Seed
-
దివాళా అంచున విత్తనాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: దేశానికి అవసరమైన విత్తనాల్లో 70 శాతం తామే అందిస్తున్నామని, విత్తన భాండాగారంగా వెలుగొందుతున్నామని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ దివాళా అంచున నిలబడింది. ప్రైవేటు విత్తన సంస్థలు ఏటా రూ.కోట్లు ఆర్జిస్తుంటే, విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం ఏటికేడు నష్టాల్లో కూరుకుపోతోంది. సంస్థ 2016లో యూనియన్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద రూ.100 కో ట్లు తీసుకుంది. ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడం, ఏటా మరింత మొత్తం తీసుకోవటంతో ప్రస్తుతం అది రూ.400 కోట్లకు చేరింది.దీనికి ప్రతినెలా రూ.3 కోట్ల చొప్పున వడ్డీని సంస్థ చెల్లిస్తోంది. అప్పుల భారం పెరగడంతో ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సంస్థ బ్యాంకు ఖాతాలో రూ.3.66 కోట్ల మేర నిల్వ లు ఉండగా, ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత అందులో నుంచి రూ.3 కోట్లు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకుంటుంది. మిగిలే రూ.66 లక్షలను ఉద్యోగులకు వేతనాల కింద సర్దుబాటు చే యాల్సి ఉంటుంది. పోనీ మళ్లీ ఓడీ తీసుకుందామంటే.. సంస్థకు ఇప్పుడున్న క్రెడిట్ అవకాశం రూ.2 వేల వరకు మాత్రమే. స్వయంకృతం విత్తనాల కోసం అభివృద్ధి చేసిన వరి, ఇతర పప్పు ధాన్యాలను సకాలంలో రైతులకు విక్రయించకపోవడం సంస్థకు ఏటా రివాజుగా మారింది. దాంతో సీజన్ దాటగానే సీడ్ (విత్తనాలు)ను నాన్ సీడ్‌గా మార్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 2023లో 50 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను నాన్‌సీడ్‌గా మార్చి విక్రయించటంతో రూ.94 కోట్ల నష్టం వచ్చింది. 2015–16 నుంచి విత్తన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్లో ఇంకా రూ.80 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వం విత్తనాలకు సబ్సిడీని విడుదల చేయడం లేదు. ఈ సబ్సిడీ మొత్తం రూ.450 కోట్లవరకు రావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 ప్రాసెస్ యూనిట్లు, ఆగ్రోస్ విక్రయ కేంద్రాలు, సొసైటీల ద్వారా విత్తనాలను విక్రయించే సంస్థ సరైన ప్రణాళిక లేక దివాళా దశకు చేరిందని వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బోర్డు ఆమోదం లేకుండానే టెండర్లు వచ్చే 2025–26లో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులకు అందించేందుకు 2.73 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం సంస్థ టెండర్లు పిలిచింది. అందుకు కార్పొరేషన్ బోర్డు ఆమోదం తీసుకోనేలేదు. 1.78 లక్షల క్వింటాళ్ల 8 రకాల వరి విత్తనాలు, 50 వేల క్వింటాళ్ల సోయాబీన్.. పెసర, కంది, శనగ, వేరుశనగ, జొన్న మొదలైన 2,73,500 క్వింటాళ్ల విత్తనాల కోసం సంస్థ తరఫున ఇన్చార్జి ప్రొడక్షన్ మేనేజర్ నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 27వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీ కాగా, ఒక్క విత్తన సంస్థ కూడా టెండర్ వేయకపోవటంతో గడువు తేదీని ఫిబ్రవరి 11 వరకు పొడిగించారు. గత సర్కారు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితిబీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలే విత్తనాభివృద్ధి సంస్థ నష్టాలకు కారణం. సంస్థకు రావాల్సిన సబ్సిడీని విడుదల చేయలేదు. సీడ్‌ను నాన్ సీడ్‌గా మార్చి విక్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాసెస్ చేసిన విత్తనాలను పూర్తిస్థాయిలో విక్రయించే ఏర్పాట్లు చేశాం. 2024లో ఆ ఫలితాలు కనిపించాయి. కొత్త టెండర్లకు బోర్డు ఆమోదం అవసరం లేదు. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ. – అన్వేశ్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ -
దేశానికి మన విత్తన పాదు
(యెన్నెల్లి సురేందర్) గజ్వేల్: భారత్ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. కోట్లమంది రైతులు, కోట్ల ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. మంచి పంట రావాలంటే అతి ప్రధానమైనది విత్తనం. పంటలు పండే ప్రతి చోటా విత్తనాన్ని ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. అందుకు సమృద్ధిగా నీరు ఉండాలి.. మంచి నేలలు కావాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి.. వీటన్నింటినీ చక్కగా వాడుకోగల నిపుణులైన రైతులు ఉండాలి. ఈ వనరులన్నింటికీ ఇప్పుడు తెలంగాణ ఆలవాలమైంది. అందుకే రాష్ట్రం నుంచి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతున్నాయి. దేశానికి అవసరమైన మొత్తం విత్తనాల్లో 55 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయటం ఎంత ముఖ్యమో.. దానిని పాడవకుండా దీర్ఘకాలం నిల్వచేయటం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ వాతావరణం విత్తన నిల్వకు చక్కగా సరిపోతోంది. అందుకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా తెలంగాణకు తరలించి నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారి ఇక్కడే సీడ్ పార్కును ఏర్పాటుచేసింది. ఏటా విత్తనోత్పత్తి పంటల సాగు పెరుగుతున్న తీరుపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..ఒక్కో జిల్లాలో ఒక్కో విత్తనం విత్తనోత్పత్తి రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలకు విస్తరిస్తోంది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తోపాటు సిద్దిపేట జిల్లా విత్తనోత్పత్తికి హబ్‌గా అవతరించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, భూత్పూర్ ప్రాంతాల్లో పత్తి విత్తనోత్పత్తి భారీగా జరుగుతోంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో విత్తన పత్తి పంట దాదాపు 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. మిగితా జిల్లాల్లో వరి, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పచ్చ జొన్న తదితర పంటల విత్తనోత్పత్తి జోరుగా సాగుతోంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో సజ్జ విత్తనాల ఉత్పత్తి అధికంగా ఉంది. 2014–15లో వరి విత్తన ఉత్పత్తి 3 లక్షల కిలోలకుపైగా ఉండగా, ఇప్పుడు రెట్టింపైంది. ఇలా అన్ని రకాల విత్తనోత్పత్తి పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడు మరింత పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. విత్తనోత్పత్తితో మంచి ఆదాయం నాకు పదెకరాల భూమి ఉంది. సాధారణ పద్ధతిలో ఎంత కష్టపడినా ఎకరాకు 25–30 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. ఆ వడ్లను అమ్మితే ఖర్చులు పోను రూ.20–25 వేలు కూడా మిగిలేవి కాదు. అందువల్ల విత్తనోత్పత్తి వైపు వచ్చాను. ఖ ర్చులు పోను ఒక సీజన్లో ఎకరాలో రూ.60–80 వేల వరకు ఆదాయం వస్తోంది. చిమ్ముల సీతారాంరెడ్డి, వేలూరు, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లామూడేళ్లుగా సజ్జ విత్తనోత్పతి చేస్తున్న మూడేళ్లుగా సజ్జ పంటలో విత్తనోత్పత్తి చేస్తున్న. ఖర్చులు పోను ఎకరాకు రూ.50 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు మంచి ఫలితాలే వచ్చినయ్. – చంద్రం, దండుపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లావిత్తనోత్పత్తికి తెలంగాణ నేలలు అనుకూలం తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయి. చౌడు నేలలు మినహా మిగితా నేలల్లో విత్తన సాగు చేపట్టవచ్చు. విత్తన సాగు రైతులకు లాభదాయకమే అయినప్పటికీ కంపెనీలతో సరిగ్గా అగ్రిమెంట్లు చేసుకోకపోతే నష్టపోవడం ఖాయం. – డాక్టర్ విజయ్‌కుమార్, సిద్దిపేట జిల్లా డాట్ సెంటర్ శాస్త్రవేత్తలక్షల టన్నులవిత్తనాల ఎగుమతి రాష్ట్ర వ్యవసాయశాఖ, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,400లకు పైగా గ్రామాల్లో 3.10 లక్షల మంది రైతులు 7.5 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా 80 వేల టన్నుల విత్తనోత్పత్తి జరుగుతోంది. 20 లక్షల టన్నుల విత్తనాల నాణ్యతను ఈ సంస్థ ధ్రువీకరించి ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు మరో 11.200 లక్షల టన్నుల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. మరో 12 లక్షల టన్నుల విత్తనాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. దేశంలో సుమారుగా 44 లక్షల టన్నులకుపైగా విత్తనాల అవసరం ఉండగా.. తెలంగాణ నుంచే 24 లక్షల టన్నులు సరఫరా అవుతుండటం విశేషం. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం తదితర 20 దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. విత్తన సాగుపై రైతుల ఆసక్తి సాధారణ పంటలకంటే విత్తనోత్పత్తి పంటల సాగులో ఆదాయం అధికంగా వస్తుండటంతో రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులుపోను రూ.20–30 వేలు మిగలడమే గగనం. కానీ విత్తనోత్పత్తి పంటలు వేస్తే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షకుపైగా ఆదాయం వస్తోంది. ఈ పంటల సాగు క్లిష్టమైనదే అయినప్పటికీ.. నిష్టాతులైన కూలీలతో సులువుగా సాగు చేపడుతున్నారు. విత్తన వడ్లకు క్వింటాలుకు వివిధ కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర చెల్లిస్తున్నాయి. ఒకవేళ 10 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వస్తే సదరు కంపెనీ రైతుకు పరిహారం కింద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష చెల్లిస్తోంది. ఇదే తరహాలో పంట రకాలను బట్టి ధరను చెల్లిస్తున్నారు. మంచి లాభం ఉండటంతో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 5 వేల ఎకరాల్లో వరితోపాటు ఇతర విత్తన పంటల సాగు చేస్తూ ఏటా రూ.80 కోట్లకుపైగానే లాభం పొందుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సేకరించే విత్తనాలపై క్వింటాల్‌కు కనీస మద్దతు ధ రకంటే వరికి 20 శాతం అధికంగా ఇన్సెంటివ్స్ ఇ స్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తృణధా న్యాలకు 17 శాతం, సోయాబీన్స్‌కు 25 శాతం, ఇతర పంటలకు 15 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. విత్తనోత్పత్తిలో అగ్రిమెంట్లే కీలకం విత్తనోత్పత్తి విధానంలో రైతులు, కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలు సక్రమంగా లేకుంటే నష్టాలు తప్పవు. అగ్రిమెంట్లు సరిగా లేకపోతే కంపెనీ ముందుగా చెప్పే దిగుబడుల కంటే తక్కువ వస్తే పరిహారం ఇవ్వటంలేదు. అందువల్ల రైతులు విత్తనోత్పత్తి చేపట్టే సందర్భంలో ప్రాంతీయ విత్తన అధికారి వద్ద తమ పంటకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, ప్రైవేటు కంపెనీలు భారీ ఎత్తున విత్తనోత్పత్తి చేపడుతున్నా.. ప్రభుత్వం వైపు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విత్తనోత్పత్తికి సంబంధించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఆరేళ్ల క్రితం వరకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
సీడ్.. ఎదుగుదల స్పీడ్
సాక్షి, హైదరాబాద్: రసాయన, పురుగు మందుల వ్యవసాయంతో భూమిలోని సూక్ష్మజీవులు, పోషకాలు నాశనమై జీవవైవిధ్యం కోల్పోయిన పరిస్థితుల్లో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) సరికొత్త ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకొచి్చంది. మొక్కల పెరుగుదల, అధిక దిగుబడికి తోడ్పడేలా సూక్ష్మ పోషకాలు, క్రిమి, శిలీంధ్ర సంహారక మందులు విత్తనాలపై ప్రయోగించడానికి ఐసీఏఆర్–ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు దేశంలో తొలిసారిగా బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు.ఈ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించిన నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్.శర్మ, ఐఐఓఆర్ డైరెక్టర్ ఆర్కే.మాథూర్‌లతో శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాసరావు, యాదుకా అగ్రిటెక్ ఎండీ ఆదిత్యలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బయో పాలిమర్‌తో లభించే ప్రయోజనాలను వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2015 నుంచి ప్రయోగాలు ఇప్పటి వరకు విత్తనాలకు రసాయనాలతో కూడిన సింథటిక్ పాలిమర్‌తో సీడ్ కోటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయా కంపెనీలు విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేవి. అయితే సింథటిక్ పాలిమర్ కోటింగ్‌తో వచ్చిన విత్తనాలను రైతులు విత్తినా, సరైన ఎదుగుదల లేకపోవడం, దిగుబడి రాకపోవడాన్ని నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) గుర్తించింది. సుమారు 60 ఏళ్లుగా సాగుతున్న రసాయన వ్యవసాయం వల్ల భూమి లో పోషకాలు, సూక్ష్మ జీవులు నశించిపోయాయని తేల్చారు. జీవవైవిధ్యం కోల్పోయి నిస్సారంగా మారిన భూమిని విత్తనాల ద్వారానే తిరిగి పునరుజ్జీవం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. తద్వారా కనీసం 35 శాతం దిగుబడిని పెంచాలని భావించారు.ఈ మేరకు ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్త ఆర్డి.ప్రసాద్, మరో శాస్త్రవేత్త పూర్ణ చంద్రిక 2015లో బయోపాలిమర్ ఆధారిత కోటింగ్ విధానంపై ప్రయోగాలు ప్రారంభించారు. గత ఏడాది కొత్తగా బయోపాలిమర్‌ను ఆవిష్కరించిన వీరు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు. ఈ బయోపాలిమర్‌ను వినియోగించి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు శ్రీకర్ అగ్రిటెక్, యాదుక అగ్రిటెక్ ముందుకు రావడంతో ఆ సంస్థలతో కలిసి పనిచేశారు ఈ బయో పాలిమర్ ఆధారిత విత్తనాలు వచ్చే నెల నుంచి రైతులకు అందుబాటులోకి వస్తాయని శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాస్‌రావు తెలిపారు. వేరుశనగ, సన్‌ఫ్లవర్, కుసుమ, నువ్వులు వంటి నూనె గింజెలతోపాటు కందులు, శనగలు, వరి వంగడాలను కూడా ఈ బయోపాలిమర్ కోటింగ్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రి ఇన్నోవేట్ ఇండియా సీఈవో ప్రవీణ్ మాలిక్, ఆర్ఏసీ చైర్మన్ ఎస్కే.రావు తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, అందుకు తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల సీడ్ గార్డెన్ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో నడుపుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించారు.అక్కడ ఎఫ్‌జీవీ కంపెనీ రిఫైనరీ మొక్కలను సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి ఇప్పటికే రాష్ట్రానికి సీడ్స్‌ను చాలావరకు తెప్పించుకున్నామన్నారు. రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని కోరగా వారు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి అక్కడ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. -
జన్యు మార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వే‹Ùరెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది.ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆరి్థక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను ఆదేశించారు. -
అపరాలలోనూ విత్తన మార్పిడి
సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్‌లో కందులులో ఎల్‌ఆర్‌జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా, ఎల్‌ఆర్‌జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా విస్తరణ డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివరిస్తారు. మినుములో ప్రత్యామ్నాయ రకాలు » పీయూ–31కు బదులుగా ఖరీఫ్ సీజన్లో ఎల్బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్8, ఎల్జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. » తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్బీజీ 904 రకం » ఎల్బీజీ 752కు బదులుగా ఖరీఫ్‌లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్ 8, ఎల్బీజీ 904, జీబీజీ1, ఎల్బీజీ 787 » టీ–9కు బదులుగా రెండు సీజన్లలో ఎల్బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్బీజీ 904 రకం ఏపీ సీడ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: » ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 574, ఎల్జీజీ 607,ఎల్జీజీ 630 ఎల్జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు » ఎల్జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 607 రకాలు, ఎల్జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్జీజీ 630, ఎల్జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్‌ఆర్‌జీ 52 స్థానంలో ఖరీఫ్‌లో టీఆర్జీ 59 (తిరుపతి కంది), ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33, పీఆర్జీ 176 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. » ఎల్‌ఆర్‌జీ 41 స్థానంలో ఖరీఫ్‌లో పీఆర్జీ 158, టీఆర్జీ 59, ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 (సౌభాగ్య), పీఆర్జీ 176, ఎల్‌ఆర్‌జీ 52 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 రకాలు » ఐసీపీహెచ్ 2740, ఐసీపీఎల్ 87119, పీఆర్జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105 రకం » ఐసీపీహెచ్ 87063 కు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. శనగలో ప్రత్యామ్నాయ రకాలు శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్‌బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్‌బీఈజీ 776 రకాలు, ఎన్ఈజీ 452 (నంద్యాల గ్రామ్ 452), ఎన్‌బీఈజీ 810 (నంద్యాల గ్రామ్ 810), ఎన్‌బీఈజీ 857 (నంద్యాల గ్రామ్) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు -
విత్తన పరిశోధనకు మరో ముందడుగు
సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్తనాలనే మార్కెట్లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు పరిపాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అత్యాధునిక సౌకర్యాలు.. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే.. ► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు. ► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తికావచ్చింది. ► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్‌కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్‌కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్‌లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్‌ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్‌కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్‌లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్‌లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. ల్యాబ్‌లో ఏబ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్‌గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్‌గా నిలిచింది. ల్యాబ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్‌లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్‌లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్‌లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్‌లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్‌లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్‌లో బీటీ, హెచ్‌టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్‌లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్‌ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్‌ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్‌ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్‌లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు. పకడ్బందీగా విత్తన పంపిణీ ముందస్తు రబీ సీజన్‌కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం గడిచిన సీజన్లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ, మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్‌కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. -
Papaya Seed Health Benefits: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..?
