♦ ఎకరా వరికి బీమా రూ.17,750కే పరిమితం
♦ కుదించిన ఏఐసీ, ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
♦ విపత్తుల్లో వచ్చేది అరకొర పరిహారమే
♦ ఖరీఫ్ సాగుపై విరక్తి చెందుతున్న రైతాంగం
పీకల లోతు మునిగినవారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎవరైనా చేయందిస్తారు. ప్రస్తుత పాలకులు మాత్రం ఆపదకాలంలో మొండి చేయి చూపి వారిని మరింత ముంచేస్తున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతును ఆదుకోవాల్సింది పోయి.. వారు సాగంటనే భయపడేలా చేస్తున్నారు. తాజాగా బీమా భరోసాను కూడా కుదించి వేసి వ్యవసాయాన్ని గాలిలో దీపంగా మార్చివేస్తున్నారు.
అమలాపురం : జిల్లాలో ఖరీఫ్ సాగు జూదంగా మారింది. అనావృష్టితో సాగు ఆరంభంలో నీటి కోసం పడరాని పాట్లుపడడం.. తీరా పంట చేతికి వచ్చే సరికి అతివృష్టితో చేలు భారీ వర్షాలు, తుపానుల బారిన పడి నీట మునగడం పరిపాటిగా మారింది. గడచిన ఆరేళ్లలో ఐదేళ్లు రైతులకు ఖరీఫ్ పంట పూర్తిగా దక్కిన దాఖలాలు లేవు. అయినా రైతులు సాగు చేస్తున్నారంటే పంట మీద మక్కువ ఓ కారణం కాగా పంట దెబ్బ తింటే బీమా (ఇన్సూరెన్స్) పరిహారం వస్తుందనే భరోసా మరో కారణం.
ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా లేకుండా చేస్తున్నారుు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ), రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎకరాకు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా బీమా చేయించుకుని పంట నష్టపోతే పరిహారం అందించేది. బ్యాంకుల నుంచి పొందిన వ్యవసాయ రుణం మొత్తానికి బీమా ప్రీమియం చేయించుకుని పరిహారం అందించేవారు. బీమా కంపెనీ ఇప్పుడు దీనిని ఎకరాకు కేవలం రూ.17,750కి కుదించివేస్తూ ప్రతిపాదన పంపగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. వరికి ఇంతకుమించి బీమా చేయించవద్దని ప్రభుత్వం అన్ని బ్యాంకులకూ సర్క్యులర్ పంపించింది.
జిల్లాలోనే పెట్టుబడి అధికం
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా మన జిల్లాలో వరిసాగుకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. అందుకే ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా రూ.29 వేలు చేస్తూ జిల్లా కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కమిటీ గతంలో అభ్యంతరం తెలిపినా జిల్లా కమిటీ సిఫార్సు మేరకు బ్యాంకులు ఈ మేరకు రుణాలందిస్తున్నారుు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకు మేనేజర్లు పెట్టుబడికి అయ్యే ఖర్చుమీద 30 శాతం అదనంగా రుణం ఇచ్చే అవకాశముంది.
అంటే ఎకరాకు రైతులు రూ.37,700 వరకు రుణం పొందవచ్చు. గతంలో అయితే ఈ మొత్తం రుణం మీద బ్యాంకులు బీమా చేరుుంచేవి. ఇప్పుడు ఎకరాకు రూ.17,750కి మాత్రమే బీ మా చేయించాలని చెప్పడంతో బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు పైబడి 30 శాతం రుణం ఇచ్చేందుకు వెనుకడుగు వేయవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మొత్తం రుణానికి బీమా ప్రీమియం చెల్లించినా రూ.17, 750ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిహారం అంది స్తారని దేవగుప్తం సహకార సంఘం అధ్యక్షుడు జున్నూరి బాబి ‘సాక్షి’కి తెలిపారు. బీమా భరోసా లేకపోవడం, పంట నష్టపోతే ప్రభుత్వం తక్షణం పరిహారం అందించకపోవడం తో రైతులు ఖరీఫ్ సాగుకు ఆసక్తి చూపడం లేదు.
గడువు పెంచుతారా?
ఖరీఫ్ బీమా ప్రీమియం గడువు జూలై 31తో ముగిసిపోయిం ది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 41 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. మధ్యడెల్టాలో అయితే 20 శాతం కూడా పూర్తి కాలేదు. మెట్ట, ఏజెన్సీల్లో మరీ తక్కువ. ఈ నేపథ్యం లో బీమా గడువు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భరోసాకు ఎసరు
Published Sun, Aug 2 2015 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement