
రామడుగు(చొప్పదండి): అమ్మాయిది శ్రీలంక.. అబ్బాయిది రామడుగు మండలంలోని పందికుంటపల్లి. దేశాలు వేరైనప్పటికీ ప్రేమ అనే బంధం ఇరువురినీ ఒక్కటి చేసింది. పందికుంటపలి్లకి చెందిన కట్కం సురేందర్ ఉద్యోగం చేయడానికి లండన్ వెళ్లాడు. తాను పని చేస్తున్న ఆఫీస్‌లో శ్రీలంక దేశానికి చెందిన జానుషికతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో తమ కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో ఏడడుగులు వేశారు. వివాహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment