అలాస్కా: చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు.
చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్‌సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపైనుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని, ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment