Subsidized seeds
-
నాన్ సబ్సిడీ సీడ్ పంపిణీ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: నాన్ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్‌్సలో సర్టిఫై చేసిన సీడ్‌ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీఖరీఫ్ సీజన్ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనంసీజన్లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ సీడ్‌నే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు నాన్ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్‌కు ముందే ఒప్పందాలు చేసుకునేది.ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేసింది.నకిలీల బారిన పడకుండా చర్యలుఈసారి కూడా ఖరీఫ్ సీజన్‌కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్‌కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రైతన్నకు ‘విత్తన’ దన్ను
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు.. కొప్పూరి జనార్దనరెడ్డి. ఊరు.. వైఎస్సార్ జిల్లా విభరాపురం. ఈయన రబీలో 25 ఎకరాలు శనగ వేశారు. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. రూ.2.50 లక్షల పెట్టుబడి నష్టపోయారు. దీంతో మళ్లీ విత్తనం వేయకూడదనుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచి 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. దీంతో క్వింటాల్ విత్తనం రూ.1,380లకే వచ్చింది. 80 శాతం సబ్సిడీపై విత్తనం ఇచ్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని జనార్దనరెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది వచ్చి భరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. .... ఇలా వర్షాలు, వరదలతో నాటిన విత్తనం కొట్టుకుపోయి.. ఎదిగొస్తున్న పంట మునిగిపోయి కుదేలైన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తోంది. రైతులు అడిగిందే తడవుగా ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనాన్ని సాగు విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా 5 బస్తాల వరకు అందిస్తోంది. ఇటీవల అకాల వర్షాలు, వరదలతో పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అధికారులు విత్తనాన్ని పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఆర్ఎన్ఆర్– 15048, ఎన్‌ఎల్‌ఆర్–33892 రకాలకు సంబంధించి 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతోపాటు జేజీ–11, కేఏకే–2 రకాలకు చెందిన 2 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ ఆర్బీకేల ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే నెల్లూరుతో సహా వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో శనగ విత్తనాన్ని ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా 1,01,110 క్వింటాళ్ల శనగ, 10,048 క్వింటాళ్ల వరి విత్తనాల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ఇప్పటివరకు 68,810 క్వింటాళ్ల శనగ విత్తనం కోసం 75,738 మంది, 10,800 క్వింటాళ్ల వరి విత్తనం కోసం 3,500 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 72 వేల మంది రైతులకు 44 వేల క్వింటాళ్ల శనగ, 3 వేల మంది రైతులకు 9,100 క్వింటాళ్ల వరి విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేశారు. – సాక్షి, అమరావతి ప్రభుత్వం ఊరటనిచ్చింది.. రూ.20 వేల పెట్టుబడితో 20 ఎకరాల్లో జీలకర్ర సన్నాలు నారు వేశా. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరా చేయడం ఊరటనిచ్చింది. బస్తా రూ.198 చొప్పున 15 బస్తాల విత్తనం తీసుకున్నా. రెండ్రోజుల్లో మళ్లీ నారు పోస్తా. – పామల విశ్వనాథ్, చిట్టమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విత్తనాలు సిద్ధం వరదలు, వర్షాలతో దెబ్బతిన్న ప్రతి రైతుకు అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై వరి, శనగ విత్తనాలను సరఫరా చేస్తున్నాం. 2.20 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంగా ఉంచాం. 1.11 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ప్రతి ఒక్కరికీ కావాల్సినంత విత్తనాన్ని సరఫరా చేస్తాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
ఆరుతడికి సబ్సిడీ..
