ఆరుతడికి సబ్సిడీ.. | Subsidy to six wet .. | Sakshi
Sakshi News home page

ఆరుతడికి సబ్సిడీ..

Published Tue, Nov 17 2015 12:28 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

Subsidy to six wet ..

 రైతులకు అందుబాటులో విత్తనాలు
ఖరీఫ్‌లో నష్టపోయిన అన్నదాతలకు అవకాశం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన    
సభలో  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
నిరుపయోగంగా మారిన
వ్యవసాయ యంత్ర పరికరాల స్టాల్స్
 

గుంటూరు : ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఖరీఫ్‌లో పంటలు సాగుచేయ లేని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సోమవారం ఉదయం తాడికొండ మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం(లాంఫాం)లో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవడానికి విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు.
 
కేంద్ర మంత్రి చేతులమీదుగా  శంకుస్థాపన ..

 తొలుత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైనవారందరికీ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ బుద్ధ ప్రతిమలను అందచేయగా,  కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, వెంకయ్యనాయుడులను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, తదితరులు పాల్గొన్నారు.
 
అధికార దుర్వినియోగం

 ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజలను తరలించేందుకు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్‌లను వినియోగించారు. దీనికి సంబంధించి మండల వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులకు  లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో ఒక్కో అధికారి  తన సొంత డబ్బు రూ.10 వేల వరకు ఖర్చు చేసి ప్రజల తరలింపును చేపట్టారు. అయితే ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో నామమాత్రంగానే ప్రజలు హాజరయ్యారు. రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమా న్యాలపై ఒత్తిడి తెచ్చి దాదాపు 500 బస్‌లను తరలింపు కార్యక్రమానికి కేటాయించారు. తాడికొండ, గుంటూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు ఉదయం 7 గంటలకే బస్‌లను పంపించారు. అయితే  వర్షం పడుతుండడంతో బస్సుల్లో  పది మందికి మించి రాలేదు.

నిరుపయోగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్
 కార్యక్రమంలో భాగంగానే వ్యవసాయ పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రాంగణంలో 18 ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన వ్యవసాయ పరికరాలను ఆ స్టాల్స్‌లో ఉంచారు. అయితే సభా కార్యక్రమం అనంతరం వీటివైపు రాకుండా మంత్రులంతా వెళ్లిపోవడంతో,  వీటి ఏర్పాటుకు చేసిన ఖర్చు నిరుప యోగం అయింది.  పంట పొలాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో వర్షం కారణంగా బురదగా మారి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బాపట్ల , రాజమండ్రి వ్యవసాయ కళాశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement