
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్‌లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment