సాక్షి, విజయవాడ: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కారు మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి.
ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది. ఇక విశాఖ వర్షం నేపథ్యంలో.. రేపటి(ఆదివారం) మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఇదీ చదవండి: వివక్ష లేదు.. మంత్రి వేణు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment