆర్పీ కింద తాగు, సాగు అవసరాలకు, మరో 7.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం సాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన 172 టీఎంసీలు, శ్రీశైలంలో 148.65 టీఎంసీలు కలిపి మొత్తంగా 320 టీఎంసీల మేర నీటినిల్వలు లభ్యతగా ఉన్న దృష్ట్యా అందులోంచే ఈ నీటిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి డేటాను తెలంగాణ, ఏపీలు ఆమోదించి బోర్డుకు పంపాలని తెలిపింది. 2015లో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ నీటి విడుదలలో బోర్డు ఆదేశాలు పాటించాలని సూచించింది. స్థిరంగా ప్రవాహాలు.. ఇక సాగర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. గురువారం సాగర్‌లోకి 26వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 312 టీఎంసీలకు గానూ 303.95 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులోంచే 19,213 క్యూసెక్కుల నీటిని దిగువ అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువన శ్రీశైలానికి స్థిరంగా 25వేల క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నుంచి 54వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. -
శ్రీశైలం ఖాళీ.. సాగర్‌పై గురి!
785 అడుగుల మట్టం వరకు శ్రీశైలం నీటి వినియోగం పూర్తి ► ఇప్పుడు సాగర్ నీటి కోసం పోటాపోటీ ► కుడి కాల్వను వివాదాస్పదం చేసేందుకు ఏపీ యత్నం ► రాష్ట్ర అధికారులపై కేసుల నమోదులో బోర్డు జోక్యం కోరిన తెలంగాణ సాక్షి, హైదరాబాద్: వేసవి మధ్యలోనే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు ఖాళీ కావడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వేడి పుట్టిస్తోంది. అవసరమైన మేర నీటి నిల్వలు లేకపో వడంతో... ఉన్న నీటికోసం తెలుగు రాష్ట్రాలు గుంజులాడుకుంటున్నాయి. గతంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన కనీసమట్టాల మేర కు.. ఇప్పటికే శ్రీశైలం కోటా (785 అడుగుల వరకు) పూర్తయింది. నాగార్జునసాగర్‌లో మాత్రం మరో రెండు అడుగుల (కనీస మట్టం 503 అడుగులు) వరకు నీటిని తీసుకునే అవకాశం ఉండటంతో.. ఆ నీటికోసం ఇరు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఉన్న కొద్దినీటినే.. ఫిబ్రవరిలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 78 టీఎంసీల నుంచి బోర్డు ఏపీకి 47 టీఎంసీలు, తెలంగాణకు 31 టీఎంసీలు పంచింది. అందులో తెలంగాణ వాటా ఇప్పటికే పూర్తికాగా.. ఏపీకి మరో 5 టీఎంసీలు రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 785 అడుగుల కనీస మట్టం వరకు నీటి వినియోగం పూర్తయింది. సాగర్‌లో ప్రస్తుతం 504.9 అడుగుల మేర జలాలు ఉన్నాయి. అంటే కనీసమట్టానికి పైన రెండు అడుగుల మేర 3.25 టీఎంసీల లభ్యత జలాలు ఉన్నాయి. ఇప్పుడీ నీటి కోసమే ఇరు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. 504 అడుగుల కన్నా దిగువకు తగ్గితే హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది ఉంటుందన్న కారణంగా తెలంగాణ నీటిని విడుదల చేయడం లేదు. అంతేగాకుండా కుడి కాల్వ కింద వాటా మేరకు నీటి విడుదల పూర్తయిందని చెబుతోంది. కానీ ఏపీ దీనిని అంగీకరించడం లేదు. బోర్డు ఆదేశాలను చూపుతూ నీటి విడుదల కోసం పట్టుబడుతోంది. తెలంగాణ అధికారులపై పోలీసు కేసులు కూడా నమోదు చేసింది. అయితే కుడి కాల్వ అంశాన్ని వివాదాస్పదం చేసి దాన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చేలా ఏపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే పోలీసు కేసులు పెడుతున్నారని తెలంగాణ అనుమానిస్తోంది. వాస్తవానికి సాగర్ కుడి కాల్వ కృష్ణా బోర్డు నియంత్రణలో ఉండాలని, అలాగైతేనే తమకు నీటి విడుదల సులభమని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. బోర్డు జోక్యం చేసుకోవాలి రాష్ట్ర అధికారులపై ఏపీ అధికారులు పెట్టిన పోలీసు కేసుల విషయంలో కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం రాత్రి బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి వివిధ సందర్భాల్లో 22.59 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారని.. అందులో సరఫరా నష్టాలు 2.52 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 1.67 టీఎంసీ లతో కలిపి 22.69 టీఎంసీలు విడుదల చేశామని ఆ లేఖలో వివరించారు. బోర్డు ఆదే శాల మేరకు వాటా పూర్తయినందునే తెలం గాణ అధికారులు నీటి విడుదల నిలిపి వేశా రని స్పష్టం చేశారు. అయినా ఏపీ అధికారు లు ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించా రని, తెలంగాణ అధికారులపై కేసు లు నమో దు చేశారని తెలిపారు. ఈ విష యంలో బోర్డు జోక్యం చేసుకుని ఏపీకి సహేతుక సూచనలు చేయాలని విన్నవించారు. -
కొండపై నిండుకుంటున్న జలాశయాలు
