ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచీ విత్తనం విత్తుకుని, పంట దిగుబడి వచ్చే వరకు పంటలను
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచీ విత్తనం విత్తుకుని, పంట దిగుబడి వచ్చే వరకు పంటలను కాపాడుకోవడానికి రైతులు చేయని ప్రయత్నం ఉండదు. చీడపీడల బారి నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం విస్మరిస్తుంటారు. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ వివరించారు.
జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పతి, సోయాబీన్ పంటలపై రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు తదితర తెగుళ్ల నివారణకు పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. రకరకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసే సందర్భాల్లో జాగ్రత్తలు వహించకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. మందులు చల్లే సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి, సోయా పంటలు సాగవుతున్నాయి. మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.