పొలాల్లో కందకాలతోనే సాగు నీటి భద్రత!
పొలంలో కురిసిన ప్రతి వాన చినుకుపైనా ఆ పొలం యజమానికి హక్కుంది. పొలంలో కురిసే ప్రతి చినుకునూ బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపంజేసుకుంటే రైతులకు నీటి కష్టాలే ఉండవని నిపుణులు చెబుతున్నారు. కుండపోతగా కురిసే వర్షాన్ని పొలాల్లోనే భూమిలోకి ఇంకింపజేసుకోవడమే సర్వోత్తమం. పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పుతో, ప్రతి 50 మీటర్లకు ఒకచోట, కందకాలు తవ్వుకుంటే కుండపోత వర్షం కురిసినా నీరు పొలం దాటి వెళ్లదు. వర్షాలు తక్కువైనా బావులు, బోర్లలో నీటి నిల్వలకు కొరతే ఉండదు. సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనంటున్నారు నిపుణులు.
ఎకరానికి రూ. 1,500 ఖర్చుతో రైతులే తమ పొలాలకు సాగు నీటి భద్రత సాధించుకోవచ్చు. సలహాలు, సూచనలకు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎస్. చంద్రమౌళి (98495 66009), ప్రధాన కార్యదర్శి ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి (99638 19074) లను సంప్రదించవచ్చు.