శ్రీవారి భక్తులకు 165 రోజుల వరకే నీళ్లు సాక్షి, తిరుమల: శేషాచలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తిరుమలకొండ మీద గోగర్భం, ఆకాశగంగ డ్యాములు ఎండాయి. ఇక పాపవినాశనం, కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు భారీగా తగ్గాయి. కారణంగా తిరుమలలో కేవలం 165 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయి. ఈ లోపు వర్షాలు పడకుంటే ఏప్రిల్ నెలనుంచి శ్రీవారి భక్తులకు నీటి కష్టాలు మొదలవుతాయి. స్వామి దర్శనంకోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసంరోజూ 32 లక్షల గ్యాలన్లు నీరు వాడుతుంటారు. గత ఏడాది నవంబరు 7,8,9 తేదీల్లో మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తిగా నిండారుు. ఆ నీటిని వినియోగించటంతో రెండు డ్యాములు ఎండిపోగా, మిగిలిన మూడు డ్యాముల్లో నీటి నిల్వలు బాగా తగ్గారుు. దీంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది. నీటివాడకంలో నిర్దిష్ట విధానాలు అమలు చేస్తోంది. -
ఆలమట్టిలోకి ఒక్కరోజే 16 టీఎంసీలు
* 70 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ * తుంగభద్రకు భారీగా ప్రవాహాలు * మరో పది రోజుల్లో దిగువకు కృష్ణమ్మ పరుగులు! సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి జలక ళను సంతరించుకుంటోంది. బుధవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి ఏకంగా 16 టీఎంసీల మేర నీరొచ్చి చేరింది. గురువారం సైతం 1.75 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటం, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐదారు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ నెలాఖరుకు ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. తుంగభద్రకు కూడా ప్రవాహాలు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. ఆలమట్టిలోకి మరో 50 టీఎంసీల నీరు చేరితే దిగువన ఉన్న నారాయణపూర్‌కు నీటిని వదిలే అవకాశాలున్నాయి. నారాయణపూర్ నిండిన వెంటనే జూరాలకు నీటి ప్రవాహాలు మొదలు కానున్నాయి. దిగువకు ప్రవాహాలు వచ్చేందుకు పది రోజులకు మించి సమయం పట్టకపోవచ్చని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. గోదావరి తగ్గుముఖం భద్రాచలం: గోదావరి నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి నీటిమట్టం 42.5 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం, దిగువన ఉన్న కిన్నెరసాని, శబరి నదుల్లో వరద తాకిడి లేకపోవడంతో గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. భద్రాచలం డివిజన్లోని పలు మండలాల్లో రోడ్లపై నీటి ఉధృతి తగ్గింది. రాకపోకలు ప్రారంభం కాగా.. భద్రాచలంలోని స్నానఘట్టాలు, కల్యాణకట్ట కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. స్లూయిజ్ లీకేజీ ద్వారా నీరు బయటకు వచ్చి ఇళ్లు మునగటంతో గోదావరి తగ్గినప్పటికీ ఇంకా కొంత మేర అలాగే నీరు నిలిచిపోయింది. శుక్రవారం నాటికి వరద మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ... తగ్గిన ఇన్‌ఫ్లో బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం వరద నీరు తగ్గుముఖం పట్టింది. క్రితం రోజు 58 వేల క్యూసెక్కులు వచ్చి చేరిన వరద నీరు 19,344 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.30 అడుగులు (16.34 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సీజన్లో 12 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 15 అడుగుల నీటి మట్టం పెరిగిందన్నారు. -
పొలాల్లో కందకాలతోనే సాగు నీటి భద్రత!
పొలంలో కురిసిన ప్రతి వాన చినుకుపైనా ఆ పొలం యజమానికి హక్కుంది. పొలంలో కురిసే ప్రతి చినుకునూ బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపంజేసుకుంటే రైతులకు నీటి కష్టాలే ఉండవని నిపుణులు చెబుతున్నారు. కుండపోతగా కురిసే వర్షాన్ని పొలాల్లోనే భూమిలోకి ఇంకింపజేసుకోవడమే సర్వోత్తమం. పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పుతో, ప్రతి 50 మీటర్లకు ఒకచోట, కందకాలు తవ్వుకుంటే కుండపోత వర్షం కురిసినా నీరు పొలం దాటి వెళ్లదు. వర్షాలు తక్కువైనా బావులు, బోర్లలో నీటి నిల్వలకు కొరతే ఉండదు. సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనంటున్నారు నిపుణులు. ఎకరానికి రూ. 1,500 ఖర్చుతో రైతులే తమ పొలాలకు సాగు నీటి భద్రత సాధించుకోవచ్చు. సలహాలు, సూచనలకు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎస్. చంద్రమౌళి (98495 66009), ప్రధాన కార్యదర్శి ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి (99638 19074) లను సంప్రదించవచ్చు. -
మంజీరాపై తొలి ‘నీటి వంతెన’
- 350 మీటర్ల పొడవు.. రూ.50 కోట్లతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: ఒకే నిర్మాణం.. రెండు ప్రయోజనాలు.. ఈ తరహాలో తొలి భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నది దాటేందుకు రోడ్డుతోపాటు, నది నీటిని నిల్వ చేసే డ్యామ్ తరహా ఏర్పాటుకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకర తొలి భారీ వంతెన సిద్ధం కాబోతోంది. నిజామాబాద్-మెదక్ సరిహద్దులో వెంకంపల్లి వద్ద మంజీరా నదిపై దీనిని నిర్మించనున్నారు. దాదాపు 350 మీటర్ల పొడవుండే ఈ వంతెనకు దాదాపు రూ.50 కోట్లకుపైగా వ్యయం కానుంది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం-మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలాలను అనుసంధానించటంతోపాటు ఆ ప్రాంతాల్లోని గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు అవకాశం కలుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో సత్ఫలితాలనిస్తున్న ఈ తరహా నిర్మాణాలను తెలంగాణలో చిన్న నదీ పాయలు, పెద్ద వాగులపై నిర్మించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంజీరా నదిపై కూడా చేపట్టాలని తాజాగా రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించటంతో ఆ శాఖ అధికారులు దీనిని ఎంపిక చేశారు. ఇక్కడ రోడ్డు కోసం వంతెన నిర్మించే ప్రతిపాదన మాత్రమే ఉంది. మంత్రి ఆదేశాలతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి వంతెన డిజైన్ మార్చి టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. దీనికి సంబంధించి సర్వే పని మొదలుపెట్టారు. గతంలో మాటూరు వద్ద వంతెన నిర్మాణానికి ప్రయత్నించినా.. ఆ ప్రాంతం అనువైంది కాదని మట్టి పరీక్షలో తేలడంతో.. ఇప్పుడు వెంకంపల్లిని ఎంపిక చేశారు. -
వరుణుడే దిక్కు
- జలాశయాల్లో అడుగంటిన సాగునీటి నిల్వలు - ఖరీఫ్‌కు 32 టీఎంసీలు అవసరం - రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్నది కేవలం 4 టీఎంసీలు - జూలై నెలాఖరుకు నిండితేనే నీరు విడుదల - లేదంటే కష్టమేనంటున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్ సీజన్...ఆరంభంలోనే రైతులను కలవరపెడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అడుగంటిన సాగునీటి నిల్వలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో సగం వర్షాధార ప్రాంతమే. జలాశయాల్లో పుష్కలంగా నీరు లేదు. వచ్చే నెలాఖరుకు అవి నిండితేనే సాగునీరు విడుదల చేస్తామని, లేదంటే కష్టమేనని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారమంతా వరుణుడిపైనే వేసి అన్నదాతలు కాడి నెత్తుకుంటున్నారు. జిల్లాలో సాగు లక్ష్యం 2,08,988 హెక్టార్లు. ఇందులో వరి లక్షా ఆరువేల హెక్టార్లు. ప్రాజెక్టులు, కాలువలు, ఇతర సాగునీటి వనరుల కింద 1.99లక్షల ఎకరాలు, వర్షాధారంగా మరో 65,233 ఎకరాల సాగవుతాయి. ఇందుకు 32 టీఎంసీల నీరు అవసరం. వర్షాధార ప్రాంతాలు మినహాయిస్తే కనీసం 26 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేవలం 3.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా తాండవ, రైవాడ, కోనం, పెద్దేరు జలాశయాల పరిధిలో అత్యధికంగా 92వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 11.6 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం వీటిల్లో 2.66 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వంద ఎకరాలకు పైబడి 232 సాగునీటి చెరువులున్నాయి. వీటి పరిధిలో 59వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 6.5 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు మాత్రమే వీటిల్లో అందుబాటులో ఉంది. ఇక మిగిలిన సాగునీటి వనరుల్లో చుక్కనీరులేని దుస్థితి. సీజన్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈసారి పూర్తిగా వర్షాలపైనే సాగునీటి వనరుల కింద ఆయకట్టు కూడా ఆధారపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశంతో వారం రోజుల నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రం సింగిల్ సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. ఒకటి రెండు రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో మాత్రమే అత్యల్ప వర్షపాతం నమోదుతో ఈ ప్రాజెక్టుల్లో నీటిమట్టం కేవలం అడుగులోపేఉంది. మిగిలిన ప్రాజెక్టుల్లో ఆ పరిస్థితీ లేదు. గతేడాది ఇదే సమయంలో జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలున్నాయి. ఉదాహరణకు గతేడాది తాండవలో 3 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క టీఎంసీ నీరు ఉంది. దీంతో రానున్న నెలరోజులు క్యాచ్మెంట్ ఏరియాలో కుంభవృష్టి ఉంటే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రాజెక్టుల నుంచి నీరు వదలాల్సిఉంటుంది. అంటే జూలై నెలాఖరులోగా ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్(చెరువులు) నిండాలి. ఏమాత్రం వరుణుడు ముఖం చాటేసినా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరమే. ప్రాజెక్టులు నిండితేనే నీరు విడుదల జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం పెద్దేరు జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. పంటలకు ఆగస్టు రెండోవారం నుంచి నీరు అవసరం ఉంటుంది. ఈలోగా ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వాటి సామర్ధ్ద్యానికి తగ్గట్టుగా నిండితేనా పంటలకు నీరు విడుదల చేయగలం. లేకుంటే కష్టమే. వర్షాలు మైదాన ప్రాంతాల్లో కాకుండా క్యాచ్మెంట్ ఏరియాలో పడితేనే ప్రాజెక్టులకు..రైతులకు ఉపయోగం.. నాగేశ్వరరావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ -
రాష్ట్రంలో నీటి కటకట
- గతేడాదితో పోల్చితే గణనీయంగా తగ్గిన నిల్వలు - ఆందోళన చెందుతున్న ముంబై ప్రజలు - జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయి: బీఎంసీ సాక్షి ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలవకపోతే పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నీటి నిల్వలు ఘననీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలు దాటిపోతుండటంతో నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై బీఎంసీ నీటి సరాఫరాల శాఖ చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాంబ్లే మాట్లాడుతూ.. ముంబై నగరానికి నీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. నగరానికి నీరు సరాఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ విషయమై నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని చెప్పారు. ప్రస్తుతం బీఎంసీ వద్ద నాలుగు లక్షల మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ముంబైకర్లకు ప్రతిరోజు 3,750 ఎమ్మెల్డీల (మిలియన్ లీటర్స పర్ డే) నీరు అవసరమని, దీన్ని బట్టి నీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీఎంసీ అధికారులు తెలిపారు. గతంలో జూన్ చివరి తేదీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాపై అధికారులు ప్రణాళికలు రూపొందించేవారు. కాని సమయానికి వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల ప్రస్తుతం జులై 31 వ తేదీ వరకు నీటిని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా తదితర జలాశయాల్లో ప్రస్తుతం జూలై 31 వరకు సరిపోయే విధంగా నిల్వలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నెల రోజుల ముందు వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి. కాగా, ఈ సారి అనుకున్న సమయానికన్నా ముందే వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అయితే ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే నగరంలో ఎంత శాతం మేర నీటి కోత అమలు చేయాలనే విషయంపై బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
బోసిపోతున్న ‘సాగర్’
రోజురోజుకూ అడుగంటుతున్న జలాలు ప్రధాన కాల్వకు కొనసాగుతున్న నీటి విడుదల భవిష్యత్తులో దాహం తీరేది అనుమానమే!వేసవిలో మోగనున్న ప్రమాద ఘంటికలు నిజాంసాగర్: జిల్లా వరప్రదారుుని అయిన నిజాంసాగర్ ప్రాజె క్ట్టులో నీటి నిల్వలు క్రమ క్రమంగా పడిపోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే తాగునీటి అవసరాల కోసం ప్రధా న కాలువకు నీటి విడుదల చేపడుతుండటంతో ‘సాగర్’ నీరు అడుగంటుతోంది. బోధన్ పట్టణం, నిజామాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి నిజాంసాగర్ నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రధాన కాలువకు 1,240 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. నాలుగు రోజుల పాటు 400 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని మాత్రం విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆరు రోజుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.తద్వారా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రాను న్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. బోధన్, నిజామాబాద్ ప్రజలకు తాగునీరందించేందుకు బెల్లాల్ చెరువు, అలీసాగర్ రిజర్వాయర్‌ను పూర్తిస్థాయి లో నింపాలని అధికారులు నిర్ణరుుంచారు.బెల్లాల్ చెరువు ద్వారా బోధన్ పట్టణానికి రోజుకు 1.5 ఎమ్‌సీఎఫ్‌టీలు, అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి 1.5 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండు జలాశయూలను పూర్తిగా నింపినా నెల రోజుల అవసరాలకే సరిపోతా రుు. ఈ లెక్కన వచ్చే మార్చి నెలాఖరు నుంచి తాగునీటికి అవస్థలు పడాల్సిందే. గతేడాది కంటే తగ్గిన నిల్వలు నిజాంసాగర్ నీటిమట్టం గతేడాదితో పోలిస్తే ఈ యేడు భారీగా తగ్గిపోరుుంది. ప్రాజెక్టు పూర్తిస్థారుు నీటిమట్టం 1405 అడుగులు. 17.08 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1 379.16 అడుగులతో 1.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయూనికి 1398.88 అడుగులతో 10.189 టీఎం సీల నీరు నిల్వ ఉంది.కనిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో సాగర్ వెల వెలబోతోంది. ఈ యేడు వర్షాలు సకాలంలో కురవకపోతే తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు జలాశయంలో సైతం నీటి మ ట్టం ఆశాజనకంగా లేదు. దీంతో సింగూరు జలాలపై ఆశలు ఆవిరికానున్నాయి. గత రబీ సీజన్లో సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని విడుద ల చేయూలని ప్రతిపాదించారు. నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గత వేసవిలో తాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 517.654 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు మా త్రమే నిల్వ ఉంది. అక్కడి నీటిని జంటనగరాల తాగు నీటి అ వసరాలకు ఉపయోగించనున్నందున నిజాంసాగర్‌కు జలా లు రావడం అనుమానమే. -
ఆశలు ఆవిరి
⇒ కలవర పెడుతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు ⇒ కనిష్ట మట్టానికి చేరువలో నీటి నిల్వలు ⇒ తాగునీటి అవసరాలకే అధికారుల ప్రాధాన్యం ⇒ ఆరుతడి పంటలకూ సాగునీరు అనుమానమే ⇒ ఆందోళనలో ఆయకట్టుదారులు నిజాసాంగర్: ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని జిల్లా కేంద్రంతో పాటు బోధన్ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రబీ పంటకు నీళ్లులేనట్లే! నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు వరకు 2.4 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. చివరి ఆయకట్టుకు చెరువులు, కుంటలతోపాటు బోరుబావులు ఆధారంగా ఉన్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంతంలోని లక్ష ఎకరాలకు ప్రధాన కాలువే జీవనాధారం. ఖరీఫ్‌లో వరుణుడు కరుణించకపోవడంతో అక్కడ ఉన్న సుమారు 15వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ప్రధాన కాలువను నమ్ముకుని బీర్కూర్, వర్ని, కోటగిరి, ఎడపల్లి, బోధన్ తదితర మండలాలలోని రైతులు సుమారు 80 వేల ఎకరాలలో వరి సాగు చేశారు. వీటికి అధికారులు ప్రాజెక్టు నుంచి నాలుగు విడతలలో 4.1 టీఎంసీల నీటిని ప్రధాన కాలువ ద్వారా అందించారు. ఫలితంగా అక్కడ పంటలు సాగు చేసిన రైతులు గట్టెక్కారు. మొదటి ఆయకట్టు పరిధిలోని నిజాంసాగర్, సుల్తాన్‌నగర్, గున్కుల్, మహమ్మద్‌నగర్, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ, గాలిపూర్, ముగ్దుంపూర్, కొత్తాబాది, తిర్మాలాపూర్, తాడ్కోల్, బుడ్మి, బాన్సువాడ ప్రాంతాలలో వందల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఆయా ప్రాంతాల రైతులు రబీలో మొక్క జొన్న, జొన్న, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం సాగు నీరు అత్యవసరంగా మారింది. నీటి తడులు లేక పంటలు వాడిపోతుండటంతో రైతులు కలవరపడుతున్నారు. తాగునీటికే ప్రాధాన్యం నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకూ జలాలు అడుగంటుతున్నాయి. అవిరి రూపంతోపాటు వ్యవసాయ పంపుసెట్ల ఎత్తిపోతలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. రోజుకు 75 నుంచి వంద క్యూసెక్కుల మేర నీరు తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు, 17 .8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,381 అడుగులతో 1.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి కోసం ఉపయోగించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. రబీ సీజన్లో ప్రధాన కాలువకు ఎట్టిపరిస్థితులలోనూ నీటిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బెల్లాల్, అలీసాగర్ నుంచి పట్టణాలకు తాగునీరు జిల్లా కేంద్రంతోపాటు బోధన్ పట్టణ ప్రజలకు వేసవిలో తాగునీటి కొరత రాకుండా నీటి నిల్వలున్నాయి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్, బోధన్ మండలంలోని బెల్లాల్ చెరువులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి రోజుకు 1.25 ఎంసీఎఫ్‌టీల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. బెల్లాల్ చెరువు ద్వారా రోజు 1.5 ఎంసీఎఫ్‌టీల నీటిని బోధన్ పట్టణానికి తాగునీరందిస్తున్నారు. అలీసాగర్, బెల్లాల్ చెరువులో నీటినిల్వలున్నందున మార్చి నెలాఖరు వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రధాన కాలువ మొద టి ఆయకట్టు కింద పంటలను సాగు చేసే రైతులకు ఇక బోరుబావులు, చెరువులు, కుంటలే శరణ్యంగా మారనున్నాయి. -
నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోనున్న హుడా
గుర్గావ్: శుద్ధీకరించిన నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు హర్యానా పట్టణాభివృద్ధి సంస్థ(హుడా) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బసా యి నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మరింత విస్తరించేందుకు 75ల భూమిని సేకరించింది. చంధూ బుధేరా జలశుద్ధీకరణ కేంద్రం పరిసరాల్లో కూడా 240 ఎకరాలను సేకరించింది. ‘నీటి శుద్ధీకరణ కేంద్రాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే యోచనలో ఉన్నాం. ఇప్పటికే రెండు కేంద్రాల వద్ద అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గుర్గావ్-మనేసర్ మాస్ట ర్ ప్లాన్-2031 నాటికి సరిపోయేలా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించామ’ని హుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.కె. శేవ్కండ్ తెలి పారు. గుర్గావ్ నగరంలో ముడింట రెండొం తుల జనాభాకు బసాయి ప్లాంటు నుంచే నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం బసాయి నీటి నిల్వ సామర్థ్యం 60 ఎంజీడీలుగా ఉంది. ప్రస్తుతం హుడా చేస్తు న్న ప్రయత్నాలు ఫలించి, సేకరించిన భూమి అం దుబాటులోకి వస్తే మరో 20 ఎంజీడీల నీటిని నిల్వ చేయడానికి వీలుంటుంది. దీంతో బసాయి నీటి నిల్వ సామర్థ్యం 80 ఎంజీడీలకు పెరుగుతుంది. సేకరిస్తున్న భూమి పూర్తిగా వినియోగంలోకి వస్తే బసాయి నీటి నిల్వ సామర్థ్యం 224 ఎంజీడీల నుంచి 560 ఎంజీడీల వరకు పెరుగుతుంది. అప్పు డు మరమ్మతుల సమయంలో కూడా నిరంతరాయంగా నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇక చంధూ బుధేరా ప్లాంట్ సామార్థ్యాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి పెంచేలా రెండు కొత్త ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం బసాయి ప్లాంటు నుంచి మాత్ర మే నగరానికి ఎక్కువగా నీరు సరఫరా అవుతోంది. దీంతో ముందుగా దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే హుడా ప్రాధాన్యతనిస్తోంది. -
అన్నదాత ఆశలు ఆవిరి
* ప్రధాన రిజర్వాయర్లలోకి చేరని నీరు * 250 టీఎంసీల మేర కొరత * అక్టోబర్ తర్వాతి పరిస్థితిపై అప్పుడే ఆందోళన * సాగు, తాగు నీటి కష్టాలు తప్పవంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నా వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రాష్ర్టంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికీ కష్టాలు తప్పవటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 250 టీఎంసీల మేర నీటి కొరత ఉందని అధికారులు అంచనా వేశారు. కృష్ణాతో పోల్చితే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో కొత్తగా చుక్క నీరు కూడా చేరడం లేదు. దీంతో శ్రీరాంసాగర్, సింగూర్, నిజాంసాగర్, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్‌కు ప్రాజెక్టులపరంగా115 టీఎంసీల మేర కొరత ఉండగా, కృష్ణాపై ఉన్న నాగార్జునసాగర్, జూరాలలో మరో 130 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా కష్టతరంగా మారనుందని అధికారులే అంటున్నారు. ప్రాజెక్టుల తాజా పరిస్థితి సింగూరు: జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చడంలో ముందున్న సింగూరు నుంచి ఈ ఏడాది పొడవునా నీటి సరఫరా కష్టంగా మారనుంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు ఏటా 6 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, అందులో ఇప్పటికే గ్రావిటీ ద్వారా, మంజీరా పంపింగ్ ద్వారా 5.2 టీఎంసీల మేర నీటి సరఫరా జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.8 టీఎంసీల బ్యాలెన్సింగ్ మాత్రమే ఉంది. మొత్తం సామర్థ్యం 30 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 11.26 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్టోబర్ తర్వాత రాజధాని తాగునీటి అవసరాలకు సింగూర్ జలాల పంపిణీ కష్టంగా మారనుంది. ఎస్సారెస్పీ: ఎస్సారెస్పీలో ఈ ఏడాది చుక్క నీరు కూడా కొత్తగా వచ్చి చేరలేదు. దీంతో 90.31 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ కేవలం 20.75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి సాధారణంగా ఏటా 5.5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడతారు. కానీ ప్రస్తుత నిల్వలను బట్టి తాగునీటికి 4 టీఎంసీలు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి కటకట తప్పేలా లేదు. రానున్న రబీలో ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే. నాగార్జునసాగర్: సాగర్ జలాశయం పరిధిలోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎగువ నుంచి అంతా ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులో 312.045 టీఎంసీల నిల్వ సామర్థ్యానికిగానూ 183.77 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో 6.50 లక్షల ఎకరాలకు గాను కేవలం 4 లక్షల ఎకరాలకే సాగు నీరిచ్చారు. ఇక ఆంధ్రా ప్రాంతంలో 14.50 లక్షల ఎకరాలకు గానూ 5.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. జూరాల: జూరాలలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ వారం రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 1383 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండగా వెయ్యి క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మండుతున్న రైతు గుండె అసలే వర్షాలు లేక కలవరపడుతుంటే.. కరెంటు కోతలూ తోడవడంతో రైతుల గుండెలు మండుతున్నాయి. అందుబాటులో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక మథనపడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. అరకొర వర్షాలతో ఈసారి ఆలస్యంగా పనులు మొదలుపెట్టిన అన్నదాతలకు ఇది శాపంగా మారింది. కరెంటు లేక బోర్లు, బావుల్లో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నారు. ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటల నుంచి ఆరు గంటలకు ప్రభుత్వం అధికారికంగానే కుదించింది. అయితే పేరుకే ఆరు గంటలు కానీ పట్టుమని రెండు మూడు గంటల కరెంటు కూడా అందడం లేదు. హైదరాబాద్‌లో 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల పాటు సరఫరా నిలిపేస్తున్నారు. ఇక గ్రామాల్లోనైతే కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలకూ వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలులో ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ర్టవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ అంచనాలను మించి ఉంటోంది. 19వ తేదీన రాష్ట్రంలో 147 మిలియన్ యూనిట్ల(ఎంయూ) డిమాండ్ నమోదు కాగా, సరఫరా మాత్రం 135 ఎంయూలకే పరిమితమైంది. పాతాళంలో భూగర్భ జలాలు రాష్ర్టంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు, బావులు వట్టిపోయాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తాగునీటికి కటకట ఏర్పడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూలై నెలలో ఆదిలాబాద్ జిల్లాలో 5.49 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యంకాగా.. ఈ ఏడాది జూలైలో 8.84 మీటర్లలోకి పడిపోయాయి. ఇదే కాలంలో నిజామాబాద్ జిల్లాలో 7.60 మీటర్ల నుంచి 10.85 మీటర్లకు, కరీంనగర్ జిల్లాలో 6.45 మీటర్ల నుంచి 9.08 మీటర్లకు.. ఖమ్మం జిల్లాలో 6.33 మీటర్ల లోతు నుంచి 8.70 మీటర్లకు చేరాయి. ఇక హైదరాబాద్‌లో 7.39 మీటర్ల నుంచి 9.59 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. కాగా రాష్ట్రంలో ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం(ఆగస్టు 20) నాటికి సాధారణంగా 517.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 231.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే ఏకంగా 55 శాతం లోటు కనిపిస్తుంది. -
డెడ్ స్టోరేజీకి నిజాంసాగర్!
