నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోనున్న హుడా
గుర్గావ్: శుద్ధీకరించిన నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు హర్యానా పట్టణాభివృద్ధి సంస్థ(హుడా) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బసా యి నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మరింత విస్తరించేందుకు 75ల భూమిని సేకరించింది. చంధూ బుధేరా జలశుద్ధీకరణ కేంద్రం పరిసరాల్లో కూడా 240 ఎకరాలను సేకరించింది. ‘నీటి శుద్ధీకరణ కేంద్రాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే యోచనలో ఉన్నాం. ఇప్పటికే రెండు కేంద్రాల వద్ద అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గుర్గావ్-మనేసర్ మాస్ట ర్ ప్లాన్-2031 నాటికి సరిపోయేలా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించామ’ని హుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.కె. శేవ్‌కండ్ తెలి పారు.
గుర్గావ్ నగరంలో ముడింట రెండొం తుల జనాభాకు బసాయి ప్లాంటు నుంచే నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం బసాయి నీటి నిల్వ సామర్థ్యం 60 ఎంజీడీలుగా ఉంది. ప్రస్తుతం హుడా చేస్తు న్న ప్రయత్నాలు ఫలించి, సేకరించిన భూమి అం దుబాటులోకి వస్తే మరో 20 ఎంజీడీల నీటిని నిల్వ చేయడానికి వీలుంటుంది. దీంతో బసాయి నీటి నిల్వ సామర్థ్యం 80 ఎంజీడీలకు పెరుగుతుంది. సేకరిస్తున్న భూమి పూర్తిగా వినియోగంలోకి వస్తే బసాయి నీటి నిల్వ సామర్థ్యం 224 ఎంజీడీల నుంచి 560 ఎంజీడీల వరకు పెరుగుతుంది.
అప్పు డు మరమ్మతుల సమయంలో కూడా నిరంతరాయంగా నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇక చంధూ బుధేరా ప్లాంట్ సామార్థ్యాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి పెంచేలా రెండు కొత్త ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం బసాయి ప్లాంటు నుంచి మాత్ర మే నగరానికి ఎక్కువగా నీరు సరఫరా అవుతోంది. దీంతో ముందుగా దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే హుడా ప్రాధాన్యతనిస్తోంది.