అందరూ బొప్పాయి పండుని తినేసి గింజలు పడేస్తారు. ఇది సర్వసాధారణం. అయితే గింజల్లో ఎన్నో పుష్కలమైన విటమిన్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండు శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఇస్తోందో దాని విత్తనాలు కూడా అన్నే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా!. బొప్పాయి పండు తోపాటు విత్తనాలు కూడాను.. బొప్పాయి పండు విత్తనాల్లో ఆల్కలాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అర్థరైటిస్‌ను తగ్గిస్తాయి. ∙బొప్పాయి గింజలు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీర్ణక్రియారేటు పెరుగుతుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహారాన్ని విషం కానివ్వవు. గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. హార్ట్ఎటాక్ రాదు. బొప్పాయి గింజలు కొవ్వుని కరిగించి, బరువుని నియంత్రణలో ఉంచుతాయి. ఆల్కహాల్ టాక్సిన్ వల్ల కాలేయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ బొప్పాయి గింజలు కాపాడతాయి. పైగా కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. పేగు పరాన్న జీవలకు మంచి నివారిణిగా ఉంటుంది. ఈ బొప్పాయి గింజలను పరగడుపునే కొద్ది మొత్తంలో తాజాగా నూరి తీసుకుంటే పరాన్నజీవులను నిర్మూలించవచ్చు. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు మీ చర్మం, జుట్టు, పోషణ కోసం బొప్పాయి గింజల సారం లేదా నూనెను స్థానికంగా ఉపయోగించొచ్చు. (చదవండి: సీఫుడ్ తినడం మంచిది కాదా? ముఖ్యంగా ఆ చేపలు తింటే..) -
అదును చూసి విత్తనాలు విత్తుకోవాలి
నడిగూడెం : రైతు సాగు చేసే ఏ పంటకై నా అదునులోగా విత్తనాలు విత్తుకుంటే మేలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాజగోపాలరావు చెబుతున్నారు. ఎక్కువ విసీర్ణంలో సాగు చేసే వరి, పత్తి పంటల విత్తనాలు విత్తుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటల సాగు, విస్తీర్ణం, దిగుబడులు నైరుతి రుతుపవనాల ప్రవేశంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ వారంలో ప్రవేశించి, మూడో వారం వరకు అంతటా విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఆధారంగా వానాకాలంలో పత్తి, కంది, పెసర, ఇతర పంటలను విత్తుకుంటారు. వర్షాలపై ఆధారపడి పత్తి సాగు పత్తి విత్తనాలను వర్షాలపై ఆధారపడి విత్తుకోవాలి. తెల్లబంగారం సాగు చేసే రైతులు ఏటా అదే పొలంలో పత్తిని పండించకుండా పంట మార్పిడి చేయాలి. విత్తనాలను మొక్కకు మధ్య 2అడుగులు వరుస వరుసకు 2 అడుగులు లేదా మొక్కకు 3అడుగుల దూరంలో వరుస వరుసకు 3 అడుగుల దూరంలో విత్తుకోవడం ద్వారా సాంద్రతను పెంచి అధిక దిగుబడులు పొందవచ్చు. నల్లరేగడి భూముల్లో 60–70 మి.మీ. ఎర్ర చెల్క భూముల్లో 50–60 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు విత్తుకోవాలి. జూలై 15లోగా విత్తుకుంటే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్‌సూపర్ పాస్పేట్ రూపంలో 150కిలోలు ఆఖరు దుక్కిలో విత్తేటప్పుడు వాడాలి. మెగ్నిషియం, బోరాన్ తదితర సూక్ష్మదాతులోప నివారణకు మెగ్నిషియం పది గ్రాములు, బోరాన్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులైన ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు లేదా థయోమితాక్సోం 4 గ్రాములు, తెగుళ్ల నివారణకు వినియోగించే ట్రైకోడెర్మా విరిడే 10 గ్రాములు, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ప్రైవేట్ హైబ్రిడ్ విత్తనాలైతే శిలీంద్రనాశిని మందులు కార్బక్సీన్ థైరమ్ 25 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అంతరపంటగా కందిని ఆరు లేదా ఎనిమిది వరుసలకు విత్తుకోవాలి. జూలై 15లోగా విత్తుకోవాలి.. కంది, పెసర పంటలను ఈ నెల 15 నుంచి జూలై 15లోగా విత్తుకోవాలి. పంట మార్పిడి పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కంది తర్వాత జొన్న, మినుము, ఉలువలు నువ్వులు తదితర పంటలు సాగు చేసుకోవచ్చు. పురుగులు, తెగుళ్లు తట్టుకొనే రకాలు సాగు చేసుకోవాలి. కంది పంట చుట్టూ అక్కడకక్కడ బంతి మొక్కలు నాటుకోవాలి. బంతి పూలకు శనగపచ్చ పురుగు ఆకర్షణ చెంది పూలపై గుడ్లను పెడుతుంది. మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలు సాగు చేసేవారు జూలై 15 లోగా విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. వరి సాగుకు అనుకూలమైన సమయం దీర్ఘకాలిక రకాలైన బీపీటీ–5204 ఇంకా ఇతర సన్న రకాలు ఇప్పటి నుంచి జూన్ నెలాఖరులోగా నారు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైతే జూన్ 20నుంచి, జూలై 15వరకు నారు పోసుకోవచ్చు. ఆర్ఎన్ఆర్ 15048 రకం కొంత ఆలస్యమైనా పోసుకొనేందుకు అనువైంది. -
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్‌కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
అత్యాధునిక టెక్నాలజీతో విత్తన పరీక్షా కేంద్రం
ఏజీవర్సిటీ(హైదరాబాద్): ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ మారిందని, మన విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని విత్తన పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయస్థాయి విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణకే కాకుండా భారత విత్తన పరిశ్రమకు సేవలు అందించడానికి అత్యా«ధునిక టెక్నాల జీతో విత్తన పరీక్షాకేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విత్తనోత్పత్తిదారులకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ వర్క్‌షాప్‌ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తనరంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ ఈ విత్తన పరీక్షాకేంద్రంలో మనదేశంలోని విత్తనోత్పత్తి సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతుల తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఎంతో నేర్చు కోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణుడు ఎడ్డీ గోల్డ్‌శాక్(సౌతాఫ్రికా) మాట్లాడుతూ తెలంగాణలో నాణ్య మైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ విత్తనోత్పత్తి రంగానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, అందుకే తెలంగాణ అంతర్జాతీయస్థాయి కార్యక్రమానికి వేదిక అయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన సంస్థ ఎం.డి. కేశవులు మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో అను భవజ్ఞులైన అంతర్జాతీయస్థాయి విత్తన ప్రముఖులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే వర్క్‌షాప్‌లో ఇండియాతోపాటు టాంజానియా, కెన్యా, ఇండోనేíసియా, డెన్మార్క్, దక్షిణ కొరియా, నైజీరియా, ఆస్ట్రే లియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
అంతర్జాతీయ విత్తన సంస్థ అధ్యక్షుడిగా కేశవులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, విత్తన శాస్త్రవేత్త డాక్టర్ కేశవులు ఎన్నికయ్యారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో గురువారం ఇస్టా కాంగ్రెస్ ముగింపు సందర్భంగా ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఇస్టా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కేశవులు 2025 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. అమెరికాకు చెందిన ఎర్నెస్ట్ ఎలాన్ వైస్ ప్రెసిడెంట్‌గా, మరో తొమ్మిది మంది ఇస్టా సభ్యులుగా ఎన్నికయ్యారు. సభ్యుల్లో కెనడా, న్యూజి లాండ్, ఫ్రాన్స్, ఫిలిఫ్పైన్స్, అర్జెంటీనా, జర్మనీ, జింబాబ్వే, ఇటలీ, ఉరుగ్వేలకు చెందినవారున్నారు. కాగా, కేశవులుకు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. దేశానికి తెలంగాణ విత్తన భాండాగారంగా ఉన్న నేపథ్యం లో ఆసియా నుంచి తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి కేశవులు అని కేటీఆర్ వ్యా ఖ్యానించారు. తెలంగాణ నుంచి ఎంపిక కావడంతో యావత్ భారతావనికి కూడా విత్తన రంగంలో అంతర్జాతీయ కీర్తి లభించిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో విత్తన పరీక్ష ల్యాబ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత వ్యవసాయోత్పత్తి ప్రతి ఏడాది స్థిరంగా పెరుగుతూ వస్తోందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కైరోలో జరి గిన ఇస్టా కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు. -
‘ఇస్టా’ అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు పేరు ఖరా రైంది. ప్రస్తుతం ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగు తున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నా రు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయు డు, మొదటి ఆసియా వ్యక్తి కూడా కేశవులే కావడం విశేషం. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే. అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడ మే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్ ఇస్తారు. కేశవులు నియా మకంతో ఇక్కడి నుంచి ఇతర దేశాలకు నాణ్యమైన విత్తన ఎగుమతులు జరుగుతాయని భావిస్తున్నా రు. విత్తన నాణ్యతకు అనువైన లేబొరేటరీలు ఇక్కడకు వచ్చే అవకాశముంది. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5 శాతమైతే.. భారత్‌లో వృద్ధి రేటు 12–15 శాతంతో అంతర్జాతీయంగా ఐదో స్థా నంలో ఉందని ఇన్‌స్టా కాంగ్రెస్‌లో మంత్రి నిరం జన్రెడ్డి చెప్పారు. ఇందులో తెలంగాణ విత్తన పరి శ్రమ వృద్ధి రేటు 85% కావడం విశేషమన్నారు. -
Sagubadi: ఇలా చేస్తే బట్టతడుపు వాన పడినా చాలు మొలక వస్తుంది!
Pre Monsoon Dry Sowing: మెట్ట భూముల్లో 365 రోజులూ నిరంతరాయంగా ప్రకృతి పంటల సాగులో తొలి దశ వానకు ముందే విత్తటం (ఇదే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ –పీఎండీఎస్)లో ప్రత్యేక పద్ధతులను రైతులు అనుసరించాల్సి ఉంటుంది. 365 డిజీసీ పద్ధతిని ప్రారంభించే రైతులు తొలి సంవత్సరం మొదట్లో మాత్రమే దుక్కి దున్నాల్సి ఉంటుంది. తదనంతరం ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనుషులు చేతులతోనే విత్తన గుళికలు విత్తుకోవాలి. మళ్లీ దుక్కి చేయాల్సిన అవసరం లేదు. 20కి పైగా పంటలు ఒకేసారి విత్తుకున్నప్పటికీ ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులు, రైతుల ఆసక్తి, పంట కాలాలను బట్టి ప్రధాన పంటలను ఎంపిక చేసుకోవాలి. వానకు ముందే వేసవిలో విత్తుకోవాలి కాబట్టి.. వేడిని తట్టుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలకు లేపనం చేయటం ముఖ్యమైన విషయం. బంక మట్టి, ఘనజీవామృతం పొడులతో పాటు బూడితతో లేపనం చేసిన విత్తన గుళికలను మాత్రమే విత్తుకోవాలి. విత్తనాన్ని బొచ్చెలో లేదా గోనె సంచిలో పోసి అటూ ఇటూ ఊపుతూ.. బీజామృతంను తగుమాత్రంగా చిలకరిస్తూ.. తొలుత మెత్తగా వజ్రకాయం పట్టిన బంక మట్టి లేదా చెరువు మట్టిని విత్తనాలపై చల్లాలి. తర్వాత మెత్తగా చేసిన ఘన జీవామృతం పొడిని అవే విత్తనాలపై వేస్తూ బీజామృతాన్ని తగుమాత్రంగా చిలకరించాలి. చివరిగా కట్టె బూడిదను కూడా వేస్తూ విత్తనాలకు లేపనం చేయాలి. ఇలా ఐదు దఫాలుగా చేయాలి. విత్తనం పరిమాణానికి విత్తన గుళికల పరిమాణం 5 రెట్లు పెరుగుతుంది. ఈ విత్తనాన్ని మార్చి నుంచి మే వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 400 కేజీల ఘన జీవామృతాన్ని చల్లుకోవాలి. ఆ తర్వాత కనీసం 3 అంగుళాల మందాన వేరుశనగ పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు, గడ్డి తదితర పంట వ్యర్థాలతో పొలం అంతా ఆచ్ఛాదన చేయాలి. పొలం చదరంగా ఉంటే.. (తొలి ఏడాది మాత్రమే) దుక్కి చేసిన తర్వాత.. ఎద్దుల గొర్రు లేదా సీడ్ డ్రిల్‌తో విత్తన గుళికలను వరుసలుగా విత్తుకోవచ్చు. పొలం వాలు ఎక్కువగా ఉంటే.. వాలుకు అడ్డంగా బోదెలు తోలుకొని.. మనుషులే విత్తన గుళికలను వరుసలుగా విత్తుకోవాలి. లేపనం చేసిన విత్తనం 6 నెలలు భద్రంగా ఉంటుంది. భూమిలో వేసిన తర్వాత బట్టతడుపు వాన (5–10 ఎం.ఎం.) పడినా చాలు మొలుస్తుంది. ఘనజీవామృతంతో లేపనం చేసినందున మొలక 25–30 రోజుల వరకు వాన లేకపోయినా తట్టుకొని నిలబడుతుంది. ద్రవజీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తూ ఉంటే.. ఇక ఆ పంటకు డోకా ఉండదు. 45–50 రోజులకు పిఎండీఎస్ పంటలను కోసి ఆచ్ఛాదనగా వేయాలి. లేదా పశువులకు మేపాలి. అంతకుముందే ఖరీఫ్ పంటలను విత్తుకోవాలి. యూట్యూబ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే మరింత అవగాహన వస్తుంది. చదవండి👉🏾Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
నకిలీ విత్తనాలకు అడ్డుకట్టేది?
సాక్షి ప్రతినిది, ఖమ్మం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సలహా మేరకు రైతులు వరికి బదులు మిర్చి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేశారు. కానీ నకిలీ విత్తనాలతో ఆయా పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి చేపట్టిన పాదయాత్ర రెండోరోజు సోమవారం ముదిగొండ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా గోకినేపల్లి సమీపాన ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభు త్వం వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పంటలు సాగు చేసే రైతులకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేశారని, ఈ విషయంలో ప్రభుత్వ పాలసీ దుర్మార్గంగా ఉం దని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన గాడి తప్పిందని విమర్శించారు. రూ. 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే ఇందిరాసాగర్ పనులను కేసీఆర్ నిలిపివేయించి ప్రా జెక్టు రీడిజైన్ పేరిట నిర్మాణ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 25 వేల కోట్లకు పెంచారని భట్టి మండిపడ్డారు. సీఎల్పీ నేతగా రాష్ట్రం లోని అన్ని మండలాలకు వెళ్తానని, శాసనసభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సీఎం నియోజకవర్గంలో కొనుగోలు చేశాం.. భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా ముదిగొండ మండలంలోని గోకినేపల్లిలో రైతులు ఆయన్ను కలిశారు. కేసీఆర్ చెప్పినట్లు వరికి బదులు ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు వేస్తే.. నకిలీ విత్తనాలతో మునిగామని గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే ఈ విత్తనాలు కొన్నట్లు రైతులు వివరించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని భట్టి రైతులకు భరోసా ఇచ్చారు. -
80 దేశాలకు విత్తనాల ఎగుమతులు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్‌ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన హక్కులలో... రైతు విజయం
ప్రపంచం మొత్తంలో ఒక్క మన దేశ రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి. రైతులకు మేధోసంపత్తి హక్కు కల్పించడం కోసం మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి 20 ఏళ్లయ్యింది. విత్తనాలను ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి భారతీయ రైతులకున్న విశిష్ట హక్కుల చరిత్రలో మైలురాయి వంటి ఓ తీర్పు ఇటీవల వెలు వడింది. ఓ బహుళ జాతి కంపెనీకి చెంప పెట్టులాంటి తీర్పు ఇది. వేప, పసుపు, బాస్మతి బియ్యంపై అనాదిగా మన దేశానికి ఉన్న మేధో సంపత్తి హక్కుల తస్కరణకు గతంలో వివిధ కంపెనీల ఆధ్వ ర్యంలో ప్రయత్నాలు జరిగాయి. వాటిని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థలో డా. వందనా శివ వంటి ఉద్యమకారిణులు సమర్థ వంతంగా తిప్పికొట్టిన ఘన చరిత్ర మనకుంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధ రైతాంగ విత్తన హక్కుల పరిరక్షణ కృషిలో తాజా తీర్పు గుజరాత్ రైతులకు సంబంధించిందే కానీ.. దేశంలో రైతులందరికీ గొప్ప విజయం అనటంలో సందేహం లేదు. గుజరాత్ రైతులపై పెప్సీ కేసులు గుజరాత్ బంగాళదుంప రైతులకు వ్యతిరేకంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టిన బహుళ జాతి కంపెనీ పెప్సికో ఇండియా హోల్డింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగాళదుంప వంగడంపై పెప్సికో కంపెనీకి గతంలో ఇచ్చిన మేధో సంపత్తి హక్కులను కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ‘పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల ప్రాధికార సంస్థ (పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ.)’ ఇటీవల రద్దు చేయటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవయ్యేళ్ల క్రితం పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం–2001 ప్రకారం పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైంది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) విత్తన శాస్త్రవేత్తలు/ కంపెనీలు రూపొందించే కొత్త వంగడాలతో పాటు.. రైతులు సంప్రదాయ విజ్ఞానంతో రూపొందించే కొత్త వంగడాలకు కూడా ఈ చట్టం మేధో సంపత్తి హక్కులను కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఇలా ధ్రువీకరణ పొందిన కంపెనీల వంగడాలను సాగు చేసే రైతులు తమ పంట దిగుబడులను విత్తనాల కోసం వాడుకోవటంతోపాటు.. ఇతరులకు విక్రయించుకోవ టానికి కూడా ఈ చట్టం రైతులకు విశిష్ట హక్కును కల్పిస్తోంది. ప్రత్యే కంగా బ్రాండ్ పేరు ముద్రించిన సంచుల్లో పోసి విక్రయించకూడదు. అయితే, భారతీయ రైతులకున్న ఈ విశిష్ట హక్కును కాలరాసిన పెప్సికో కంపెనీకి చెంపపెట్టు లాంటి తీర్పును పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. వెలు వరించింది. లేస్ చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక బంగాళదుంప వంగ డానికి గతంలో ఈ కంపెనీకి ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ ఈ తీర్పు వెలువడింది. పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైన తర్వాత ఇలా ఒక వంగడంపై ధ్రువీకరణను రద్దు చేయటం ఇదే మొదటి సారి కావటంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) అసలేం జరిగిందంటే.. లేస్ చిప్స్ తయారీ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఎఫ్.ఎల్. 2027 అనే రకం బంగాళదుంప వంగడంపై పెప్సికో ఇండియా హోల్డింగ్ కంపెనీ ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల ప్రాధికార సంస్థ’లో 2016లో రిజిస్ట్రేషన్ చేయించి మేధో సంపత్తి హక్కులను పొందింది. గుజరాత్లో 12,000 మంది రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎఫ్.ఎల్.2027 రకం బంగాళదుంపలను పెప్సికో కంపెనీ సాగు చేయించింది. అయితే, ఈ రైతుల వద్ద నుంచి ఈ రకం బంగాళదుంప విత్తనాలు పొంది అక్రమంగా సాగు చేయడం ద్వారా 9 మంది గుజరాత్ రైతులు మేధో సంపత్తి ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ 9 మంది గుజరాత్ రైతులపై కేసులు పెట్టింది. ఒక్కో రైతు నుంచి తమకు రూ. కోటి పరిహారం ఇప్పించాల్సిందిగా కూడా పెప్సికో కంపెనీ వ్యాజ్యంలో కోరింది. రైతులపై కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమం పెల్లుబకటంతో కంపెనీ వెనక్కి తగ్గి, కేసులు ఉపసంహరించుకుంది. (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) కవిత దరఖాస్తు ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం–2001’ మన దేశంలో రైతులకు రిజిస్టరైన విత్తనాలను విత్తుకోవటం, దాచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, బ్రాండ్ ముద్ర వేయకుండా ఇతరులకు విక్రయించుకునే హక్కులను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వంగ డంపై పెప్సికో కంపెనీకి మేధో సంపత్తి హక్కుల ధ్రువీకరణ ఇవ్వటం సమంజసం కాదని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ రైతు హక్కుల ఉద్యమకారిణి, కురుగంటి కవిత 2019 జూన్ 11న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ.కు దరఖాస్తు చేశారు. 30 నెలల సుదీర్ఘ విచా రణ తర్వాత పెప్సికో కంపెనీకి ఎఫ్.ఎల్. 2027 బంగాళదుంప వంగ డంపై ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ డిసెంబర్ 3న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు తీర్పు ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం ధ్రువీకరణ కోసం కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చినందున, రిజి స్ట్రార్‌కు తగిన సమాచారాన్ని, పత్రాలను అందించనందున, పంట వంగ డాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం –2001 (సెక్షన్ 34 హెచ్) ప్రకారం ‘ప్రజాప్రయోజనాల’కు విఘాతం కలుగుతున్నందున, ధ్రువీ కరణ పొందిన వ్యక్తికి తగిన యోగ్యత లేనందున మేధాహక్కుల ధ్రువీ కరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు ప్రకటించారు. రద్దు కాకుండా ఉంటే 2031 జనవరి 31 వరకు పెప్సికోకు మే«ధా సంపత్తి హక్కులు కొనసాగేవి. రైతుల చట్టబద్ధమైన విత్తన హక్కులను, స్వేచ్ఛను తుంగలో తొక్కాలని ప్రయత్నించే విత్తన, ఆహార, పానీయాల వాణిజ్య సంస్థల ఆటలు సాగవని చెప్పడానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
ఏమిటీ విత్తన బంతులు.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పచ్చని చెట్లను పెంచడానికి వీలైన అన్ని వనరులను అధికార యంత్రాంగం సమీకరిస్తోంది. రెండేళ్లుగా చేపడుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ సత్ఫలితాలనిస్తుండడంతో.. పచ్చదనం పెంపునకు ఈ ఏడాది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. విశాఖ జిల్లాలోని కొండలు, గుట్టలు, ఖాళీ స్థలాల్లో విసిరేందుకు సామాజిక అటవీ శాఖ 2 లక్షల విత్తన బంతులను తయారుచేయిస్తోంది. అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి.. అడవులు సృష్టించాలంటే సాధ్యం కాని పని. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోయినా.. అడవుల్లో చెట్లు సహజ సిద్ధంగానే పెరుగుతాయి. ఇలాంటి అడవులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఇందుకోసం విలక్షణమైన విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిత హారం అడవిలో అంతంత మాత్రంగా కనిపించడం, గుట్టలు, కొండల్లో పచ్చదనం కనుమరుగవుతున్న విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న పచ్చతోరణం’పేరుతో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమిటీ విత్తన బంతులు? ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా.. ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు అధికారులు విత్తన బంతుల పద్ధతి అమలు చేస్తున్నారు. ముందుగా మన వాతావరణానికి అనుకూలమైన చింత, వేప, కానుగ, రెల్ల, కుంకుడు, ఏగిస మొదలైన చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సిద్ధం చేస్తారు. 75 శాతం ఎర్రమట్టిలో 25 శాతం ఆవుపేడ, కొంత కోకాపిట్ను కలిపి ఎరువు మిశ్రమంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం రోజులు మురుగబెడతారు. అనంతరం జీవామృతం(ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి వీడిపోకుండా గట్టిగా ఉండేందుకు స్టార్చ్ లిక్విడ్, బబుల్ గ్లూ ద్రావణాలు మట్టి ముద్దలో కలుపుతారు. ఈ మట్టి ముద్దల్లో విత్తనాలను పెట్టి ఎండబెట్టారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత కందకాలు, గుట్టలు, కొండలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. గతేడాది మంచి ఫలితాలు గతేడాది కూడా అటవీ శాఖ విత్తన బంతులను చల్లింది. మొత్తం 2 లక్షల విత్తన బంతులు తయారు చేయగా.. జీవీఎంసీకి 50 వేల బంతులు అందించారు. నౌకాదళంతో కలిసి నగరంలోని కొండలపై జీవీఎంసీ అధికారులు విత్తన బంతులు చల్లారు. మిగిలిన 1.50 లక్షల బంతులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు విసిరారు. వాటి నుంచి ప్రస్తుతం మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సూచనలతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులు తయారు చేస్తున్నాం. నేడు మనం జాగ్రత్త చేసిన విత్తనమే.. రేపు భారీ వృక్షంగా మారుతుంది. జగనన్న పచ్చతోరణంలో భాగంగా విత్తన బంతుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసి.. పెద్ద సంఖ్యలో వృక్ష సంపద పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే నౌకాదళ సహకారం కూడా తీసుకుంటాం. – ఎన్ ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి సీడ్ బాల్స్‌తో అనేక లాభాలున్నాయి.. కొండప్రాంతాల్లో గోతులు తవ్వి మొక్కలు నాటడం చాలా కష్టతరం. విత్తన బంతుల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పోషకాలు అధికంగా ఉండే మట్టిలో విత్తనాలను పెట్టడం వల్ల మొక్కలు బతికే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. గతేడాది చేపట్టిన సీడ్‌బాల్స్ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఈ పద్ధతిలో జిల్లాలోని అటవీ ప్రాంతం, రెవెన్యూ హిల్స్‌లో.. అన్ని రకాల ప్రదేశాల్లోనూ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్‌లో విత్తన బంతులు విసిరే ప్రక్రియ ప్రారంభిస్తాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్‌వో, సామాజిక అటవీ శాఖ -
విత్తనంపై రైతు పెత్తనానికి గండి!