సాక్షి ప్రతినిది, నిజామాబాద్: ప్రాజెక్టు నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగు కోసం నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారా? లేదా? అన్న అం శంపై అధికారులు ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదు. జిల్లా నీటిపారుదల అధీకృత సంస్థ (డీఐఏ బీ) సమావేశం జరి గితేగాని, నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో ఖరీఫ్ ఆశలు గల్లంతైనట్టే కనిపిస్తోంది. జిల్లా ను కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పడిన చిరుజల్లులు పంటలను ఏ మాత్రం దక్కించలేని పరిస్థితి. జిల్లాలో సాధారణ వర్షపాతం 849 మి.మీటర్లు. ఈ సమయానికి 359.50 మి.మీ కురియాల్సి ఉంది. 2012 జులై 27 నాటికి 284 మి.మీ నమోదు కాగా, 2013 జులై 27 వరకు 681.9 మి.మీ కురిసింది. ఈసారి మాత్రం ఆదివారం నాటికి కేవలం 128.1 మి.మీ వర్షపాతం నమోదైంది. 64 శాతం తక్కువ వర్షం పడింది. దీంతో ప్రధాన ప్రాజెక్టులలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే, నిర్మాణ సమయంలో దీని సామర్థ్యం 28 టీఎంసీలు, 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీలు, 1405 అడుగులే, ఇపుడు నీటి నిల్వ 1392.60 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 5 టీఎంసీలకు పడిపోయింది. డీఐఏబీ సమావేశంపై ఆశలు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్ని, రెంజల్, బోధన్, ఎడపల్లి, ఆర్మూరు, జక్రాన్‌పల్లి తదితర మండలాల రైతులు ఇ ప్పటికే వరి సాగు చేశారు. ఈ సీజన్లో 8,01,902 ఎకరాలలో వివిధ పంటలు వేస్తారనేది వ్యవసాయశాఖ ప్రణాళిక కాగా, 3,11,562 ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా. ఈ క్రమంలోఇంకా నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో నిజాంసాగర్‌పై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అధికారులు, తగ్గిన నీటిమట్టం నేపథ్యంలో ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. బోధన్ సమీపంలోని బెల్లాల్‌కు తాగునీటి అవస రాలకు మాత్రం నీటిసరఫరా ఉంటుందని చెబుతున్నారు. తాగునీటి అవసరాల అనంతరమే సాగునీరు అని అంటున్నారు. డిఐఏబీ సమావేశంలోనైన నిర్ణయం జరుగు తుందన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. అప్పుడే నిర్ణయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్ కోసం నీటిని విడుదల చేసే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. డీఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల ద్వారా రైతులకు మేలు చేసే విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్ష జరిపారు. ప్రభుత్వం ఆదేశం, డీఐఏబీ నిర్ణయం మేరకు ఆగస్టు నెలాఖరులోగానీ, సెప్టెంబర్ మొదటి వారంలోగానీ నీటి విడుదల ఉంటుందని అనుకుంటున్నాము. - సత్యశీలా రెడ్డి, ఈఈ, నిజాంసాగర్ ప్రాజెక్టు -
వానొచ్చె...మన్యం మురిసె
ముమ్మరంగా వ్యవసాయ పనులు మేలు చేసిన భారీ వర్షం పాడేరు: నిన్నటి వరకు ఎండలు మండిపోతూ పలు చోట్ల వరినారు మళ్లు వాడిపోతున్న సమయంలో బుధవారం అర్థరాత్రి మన్యంలో కురిసిన భారీ వర్షం ఖరీఫ్ వ్యవసాయానికి ఎంతో మేలు చేసింది. మన్యమంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములన్నీ తడిసి ముద్దయ్యాయి. పల్లపు భూముల్లోని నీటి నిల్వలు అధికమయ్యాయి. మెట్ట ప్రాంతాల భూములు కూడా దుక్కి పనులకు అనుకూలంగా మారాయి. మొదటి దఫా దుక్కులు చేపట్టి దమ్ము పనులకు సిద్ధమవుతున్న సమయంలో కురిసిన భారీ వర్షం గిరిజన రైతాంగాన్ని ఎంతో ఆనంద పరుస్తుంది. గురువారం ఉదయాన్నే వాన తెరిపినివ్వడంతో రైతులంతా వ్యవసాయ పనులకు పరుగులు తీశారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి దుక్కు పూర్తయిన చోట వరినాట్లకు ఈ భూములను సిద్ధం చేసి పనులను చేపట్టారు. వరి నారుకు కూడా వర్షాలు అనుకూలమయ్యాయి. దమ్ము పనులు పూర్తయిన చోట వరినాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట వ్యవసాయ పనులకు కూడా గిరిజనులు శ్రీకారం చుట్టారు. మన్యం చల్లబడింది... అర్థరాత్రి నుంచి విస్తారంగా మన్యం అంతటా భారీ వర్షం కురవడంతో ఏజెన్సీ తడిసి ముద్దయ్యింది. పాడేరు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోను ఉదయం 10 గంటల సమయంలో ఏకధాటిగా వర్షం కురిసింది. పాడేరు మండలంలో 45.4 మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో 17.6 మి.మీ, పెదబయలులో 16.2 మి.మీ, హుకుంపేటలో 4.2 మి.మీ, డుంబ్రిగుడలో 5 మి.మీ, అరకులోయ 10.2 మి.మీ, జి.మాడుగులలో 20.2 మి.మీ, చింతపల్లిలో 6.2 మి.మీ, జీకేవీధిలో 11.8 మి.మీ, కొయ్యూరులో 2.2 మి.మీల వర్షపాతం నమోదైంది. సాయంత్రం వరకు తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురుస్తునే ఉంది. -
దుర్భిక్షం
కనిపించని నైరుతి జాడ జలశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు మలెనాడులోనూ ఇదే పరిస్థితి ‘తుంగభద్ర’కు నీటి విడుదల బంద్ సాక్షి ప్రతినిధి/బెంగళూరు/ శివమొగ్గ : నైరుతి రుతు పవనాల జాడ లేకపోవడంతో రాష్ట్రంలో క్రమంగా కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు శర వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ నెల తొలి వారంలోనే రాష్ర్టంలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతు పవనాలు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయాయి. గత వుూడు వారాల్లో సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈసారి కూడా కరువు తప్పదేమోననే ఆందోళన నెలకొంటోంది. గత ఏడాది కరువు నెలకొన్నా తొలకరి వర్షాలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. కుంటలు, చెరువులకు పెద్దగా నీరు రానప్పటికీ, జలాశయాలు నిండాయి. ఎప్పుడూ మంచి వర్షాలు పడే మలెనాడులో కూడా ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో బలహీనంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువే. కొన్ని చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తక పోగా, మరి కొన్ని భూమిలో తగినంత తేమ శాతం లేకపోవ డంతో విత్తనాలే వేయలేదు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొంటున్నాయి. జులై తొలి వారంలో వర్షాలు పడే అవకాశాలున్నప్పటికీ, ఉత్తర కర్ణాటకలో వర్షాభావం నెలకొనవచ్చని వాతావ రణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద జులైలో కూడా సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈలోగా ఖరీఫ్ పంటలకు బాలారిష్టాలు తప్పవని, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గవ చ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా రైతులు జూన్‌లో భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటారు. జులైలో విత్తన కార్యక్రమం ఉంటుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 145 మి.మీ. సగటు వర్షపాతం కాగా కేవలం 109 మి.మీ. మాత్రమే నమోదైంది. తుంగభద్రకు నీటి నిలిపివేత మలెనాడులో మొన్నటి వరకు బాగా పడిన వర్షాలు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయాయి. వేసవిలో లాగా ఎండలు మండిపోతున్నాయి. దరిమిలా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శివమొగ్గ తాలూకాలోని తుంగా జలాశయం నుంచి హొస్పేటలోని తుంగభద్ర డ్యాంకు నీటి విడుదలను ఆపి వేశారు. జలాశయానికి ఉన్న అన్ని క్రస్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. కరువు ఛాయలు అలుముకుంటాయనే ఆందోళనతో జిల్లాలో వర్షాల కోసం రుద్రాభిషేకాలు, గణపతి హోమాలను నిర్వహిస్తున్నారు. -
పొదుపే గతి..!
- జూలై మొదటివారం నుంచి నగరంలో 10 శాతం నీటి కోత - రెండో వారం కూడా వరుణుడు కరుణించకుంటే 20 శాతానికి పెంపు సాక్షి, ముంబై: నగరవాసులు పొదుపు మంత్రం జపించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఇది పెరిగిన నిత్యావసరాల భారాన్ని తగ్గించుకునేందుకు మాత్రం కాదు. వరుణుడు కరుణించనందుకు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల కావస్తోంది. అయినా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. ఇక నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే చుక్క నీటిని కూడా వృథా చేయకుండా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే జూలై మొదటి వారం నుంచే నగరవాసులకు సరఫరా చేసే నీటిలో 10 శాతం కోత విధించాలని బీఎంసీ నిర్ణయిం చింది. రెండో వారం కూడా వర్షాలు పడకపోతే ఈ కోతను 20 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇలా కోతలు పెరిగితే ముంబైకర్లకు నీటిని పొదుపుగా వాడుకోవడం మినహాయించి మరో గత్యంతరం ఉండదు. నగరానికి నీటిని సరఫరా చేసేఏడు జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోయినందునే కోతలు విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారి చెప్పారు. ముఖ్యంగా మిడిల్, అప్పర్ వైతర్ణాలో నీటి నిల్వలు కనిష్టస్థాయికి చేరాయన్నారు. ఈ ఏడు జలాశయాలన్నింటిలో కలిపి మంగళవారంనాటికి 1.43 లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూన్ 24వ తేదీ వరకు ఈ జలాశయాల్లో మూడు లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలుండగా ప్రస్తుతం అందులో సగం కంటే తక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై మాసాంతం వరకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నగరానికి ఏడాది నీటి కోతలు విధించకుండా ఉండాలంటే 12 నుంచి 13 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. రోజుకు 4,200 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉన్నప్పటికీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 3,450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే ముఖం చాటేస్తే నీటి కోత మరింత పెంచాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్పొరేషన్ కూడా త్వరలో ‘సేవ్ వాటర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుందని చెప్పారు. ప్రతికా ప్రకటనలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసుల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించనున్నారు.