రైతులకు అందుబాటులో విత్తనాలు ఖరీఫ్‌లో నష్టపోయిన అన్నదాతలకు అవకాశం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నిరుపయోగంగా మారిన వ్యవసాయ యంత్ర పరికరాల స్టాల్స్ గుంటూరు : ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఖరీఫ్‌లో పంటలు సాగుచేయ లేని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సోమవారం ఉదయం తాడికొండ మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం(లాంఫాం)లో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవడానికి విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. కేంద్ర మంత్రి చేతులమీదుగా శంకుస్థాపన .. తొలుత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైనవారందరికీ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ బుద్ధ ప్రతిమలను అందచేయగా, కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, వెంకయ్యనాయుడులను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, తదితరులు పాల్గొన్నారు. అధికార దుర్వినియోగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజలను తరలించేందుకు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్‌లను వినియోగించారు. దీనికి సంబంధించి మండల వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో ఒక్కో అధికారి తన సొంత డబ్బు రూ.10 వేల వరకు ఖర్చు చేసి ప్రజల తరలింపును చేపట్టారు. అయితే ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో నామమాత్రంగానే ప్రజలు హాజరయ్యారు. రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమా న్యాలపై ఒత్తిడి తెచ్చి దాదాపు 500 బస్‌లను తరలింపు కార్యక్రమానికి కేటాయించారు. తాడికొండ, గుంటూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు ఉదయం 7 గంటలకే బస్‌లను పంపించారు. అయితే వర్షం పడుతుండడంతో బస్సుల్లో పది మందికి మించి రాలేదు. నిరుపయోగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ కార్యక్రమంలో భాగంగానే వ్యవసాయ పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రాంగణంలో 18 ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన వ్యవసాయ పరికరాలను ఆ స్టాల్స్‌లో ఉంచారు. అయితే సభా కార్యక్రమం అనంతరం వీటివైపు రాకుండా మంత్రులంతా వెళ్లిపోవడంతో, వీటి ఏర్పాటుకు చేసిన ఖర్చు నిరుప యోగం అయింది. పంట పొలాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో వర్షం కారణంగా బురదగా మారి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బాపట్ల , రాజమండ్రి వ్యవసాయ కళాశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. -
ఖరీఫ్‌కు రెడీ
- సాగు అంచనా 6.58 లక్షల హెక్టార్లు - విత్తనాలు, ఎరువులకు సన్నాహకం - ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు. రుతుపవనాలు ఖరీఫ్ ఆరంభానికి ముందే జిల్లాకు తాకనున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుండడంతో సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది 5.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. ఖరీఫ్ లక్ష్యం 6.58 లక్షల హెక్టార్లుగా ఉంటుందని ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో అత్యధికంగా పత్తి, సోయాబీన్ పంటలు సాగవుతాయని వారి అంచనా. పత్తి 3,50,500 హెక్టార్లలో, సోయాబీన్ లక్షా 35 వేల హెక్టార్లు, వరి 60 వేల హెక్టార్లు, కందులు 50 వేల హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లు, జొన్న 25 వేల హెక్టార్లు, పెసళ్లు 11 వేల హెక్టార్లు, మినుములు 10 వేల హెక్టార్లు, నువ్వులు 1500 హెక్టార్లు, ఇతర ధాన్యాలు 5 వేల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ కమిషనరేట్‌కు వారం రో జుల క్రితం ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు. సబ్సిడీపై విత్తనాలు.. ప్రభుత్వం రైతులకు రాయితీపై వివిధ రకాల విత్తనాలు