Hail rain
-
పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తరో?
సాక్షి, సిద్దిపేట : అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే కొందరికి ఈ సాయం అందగా, మరికొందరు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 52,407 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు 1,146.11 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వారికి గత పదిరోజుల కిందట చెల్లించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు. ● మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 51,261.08 ఎకరాల్లో 55వేల మంది రైతులు నష్టపోయారు. అందులో వరి 44,601.12 ఎకరాలు, మొక్కజొన్న 475.04, ఉద్యానవన పంటలు 6,158, సన్ ఫ్లవర్ 25.27, నువ్వులు 1.05 ఎకరాలు ఉన్నాయి. ● అత్యధికంగా మద్దూరులో 8,993, చేర్యాలలో 7,630 ఎకరాలు, సిద్దిపేట అర్బన్ 5,674, రూరల్‌లో 5,681, దుబ్బాకలో 4,968 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. అత్యల్పంగా దౌల్తాబాద్‌లో 50.28 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. ● జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన, రెవెన్యూ శాఖలు మండల, జిల్లా స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ● ప్రభుత్వానికి మే రెండో వారంలో కలెక్టర్ ఆమోదంతో వ్యవసాయ శాఖ నుంచి నివేదికను పంపించారు. ఇప్పటి వరకు మొదటి విడత పంపించిన పంట నష్టపరిహారం మాత్రమే రైతులకు అందింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ● యాసంగిలో అకాల వర్షాలకు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికై న అధికారులు స్పందించి నష్టపరిహారం త్వరగా అందించాలని కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నోజు కనకాచారి, మద్దూరు మండలం లద్నూరు గ్రామం. ఇతనికున్న 8 ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాడు. మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. దీంతో రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వ్యవసాయ అధికారులు పంట నష్ట వివరాలను సేకరించారు. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. వానాకాలం పెట్టుబడికైనా అందుతుందని ఆశగా రైతు ఎదురు చూస్తున్నాడు. ఇది ఒక్క కనకాచారి ఎదుర్కొంటున్న సమస్య కాదు, జిల్లాలోని అనేక మంది రైతులది ఇదే పరిస్థితి. 12 ఎకరాల్లో నష్టం యాసంగిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశాను. పంట చేతికి వచ్చిన సమయంలో వడగళ్ల వాన పడి వడ్లు మొత్తం రాలిపోయాయి. ప్రభుత్వం చేస్తామన్న సాయం ఇప్పటివరకు అందలేదు. త్వరగా అందిస్తే వానాకాలం పెట్టుబడికి అయినా ఉపయోగపడుతుంది. –ఉల్లంపల్లి సాయిలు, అయినాపూర్ నష్టపరిహారం వెంటనే అందించాలి నాకున్న పొలంతో సహా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో వడగళ్ల వాన పడి పంట పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం త్వరగా అందించి ఆదుకోవాలి. –గిరక శ్రీనివాస్, తాడూరు -
ఉరిమేసి... కుమ్మేసి
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మంగళవారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ వాగుల్లా మారాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు బస్తీలు జలమయమయ్యాయి. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద కాలువల్లా మారిన రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 150 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. భీకర గాలులకు హుస్సేన్‌సాగర్‌లో భాగమతి బోటు అదుపు తప్పింది. రాత్రి 9 గంటల వరకు రాంచంద్రాపురంలో 7.9 సె.మీ., గచ్చిబౌలిలో 7.7 సె.మీ., గాజులరామారంలో 6 సె.మీ. వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. పంటలకు నష్టం వాటిల్లింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. కాగా బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉక్కపోత..కుండపోత మంగళవారం సాయంత్రం వరకు వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాతవారణంలో మార్పులతో కొంత ఉపశమనం పొందారు. వాతావరణం చల్లగా మారిన కొద్దిసేపటికే వర్షం మొదలై ఊపందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో వాతవారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ జీహెచ్ఎంసీ హెచ్చరించింది. కాగా రాంచంద్రాపురం, గచ్చిబౌలిలో భారీ వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, చార్మినార్, ఖైరతాబాద్, పటాన్చెరు, మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్మేట్, ముసాపేట, ఈసీఐఎల్, బాలనగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఉప్పల్ పరిధిలో, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో ఈదురుగాలులతో రహదారుల వెంట ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఎస్పీఆర్ హిల్స్‌లోని ఒక దేవాలయంలో గల మహావృక్షం నేలకూలడంతో చుట్టు పక్కల ఇళ్ల గోడలు కూలాయి. దీంతో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్‌పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట్‌లలో ప్రధాన రహదారులు వాగుల్ని తలపించాయి. అదుపు తప్పిన భాగమతి లుంబినీ పార్క్ నుంచి సందర్శకులను ఎక్కించుకుని హుస్సేన్‌సాగర్‌లో విహారానికి బయలుదేరిన భాగమతి బోటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. బోట్స్ క్లబ్ వైపునకు వెళ్లింది. బోటులోని సిబ్బంది సమాచారంతో స్పీడ్ బోట్లలో వచ్చిన ఇతర సిబ్బంది భాగమతి వద్దకు చేరుకుని తాళ్ల సాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భాగమతిలో ఒకేసారి 150 మంది వరకు ప్రయాణించవచ్చు. పలు జిల్లాల్లో వానలు..పంటలకు నష్టం మంగళవారం ఆదిలాబాద్, జనగామ, నల్లగొండ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాలలో 8 సె.మీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో 7 సెం.మీ, గంగాధరలో 5 సె.మీ, జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో 5 సె.మీ వర్షపాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలైన వడగళ్ల వాన సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా కురిసింది. పలు మండలాల్లో జొన్న, నువ్వులు, వేరుశనగ, కూరగాయల పంటలు నేలకొరిగాయి. నిర్మల్ జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. సారంగపూర్ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. భైంసాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. నిజామాబాద్ మార్కెట్లో విక్రయించడానికి రైతులు తీసుకొచ్చిన పసుపు రాశులు తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి బచ్చన్నపేట, జనగామ, నర్మెట, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండల పరిధిలోని 25 గ్రామాల్లో 3,757 మంది రైతులకు చెందిన వరి, మామిడి, కూరగాయల పంటలకు (10,169 ఎకరాల్లో) నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. నలుగురి మృతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం నలుగురు మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన నీల పద్మ (38) చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మంగళవారం రామాయంపేటలో పండ్లు అమ్ముకొని, మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈదురుగాలులు వీయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన అంద్యాల పద్మ (45)పై ఇంటి రేకులు పడడంతో అక్కడికక్కడే మరణించింది. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కనపర్తి విజయ్‌కుమార్ (38) పిడుగుపాటుకు గురై మరణించాడు. విజయ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో కూలీకి వెళ్లేవాడు. మంగళవారం సమీప బంధువు మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగివస్తుండగా వైరా నది సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూరా గ్రామానికి చెందిన పాతకుంట మోహన్ (21) కూడా మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. నేడు రేపూ వడగళ్ల వాన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. దక్షిణ /ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ వైపు దిగువస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40ని డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, కొన్నిచోట్ల 35ని డిగ్రీల కన్నా తక్కువగా కూడా నమోదు కావొచ్చునని తెలిపింది. -
HYD: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి ఇలా పలు ప్రాంతాల్లో.. భారీ వర్షం పడుతోంది. తెలంగాణ హైకోర్టు వడగండ్ల వాన కురుస్తోంది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. నగర శివారుతో పాటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. Massive hailstorm in Hyderabad #HyderabadRain #Hailstorm #Lakers pic.twitter.com/fuyS2z3VQ7 — محمد عبدالله (@abdullahqidvai) April 17, 2023 It was hot as hell since morning and now hail strom..#HyderabadRain #weather pic.twitter.com/d7xQaHFOpT — Q (@qutuba) April 17, 2023 #hyderabad #rainyday #hail #hailstorm #weather #awesome #beautiful #hyderabadrain 17th April 2023@HiHyderabad @balaji25_t @swachhhyd @Hyderabad_Bot pic.twitter.com/pEAuWWYadd — Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) April 17, 2023 -
హైదరాబాద్‌లో వడగళ్ల వాన
-
హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు వడగళ్లు, ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40 నుండి 50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఈటలకు బిగ్ షాక్! -
Unseasonal rains: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కారు మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది. ఇక విశాఖ వర్షం నేపథ్యంలో.. రేపటి(ఆదివారం) మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇదీ చదవండి: వివక్ష లేదు.. మంత్రి వేణు ప్రకటన -
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం..
-
నిజామాబాద్ జిల్లలో వడగండ్ల వాన పంట నష్టం
-
లీజుదారులకు నిష్‘ఫలమే’
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సీజన్లో పూత నుంచే సమస్యలు మొదలయ్యాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు, పూత సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, తేమ వాతావరణంతో వచ్చిన పూత నిలువలేదు. నిలిచిన పూతను సైతం తెగుళ్లు ఆశించి నష్టం చేశాయి. మామిడి చెట్లకు అక్కడక్కడ ఉన్న కాయలు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రాలిపోయాయి. ఈ క్రమంలో వడగండ్లు, ఈదురుగాలుల బాధ పడలేక గుత్తేదారులు కాయ సైజు పెరగకుండానే కోస్తున్నారు. మార్కేట్లో ఏదో ఒక రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. గుత్తెదారుల గుండెల్లో దడ మామిడి తోటలను జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు లీజుకు ఇస్తుంటారు. ఈసారి మామిడి తోటలపై వాతావరణ ప్రభావంతోపాటు వడగండ్ల ప్రభావంతో ఉండటంతో లీజుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తోట యాజమానులకు ముందే డబ్బులు చెల్లించడం, కాయలు పెద్దగా లేకపోవడం, ఉన్న కొద్దిపాటి కాయ రాలడం, మంచి కాయ రేటు సైతం రోజు రోజుకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు తెచ్చి మరీ తోటలు లీజుకు తీసుకున్న లీజుదారులు.. దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో లీజు డబ్బులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 వేలపైగా రైతులకు చెల్లించి తోటలు లీజుకుతీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మామిడికాయ లేకపోవడంతో ధర ఓ మోస్తారుగా టన్నుకు మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండటం లీజుదారులకు కొంత ఊరటనిస్తోంది. భారీగా పెట్టుబడి ఖర్చులు.. లీజుదారులు మామిడి తోటలను లీజుకు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ పనిని వారే చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూత రాలిపోవడం, కాయ సైజు పెరగడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులతోపాటు పోటాష్ వేశారు. కాయ సైజు పెరిగినప్పటికీ తోటలకు రక్షణగా ఓ కాపాలదారుడిని పెడుతుంటారు. తర్వాత, సైజుకు వచ్చిన కాయలను కూలీలతో కోయించడం, మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి లీజుదారులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు కనీసం రూ.10 వేలపైనే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి వచ్చేలా లేదు నేను ఐదు ఎకరాల తోట లీజుకు తీసుకున్నాను. పూత బాగానే వచ్చింది కాని ఆ మేరకు కాయ కనబడటం లేదు. కాయ చిన్నగా ఉన్నప్పటికీ రాళ్లవాన వస్తే ఇబ్బంది అని కొంతమేర తెంపి జగిత్యాల మార్కెట్లో అమ్మిన. ఈ సారీ మామిడి తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – గాదె శంకరయ్య, అనంతారం ఏం చేసుడో అర్థమైతలేదు ఈసారి ఐదారు తోటలు లీజుకు తీసుకున్న. పూత బాగా వచ్చిందని తోటలు పట్టిన. రెండుసార్లు మందులు కూడా కొట్టినా. అయినా ఊహించినంతగా కాయ రాలేదు. ఉన్న కాయ గాలులకు రాలిపోతున్నయ్. భయంతో ఇప్పటికే సగం కాయలు తెంపి అమ్మిన. మిగిలిన కాయలకు కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. – సత్తవ్వ, తిర్మలాపూర్ నిరుడు మంచిగ కాసినయ్ నేను ఈ ఏడాది 20 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్న. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులకు ముట్టజెప్పిన. అయితే నిరుడు మామిడి చెట్లు మంచిగ కాసిన. ఈసారి కూడా దిగుబడి బాగా వస్తదనుకున్నం. కానీ అనుకున్నంతగా చెట్లు కాయలేదు. ఇప్పటికే రెండుసార్లు కురిసిన రాళ్లవానకు ఉన్న కాయలు రాలినయ్. మళ్లీ గాలి దుమారం.. రాళ్ల వన పడుతదోనని భయమేస్తుంది. ఉన్న కాయను ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కాయ సైజు పెద్దగా ఉంటే బరువు వచ్చి లాభం ఉంటుంది. – పంబల్ల లక్ష్మి, తాటిపల్లి -
బాధిత రైతాంగాన్ని ఆదుకుంటాం
దిలావర్పూర్(నిర్మల్) : ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతినగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సోమవారం కురిసిన వడగళ్లవానతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. బాధిత రైతాంగానికి పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అధికారులు దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఏడీఏ కోటేశ్వరరావు, ఏవో స్రవంతి జరిగిన నష్టాన్ని మంత్రికి వివరించారు. అలాగే సముందర్‌పల్లి అనుంబంధ గ్రామమైన కాండ్లీలో జరిగిన ఓ పేద యువతి వివాహానికి మంత్రి హాజరయ్యారు. నూతన వధూవరులు ఈశ్వరి–రాందాస్‌లను ఆశీర్వదించారు. పేదింటి యువతులకు కల్యాణలక్ష్మి ఓ వరమన్నారు. నిర్మల్ ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబా, తహసీల్దార్ నర్సయ్య, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కోడె రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ ధనె నర్సయ్య, అడెల్లి దేవస్థాన కమిటీ డైరెక్టర్ ధనె రవి తదితరులున్నారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కలెక్టర్ భైంసా(ముథోల్) : మండలంలోని హజ్గుల్, దేగాం, ఇలేగాం గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, శనగ తదితర పంటలను ఆదివారం కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో నివేదిక పంపి పరిహారం అందేలా చూస్తామన్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలన్నారు. వడగళ్లతో భైంసా డివిజన్లో ఇళ్లు కూలిపోయాయని, విద్యుత్ స్తంభాలు విరిగి ప్రమాదాలు జరిగాయన్నారు. బాధితులను ఆదుకోవాలన్నారు. బాసర మండలం బిద్రెల్లిలో గొర్రెల కాపరి ఈరన్న మృతి చెందాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వడగళ్ల వర్షంతో కలిగిన నష్టాన్ని ఇదివరకే సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వివరించానని ఎమ్మెల్యే తెలిపారు. -
గాలివాన బీభత్సం
జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు కడగండ్లు తెచ్చాయి. బడుగులపై పిడుగులు కురిసాయి. పంటలు దెబ్బతిన్నాయి. డక్కిలి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మర్రిపాడు మండలంలోని పెద్దమాచనూరులో పిడుగుపడటంతో కావులూరి శ్రీనివాసులు పొలంలో చెరుకు పైరు దగ్ధమైంది. డీసీపల్లిలో వడగళ్ల వాన కురిసింది. కలువాయి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాపూరు, చేజర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డక్కిలి(వెంకటరిగి): డక్కిలి మండలంలో మంగళవారం ఉరుములుతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కమ్మపల్లి సమీపంలోని నిమ్మతోటలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సంక్రాంతి నిర్మలమ్మ(38), పోకూరు వెంకటేశ్వర్లు పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గ్రామస్తులు హూటాహుటిన వెంకటగిరిలోనే ఓ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా నిర్మలమ్మ మార్గమధ్యంలో మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే సైదాపురం మండలం లింగనపాళెం ఎస్టీ కాలనీకి చెందిన వేటగిరి రమణయ్య(45) సంగనపల్లి చెరువులో గొర్రెలు కాస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఆయన కొన్ని రోజుల నుంచి మార్లగుంటలోని బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అలాగే దగ్గవోలు గ్రామానికి చెందిన తోట కోటేశ్వరరెడ్డికి చెందిన రెండు ఎడ్లు పిడుగుపాటుకు గురై అక్కడక్కడే మృతిచెందాయి. అలాగే కమ్మపల్లిలో ఓ లేగ దూడ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. లింగసముద్రం గ్రామానికి పునుగోటి నాగరాజుకి చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. మోపూరురోడ్డు సెంటర్‌కు చెందిన పలువురి పంటపొలాల్లో పిడుగుపడి కంచెలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కమ్మపల్లిలో ఓ వృద్ధుడు, బాలుడు కూడా ఉరుములు మెరుపులకు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. వరి పంటకు అపార నష్టం డక్కిలి మండలంలో కురిసిన వడగళ్ల వాన, గాలులకు పలు చోట్ల వరిపంట తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా లింగసముద్రం, సంగనపల్లి తదితర చోట్ల వరిపంట గాలులకు నేలవాలింది. దీంతో రైతులకు అపారనష్టం సంభవించింది. చేతికొచ్చే పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆత్మకూరు మండలంలో. ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మండలం, పట్టణంలో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కలువాయి, రాపూరు మండలాల్లో.. కలువాయి/రాపూరు : కలువాయి మండలంలో ఈదురుగాలుల దాటికి మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని చెట్లు నేలకూలాయి. అలాగే రాపూరులో ఉరుములు, మెరుపులతో కూడి ఓ మోస్తారు వర్షం కురిసింది. గ్రామాల్లో వడగళ్ల వాన దుత్తలూరు : మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వడగళ్లతో కూడిన గాలివాన కురిసింది. లక్ష్మీపురం, కమ్మవారిపాళెం, ఏరుకొల్లు తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. కమ్మవారిపాళెం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పూరిపాక చెల్లాచెదురైంది. లక్ష్మీపురంలో చెట్లు విరిగిపడ్డాయి. పైకప్పు రేకులు విరిగి పడ్డాయి. పండ్ల తోటల రైతులకు నష్టం బాలాయపల్లి : ప్రకృతి పండ్ల తోట రైతులపై కన్నెర్ర చేసింది. మంగళవారం సాయంత్రం వీచిన పెనుగాలులకు మల్లిమాల, నిండలి గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. వెంగమాంబపురం గ్రామంలో పెనుగాలులకు ఓ ఇంటి రేకులు లేచి పగిలిపోయాయి. పిడుగుపడి చెరుకుతోట దగ్ధం మర్రిపాడు(ఆత్మకూరు): మర్రిపాడు మండలంలోని పెద్దమాచనూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడడంతో గ్రామానికి చెందిన కావులూరి శ్రీనివాసులు పొలంలోని చెరుకు పంట దగ్ధమైంది. ఏడు ఎకరాల్లో చెరుకు పంట, డ్రిప్ సామగ్రి దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. అలాగే డీసీపల్లి, మర్రిపాడు గ్రామాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. విద్యుత్ తీగలు ఎక్కడిక్కడ తెగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతోపాటు వడగళ్లు కూడా పడ్డాయి. గాలుల దాటికి బ్యారెన్ల పైకప్పులు లేచిపోవడంతో బ్యారెన్లలో ఉన్న పొగాకు తడిచిపోయింది. చేజర్లలో భారీ వర్షం చేజర్ల : మండలంలోని చేజర్ల, మడపల్లి, బోడిపాడు తిమ్మాయపాళెం, ఉలవపల్లి, చిత్తలూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోడిపాడు, మడపల్లి ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. -
గ్రేటర్లో గాలివాన బీభత్సం
పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి వాహనాలు ధ్వంసం సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి ఉధృతంగా వీస్తున్న తేమ గాలులు, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ సహా పలు శివారు ప్రాంతాల్లో భారీగా గాలి దుమారం చెలరేగడంతో కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి వాటి కింద పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపడటంతో రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని 15 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గురువారం గరిష్టంగా 39.8 డిగ్రీలు, కనిష్టంగా 24.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయంది. కాగా, ఈదురు గాలులు.. భారీ వర్షంతో హిమాయత్‌సాగర్ గ్రామ ప్రజలు గురువారం మధ్యాహ్నం భయాందోళనకు గురయ్యారు. ఒక పోలీసు వాహనంతో పాటు 3 ద్విచక్ర వాహనాలు, 20 షాపులు, విద్యుత్ వైర్లు ధ్వంసం కాగా వందకు పైగా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లపై నాలుగు ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగి పడటంతో వైర్లు తెగి అంధకారం నెలకొంది. హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి, గెస్ట్‌హౌస్, జలమండలి కార్యాలయం ఆవరణలో ఉన్న భారీ చెట్లు వేర్లతో సహా విరిగిపడ్డాయి. ఆస్తినష్టం అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. వడగండ్ల వాన బీభత్సం సాక్షి, నల్లగొండ/రంగారెడ్డి జిల్లా: వడగండ్ల వాన రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో బీభత్సం సృష్టించిం ది. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి, కనుముకుల, జిబ్లక్‌పల్లి, దంతూర్, మర్రిగూడ, రాజాపేటల్లో వరి, బత్తాయి, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. అలాగే, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో 4 గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. పూడూరు మండలం కడ్మూరులో పిడుగుపాటుకు రెండు ఎడ్లు, రెండు లేగదూడలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్‌లో ఓ చెట్టుపై పిడుగుపడింది. పిడుగుపాటుకు మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
పాతాళపుటంచుకు చేరిన ‘గంగ’
- పలు నగరాల్లో నీటి కటకట - బీడ్ జిల్లాలో 10 రోజులుగా జరగని నీటి సరఫరా పింప్రి: రాష్ట్రంలో ఇటీవల వడగండ్ల వానలు కురిసినప్పటికీ నీటి సమస్య మాత్రం తీరలేదు. గ్రామాల్లో నీటి నిల్వలు అంతకంతకు తగ్గుతూనే ఉన్నాయి. మరఠ్వాడాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాబోయే రెండు నెలలకు నీటి నిల్వలను వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల్ కు సూచించింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రం కరవు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీంతో ఏటా నీటి సమస్య వెక్కిరిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో మరఠ్వాడాలోని పలు రిజర్వాయర్లలో 2,184 మిలియన్ ఘన మీటర్ల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం 826 మిలియన్ ఘన మీటర్లు మాత్రమే ఉంది. బీడ్ జిల్లాలో తాగు నీటి సమస్య తాండవిస్తోంది. గత 10 రోజులుగా నీటి సరఫరా జరగలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇక్కడ 300 మిలియన్ ఘన మీటర్ల నీటి సరఫరా జరుగుతోంది. పుణే, నాసిక్ విభాగంలోనూ ఇదే పరిస్థితి.