- సాగు అంచనా 6.58 లక్షల హెక్టార్లు
- విత్తనాలు, ఎరువులకు సన్నాహకం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖ
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు. రుతుపవనాలు ఖరీఫ్ ఆరంభానికి ముందే జిల్లాకు తాకనున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుండడంతో సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది 5.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. ఖరీఫ్ లక్ష్యం 6.58 లక్షల హెక్టార్లుగా ఉంటుందని ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో అత్యధికంగా పత్తి, సోయాబీన్ పంటలు సాగవుతాయని వారి అంచనా. పత్తి 3,50,500 హెక్టార్లలో, సోయాబీన్ లక్షా 35 వేల హెక్టార్లు, వరి 60 వేల హెక్టార్లు, కందులు 50 వేల హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లు, జొన్న 25 వేల హెక్టార్లు, పెసళ్లు 11 వేల హెక్టార్లు, మినుములు 10 వేల హెక్టార్లు, నువ్వులు 1500 హెక్టార్లు, ఇతర ధాన్యాలు 5 వేల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ కమిషనరేట్‌కు వారం రో జుల క్రితం ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు.
సబ్సిడీపై విత్తనాలు..
ప్రభుత్వం రైతులకు రాయితీపై వివిధ రకాల విత్తనాలు అందించనుంది. ఇందులో పత్తి విత్తనాలు 21 లక్షల ప్యాకెట్లు, సోయాబీన్ 85 వేల క్వింటాళ్లు, వరి 31,500 క్వింటాళ్లు, కందులు 2 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 1,500 క్వింటాళ్లు, పెసళ్లు 300 క్వింటాళ్లు, జొన్న 150 క్వింటాళు,్ల బజరా 150 క్వింటాళ్లు, మినుములు 100 క్వింటాళ్లు, నువ్వులు 10 క్వింటాళ్లు, ధైంచా 3 వేల క్వింటాళ్లు తదితర విత్తనాలు 3,700 క్వింటాళ్ల వరకు అవసరమవుతాయని ప్రతిపాదనలు ఇచ్చారు.
పత్తి విత్తనాలు మినహా మిగతావన్నీ 33 శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. కాగా.. సోయా విత్తనాల ధర గతేడాది క్వింటాల్‌కు రూ.7,800 ఉండగా, రాయితీ 33 శాతంతో రూ.5,226 చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది రూ.6,700లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 33 శాతం రూ.2,230 సబ్సిడీ పోను రూ.4,470 రైతులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు 2 వేల సోయాబీన్ విత్తనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ఎరువులు..
పంట సాగు అవసరాల మేరకు ఖరీఫ్‌లో మూడు లక్షల టన్నుల వరకు ఎరవులు అవసరమని గుర్తించారు. ఇం దుకోసం 1,26,435 మెట్రిక్ టన్నుల యూరియా, 35,800 మెట్రిక్ టన్నుల డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు 38 వేల టన్నులు, పొటాష్ 30 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.