అందించనుంది. ఇందులో పత్తి విత్తనాలు 21 లక్షల ప్యాకెట్లు, సోయాబీన్ 85 వేల క్వింటాళ్లు, వరి 31,500 క్వింటాళ్లు, కందులు 2 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 1,500 క్వింటాళ్లు, పెసళ్లు 300 క్వింటాళ్లు, జొన్న 150 క్వింటాళు,్ల బజరా 150 క్వింటాళ్లు, మినుములు 100 క్వింటాళ్లు, నువ్వులు 10 క్వింటాళ్లు, ధైంచా 3 వేల క్వింటాళ్లు తదితర విత్తనాలు 3,700 క్వింటాళ్ల వరకు అవసరమవుతాయని ప్రతిపాదనలు ఇచ్చారు. పత్తి విత్తనాలు మినహా మిగతావన్నీ 33 శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. కాగా.. సోయా విత్తనాల ధర గతేడాది క్వింటాల్‌కు రూ.7,800 ఉండగా, రాయితీ 33 శాతంతో రూ.5,226 చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది రూ.6,700లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 33 శాతం రూ.2,230 సబ్సిడీ పోను రూ.4,470 రైతులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు 2 వేల సోయాబీన్ విత్తనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎరువులు.. పంట సాగు అవసరాల మేరకు ఖరీఫ్‌లో మూడు లక్షల టన్నుల వరకు ఎరవులు అవసరమని గుర్తించారు. ఇం దుకోసం 1,26,435 మెట్రిక్ టన్నుల యూరియా, 35,800 మెట్రిక్ టన్నుల డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు 38 వేల టన్నులు, పొటాష్ 30 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. -
వేరుశెనగ రైతుకు సర్కారు శఠగోపం
- 40 శాతం మందికే సబ్సిడీ విత్తనాలు - మిగిలిన రైతులకు ప్రయివేటు విత్తనాలే దిక్కు - 60 శాతం మందిపై కోట్లలో భారం - 16.8 కోట్ల సబ్సిడీ కోల్పోతున్న రైతులు - జిల్లాలో 1.36 లక్షల హెక్టార్లలో పంట సాగు సాక్షి, చిత్తూరు: రైతులకు అండగా ఉండేది మా ప్రభుత్వమేనంటూ పదేపదే గొప్పలుపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన కుదరడంలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జిల్లాలో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను 40 శాతం మంది రైతులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ ఉత్తర్వులు జారీచేసింది. మిగిలిన 60 శాతం మంది రైతులు విత్తనాలను ప్రైవేటు మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కొనుక్కోవలసిందే. దీంతో అన్నదాతలపై కోట్లాది రూపాయల భారం పడనుంది. జిల్లాలో ఖరీఫ్‌లో 1.36 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంట సాగుచేస్తారు. గతంతో పోలిస్తే వర్షభావంతో ఏడాదికేడాది సాగువిస్తీర్ణం తగ్గుతోంది. సకాలంలో వర్షం కురిస్తే జూన్ నెలలో వేరుశెనగ సాగవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోమారు వర్షం కురిస్తే వేరుశెనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ వేరుశెనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో 40 శాతం మందికి మాత్రమే సబ్సిడీ విత్తనాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు 83 వేల క్వింటాళ్ల విత్తన కాయలను వ్యవసాయశాఖ కేటాయించింది. వీటిని ఆయిల్‌ఫెడ్ ద్వారా 25వేలు, ఆఖా ద్వారా 24వేలు, ఏపీసీడ్స్ ద్వారా 34వేల క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. మే 15 నుంచి జూన్ మొదటి వారంలోపు విత్తన కాయలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కన 52 వేల హెక్టర్లకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు అందనున్నాయి. మిగిలిన 84 వేల హెక్టార్ల సాగుకు ప్రైవేటు మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి విత్తనాలను కొనాల్సిందే. ఇది రైతులకు భారం కానుంది. ప్రస్తుతం ప్రభుత్వం కిలో *64.75 చొప్పున 30కిలోల బస్తా వేరుశెనగ కాయలను *1942కు కొనుగోలు చేస్తుంది. కిలోకు *21.37(33 శాతం) సబ్సిడీ ప్రకారం *641పోను బస్తా కాయలను *1301కు విక్రయిస్తోంది. ప్రైవేటు వ్యాపారులు 40కిలోల బస్తా విత్తనకాయలను * 2400 నుంచి 2500 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 30కిలోల బస్తా విత్తనకాయల ధర *1800 అవుతుంది. ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడంతో బస్తా కాయలపై రైతులు *501లు నష్టపోతున్నారు. హెక్టారుకు నాలుగు బస్తాల కాయలకు *2 వేలు నష్టపోవాల్సి వస్తోంది. మొత్తంగా జిల్లాలోని 84 వేల హెక్టార్ల పరిధిలో రైతులపై * 16.8 కోట్ల భారం పడుతోంది. ఇప్పటికే వేరుశెనగ రైతులు వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయా రు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల సందర్భంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని పదేపదే ప్రకటించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. సబ్సిడీ విత్తనాలైనా అందిస్తారనుకుంటే ప్రభుత్వం ఎగనామం పెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
రబీ సాగు అంచనా 1,86,025
వరంగల్ : రబీ సీజన్ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా... రైతులు 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ సీజన్‌కు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువుల అవసరాన్ని ప్రణాళికలో పొందుపరిచారు. ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఖరీఫ్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు ఆలస్యమైంది. ఈ పంటలు చేతికొచ్చే సరికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ... రబీలోనైనా కాలం కలిసివస్తుందేమోనని ఆశతో రైతులు ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సాగు చేయని రైతులు రబీ సాగుకు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు సానుకూలంగా కురవనందున వరి సాగు బాగా తగ్గింది. ఈ రబీలోనైనా వరి సాగు చేపట్టాలని మధ్య తరహా నీటి ప్రాజెక్ట్‌ల పరిధిలోని ఆయకట్టు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని పాకాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి నీరు చేరింది. ఈ కారణంగా రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఇక జిల్లాలో పూర్తిగా వర్షాధార వ్యవసాయమే అయినందున కాలం కలిసొస్తేనే రబీలో మెట్ట పంటల సాగు పెరిగే అవకాశం ఉంది. 49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరం జిల్లాలో రబీ సాగుకు 49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వేరుశనగ విత్తనాలు 26 వేల క్వింటాళ్లు, శనగలు 2,100 క్వింటాళ్లు, పెసర్లు 2,600 క్వింటాళ్లు, మినుములు 2,000 క్వింటాళ్లు, జొన్నలు 1,000 క్వింటాళ్లు, మొక్కజొన్నలు 10,000 క్వింటాళ్లు, 100 క్వింటాళ్ల చొప్పున పొద్దు తిరుగుడు, నువ్వులు, బొబ్బెర్లు, ఉలువలు 300 క్వింటాళ్లు, వరి విత్తనాలు 5 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. రబీలో కిలో మొక్కజొన్న విత్తనాలకు రూ.25, వరికి రూ. 50, ఉలువలకు రూ.32, మిగతా అన్ని రకాల విత్తనాలకు 33 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గత ఏడాది విత్తనాలపై సబ్సిడీ 50 శాతం ఉండగా... ఈ ఏడాది 33 శాతానికి తగ్గించారు. ఎరువుల ప్రణాళిక రబీ సీజన్లో 1,30,322 టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. యూరియా 67,396 టన్నులు, డీఏపీ 20,219 టన్నులు, కాంప్లెక్సు 26,959 టన్నులు, ఏంఓపీ 10,783 టన్నులు , ఎస్ఎస్పీ 4,964 టన్నులు అవసరమని అంచనా వేశారు. -
సాగుకు సర్కారీ సాయం
వ్యవసాయ శాఖ పథకాలు 1. మాగాణి భూములకు పచ్చి రొట్ట పైర్ల విత్తనాలు, అంతర పంటల విత్తనాలు 50శాతం సబ్సిడీపై సరఫరా. 2. విత్తన గ్రాస పథకం కింద రైతులు వారికి కావాల్సిన విత్తనం వారే తయారు చేసుకునేందుకు ఫౌండేషన్ విత్తనాల సరఫరా. 3. భూసార వారోత్సవాల నిర్వహణ- మట్టి నమూనాల విశ్లేషణ ఆధారంగా ఎరువుల వాడకానికి ప్రోత్సాహం. 4. మండలానికి పది చొప్పున ముఖ్యమైన పంటల్లో ఆధునిక పద్ధతుల సమగ్ర ప్రదర్శనకు పదెకరాల ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ. 5. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ప్రచారానికి వరి, పత్తి, వేరుశనగ, కంది పంటల్లో క్షేత్ర పాఠశాల నిర్వహణ. 6. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు సరఫరా. 7. పురుగు మందులు కల్తీల నిరోధానికి శాంపుల్స్ రహస్య కోటింగ్ పద్ధతిన కొనసాగింపు. 8. జీవ నియంత్రణ విధానాల ప్రచారానికి తక్కువ ధరకు ట్రైకోడెర్మా విరిడి, ఎన్పీవీ ద్రావణం, ట్రైకోగ్రామా కార్డుల సరఫరా. 9. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, రైతు గ్రూపులు తదితర కార్యక్రమాల నిర్వహణ. ఉద్యానవన శాఖ పథకాలు 1. ఆయిల్ ఫామ్ తోటల అభివృద్ధి. 2. అధిక దిగుబడి నిచ్చే కూరగాయ, ఉల్లి విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా. 3. మేలు రకం పండ్ల మొక్కలు, టిష్యూ కల్చర్ మొక్కలను రాయితీపై అందజేత. 4. ఉద్యాన పంటల ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెంపునకు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు సరఫరా. 5. సమగ్ర పండ్ల అభివృద్ధి పథకం, కూరగాయల అభివృద్ధి పథకం, సమగ్ర సుగంధ ద్రవ్యాల అభివృద్ధి పథకం. 6. పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక పథకాల అమలు. 7. ఆకులలో పోషకాలను విశ్లేషణ చేసే లేబొరేటరీ ద్వారా ఆకులను విశ్లేషించే సమగ్ర పోషక యాజమాన్యం అమలు. 8. రైతు బజార్ల రైతులకు విత్తనాల సబ్సిడీ, సాంకేతిక సలహాలు అందజేయడం. 9. రైతు శిక్షణా కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటు, రైతు విజ్ఞాన యాత్రల ద్వారా అవగాహన పెంపొందించడం. 10. మామిడి, ద్రాక్ష, గులాబీ, పుట్టగొడుగుల ఎగుమతి ప్రోత్సాహానికి చర్యలు. -
నిధుల కొరత.. సబ్సిడీకి కోత
చేవెళ్ల: జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. అరకొర నిధులను విడుదల చేస్తూ కూరగాయల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యాన పంటల సాగుకు జిల్లాలోని భూములు అనువైనవని పేర్కొంటున్న సర్కారు.. కూరగాయల సబ్సిడీ విత్తనాలకు నిధులు విదల్చడంలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సబ్సిడీ కూరగాయల విత్తనాలకు తక్కువ నిధులు కేటాయించింది. దీంతో దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేస్తున్నామంటూ ఉద్యాన శాఖ కార్యాలయం ఎదుట అధికారులు నోటీసు పెట్టారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇవ్వడానికి గురువారం ఎగబడ్డారు. గత ఏడాది రూ.30 లక్షలు.. ఈసారి రూ.10 లక్షలే చేవెళ్ల డివిజన్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను పండిస్తారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ఖరీఫ్, రబీలో సీజన్లలో కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ఉద్యానశాఖ సబ్‌డివిజన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో కూరగాయ విత్తనాల సబ్సిడీకి ప్రభుత్వం 2014-15 ఖరీఫ్ సీజన్‌కు రూ.10 లక్షలు కేటాయించింది. ఉద్యాన శాఖ అధికారులు రైతుల నుంచి 50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇంకా దరఖాస్తులను ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సబ్సిడీ కూరగాయల విత్తనాల సరఫరాకు కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, మరో 5 లక్షల రూపాయల విలువచేసే విత్తనాలకు అధికంగా దరఖాస్తులు అందాయంటూ శుక్రవారం నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద నోటీసు అంటించారు. దరఖాస్తు చేయడానికి గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీ సంఖ్యలో వచ్చారు. కూరగాయ రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా అందుకు అవసరమైన నిధులను కేటాయించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.30 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మాత్రం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు. -
ఆ ‘విత్తనం’ లేదు.. ఇది తీస్కో!
చేవెళ్ల రూరల్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న విత్తనాలు పొందడంలో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోరిన విత్తనం లేదంటున్న అధికారులు.. ఏదో ఓ కంపెనీ విత్తనాలు అంటగట్టేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు వాటినే తీసుకెళ్తున్నారు. చేవెళ్ల మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు కూరగాయలు పండిస్తారు. విత్తనాల కోసం ఆయా గ్రామాల నుంచి గురువారం చేవెళ్లలోని ఉద్యానశాఖ కార్యాలయానికి రైతులు తరలివచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో అధికారులు కోరుకున్న విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. కానీ తీరా అదను వచ్చే సరికి డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు తెప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీపై కోరుకున్న విత్తనాలు వస్తాయని దాదాపు వెయ్యి మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకొచ్చారు. అయితే ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీలు చెల్లించేందుకు వచ్చిన రైతులు ఏఏ కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. డిమాండ్ అధికంగా ఉన్న మేలు రకం విత్తనాలు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. కొందరు రైతులు విత్తనాలు తీసుకోకుండా వెళ్లగా, మరికొందరు సబ్సిడీపై వస్తున్నాయని భావించి తీసుకెళ్లారు. మొత్తంగా విత్తనాలకోసం సుమారు 300 మంది రైతులు డీడీలు కట్టారు. మరికొందరు డీడీలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా ఎస్సీ, ఎస్టీ రైతులకే సబ్సిడీ వస్తుందని చెప్పడంతో నిరాశగా వెళ్లిపోయారు. ఇదా 50 శాతం సబ్సిడీ.. ఆయా కంపెనీల విత్తనాలపై ఇస్తున్న సబ్సిడీ చూసి రైతులు బిత్తరపోతున్నారు. ప్రస్తుతం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న క్యారెట్, బీట్రూట్ విత్తన ప్యాకెట్ల ధరకు, బయట లభిస్తున్న అదే ప్యాకెట్ల ధరకు కొద్ది మొత్తంలోనే తేడా ఉంటోంది. సబ్సిడీపై ఇస్తున్న బీట్రూట్ విత్తన డబ్బాను రూ.125కు ఇస్తున్నారు. అదే డబ్బా బయట మార్కెట్లో రూ.175కు దొరుకుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. క్యారెట్ విత్తన డబ్బా సబ్సిడీపై రూ.280కి వస్తుండగా అదే బయట మార్కెట్లో రూ.350కి వస్తోంది. నిజానికి 50 శాతం సబ్సిడీ అంటే ప్రభుత్వం నుంచి సగం ధరకే రావాలి. కానీ అదే కంపెనీ.. ఎమ్మార్పీపై రేటు తగ్గించి బయట విక్రయిస్తోంది. దీంతో రైతులు 50శాతం సబ్సిడీపై పెదవి విరుస్తున్నారు. -
విత్తు అందితే ఒట్టు!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభంలోనే అన్నదాతకు విత్తన కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులైనా జిల్లాలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయలేదు. ఎన్నడూ లేనివిధంగా విత్తన పంపిణీలో జాప్యం జరుగుతున్నా.. కొత్త ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నెల 3వ తేదీ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. తర్వాత అడపాదడపా అక్కడక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటికే దాదాపు 25 వేల హెక్టార్లలో విత్తనం పనులు పూర్తయ్యాయి. అయితే వేరుశనగ, పత్తి, జీలుగ విత్తనాలకు తీవ్ర కొరత ఉన్నా.. ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించకపోవడంపై రైతులు భగ్గుమంటున్నారు. జిల్లాలో వేరుశనగ 1,34,916 హెక్టార్లలో సాగవుతుండగా 75 వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అయితే ప్రభుత్వం 40 వేల క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కేటాయించింది. కేటాయింపు రెండు నెలలు ముందు జరిగినా విత్తనాలను పొజిషన్ చేయకుండా.. ఏపీ సీడ్స్, దానికి వేరుశనగ సరఫరా చేసే దళారులు అధిక ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. నంద్యాల డివిజన్‌తోపాటు జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాల్లో పచ్చరొట్ట ఎరువుగా దోహదపడే జీలుగ, పిల్లి పెసర విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే జిల్లాకు 4500 క్వింటాళ్ల జీలుగ, 3000 క్వింటాళ్ల పిల్లి పెసర మంజూరయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులవుతున్నా పంపిణీ అతీ గతీ లేదు. విత్తనాల కోసం శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు మండలాల్లో రైతులు బారులుదీరుతున్నారు. మరోవైపు నాసిరకం విత్తనాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. బీటీ పత్తి విత్తనాల పేరుతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విత్తన సమస్యపై అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఈ రైతు పేరు మంగన్న. అరికెర గ్రామ వాసి. ఈయనకు ఆరెకరాల పొలం ఉంది. ఈ ఏడాది వేరుశనగ సాగు చేయాలనుకున్నాడు. అయితే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు అందలేదు. వర్షాలు కురుస్తాయో లేదో అన్న ఆందోళనతో అరకొర పదునులోనే పత్తి విత్తనాలు నాటాడు. అయితే చినుకు జాడ లేకపోవడంతో భూమిలోంచి మొలక రాలేదు. విత్తనాల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం కోసం ఈయన అన్వేషిస్తున్నాడు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు పంపిణీ చేశామన్నారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను తిల కించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.600 కోట్ల పంట రుణాలు పంపిణీ లక్ష్యం కాగా ఇంత వరకు 74 వేల మందికి రూ.370 కోట్లుమంజూరు చేశామన్నారు. గతేడాది నీలం తుపానులో నష్టపోయిన 234 మంది రైతులకు రూ.11.50 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమచేసినట్లు చెప్పారు. సాగురైతు రక్షణహస్తం పథకం కింద 3,081 మందికి కార్డులు జారీ చేశామని, ఇందులో 115 మంది కౌలు రైతులకు రూ.18.12 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. 795 హెక్టార్లలో రూ.1.28 కోట్ల ఖర్చుతో ఆయిల్‌పామ్ తోటల విస్తరణ చేపట్టినట్టు చెప్పారు. 4,846 హెక్టార్లలో వివిధ ఉద్యానవనాల పెంపకానికి రూ.4.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించేంకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. జోరుగా జలాశయాల పనులు : జిల్లాలో జలాశయాలను రూ.55 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. రైవాడ,కోనాం పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. తాచేరు, రంగబోలుగెడ్డ, ఉరకగెడ్డ, పాలగెడ్డ, జగ్గమ్మగెడ్డ, ఇసుకగెడ్డలపై రూ.26.10 కోట్లతో జలశయాల నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా 7,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. అలాగే 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.43.78 కోట్లతో తాండవ, వరాహ, శారదా నదులపై ఆనకట్టల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి పథకాలు : ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు, మలేరియా ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మలేరియా నివారణకు 3574 గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారీ పూర్తయిందన్నారు. ఏజెన్సీలో రహదారులు, వంతెనలు అభివృద్ధికి రూ.88.17 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరు మండలాల్లో రూ.60 కోట్లతో 820 ప్రాధాన్యతాపరమైన పనులు చేపట్టినట్టు వెల్లడించారు. 2,374 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.21.25 లక్షల రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఏజెన్సీలో కాఫీబోర్డు, ఉపాధి హామీ పథకం, ఐటీడీఏ సంయుక్తంగా రూ.349 కోట్లతో 4 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు : జిల్లాలో ప్రస్తుతం 74 భారీ పరిశ్రమలు ఉన్నాయని, రూ.74695 కోట్ల పెట్టుబడితో మరో 105 నెలకొల్పుతున్నామని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 38 వేల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అదే విధంగా రూ.3,869 కోట్లతో 7,159 మధ్య, చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందన్నారు. మహిళా సంక్షేమానికి పథకాలు : మహిళా సాధికారతలో భాగంగా 2966 గ్రూపులకు రూ.79.2 కోట్లు రుణ సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. 29,836 స్వయం సేవా సంఘాలకు రూ.11 కోట్లు వడ్డీలేని రుణాలను వారి సేవింగ్స్ ఖాతాలకు నేరుగా జమ చేసినట్టు చెప్పారు. స్త్రీనిధి పథకం కింద 4500 మంది గ్రూపు సభ్యులకు సుమారు రూ.8 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. బాలికా శిశు సంరక్షణ పథకం కింద రూ.12.52 కోట్లు విలువైన బాండ్లను 3,878 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు జి.అచ్చయ్యమ్మ, ఎల్.సీతాదేవి, టి.అప్పారావులకు మంత్రి బాలరాజు, కలెక్టర్ వి.శేషాద్రి ఘనంగా సన్మానించారు. కాగా పంద్రాగస్టు వేడుకల్లో ఏటా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన ఆనవాయితీ. ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా ఈ ఏడాది శకటాల స్థానంలో ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంత్రి బాలరాజు సందర్శించారు. వివిధ పథకాల ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో జేసీ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ దుగ్గల్, డీఆర్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.