విత్తనాల సాగు, అమ్మకాల్లో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు పలు ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో తీసుకొస్తున్నప్పటికీ విత్తన రైతు మూలాలను దెబ్బతిసే చర్యలకు మాత్రం సాహసించలేదు. కానీ 2019లో ప్రధాని మోదీ తీసుకొచ్చిన సీడ్ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలను పక్కన బెట్టింది. ప్రధానంగా రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ముసాయిదా లోపాయకారీగా ప్రైవేట్ రంగ కంపెనీలకు లబ్ధి కలిగిస్తూ నామమాత్ర ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకుంది. అందుకే తాము రైతు ఉద్యమాన్ని ప్రారంభించకపోయి ఉంటే 2019 విత్తన బిల్లుకు కేంద్రం ఇప్పటికే చట్ట రూపం కల్పించేదని రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన ప్రకటన సత్యమే అని చెప్పాలి. కేంద్రప్రభుత్వం రైతుల డిమాండ్లను గనుక పరిష్కరించకపోతే 16 రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లను తెంచిపారేస్తామని ఇటీవలే రైతు నేత రాకేష్ తికాయత్ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన 2019 విత్తన బిల్లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రైతు ఉద్యమం కనుక జరగక పోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే ప్రైవేట్ సీడ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విత్తన బిల్లుకు చట్టరూపం కల్పించేదని టికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ సీడ్ బిల్లులో ఉంటున్న అత్యంత సమస్యాత్మకమైన అంశం ఏమిటి అనేది చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో విత్తన క్రమబద్ధీకరణ నియంత్రణ విషయంలో సీడ్ బిల్లు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏమిటో చూద్దాం. 1966 సీడ్స్ యాక్ట్‌కు చట్టరూపం ఇవ్వడం ద్వారా వ్యవస్థీకృత సీడ్ ప్రోగ్రాంని దేశంలో అమలులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గాను 1968 సీడ్స్ నిబంధనలను రూపొందించారు. ఇప్పటివరకు ఈ చట్టం పరిమిత స్థాయిలోనే అమలవుతోంది. పైగా కొన్ని రకాల విత్తన రకాలను మాత్రమే ఈ చట్టం నియంత్రిస్తోంది. 1983లో నిత్యావసర సరుకుల చట్టం 1955 అధికారాల కింద విత్తన నియంత్రణ చట్టాన్ని నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. విత్తన పంపిణీ, సరఫరాను నియంత్రణ కోసం దీన్ని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల తర్వాత, 1966 సీడ్స్ యాక్ట్‌ను రద్దు చేసి దాని స్థానంలో సీడ్స్ బిల్ 2004ను తీసుకొచ్చారు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును సమర్ఫించినప్పుడు, ఈ బిల్లుకు వ్యతిరేకంగా కమిటీ బలమైన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ కంపెనీల లాభార్జనకు వ్యతిరేకంగా, రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ఈ ముసాయిదా బిల్లు ఏం చెబుతోంది అనే అంశాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది. అంతకు కొన్ని సంవత్సరాలకు ముందు, 2001లో అంటే బిల్లుని ఇంకా ప్రవేశపెట్టక ముందు, పంటల రకాలు, రైతుల హక్కుల చట్టం (పీపీవీఎఫ్ఆర్ఏ) తీసుకొచ్చారు. విత్తన వ్యాపారంలో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు ఈ చట్టంలో పొందుపర్చారు. విత్తన వ్యాపారంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి దారి కల్పించడాన్ని గౌరవిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రమాణాలను భారత్ పాటించాల్సినందువల్ల ఇలాంటి చట్టం ఒకటి తీసుకురావలసిన అవసరం అప్పట్లో ఏర్పడింది. శాసనపరమైన సంక్లిష్టతల మధ్యనే నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో సీడ్ బిల్లు ముసాయిదాను తీసుకొచ్చింది. అయితే ఈ ముసాయిదాలో నాటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పాక్షికంగా మాత్రమే మనం చూడవచ్చు. రైతులు తమ విత్తనాలను నమోదు చేసుకోవాలని, అవి తక్కువ అంకురోత్పత్తిని, భౌతిక స్వచ్ఛతను, జన్యు స్వచ్ఛతను కలిగి ఉండేలా జాగ్రత్తలు పాటించాలని బిల్లు ప్రతిపాదించిందన్న వాస్తవానికి వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ప్రధానంగా మాట్లాడింది. అలాంటి నిబంధనలు విత్తనాలను తయారు చేసి అమ్మే రైతుల హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. పైగా ఈ చట్టం మార్కెట్‌ను పూర్తిగా ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచేస్తోందని కమిటీ భావించింది. అందుకే విత్తనాల ధరల నియంత్రణపై, వాటి స్వీయ ధ్రువీకరణ తొలగింపుపై కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ ప్రయివేట్ విత్తన సంస్థలను అదుపుచేసే అంశాలను స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో విత్తన పంటల బీమా స్కీమ్‌ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని కమిటీ లేవనెత్తింది. అలాగే గుర్తించదగిన మరికొన్ని సూచనలను కూడా చేసింది. స్టాండింగ్ కమిటీ చేసిన అనేక ప్రతిపాదనలను 2019 ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. కానీ అనేక కీలకమైన అంశాలపట్ల ముసాయిదా ఇప్పటికీ మౌనం పాటిస్తోంది. రైతు మాత్రమే కాకుండా ప్రతి విత్తన ఉత్పత్తిదారుకూ చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్న క్లాజ్ 1(3)(బి)ని సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ప్రస్తుత ముసాయిదా పొందుపర్చింది కూడా. అయితే సాంప్రదాయిక విత్తన రకాలను నిల్వ చేసుకునేవారిని, లేదా విత్తనాలకు మరికాస్త విలువ కల్పించేవారిని కూడా చేరుస్తూ రైతు అనే నిర్వచనాన్ని మరింతగా విస్తరించాలనే స్టాండింగ్ కమిటీ సిఫారసుకు ఈ బిల్లులో చోటు లభించలేదు. తమ వద్ద ఉన్న విత్తనాలను తప్పకుండా నమోదు చేయాలని రైతులను ఈ ముసాయిదా ఇప్పుడు బలవంత పెట్టడం లేదు కానీ, రైతులు లేక కంపెనీలు కానివారు, (బహుశా దేశీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు) విత్తనాలను ఉత్పత్తి చేసి, అమ్ముకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. అలాగే మార్కెట్లో నాసిరకం విత్తనాలను, అవాంఛనీయమైన విత్తనాలను అమ్మడానికి వీల్లేకుండా, తప్పుముద్రతో వస్తున్న విత్తనాలను నిత్యం తనిఖీ చేయడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది కానీ, ఈ ముసాయిదా బిల్లులో అలాంటి యంత్రాంగం ప్రస్తావన లేదు. పైగా విత్తనం అనే నిర్వచనం పరిధిలో సింథటిక్ విత్తనాలను పొందుపర్చరాదని కమిటీ సూచించింది కానీ ఈ ముసాయిదా బిల్లు అదే సింథటిక్ విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు అనే నిర్వచనంతో చేర్చింది. అలాగే రైతుల భాగస్వామ్యం గురించి కమిటీ నొక్కి చెప్పింది. వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులను కేంద్ర విత్తన కమిటీలో తప్పకుండా పొందుపర్చాలని స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి కోరింది. ముసాయిదా బిల్లు రైతు ప్రతినిధుల భాగస్వామ్యాన్ని పొందుపర్చింది కానీ దానికి ఒక అర్హతను జోడిస్తూ ఆ డిమాండ్‌ను పలుచబార్చింది. విత్తన నియంత్రణ అమలులో రైతులను ఒక పార్టీగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని సూచిస్తూ, రైతుల ప్రాతినిధ్యం రొటేషన్ ప్రకారం ఉంటుందని ముసాయిదా బిల్లు పేర్కొంది. అలాగే కేంద్ర విత్తన కమిటీ ద్వారా లేక రాష్ట్ర స్థాయి విత్తన కమిటీల ద్వారా విత్తనాల ధరలను నియంత్రించవలసిన అవసరం గురించి స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి నొక్కి చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే లేదా ఇతర అనివార్య కారణాలతో కొత్త విత్తన రకాల నమోదును ప్రజలు వ్యతిరేకించేలా ఒక నిబంధనకూడా బిల్లులో పొందుపర్చాలని కమిటీ కోరుకుంది. దీనికి అనుగుణంగా విత్తన శాతం మూలాన్ని ప్రకటించాలని కూడా కమిటీ సూచించింది. అయితే ఈ సిఫార్సులు వేటినీ ముసాయిదా బిల్లులో చేర్చలేదు. రైతుల ప్రయోజనాల మాట ఏమిటి? దేశవ్యాప్తంగా విత్తనాల వ్యాపారంలోకి ప్రైవేట్ రంగం విస్తరించిన నేపథ్యంలో విత్తనాల ధరలు చుక్కలంటుతున్నాయి దీంతో విత్తన సాగు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు ఆవాల విత్తనాలను అమ్మడంలో భాగం పంచుకుంటున్న పయనీర్ అనే ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఒక కిలో ఆవాల విత్తనాలను 750 రూపాయలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న ధరలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. పలురకాల ప్రకృతిపరమైన ఉపద్రవాల కారణంగా తమ పంట కచ్చితంగా చేతికొస్తుందన్న నమ్మకం రైతులకు లేకపోగా, విత్తన సాగుకు పెట్టిన ఖర్చు కూడా వారు పొందలేకపోతున్నారు. సాగుకోసం చేసిన అప్పుల్ని చెల్లించడానికి డబ్బు అందుబాటులో లేకపోవడంతో వీరు తరచుగా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. శ్రుతి జైన్ వ్యాసకర్త జర్నలిస్ట్ (ది వైర్ సౌజన్యంతో) -
మన విత్తనం దేశంలోనే ఉత్తమం
సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు ► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. ► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్‌కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్‌కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. ► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్ చాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు ► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి. -
విత్తన భాండాగారంగా తెలంగాణ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత ఉందని.. అది ఈ ప్రాంతం, ఈ నేలలకే సొంతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇక్కడ సిద్ధమైన విత్తనం ప్రపంచంలో ఎక్కడైనా మొలకెత్తుతుందని చెప్పారు. అందుకే తెలంగాణ విత్తన భాండాగారం అయిందని పేర్కొన్నారు. శనివారం ఫ్యాప్సీ హాల్లో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాహితీవేత్తలకు నిర్వహించిన విత్తన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. జ్వలిత రచించిన సంగిడిముంత.. సుజనా రాజు ప్యూపా, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన బృందావనంల బాలల కథాసంపుటి పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దంపడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్తాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలు అందుబాటులోకి తేనున్నారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
పైసలు రాక పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విత్తన కంపెనీల అక్రమాలను అరికట్టడంలో ముందుండాల్సిన వ్యవసాయ ప్రయోగశాల(ల్యాబ్)లు.. ఆ కంపెనీలిచ్చే అప్పులతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ కష్టమవుతోందని, కంపెనీల నుంచే అప్పులు తీసుకుంటూ ల్యాబ్‌లు నడిపించాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. వివిధ పథకాల కోసం వ్యవసాయ శాఖ నుంచి ఏడాదికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంటారు. ల్యాబ్‌లకు రూ.1.36 కోట్లు ఇవ్వడానికి అశ్రద్ధ చూపటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజూవారీ ఖర్చులూ కష్టమే.. విత్తనాల నాణ్యత, నకిలీ విత్తనాల గుర్తింపు కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు ల్యాబ్‌లు నడుస్తున్నాయి. ఒకటి మలక్‌పేటలో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్ కాగా, మరో విత్తన పరీక్షల ల్యాబ్ రాజేంద్రనగర్‌లో ఉంది. జాతీయస్థాయిలో ఈ రెండూ ప్రతిష్టాత్మకమైన ల్యాబ్‌లే. 2 ల్యాబ్‌లలో ఏడాదికి 9 వేల నమూ నాలు పరీక్షిస్తారు. ప్రభుత్వం మాత్రం రోజువారీ నిర్వహణ ఖర్చులు కూడా విడుదల చేయడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల పరీక్షలూ ఇక్కడే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవకపోవడంతో ప్రైవేటు కంపెనీల నుంచి అప్పులు తీసుకుంటూనే ఇతర రాష్ట్రాల నమూనాలు కూడా పరీక్షించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇటీవల గుజరాత్, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ లు కూడా నమూనాలను ఇక్కడే పరీక్ష చేయించాయి. ఆ పరీక్షల నుంచి వచ్చే చార్జీలతోనే ఎంతో కొంత నిర్వహణ ఖర్చులకు సంపాదిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ
సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్., పి.జె.టి.ఎస్.ఎ.యు., ‘సీడ్’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495 -
స్నేహానికి 200 గంటలు
నమ్మకమనే విత్తనం లేకుండా, ఇష్టం, స్నేహం, ప్రేమ వంటి ఏ బంధమూ మొలకెత్తదు. అన్ని బంధాల్లోకీ తియ్యనైనది స్నేహం. దానికీ నమ్మకం అనే విత్తనం కావలసిందే కానీ.. అది మొలకెత్తడానికి కనీసం 200 గంటల సమయం పడుతుందట! కొత్తగా పరిచయమైన వ్యక్తి మీద నమ్మకం ఏర్పడి, వారిద్దరి మధ్య స్నేహం వెల్లివిరుస్తుంది. ఒకే గూటి పక్షులు ఒకే మాట మాట్లాడతాయన్నట్లుగా, ఒకే భావాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ స్నేహబంధం ఏర్పడుతుంది. అయితే మొదటి చూపులోనే ప్రేమ ఏర్పడినట్లుగా తొలి పరిచయంతోనే స్నేహం ఏర్పడదు అని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. కన్సాస్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న జెఫ్రీ హాల్.. స్నేహం గురించి పరిశోధన చేసి ఇద్దరు మనుషుల మధ్య స్నేహం ఏర్పడటానికి ఎంతలేదన్నా కొంత సమయం పడుతుందని అంటున్నారు. ఆన్లైన్ పరిశోధనలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రహించారు. గత ఆరు నెలలుగా కొత్త స్నేహితుల కోసం ఆసక్తి కనపరుస్తున్న 355 మందితో మాట్లాడారు. వారు కొత్తవారితో ఎన్ని గంటలు కలిసి ఉంటున్నారో పరిశీలించారు. సాన్నిహిత్యం, సరదాగా స్నేహం, స్నేహం, గాఢమైన స్నేహం... ఈ నాలుగు అంశాల మీద జెఫ్రీ హాల్ సర్వే జరిపారు. రెండవ దశగా 112 మంది విద్యార్థులను ప్రశ్నించారు. స్కూల్స్ తెరవడానికి రెండు వారాల ముందు నుంచే తాము, తమ స్నేహితులు కలుస్తామని వారు చెప్పారు. వారిని సుమారు నాలుగు నుంచి ఏడు వారాల పాటు అధ్యయనం చేశాక.. సాధారణమైన స్నేహం ఏర్పడటానికి 40–60 గంటల సమయం, సాధారణ స్థాయి నుంచి కొద్దిగా ముందుకు వెళ్లడానికి 80–100 గంటల సమయం, మంచి స్నేహితులు కావడానికి కనీసం 200 గంటల సమయం పడుతోందని హాల్ గమనించారు. అంటే మధురమైన స్నేహాన్ని పటిష్టంగా ఏర్పరచుకోవడానికి 200 గంటలు నిరీక్షించాల్సిందేనా? అవసరం లేదు. మంచి స్నేహం ఏర్పడిందంటే రెండొందల గంటలు గడిచి ఉంటాయనే అనుకోవాలి జెఫ్రీ హాల్ మాటల్ని బట్టి. – రోహిణి -
అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. విత్తన భాండాగారంకోసం కృషి చేస్తున్న తెలంగాణకు ఇది అరుదైన అవకాశమని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది. డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది. నాణ్యమైన విత్తనోత్పత్తికి అవకాశం ఉంటుందని, విదేశాలకు విత్తన ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని కేశవులు తెలిపారు. కేశవులు నియామకం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందించటానికి కేశవులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మన రాష్ట్రానికి చెందిన విత్తన శాస్త్రవేత్తకు ఈ హోదా దక్కడం అరుదైన విషయమన్నారు. విత్తన భాండాగారం సాధనకు విశేష కృషి జరుగుతున్న ఈ తరుణంలో ఇది శుభసూచకమని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ అన్నారు. -
పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం
సాక్షి, హైదరాబాద్: ‘‘పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం. నకిలీ విత్తన సరఫరా దార్లపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీ విత్తన సరఫరా సంస్థలపై పీడీ యాక్ట్ తెచ్చాం’’ అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం సచివాలయంలో ‘‘ఇండో– జర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్’’ లో భాగంగా జరిగిన ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత విత్తన చట్టం స్థానంలో కొత్త విత్తన చట్టం తీసుకు రావడం, దేశీయ అవసరాలకు అనుగుణంగా సేంద్రియ ధ్రువీకరణ విధానాన్ని రూపొందించుకోవడం, సీడ్ పా ర్క్స్ ఏర్పాటు, ప్రైవేటు విత్తన సంస్థలను ప్రోత్సహించ డం అనే 4 అంశాలపై పలు ప్రతిపాదనలు తీర్మానించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూసే విధంగా వ్యవ సాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్య లు చేపట్టిందన్నారు. ప్రస్తుతం దేశ విత్తన అవసరా లలో 60% రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నా యని, ఈ ఏడాది 20 దేశాలకు విత్తనాల ఎగుమతి జరుగుతుందన్నారు. స్వయంగా రైతే సీఎంగా ఉం డటం తెలంగాణ అదృష్టమన్నారు. జర్మనీ సాంకేతికతో రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగుతుందన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన బృందంతో జర్మనీ సందర్శిస్తామన్నారు. -
ప్రకృతి సేద్యం – విత్తనోత్పత్తిపై రైతులకు నెల రోజుల ఉచిత శిక్షణ
ప్రకృతి వ్యవసాయం, విత్తనోత్పత్తిపై రైతులకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు నిర్ణయించింది. 240 గంటల పాటు (నెలకు పైగా) శిక్షణ ఉంటుంది. వసతి, భోజనం ఉచితం. శిక్షణకు రానుపోను ప్రయాణ ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. శిక్షణ ఆంగ్లంలో ఉంటుంది. ఇతర వివరాలకు.. 080– 28432965 నంబరులో లేదా training.ssiast@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. -
బీటీ పత్తి విత్తనాల ధర ఖరారు
– బీటీ–1 ప్యాకెట్ ధర రూ.635 – బీటీ–2 ప్యాకెట్ ధర రూ.800 కర్నూలు(అగ్రికల్చర్): బీటీ పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ధర కాస్త తగ్గింది. ఈ ఏడాది జిల్లాలోని కర్నూలు, ఆదోని డివిజన్లలో పత్తి సాగు పెరిగే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ జిల్లాకు 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లను కేటాయించింది. బీటీ–1 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.635, బీటీ–2 విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.800లుగా నిర్ణయించింది. -
విత్తన విక్రయం... ప్రశ్నార్థకం
► గతేడాది ఏపీసీడ్స్‌లో రూ.50 కోట్లకు విక్రయాలు ► ఈ ఏడాది ఒక్క బస్తా విక్రయించలేని పరిస్థితి శ్రీకాళహస్తి: తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ కీలకంగా మారింది. రాష్ట్ర విత్తనశుద్ధి సంస్థ(ఏపీసీడ్స్)లో ప్రాసెసింగ్(విత్తనశుద్ధి) చేసిన వరి విత్తనాలను ఇతర జిల్లాలకు విక్రయించాలా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ప్రాసెసింగ్‌ను ప్రారంభించారు. ప్రధానంగా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు మినహా మిగిలిన అన్ని జిల్లాకు శ్రీకాళహస్తి నుంచి వరి విత్తనాలు మూడేళ్లుగా పంపుతున్నారు. గతేడాది రూ.50 కోట్ల మేరకు వరి విత్తనాలు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వరి విత్తనాలు శ్రీకాళహస్తి నుంచి పంపించారు. దీంతో ఏపీసీడ్స్‌కు మంచి ఆదాయం లభించిందని అప్పట్లో అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది కూడా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ నుంచి ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు తమిళనాడుకు పంపాలని భావించారు. ఈ మేరకు గత అక్టోబర్, నవంబర్‌లో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది 98వేల క్వింటాళ్లు వరిధాన్యం వచ్చిందని, ఈ ఏడాది రబీ సీజన్లో లక్ష పది క్వింటాళ్లు వరి ధాన్యం వస్తుందని అధికారులు భావించారు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో ఏపీసీడ్స్‌కు రైతుల నుంచి కేవలం 32వేల క్వింటాళ్లు మాత్రమే వరి విత్తనాలు వచ్చాయి. ప్రతిఏటా మార్చిలోనే వాటిని ప్రాసెసింగ్ చేసి, ఇతర జిల్లాలకు విక్రయించేవారు. గతేడాది మార్చి లోనే రూ.2 కోట్ల విలువైన విత్తనాలు ఇతర జిల్లాకు విక్రయించిన విషయం తెలిసిందే. తక్కువ ధాన్యం రావడంతో మే 1వ తేదీ నుంచి విత్తనాల ప్రాసెసింగ్ ప్రారంభించారు. ప్రాసెసింగ్ అయిన విత్తనాలను ఇతర జిల్లాలకు విక్రయిస్తే, స్థానికంగా రైతులకు రబీలో విత్తనాల కొరత తలెత్తే ప్రమాదం ఉందని, దీంతో బయట జిల్లాలకు కొంతమేరకు విత్తనాలు విక్రయిం చాలా, వద్దా అనే విషయం సందిగ్ధంగా మారింది. మొత్తం మీద వర్షాలు లేకపోవడంతో ఏపీసీడ్స్‌కు ఆశించిన మేరకు వరిధాన్యం రాకపోవడంతో ఏపీసీడ్స్‌కు కష్టాలు తప్పడంలేదు. -
నాసిరకం విత్తు.. రైతు చిత్తు
= ముంచిన సబ్సిడీ నాసిరకం విత్తనం = 1,500 ఎకరాల్లో చేతికందని వరి పంట = ఎకరాకు రెండు సంచులే ధాన్యమే దిగుబడి = లబోదిబోమంటున్న రైతులు ఉరవకొండ : నాసిరకం విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచాయి. ప్రైవేటు డీలర్ల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దంటూ వ్యవసాయాధికారులు ఊరూవాడా ప్రచారం చేయడంతో రైతులంతా ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనం కొని నిండా మునిగిపోయారు. నాలుగునెలలపాటు కుటుంబమంతా పంటను బిడ్డలా కాపాడుకున్నా రెండు మూటలు మించి దిగుబడి రాకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కనీసం పెట్టుబడి కూడా పెట్టుబడి తిరిగి రాక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ మండలం ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి గ్రామాల్లో బోరు బావులు కలిగిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టులో కణేకల్లు ప్రభుత్వ ఫాం ద్వారా నెల్లూరు వెరైటీ వరి వంగడాన్ని సబ్సిడీపై అందించారు. నాణ్యమైన వరి విత్తనం అంటూ అధికారులు ప్రచారం చేయడంతో రైతులు ఒక పాసుపుస్తకంపై ఒక్కో ప్యాకెట్‌ను రూ.650 చెల్లించి కోనుగోలు చేశారు. విత్తనం వేసి నెలలు గడిచినా పంట ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోâýæనకు గురయ్యారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు పట్టించుకోలేదు. 1,500 ఎకరాల్లో దిగుబడి లేదు రైతులు ఎకరాకు రూ.20 వేల వరుకు పెట్టుబడి పెట్టి సబ్సిడీ వరి విత్తనం సాగుచేశారు. ఆరు నెలలు అవుతున్నా పంటలో ఎదుగుదల లేదు. కొన్ని గింజలు మాత్రమే కనిపిస్తుండటంతో తమకు ప్రభుత్వం నాసిరకమైన విత్తనం అంటగట్టిందని గుర్తించారు. సాధారణంగా ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరి దిగుబడి వచ్చేది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు ఆదాయం లభించేది. ప్రస్తుతం నాసిరకం విత్తనం కారణంగా ఎకరాకు 3 బస్తాలు కుడా అందని పరిస్థితి. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చేలా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. నాసిరకం వరి విత్తనం అంటగట్టి మోసగించిన ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రాకెట్ల రైతులు అనిల్, సురేష్, అశ్వర్థరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, లాలెప్ప, చిన్ననాగన్న తదితరులు కోరుతున్నారు. -
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మన్ పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
విత్తన చట్టంలో మార్పులు తెస్తాం
పెద్దాపురం : చరిత్ర కల్గిన పెద్దాపురం దుంప పరిశోధన కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక దుంప పరిశోధనా కేంద్రాన్ని మంత్రి పుల్లారావు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరిగిన సభలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ బయో పేరుతో రసాయనాలతో ఎరువులు కల్తి చేసిన చేసిన 51 కంపెనీల యజమానులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడతామని హెచ్చరించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పరిశోధనా కేంద్రాన్ని పెద్దాపురం తీసుకువచ్చిన ఘనత రాజప్పదేనన్నారు. మంత్రి రాజప్ప మాట్లాడుతూ రైతు అభివృద్ధికి పాటుపడుతాన్నారు. అనంతరం సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన నూతన పరిశోధన కేంద్ర భవనానికి మంత్రులు, ఎంపీ, భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేలు వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, జిల్లా గ్రం«థాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, రైతు నేతలుమాసిన వెంకట్రావు, పుట్టా సోమన్నచౌదరి, నున్నా రామకృçష్ణ (రాంబాబు), రంధి సత్యనారాయణ, ఎంపీపీ గుడాల రమేష్, జెడ్పీటీసీ సుందరపల్లి శివ నాగరాజు పాల్గొన్నారు. -
విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు
సూర్యాపేటః ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మిరప విత్తనాల విక్రయాలకు సంబంధించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు దుకాణాల్లో డివిజన్ వ్యవసాయాధికారి కె.శంఖర్ రాథోడ్ ఆధ్వర్యంలో తనఖీలు చేశారు. స్థానిక సాయికృప ఆగ్రో ఏజెన్సీస్, శ్రీరామచంద్ర సీడ్స్ దుకాణల్లో నకిలీ మిరప విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు దుకాణాల్లోనూ జీవ ఆగ్రో జెనిటిక్స్ కంపెనీకి చెందిన జేసీఫోర్ 801 మిరప విత్తనాలను విక్రయించడం జరిగిందని తెలిపారు. విత్తనాల విక్రయ రసీద్లను స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. విత్తన, ఎరువుల దుకాణాల యాజమానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓలు అరుణ, సందీప్‌తో పాటు పలువురు ఉన్నారు. -
ఆ విత్తనాలు నకిలీవే..
నిర్ధారించిన అధికారులు, శాస్త్రవేత్తలు బండారుపల్లి (తాడికొండ రూరల్): తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో 1000 ఎకరాలలో పూత, పిందె లేకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్న విత్తనం నకిలీదేనని అధికారులు నిర్ధారించారు. మంగళవారం గ్రామంలో శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించిన అనంతరం నకిలీ విత్తనంగా తేల్చారు. మొత్తం 80 క్వింటాళ్ళకు పైగా బ్రహ్మపుత్ర–555 విత్తనాన్ని తమకు అంటగట్టారని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. ఇప్పటికే ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి రూపంలో పెట్టామని, తమకు పరిహారం వచ్చేలా విత్తన కంపెనీపై చర్యలు తీసుకోపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. లాంఫాం శాస్త్రవేత్త శారద, ఉద్యానశాఖ డీడీఏ జయచంద్రారెడ్డితో కలిసి పలువురు అధికారులు మిరప పంటను పరిశీలించిన అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. బిల్లులు, విత్తన సంచుల ఆధారంగా రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు సేకరించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, వ్యవసాయాధికారి మన్నవ నాగరాజు, ఉద్యాన శాఖాధికారి రవిప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు మానుకొండ రత్తయ్య పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలతో భారీ నష్టం
-
నకిలీ విత్తనాలతో భారీ నష్టం
కొరిటెపాడు(గుంటూరు) : మిరప కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. నకిలీ కల్తీ విత్తనాల వల్ల మిరప పంట నష్టపోయిన మేడికొండూరు, అమరావతి మండలాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.డి.వి.కపాదాసును కలసి వినతి పత్రం అందజేశారు. రంగారావు మాట్లాడుతూ నకిలీ విరప విత్తనాల వల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయాలకు కూత వేటు దూరంలో నకిలీ విత్తనాలు విచ్చల విడిగా అమ్మకాలు జరగడం దుర్మార్గమన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. జేడీఏ కపాదాసు మాట్లాడుతూ ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతు ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో పర్యటిస్తున్నారని, నివేదిక రాగానే విత్తన చట్టం ప్రకారం నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేడీఏను కలసిన వారిలో కౌలు రైతు సంఘం నాయకులు కె.అజయ్‌కుమార్, బైరగాని శ్రీనివాసరావు, అమరావతి, మేడికొండూరు మండలాల రైతులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై రైతుల ఆందోళన
వ్యాపారిపై దాడి కాల్వొడ్డు, టీడీడీసీ, జేడీఏ కార్యాలయాల వద్ద ధర్నా కలెక్టర్, జేడీఏ హామీతో ఆందోళన విరమణ ఖమ్మం వ్యవసాయం : నకిలీ మిరప విత్తనాలపై రైతులు ఖమ్మం రోడ్లపై కదం తొక్కారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయామని తమకు తగిన న్యాయం చేయాలని సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, బోనకల్లు, చింతకాని, వైరా, వేంసూరు, తల్లాడ, వరంగల్ జిల్లా డోర్నకల్, కురవి, మరిపెడ మండలాలకు చెందిన రైతులు వందలాదిగా ఖమ్మం వచ్చి వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేశారు. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, డోర్నకల్, కురవి మండలాలకు చెందిన రైతులు జీవా మిరప విత్తనాలు విక్రయించిన ఖమ్మం నగరంలోని పొట్టి శ్రీరాములు రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ భార్గవిసీడ్స్ దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలమని రైతులు అక్కడే కూర్చున్నారు. అక్కడకు చేరిన వ్యాపారి మోహన్‌రావుపై దాడి చేశారు. పోలీసులు వ్యాపారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రైతులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అక్కడ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాల్వొడ్డుకు చేరుకొని రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనను తెలుసుకున్న జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎ.ఝాన్సీకుమారి, ఉపసంచాలకలు విజయనిర్మల ఘటనా స్థలానికి చేరుకొని రైతులు వ్యవసాయ కార్యాలయానికి రావాలని, అక్కడ విషయాన్ని చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో రైతులు జేడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు బోనకల్లు, చింతకాని, వైరా, తల్లాడ, రఘునాథపాలెం, వేంసూరు, ముదిగొండ మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో నకిలీ మిరప విత్తనాలపై తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు టీడీడీసీ భవన్లో సమావేశంలో ఉన్నారని తెలిసి రైతులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ జేడీఏ, డీడీఏలు ఉండటంతో ఆయా అధికారులను ఘెరావ్ చేశారు. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ లోకేషకుమార్ దృష్టికి తీసకు వెళ్లారు. కలెక్టర్ తమ వద్దకు వచ్చి తగిన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ టీడీడీసీ భవన్‌కు వచ్చి రైతులు చెప్పిన అంశాలను విన్నారు. నకిలీ మిరప విత్తనాలకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకోవాలని, విత్తనాలు విక్రయించిన ఏజెన్సీలను, కంపెనీల ప్రతినిధులను పిలిపించాలని వ్యవపసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. అందుకు గడువు పెట్టాలని రైతులు డిమాండ్ చేయడటంతో 4 రోజుల గడువులో కంపెనీ ప్రతినిధులను పిలిపించి మాట్లాడుతామని చెప్పారు. అక్కడ నుంచి వ్యవసాయ అధికారులు జేడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ ధర్నా చేస్తున్న రైతులకు కూడా అదే విషయాన్ని వివరించారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జిల్లా ఉన్నతాధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళనను విరమించారు. శ్రీలక్ష్మీభార్గవి సీడ్స్ దుకాణం వ్యాపారి మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. -
కాపు రాని మిర్చి విత్తనం
అమరావతి: మండల పరిధిలోని గ్రామాల్లో విత్తిన జీవా కంపెనీకి చెందిన మిర్చి రకం విత్తనం ఎదుగుదలలో తేడా గమనించి నకిలీ విత్తనాలుగా గుర్తించి సోమవారం ఉదయం రైతులు విత్తన దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలలో కెళితే మండలంలోని అత్తలూరు, నూతలపాటివారిపాలెం, తురగా వారిపాలెం, బయ్యవరం, పెదకూరపాడు మండలంలోని పలుగ్రామాల రైతులు రెండు నెలలక్రితం జీవా కంపెనీకి చెందిన (జేసీహెచ్ 802) మిరప విత్తనాలను పెదకూరపాడు మండలంలో 75 త్యాళ్ళూరులో ఉన్న త్రివేణి పెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేశారు. అత్తలూరుకు చెందిన మదమంచి ఆదిశేషగిరిరావు మిరపతోటలో పెరుగుదల, కాపు విషయంలో తేడా ఉండడం గుర్తించి అదే విత్తనం వేసిన మిగిలిన పొలాలు కూడా పరిశీలించారు. మిగతా రైతులతో కలిసి సోమవారం దుకాణదారుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు. తమకు ఎకరానికి సుమారు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చయిందని రైతులు వాపోతున్నారు. దీనిపై దుకాణదారుడు సరైన రీతిలో స్పందించకపోవడంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఊరట కరువు
ఆకాశంలో రబీ విత్తన ధర – వర్షాభావంతో నష్టాల్లో అన్నదాత – కిలో శనగ ధర రూ.98.66 – సబ్సిడీ 40 శాతమే.. – కిలోకు చెల్లించాల్సిన మొత్తం రూ.59.20 – మార్కెట్లో తక్కువ ధరకే లభ్యం – 24 నుంచి విత్తన పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంట కళ్లెదుటే కరిగిపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతు పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి కరువైంది. సీజన్లో వర్షాభావం కారణంగా 2,66,428 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగమే అంచనా వేసింది. చాలా వరకు ఈ భూముల్లో రబీ పంటల సాగుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కరువు రైతుకు ఊరటనిచ్చేలా రబీ సీజన్‌కు అవసరమైన శనగ విత్తనాల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ధర నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే కిలో శనగ విత్తనాలపై ఏకంగా రూ.34.16 పెంచి రైతుల నడ్డి విరిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అదనపు భారం రూ.15.88 కోట్లు. మార్కెట్ రేటును మించి ధర పెంచి.. కంటి తుడుపుగా 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ధర లు ఖారారు కావడంతో విత్తనాలను కూడా వెంటనే పొజిషన్ చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ విలేకరులకు తెలిపారు. ఈ నెల 24 నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శనగ ధరలు ఇలా.. రబీలో శనగ సాగు ప్రధానమైంది. జిల్లాలో ఈసారి 2 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. ఈ సారి జిల్లాకు 98వేల క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అలాట్మెంట్ ఇచ్చింది. వీటిని అయిల్‌ఫెడ్, ఎపీ సీడ్స్, మార్క్‌ఫెడ్ సరఫరా చేస్తాయి. గత ఏడాది కిలో విత్తనం ధర రూ.64.50 ప్రకటించి.. రూ.21.50(33.33 శాతం) సబ్సిడీ ఇచ్చింది. ఈ లెక్కన రైతు కిలో విత్తనాలకు రూ.43 చెల్లించాలి. కమీషన్ మత్తులో పడిన ఉన్నతాధికారులు వ్యాపారులు సంక్షేమం లక్ష్యంగా ఈ సారి కిలో పూర్తి ధర రూ.98.66లుగా నిర్ణయించింది. మార్కెట్లో క్వింటా ధర రూ.8వేల వరకు ఉండగా.. ప్రభుత్వం క్వింటా ధర రూ.10వేలుగా ప్రకటించడం గమనార్హం. సబ్సిడీ కూడా 40 శాతం ప్రకటించడంతో.. రైతులు కిలోకు రూ.59.20 చెల్లించాల్సి వస్తోంది. -
రబీ విత్తనం..పంపిణీ ప్రశ్నార్థం
– జాడలేని బయోమెట్రిక్‌లు – ఇంతవరకు ఖరారు రాని ధరలు –వర్షాలు పడుతుండడంతో రైతుల ఎదురు చూపు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షాలు విస్తారంగా పడుతుండటంతో రైతులు రబీ సీజన్‌కు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా రబీలో శనగ పంటను సాగు చేస్తారు. ప్రతి ఏడాది జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా ఈ పంట సాగవుతోంది. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినడంతో ఈ ఏడాది శనగ సాగు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ మండలాల్లో రైతులు దెబ్బతిన్న పంటలను దున్నేసి రబీకి సిద్ధం అవుతున్నారు. ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో రైతులు ఈ మేరకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే విత్తనాల పంపిణీ ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. కేటాయింపులు ఇలా... జిల్లాకు శనగ విత్తనాలు 98వేల క్వింటాళ్లు కేటాయించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి మండలాల వారీగా వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇంతవరకు బయోమెట్రిక్ మిషన్లు జిల్లాకు రాలేదు. బయోమెట్రిక్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలంటే ముందుగా వ్యవసాయాధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా సబ్సిడీపై పంపిణీ చేసే శనగ విత్తనాలు ధర, సబ్సిడీలు ఖరారు కాలేదు. ధరలు ఖరారు కానిదే విత్తనాలను పంపిణీకి పొజిషన్ చేయలేరు. ఇందువల్ల విత్తనాల పంపిణీలో ఈ సారి జాప్యం జరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు. ఏవోల చుట్టూ ప్రదక్షిణ.. రబీ సీజన్ ముంచుకొస్తున్నా విత్తనాల పంపిణీ అతీగతీ లేకుండా పోయింది. దీంతో విత్తనాల పంపిణీ ఎపుడూ అంటూ రైతులు కొద్ది రోజులుగా వ్యవసాయ అధికారుల(ఏవోల) చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో వ్యవసాయాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి విత్తనాల పంపిణీ మొదలైంది. ఈ సారి ఇప్పటి వరకు విత్తనాల పంపిణీపై ప్రభుత్వం నుంచే తగిన చర్యలు లేకపోవడంతో అధికారులు కూడ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై జేడీఏ ఉమామహేశ్వరమ్మను వివరణ కోరగా.. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని.. ధరలు ఖరారు అయిన వెంటనే పొజిషన్ చేస్తామని చెప్పారు. -
దేశీయ విత్తనమే జాతికి పునాది
ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీవిత్తన సంబరంలో వక్తలు కొరిటపాడు (గుంటూరు): దేశీయ విత్తనమే మన జాతికి పునాది అని వివిధ రాష్ట్రాల దేశీ విత్తనోద్యమకారులు ఎలుగెత్తిచాటారు. హరిత భారతి ట్రస్టు(విజయవాడ) ఆధ్వర్యంలో నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీ విత్తన సంబరంలో పలువురు విత్తనోద్యమకారులు ప్రసంగించారు. కర్ణాటకకు చెందిన జాతీయ విత్తన ఉద్యమకారుడు Mýష్ణప్రసాద్ మాట్లాడుతూ నేలే మనకు తల్లి అని, మనం ఏ విత్తనం నాటితే తల్లి ఆ విత్తనాలను వందల పాలబిడ్డలుగా అందిస్తుందని చెప్పారు. దేశీయ లేదా సొంత విత్తనమే మన వ్యవసాయానికి పునాది అని, ఆ పునాదిని బలంగా నిర్మించడమే ఈ దేశీయ విత్తన సంబరమని పేర్కొన్నారు. హరిత భారతి ట్రస్టు నిర్వాహకుడు సీహెచ్ త్రినాథ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు భాస్కరన్ మాట్లాడుతూ పాలేకర్ సూచనలకు అనుగుణంగా రైతులు సహజ వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు. వేప నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరప కాయలతో కషాయం తయారు చేసి చీడపీడలను నివారించుకోవాలని చెప్పారు. వరి పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే చిన్న చిన్న పురుగులను ఏరుకుని తింటాయన్నారు. వక్తలు వారి వారి రాష్ట్రాల్లో సాగు చేసిన దేశవాళీ విత్తనాల గురించి తెలియజేశారు. వారి రాష్ట్రాల్లో పండించిన పంటల విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. రైతుల నుంచి హామీపత్రం తీసుకుని ఉచితంగా 5 రకాల దేశవాళీ వరి విత్తనాలు, కంది విత్తనాలు 100 గ్రాములు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జాతీయ పత్తి సలహా సంఘం సభ్యుడు డాక్టర్ డీ నరసింహారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఇంద్రసేనారెడ్డి, తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు జయచంద్రన్, రామస్వామి, సోంపేటకు చెందిన ఢిల్లీరావు, పద్మజ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారుగా రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. -
విత్తు.. చిత్తు
♦ వానలు లేక.. విత్తనం మొలకెత్తక.. ♦ చేలను దున్నేసుకుంటున్న దైన్యం ♦ దిక్కుతోచని స్థితిలో రైతన్నలు జిల్లా రైతన్నకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. పంట మొలకెత్తక పోవడంతో దున్నేస్తున్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన బేగరి పోచయ్య, లక్ష్మి దంపతులు. వీరికున్న నాలుగున్నర ఎకరాల్లో 20 రోజుల క్రితం మొక్కజొన్న సాగుచేశారు. అంతరపంటగా కంది విత్తనాలు నాటారు. తొలకరి వర్షాలకు దుక్కిని సిద్ధం చేసుకుని ఆ మరుసటి వర్షాలకే విత్తనాలు నాటినా మొలకెత్తలేదు. తీవ్ర నిరాశకు గురైన ఆ రైతు దంపతులు సోమవారం తమ చేనులో మొలకల్ని ట్రాక్టర్‌తో దున్నేశారు. దౌల్తాబాద్: విత్తిన విత్తనం మొలకెత్తే ఆశే కనిపించడం లేదు. నిత్యం నింగికేసి చూస్తున్నా అన్నదాతను వరుణుడు కరుణించడం లేదు. చిన్నపాటి జల్లులు మినహా పెద్ద వానలు పడింది లేదు. దీంతో తొలకరి వర్షాలకు విత్తనాలు వేసుకున్న రైతులు కకావికలమవుతున్నారు. విత్తు మొలకెత్తక చిత్తవుతున్నారు. బోలెడు పెట్టుబడితో నాటిన పంట చేలు సరిగా మొలకెత్తకపోవడంతో పంటను చెడిపేసుకుంటున్నారు. మళ్లీ విత్తుతున్నారు. అన్నదాత దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వైనానికి నిదర్శనం ఈ సంఘటన. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన బేగరి పోచయ్య, లక్ష్మీ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికున్న నాలుగున్నర ఎకరాల్లో 20 రోజుల క్రితం మొక్కజొన్న సాగుచేశారు. అంతర పంటగా కంది విత్తనాలు నాటారు. తొలకరి వర్షాలకు దుక్కిని సిద్ధం చేసుకుని ఆ మరుసటి వర్షాలకే విత్తనాలు నాటిన ఆ రైతు కుటుంబానికి నిరాశే మిగిలింది. విత్తు నాటాక చిరు జల్లులు మినహా పెద్దగా వర్షం కురవకపోవడంతో చేలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు. సగానికి పైగా విత్తనాలు మొలవకపోవడంతో మొక్కలు పలుచగా కనిపిస్తున్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ రైతు దంపతులు సోమవారం తమ చేలో మొలకల్ని దున్నేసుకున్నారు. ట్రాక్టరుతో చేలో మొక్కలను దున్నేసి మళ్లీ విత్తునాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రూ.40వేలు ఖర్చయ్యాయి నాలుగున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశా. మొక్కజొన్న విత్తనాలకు రూ.8వేలు, కంది విత్తనాలకు రూ.5వేలు, ఎరువులకు రూ.6 వేలు, కూలీలకు రూ.3 వేలు, దున్నడానికి రూ.10వేల దాకా ఖర్చయింది. ఇప్పుడు చేను మొలకెత్తక మళ్లీ దున్నేసి విత్తనాలు నాటాలంటే మరో రూ.15వేల దాకా ఖర్చవుతుంది. వర్షాలు సరిగా కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నష్టాల్లో కూరుకుపోతున్నాం. - బేగరి పోచయ్య, రైతు, దొమ్మాట -
మత్స్యకారుల ధర్నా
మహబూబ్‌నగర్ జిల్లా : ప్రభుత్వం నాణ్యమైన చేపల సీడ్‌ను సబ్సిడీ ద్వారా మత్స్య కార్మికులకు అందించాలని కోరుతూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మత్స్యకారులు ధర్నాకు దిగారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతీ మత్స్యకారునికి ప్రతి నెలా రూ.1000ల ఆసరా పింఛన్ ఇవ్వాలని, జిల్లా, మండల కేంద్రాలలో శాశ్వత మార్కెటింగ్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది మత్స్యకార్మికులు పాల్గొన్నారు. -
ధ్యానమే శక్తి
ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహాపిరమిడ్‌లో ప్రపంచ ఐదో ధ్యాన మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది మహాపిరమిడ్‌లో ధ్యానం చేశారు. బ్రహ్మర్షీ పత్రీజీ, ఇతర ధ్యాన గురువులు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కడ్తాల /ఆమనగల్లు: ధ్యానమయ జీవితం సుందరమయమని, ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారే ధ్యానులని ధ్యాన గురువు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ పేర్కొన్నారు. ధ్యానమే ముక్తి, ధ్యానమే శక్తి అని ధ్యానంతో మనలను మనం శక్తివంతులుగా తయారు చేసుకోవచ్చని అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో జరుగుతున్న ఐదో ధ్యాన మహాచక్రాలు శుక్రవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పత్రీజీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక వేణునాద ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రీజీ ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. గురువుల సమక్షంలో సాముహిక ధ్యానం, సంగీత ధ్యానం, ప్రకృతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం, యోగ ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తి మూడురె ట్లు అధికంగా పొందవచ్చని చెప్పారు. మనసంతా మనతో ఉంటూ, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉచ్వాసనిచ్వాసలను గమనించడమే ధ్యానమని పేర్కొన్నారు. మంత్రం, యంత్రం, తంత్రం, మాయా ఏమి లేదని, శ్వాస మీదా ధ్యాసే ధ్యానమని సూచించారు. ధ్యానం... పైసా ఖర్చులేని ప్రక్రియ: మందా నయా పైసా ఖర్చులేని కొత్త ప్రక్రియ ధ్యానమని, పత్రీజీ కొత్త తరహా ఆలోచనలతో ధ్యానాన్ని మనకు పరిచయం చేశారని, ధ్యానం ఖర్చులేని వైద్యమని నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మం దా జగన్నాథం పేర్కొన్నారు. ధ్యానంకు సమయం అంటూ లేదని, మనకు వీలు దొరికిన సమయాల్లో శ్వాసమీద ధ్యాసతో ధ్యానం చేయవచ్చని సూచించారు. శరీరంలోని అన్ని రసాయన ప్రక్రియలను సమతుల్యంలో ఉంచేంది ధ్యానమని తెలిపారు. ధ్యానంలో మనమంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళలు- ఏడు శరీరాలు, సనాతనం-సనూతనం, విశ్వాసఫలం తదితర ధ్యాన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎంపీ జగన్నాథంను పిరమిడ్ ట్రస్టు సభ్యులతో కలిసి పత్రీజీ సన్మానించారు. -
విత్తనోత్పత్తికి కరెంటు గండం
వీణవంక : ‘రబీలో గుంట భూమి వదలకుండా హైబ్రిడ్(ఆడ, మగ) వరి పంట వేయాలి. ఈసారి అధిక దిగుబడి సాధించాలి. ఎకరంలో రూ.80 వేల లాభం రాబట్టాలి’ వరి విత్తనోత్పత్తి రైతుల నిన్నటి ధీమా ఇది. ‘కరెంటు ఇవ్వలేం. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందే’ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. విత్తనోత్పత్తి రైతులకు షాక్. ‘ఎస్సారెస్పీలో నీళ్లు లేవు. 90 టీఎంసీలకు 19 టీసీఎంలే నిల్వ ఉన్నాయి. ఇవి తాగునీటికే సరిపోతాయి. రబీలో కాలువ కు నీరు వదలడం కుదరదు’ - ప్రాజెక్టు సీఈ శంకర్ ప్రకటన. విత్తనోత్పత్తిలో జిల్లా టాప్ విత్తనోత్పత్తిలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. 55కు పైగా విత్తనోత్పత్తి కం పెనీలు 25ఏళ్లుగా జిల్లాలో పాగా వేశాయి.ఏటా రూ.100కోట్లకు పైగా రైతులకు చెల్లిస్తున్నాయి. గత రబీలో లక్ష ఎకరాల్లో హైబ్రిడ్(ఆడ, మగ) వరి సాగు చేయగా, నాలుగు లక్షల క్వింటాళ్ల ధాన్యం పండింది. ఈ రబీలో 1.30లక్షల ఎకరా ల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రభుత్వం రబీకి కరెంటు ఇవ్వలేమని తేల్చడంతో 40వేల ఎకరాలు కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడంలేదు. కంపెనీలు రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదు. పైగా ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక్కడి నేలలే అనుకూలం జిల్లాలో వీణవంక, జమ్మికుంట, ఎల్కతుర్తి, జగిత్యాల, మంథని, ముత్తారం మండలం వాగోడ్డు, పొత్కపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో హైబ్రిడ్ వరి పంట 20 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఇక్కడ రబీకి సరపడా నీరుంటుంది. హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, రంగాపూర్, వెంకట్రావ్పల్లి, శంకరపట్నం మండలం గద్దపాక, రాజాపూర్, మెట్టుపల్లి, ఆముదాలపల్లి, కాచాపూర్, మొలంగూర్ ప్రాంతాలు సీడ్‌కు అనుకూలమైనవే. ఇక్కడ పండిన విత్తనం ఎనిమిది ఏళ్లైనా మొలకెత్తే స్వభావం కలిగి ఉండడంతో ఎనిమిది మల్టినేషన్ కంపెనీలు జిల్లాలో పండిన ధాన్యాన్ని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. సవృద్ధిగా నీరుంటేనే.. ఆడ, మగ వరికి నీరు సంవృద్ధిగా ఉండాలి. 128 రోజుల కాలపరిమితి కావడంతో పది తడులన్నా అందించాలి. మొక్కకు 2 సెంటీమీటర్ల వరకు ఎప్పటికీ నీరుండాలి. గింజ పాలు పోసుకొనే సమయంలో పంట ఎండిపోకుండా చూసుకోవాలి. అప్పుడే దిగుబడి ఎక్కువగా వ స్తుంది. గింజ దృఢంగా ఉంటుంది. కంపెనీలు సైతం కొనడానికి ఆసక్తిచూపుతాయి. ఈ పరిస్థితులు ప్రస్తుత రబీలో కనిపించకపోవడంతో నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో సీడ్ ఇవ్వలేమని కంపెనీలు రైతులకు స్పష్టంచేస్తున్నారుు. ముందస్తుగా ఎరువుల కొనుగోలు ఖరీఫ్ పంట పూర్తి అయ్యిందో లేదో రైతులు రబీకి ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. మరో వారంలో విత్తనం జిల్లాకు చేరుతుందని సంబరపడ్డారు. కానీ కంపెనీలు చేతులెత్తయడంతో తెచ్చిన అప్పులు మీద పడుతాయని ఆందోళన చెందుతున్నారు. అదను దాటిపోతుండటంతో గత్యంతరం లేక హైబ్రిడ్(ఆడ,మగ) మొక్కజొన్న పంటలు వేసుకుంటున్నారు. నాలుగెకరాలు ఉన్న రైతులు రెం డెకరాలకే పరిమితమవుతున్నారు. నవంబర్ చివరి వారంలోగా వర్షాలు కురిసినా, కనీసం ఐదు గంటల కరెంటు ఇచ్చినా రబీలో పంటలు పండిస్తామని వారు పేర్కొంటున్నారు. ఉపాధి కోల్పోనున్న యువత విత్తన కంపెనీల్లో రైతుల పిల్లలే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఫీల్డ్ ఆఫీసర్, సూపర్వైజర్లుగా జిల్లాలో 850 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు తక్కువగా అవుతున్నందు న ఇందులో సగానికి పైగా ఉద్యోగులను కంపెనీలు తొలగించడానికి సిద్ధమవుతున్నాయి. -
సోయా.. గయా
జిల్లా రైతులకు గతేడాది సిరులు కురిపించిన సోయా పంట ఈసారి కన్నీళ్లు మిగిల్చింది. దిగుబడి గణనీయంగా తగ్గడంతో జిల్లా వ్యాప్తం గా రూ.75కోట్లుకు పైగా నష్టం వాటిల్లనుంది. -జగిత్యాల అగ్రికల్చర్ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆదుకుంటుందనుకున్న సోయా పంట రైతులను నట్టేట ముంచింది. గతేడాది జిల్లా రైతాంగానికి సిరులు కురిపించిన పంట ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చింది. వాతావరణ లోపమో లేదా విత్తనాల నాణ్యతా లోపమో తెలియదు గానీ పంట మొత్తం కుళ్లిపోతోంది. విత్తనాల కోసం ఎగబడిన రైతులు ఇప్పుడు పంట చూసి దిగులు చెందుతున్నారు. జగిత్యాల అగ్రికల్చర్/మల్లాపూర్ : జిల్లాలో 50 వేల ఎకరాల్లో సోయా సాగైంది. గతేడాది పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు దొరుకుతాయో లేదోనని సీజన్ మొదట్లోనే రైతులు వ్యవసాయాధికారుల కార్యాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. ఒక్కో బస్తా(30) కిలోలను సబ్సిడీ పోను రూ.1600 వరకు కొనుగోలు చేశారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున 50 వేల ఎకరాల్లో 50 వేల బస్తాల విత్తనాలు వేశారు. సీజన్ మొదట్లో మురిపించిన వర్షాలు ఆనక ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో అడపాదడపా కురిసిన చిరుజల్లులకు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి హడావుడిగా విత్తనాలు తెప్పించి రైతులకు పంపిణీ చేయగా... రెండోసారి విత్తనాలు వేశారు. ఇలా విత్తనాలపైనే రైతులు రూ.8 కోట్లు ఖర్చు చేయగా ప్రభుత్వం రూ.8 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. నష్టం రూ.75 కోట్లు సోయాబీన్ కనీస దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్లు. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించకున్నా కనీసం 5 క్వింటాళ్లు రావాలి. కానీ, వర్షాభావ పరిస్థితులకు తోడు విత్తనాల నాణ్యతా లోపంతో ఎకరాకు క్వింటాల్ నుంచి రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఒక్కో రైతు దిగుబడి రూపేణా ఎకరాకు 5 క్వింటాళ్లు నష్టపోయారు. జిల్లాలో 50 వేల ఎకరాలు సాగు కాగా... 2.50 లక్షల క్వింటాళ్ల పంట నష్టపోయినట్లే. విత్తనాలు, ఎరువులు, కలుపుతో కలిసి ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి అయింది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2600 ఉండగా ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఈ పంట సాగుతో రైతులకు మూడు నెలల శ్రమతోపాటు ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు నష్టం వాటిల్లనుంది. ఈ లెక్కన పెట్టుబడి రూపేణా కనీసం రూ.30 కోట్లు నష్టపోగా... దిగుబడి నష్టాన్ని కలుపుకుంటే ఈ నష్టం రూ.75 కోట్ల పైమాటే. కారణాలేంటి? వర్షాభావ పరిస్థితులతోనే దిగుబడి తగ్గిందని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు ఓ వైపు చెబుతుండగా... నాణ్యత లేని విత్తనాల వల్లే పంట సరిగారావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. విత్తనాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడంతో ఆఘమేఘాల మీద మధ్యప్రదేశ్ తది తర ప్రాంతాల నుంచి తెప్పించడంతో ఆ విత్తనాల్లో పురుగుపట్టిన, బూజుపట్టిన విత్తనాలు కూడా వచ్చాయి. విత్తనశుద్ధి చేసినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటకు చీడపీడలు ఎక్కువగా ఆశించి, పంట నష్టం చేశాయి. కొన్ని చోట్ల అసలు పూతే రాలేదు. వచ్చిన పూత సైతం మాడిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. మంచిగా ఉన్న మొక్కలకు సైతం ఒకటి రెండు కాయలకు మించి లేవు. దున్నేస్తున్న రైతులు సోయా దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతు లు కనీసం రెండో పంటగా మొక్కజొన్న వేసేం దుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న పంటలో ఎకరాకు ఒకటి నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నప్పటికీ వాటిని కోయడం, నూర్పడం ఖర్చుతో కూడుకున్నందున... పంట నే దున్నేస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వ్యవసాయాధికారులు గానీ, శాస్త్రవేత్తలు గానీ దృష్టి పెట్టడం లేదు. పలువురు రైతులు సమాచారమందించినా... నామమాత్రంగా పంటను చూసి సూచనలందించకుండానే వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తే రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విత్తనాల వల్ల నష్టం జరిగినట్లు భావిస్తే విత్తన ఉత్పత్తి సంస్థల నుంచి ప్రభుత్వం నష్టపరిహారం కోరే అవకాశం ఉంటుంది. రైతులందరూ సోయాబీన్‌ను దున్నేసిన తర్వాత అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే జగిత్యాల ప్రాంతంలో సోయాబీన్ పంటను దున్నేస్తున్నందున జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రజాప్రతినిధులు సైతం అధికారయంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు అండగా నిలవాల్సిన అవసరముంది. ఖర్చు ఇలా... భూమి దున్నడం : 2000 విత్తనాలు : 2400 ఎరువులు : 1000 కలుపు, గడ్డిమందు : 2000 యూరియా : 300 మందుల పిచికారీ : 1500 పంటకోతకు : 2500 -
పులిసిన ఆముదంతో పురుగులకు చెక్!
విత్తు నాటడం కాదు పంట ఇంటికి తెచ్చుకోవడం గొప్ప అంటారు పెద్దలు. కల్లంలో పంటను కాకులు, గద్దలు తన్నుకుపోకుండా కాపాడు కోవడం రైతుకు కష్టతరమే. ఈనగాసిన పంట నక్కల పాలయినట్లు మార్కెట్ మాయజాలం బారి నుంచి తప్పించుకోవడం రైతుకు ఎటూ అలవిగాని పనే అనేది ఏండ్ల తరబడి అనుభవంతో చూస్తున్నదే. అయితే విత్తనం వేసింది మొదలు సాకి సవరించే క్రమంలో కూడా పురుగూ పుట్ర దాడులు రైతు పుట్టి ముంచుతున్నాయి. కనీసం ఈ విపత్తుల నుంచైనా రైతు తనను, పంటను కాపాడుకోగలిగితే కారిన చెమట ఫలితం కండ్ల చూసుకొనే భాగ్యవంతుడవుతాడు. పంటను కాపాడుకోవడానికి కొన్ని సులభ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక సేద్యం ఆచరణలోకి వచ్చిన తరువాత మన పూర్వీకులు తమ అనుభవసారాన్ని రంగరించి అందించిన ఈ పద్ధతులు మార్కెట్ మాయతెరల కారణంగా మరుగున పడి అంటరానివై పోయాయి. జ్ఞాపకాల దుమ్ముదులిపి ప్రాచీనులు అందించిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు అద్భుతంగా పనిచేస్తున్నాయని అనేక మంది రైతులు ఆచరణలో రుజువు చేస్తున్నారు. తన పొలంలో అందుబాటులో ఉండే వివిధ పదార్ధాలతో వివిధ కీటకాల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు, నల్లముట్టె పురుగు, లద్దె పురుగు వంటి వాటిని పెద్దగా ఖర్చు లేకుండా నివారించుకోవచ్చు. పులియ బెట్టిన ఆముదం పిండి ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆముదం రసాన్ని తయారు చేసుకోవడం కూడా అతి సులభం. పులియ బెట్టిన ఆముదం రసం తయారు చేసుకునే విధానం: 5 కిలోల ఆముదాలు తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 5 లీటర్ల నీటిలో వేసి బాగా కలియపెట్టి ఒక కుండలో పోసి, నీడగా ఉన్న చోట 10 రోజుల పాటు కదల్చకుండా ఉంచాలి. 10 రోజుల్లో ఈ ద్రావణం బాగా పులిసి ఒక రకమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఈ పులిసిన ద్రావణాన్ని 5 లీటర్ల నీరు పట్టే కుండలను తీసుకొని, కుండకు రెండు లీటర్ల ద్రావణం నింపుకోవాలి. ఈ కుండలను పొలంలో అక్కడక్కడ గొయ్యితీసి నేలకు సమానంగా పాతి పెట్టాలి. ఆ తర్వాత వీటిని సాధారణ నీటితో కుతికెల వరకు నింపాలి. ఎకరా పొలంలో ఐదు కుండలను పాతి పెడితే సరిపోతుంది. ఉపయోగించేది ఇలా: ఆముదం ద్రావణం నుంచి వెలువడే వాసన అన్ని రకాల రెక్కల పురుగులను, తెల్లదోమ, పచ్చదోమలను ఆకర్షిస్తుంది. లద్దెపురుగులు, నల్లముట్టె పురుగులు కూడా ఈ వాసనకు ఆకర్షితమై కుండలోని నీళ్లలో పడి చనిపోతాయి. వరి, చెరకు తోట్లల్లో గట్ల వెంట ఈ కడవలను పెట్టినట్లయితే ఎలుకలు పారిపోతాయి. ఈ వాసన ఉన్నంత కాలం ఆ ప్రాంతంలోకి ఎలుకలు తిరిగి రావు. పొలంలో అక్కడక్కడ ఎరపంటగా వేసిన ఆముదపు మొక్కల నుంచి సేకరించిన విత్తనాలను ఇందుకు వినియోగించుకోవచ్చు. మట్టి కుండలను కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. - సాగుబడి డెస్క్ -
విత్తనం ఏదీ?
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాధార వ్యవసాయంలో సరైన అదనులో విత్తనం వేయడమనేది అత్యంత కీలకం. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే మెట్ట ప్రాంతాల్లో ‘పెళ్లయినా వాయిదా వేసుకుని విత్తనం వేయాలన్న’ నానుడి ప్రాచుర్యంలో ఉంది. అయితే.. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సకాలంలో రైతులకు విత్తనాలు అందించడం లేదు. ఈ విషయంలో తగినంత శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ విత్తనాల పంపిణీలో తప్పులు పునరావృతమవుతూనే ఉన్నాయి. గత ఖరీఫ్‌లో సబ్సిడీ నిర్ణయం కాలేదన్న కారణంగా వేరుశనగ విత్తన పంపిణీని సకాలంలో చేపట్టలేదు. వర్షం వచ్చే సమయానికి విత్తనాలు సిద్ధంగా లేకపోతే కష్టమన్న ఉద్దేశంతో జిల్లా రైతులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు. అప్పటికే రైతులు విత్తనాలు సమకూర్చుకోవడంతో విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలపోయాయి. మూడు విడతల్లో 3.50 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలను పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే.. తొలివిడత మాత్రమే పంపిణీ చేసి.. 2,3 విడతలను రద్దు చేశారు. 1.26 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే అమ్ముడుపోయాయి. వ్యవసాయ అధికారుల తీరు చూస్తుంటే ఇప్పుడు రబీలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఉంది. జిల్లాలో నల్లరేగడి భూములు కల్గిన రైతులు అక్టోబర్-నవంబర్ మాసాల్లో పప్పుశనగ వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 24 మండలాల్లోని 83 వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం అక్కడక్కడ పప్పుశనగ విత్తుతున్నారు. పదును వర్షం కురిస్తే మొత్తం వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంత వరకూ వ్యవసాయ శాఖ సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీకి సన్నాహాలే మొదలు పెట్టడం లేదు. తెల్ల కుసుమ జాడెక్కడ? పప్పుశనగకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో ఈ ఏడాది తెల్ల కుసుమ సాగును ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సమావేశాల్లో కూడా రైతులకు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే.. ఈ విత్తనం ఎక్కడ దొరుకుంది.. సబ్సిడీపై అందజేస్తారా.. లేదా అనే విషయాలు తెలియజేసే వారే కరువయ్యారు. ఒకవేళ రెండు, మూడు రోజుల్లో పదును వర్షం వస్తే నల్లరేగడి భూముల రైతులు పప్పుశనగ, తెల్లకుసుమ, ధనియాలు తదితర పంటల సాగుకు విత్తనం కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) శ్రీరామమూర్తిని వివరణ కోరగా.. పప్పుశనగ విత్తన ధరలు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. తెల్లకుసుమ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. -
నువ్వుల సాగు ఇలా..
విత్తన మోతాదు, శుద్ధి చేసే విధానం.. ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం. విత్తన పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి విత్తనానికి ఐదింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ. లోతు మించకుండా వేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. రబీలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియ దున్నాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెలరోజులకు కలుపుతీసి వేయాలి. భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో పడినపుడు అదనంగా క్యాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం.. విత్తిన వెంటనే మొదటి త డి ఇవ్వాలి. పూత, కాయ, అభివృద్ధి, గింజ కట్టు దిగేట్లు తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు నివారణ.... విత్తే ముందు పుక్లొరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ.. సస్యరక్షణ చర్యలు.. ఈ పంటకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశిస్తుంది. దీని లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. తొలి దశలో చిన్న లార్వాలు కలిసి గూడు కట్టి లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని కొరుక్కు తింటాయి. తద్వారా ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉద్ధృతి అంతగా ఉండదు. పురుగు ఆశించిన ఆకులను లార్వాలతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిపాస్ 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
దారి దీపం
జెన్ పథం సాయంత్రం దాటింది. చీకటి మొదలైంది. ఒక కుర్రాడు తన చేతిలో ఒక లాంతరు పట్టుకుని ఓ చెట్టుకింద దిగాలుగా కూర్చున్నాడు. ఆ దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన దిగులు పడుతూ కూర్చున్న కుర్రాడిని చూసి అతని వద్దకు వెళ్లాడు. కుర్రాడి బాధేంటో తెలుసుకోవాలనుకున్నాడు. కుర్రాడు ‘‘నేను పొరుగూరికి వెళ్లాల్సి ఉంది. చీకటి పడింది. నాదగ్గరున్న ఈ లాంతరు దీపం వెలుగు ఓ మూడడుగుల దూరం వరకే కనిపిస్తుంది. కనుక కొన్ని మైళ్ల దూరంలో ఉన్న మా పల్లెకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. భయంగా ఉంది...’’ అని వాపోయాడు. అతను చెప్పినదంతా విన్న పెద్దాయన ‘‘నీ దగ్గరున్న లాంతరు దీపం వెలుగు మూడడుగుల దూరం వరకే కనిపిస్తుందనేది నిజమే కావచ్చు. కానీ నువ్వీ చెట్టు కింద కూర్చుని అలా అనుకోవడం సరికాదు. ఆ దీపాన్నే నువ్వు చేత్తో పట్టుకుని నడిచే కొద్దీ ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నట్టే అవుతుంది కదా? వేసే ప్రతి అడుగు వల్ల ఆ దీపం వెలుగు దారిపొడవునా ఉన్నట్టే అవుతుంది కదా? కనుక దిగులు మాని లేచి అడుగులు వెయ్యి...’’ అన్నాడు. కుర్రాడు పెద్దాయన చెప్పినట్లే చేశాడు. తన చేతిలో ఉన్న లాంతరు వెలుగులో నమ్మకంతో నడిచి తన పల్లెకు చేరుకున్నాడు. ఉపయోగపడేదేదో మన దగ్గర ఉంటే సరిపోదు. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం అవసరం. - సమయ -
మందు పిచికారీ చేస్తున్నారా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచీ విత్తనం విత్తుకుని, పంట దిగుబడి వచ్చే వరకు పంటలను కాపాడుకోవడానికి రైతులు చేయని ప్రయత్నం ఉండదు. చీడపీడల బారి నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం విస్మరిస్తుంటారు. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ వివరించారు. జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పతి, సోయాబీన్ పంటలపై రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు తదితర తెగుళ్ల నివారణకు పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. రకరకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసే సందర్భాల్లో జాగ్రత్తలు వహించకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. మందులు చల్లే సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి, సోయా పంటలు సాగవుతున్నాయి. మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
రుణ ‘సహకారం ఏదీ..?
రుణమాఫీపై సందిగ్ధంలో కేంద్ర సహకార బ్యాంకు - మాఫీతో 61,823 మంది రైతులకు ఊరట - ఈ యేడాది ఐదు శాతం కూడా రుణాలివ్వని వైనం కలెక్టరేట్ : రైతు శ్రేయస్సు కోసం సహాయం అందించాల్సి న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయించడం తప్ప రుణాలు అందించడం లేదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందించాల్సిన సంఘాల సాయం అందకుండా పో తోంది. సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉన్నా వారికి అందని ద్రాక్షలా మారాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐ దు శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని బ్యాంకు అధికారులు పేర్కొం టున్నారు. రుణమాఫీ వర్తిస్తుందా.. లేదా.? ఎవరికి వర్తిస్తుంది..? అనే దానిపై స్పష్టత లేక సహకార బ్యాం కు సందిగ్ధంలో పడింది. గతేడాది ఖరీఫ్ రుణ ల క్ష్యంతో పోల్చుకుంటే ఈసారి ఐదు శాతం కూడా రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా సొసైటీలు విత్తనాలు, ఎరువులను విక్రయించడం తప్ప రైతులకు రుణ సాయంలో చేయూతనిచ్చినట్లు కన్పించడం లేదు. రుణం మాఫీతో 61,823 మందికి ఊరట.. జిల్లాలో 77 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 60 సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోకి వస్తాయి. 60 సంఘాల్లో 1,80,408 మంది రైతులు సభ్యులు ఉన్నారు. ఇందులో 61,823 మంది పంట రుణాలు తీసుకున్నారు. మిగతా 1,18,585 మంది పంట రుణాలు తీసుకోలేదు. అయితే.. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ. 251 కోట్ల పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్లో 61,823 మంది రైతులకు రూ.156.17 కోట్లు రుణాలు ఇచ్చారు. రబీ సీజన్లో 53,458 మంది రైతులకు రూ.135.04 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. మొత్తం రూ.291.21 కోట్ల రుణాలను ఖరీఫ్, రబీ సీజన్లలో పంపిణీ చేసి లక్ష్యం చేరుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ వర్తిస్తే జిల్లాలోని 61,823 మంది రైతులకు ఊరట లభిస్తుంది. కాగా, గతేడాది ఖరీఫ్ సీజన్లో ఇచ్చిన పంట రుణాలతో పోల్చుకుంటే ఈ యేడాది పంట రుణాలు చాలా వరకు తగ్గాయి. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ. 2.50 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. ఈ సారి రుణమాఫీ ఉంటుందనే ఆశతో రైతులు తీసుకున్న రుణాలు కట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల వస్తేనే ఈ విషయంలో ప్రశ్నలు తొలగిపోయే అవకాశం ఉంది. దృష్టి సారించని ప్రతినిధులు.. గ్రామాల్లో ఉన్న వ్యవసాయ పరపతి సంఘాలను ఆదుకునే దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో రైతులను సహకార సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. ప్యాకేజీల ద్వారా సంఘాలకు పునరుజ్జీవనం పోయాలన్న ఆలోచనే ప్రతినిధులకు లేకుండా పోయింది. జిల్లాలో 77 సంఘాలకు గాను 34 సంఘాలే ఈ యేడాది ఖరీఫ్‌లో సోయా విత్తనాలను పంపిణీ చేశాయి. -
ధాన్యం వర్షార్పణం
రైతు ఆరుగాలం శ్రమ వర్షార్పణమైంది. కళ్ల ముందే వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా నిలిచిపోయాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట, దుబ్బాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. టార్పాలిన్లు లేకపోవడంతో వానకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో అన్నదాత విలవిలలాడిపోయాడు. సిద్దిపేట జోన్,న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతను నట్టేట ముం చింది. ఆరుగాలాల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నీటి పాలు అ వుతున్నా ఎమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అన్నదాత మిగిలి పోయాడు. సిద్దిపేట యా ర్డుకు విక్రయానికి తెచ్చిన రైతు ధాన్యం మం గళవారం కురిసిన అకాల వర్షానికి కొట్టుకుపోయింది. సుమారు నాలుగు వేల బస్తాలు నీటిపాలవ్వడంతో అన్నదాత విలవిలలాడాడు. మరో వైపు మంగళవారం సిద్దిపేట యార్డులో మద్దతు ధర అమాంతం పడిపోయింది. అటు మద్దతు ధర రాక, ఇటు వర్షానికి ధాన్యం తడవడంతో రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా మా రింది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు జిల్లా తో పాటు పొరుగున ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామా ల రైతులు ధాన్యాన్ని తీసుకువస్తారు. అందు లో భాగంగా మంగళవారం సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం యార్డుకు వచ్చింది. నిర్ణిత వేలల్లో బీటు నిర్వహించాల్సిన వ్యాపారులు ఆలస్యంగా బీటు చేపట్టారు. యార్డులోని షెడ్డులతో పాటు ఆరుబయట పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డు ఆరుబయట ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యపు రాసుల నుండి వర్షపు నీరు కాలువలుగా ప్రవహించడంతో ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రైతుల ధా న్యానికి సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి గుర్రాలగొందికి చెం దిన గుర్రం యాదగిరి, కొంపెల్లి ఎల్లయ్య, చంద్రయ్య, ఎన్సాన్పల్లికి చెందిన పబ్బతి లక్ష్మి, ఇర్కోడుకు చెందిన గుట్టకింది ఎల్లవ్వ, మిట్టపల్లికి చెందిన యాదయ్యలకు చెందిన ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది. పరిస్థితిని మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య పరి శీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇదిలాఉండగా మంగళవారం నాటి బీటులో రైతుకు మద్దతు ధర పడిపోయింది. క్వింటాల్‌కు గరిష్టం రూ. 1220, కనిష్టం రూ. 1200 ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈదుగాలులతో కూడిన వర్షం దుబ్బాక, దుబ్బాక రూరల్ : రైతు కష్టం నీటిపాలయ్యింది. దుబ్బాకలో మంగళవారం ఈదురుగాలులతో కురి సిన వర్షానికి యార్డులో సూమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. దీంతో యార్డులో తడిసిన ధాన్యాన్ని కాపడుకునేం దుకు అన్నదాతలు నానా తంటాలు పడ్డారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో 12 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణమైంది. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరద నీటికి ధాన్యం నీటిపై తేలాడింది. దీంతో అన్నదాతలు అల్లాడిపోయారు. తమ రెక్కల కష్టం వృథా అయిపోయిందని ఆవేదన చెందారు. అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ఉంటే తమ ధాన్యం తడిసి ఉండేది కాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. -
పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
నల్లగొండ, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బందికి ముందు చూపు లేకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. ధాన్యం దిగుబడులు మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి పూర్తి స్థాయిలో జిల్లా పౌరసరఫరాల సంస్థ, డీఎం సివిల్ సప్లయీస్లు ధాన్యం రవాణా, మిల్లులకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథం కొనుగోలు కేంద్రాలు రైతులకు సౌకర్యంగానే ఉన్నా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అధికారుల, సంఘాల తీరు పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల సంఘాల నిర్వహకులను నిర్బం దించిన సంఘటనలు, ధర్నా రాస్తారోకోలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకుపోయిన నిల్వలివే.. ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యా యి. వాస్తవానికి కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తే 45 రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి. కానీ అధికారుల వైఫ్యలం వల్ల కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం పైనే ఇంకా కింద మీదా పడుతున్నారు. ‘న్యూస్‌లైన్’ సేకరించిన సమాచారం మేరకు జిల్లాలోని 45 ఐకేపీ కేంద్రాల వద్ద ప్రస్తుతం లక్షా 46 వేల 527 క్విం టాళ్లు ధాన్యం నిల్వలు పేరుకుపోయా యి. ఇది గాక రైతుల కల్లాల వద్ద నుంచి ఇంకా 6 నుంచి 7 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చే అవకా శం ఉంది. ఈ సీజ న్లో ఐకేపీ కేంద్రాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 21 లక్షల 58 వేల 915 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో మిల్లులకు దాదాపుగా 20 లక్షల క్వింటాళ్ల వరకు తరలించారు. ఎక్కడెక్కడ..అంటే.. అనుముల మండలం తిరుమలగిరి కేంద్రంలో 4,360 క్వింటాళ్లు, కొట్టాలలో3,200 క్విం టాళ్లు, కట్టంగూరు మండలం కురుమర్తి 3,124 క్వింటాళ్లు, తిరుమలగిరి మండలం మామిడిపల్లి 3,161 క్వింటాళ్లు, నూతనకల్ మండలం గోరంట్ల 2,466 క్వింటాళ్లు, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం 1394 క్వింటాళ్లు, మామిడాల 1,177 క్వింటాళ్లు, తుర్కపల్లి 2, 304, పెన్‌పహాడ్ మండల ఎన్ అన్నారంలో 2,443 , తుంగతుర్తిలో 2,096, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో 2,354 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. ముందుచూపేదీ..? గతేడాది భారీ వర్షాలు పడటంతో ఈ సీజన్లో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో పంట దిగుబడి పది లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని నిర్ధేశించిన అధికారులకు ఏర్పాట్లు విషయంలో మాత్రం ముందుచూపు కొరవడింది. ధాన్యం దిగుబడి దండిగా రావడంతో ఐకేపీ కేంద్రా లు, మిల్లులు ధాన్యం రాశులతో కిక్కిరిసిపోయాయి. దీంతో మరో గత్యం తరం లేక డివిజన్ నుంచి మరొక డివి జన్ పరిధిలోని మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. అయితే డివిజన్ దాటి ధాన్యం రవాణా చేయ డం వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుచాలడం లేదని కాంట్రాక్టర్లు పేచీపెట్టారు. ఈ సమస్యను పరి ష్కరించడంలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయలేకపోతున్నాయి. దీంతో పా టు మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తోం దన్న విమర్శలు కూడా ఉన్నాయి. లారీలు రావడం లేదు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు రావడం లేదు. పక్షం రోజు లుగా మా సంఘ బంధం ద్వారా 17, 551 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాం. కానీ 2500 బస్తాల ధాన్యం మాత్రమే లారీల్లో మిల్లుకు తరలించాము. రోజుకో లారీ కూడ రావడం లేదు. లారీల కోసం మిల్లులు, పోలీస్‌స్టేషన్ చుట్టు తిరగాల్సి వస్తుంది. ఏమి చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. - తిరపతమ్మ, సంఘ బంధంసభ్యురాలు, తిరుమలగిరి, హాలియా మండలం మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ధాన్యం తీసుకుపోయిన లారీ 24 గంటలు అయితే గాని దిగుమతి కావడం లేదు. దీంతో లారీ యజమానులు రెండు రోజుల కిరాయి అడుగుతున్నారు. ప్రభుత్వం క్వింటా ధాన్యాన్ని రవాణా చేస్తు క్వింటాకు రూ.16 ఇస్త్తూ మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం వల్ల రూ.32 చెల్లించాల్సి వస్తుంది. - బి. మంగమ్మ, సంఘ బంధం సభ్యురాలు, తిరుమలగిరి, హాలియా మండలం -
పాత విత్తనమే ప్రాణం
మన విత్తనం.. మన సంస్కృతి.. 206 వంగడాలను సాగు చేస్తున్న అరకు గిరిజనులు విశాఖ రైతుబజార్లలో గిరిజన సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డుతో గౌరవించిన కేంద్ర విత్తనం మన సంస్కృతి.. విత్తనం మన ఉనికి! వ్యవసాయక సమాజంలో వేలాది ఏళ్లుగా పొలం నుంచి పొలానికి, రైతు నుంచి రైతుకు, తరం నుంచి తరానికి అందివస్తున్న అమూల్య సంపద విత్తనం. ప్రపంచీకరణ పుణ్యమా అని కంపెనీల విత్తనం విజృంభిస్తున్న తరుణంలోనూ సంప్రదాయ విత్తనాలను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటున్నారు విశాఖ మన్యంలోని ఆదివాసీ రైతులు. విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు’ను ఇచ్చింది. విత్తనం బహుళజాతి కంపెనీల సొత్తుగా మారుతున్న ఈ కాలంలో ఈ గిరిజనం వెలుగుబాట చూపుతుండడం విశేషం. నాగరికతకు మూలం వ్యవసాయమైతే.. వ్యవసాయానికి జీవం రైతుల సొంత విత్తనం. అడవి బిడ్డలే అనాదిగా విత్తన పరిరక్షకులు. సామాజికంగా ఎంత ‘అభివృద్ధి’ జరిగినా ఇప్పటికీ.. పాత విత్తనమే తమకు, నేలతల్లికీ బలమంటున్నారు అరకు ప్రాంత గిరిజన రైతాంగం. విశాఖపట్నం జిల్లాలోని ఒడిశా సరిహద్దుల్లోని అరకు కొండ ప్రాంతం.. మనోహరమైన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. డుంబ్రిగుడ, హుక్కుంపేట మండలాల్లోని 5 పంచాయతీలు సంప్రదాయక పంటలకు పెట్టని కోటలు. సుసంపన్నమైన సంప్రదాయక వ్యవసాయ సంస్కృతికి ఈ గిరిజన రైతుల జీవనశైలి అద్దం పడుతుంది. వీరికి వ్యవసాయం అంటే ఎక్కువ రాబడినిచ్చే వ్యాపకం కానే కాదు. వ్యవసాయం అవిచ్ఛిన్నంగా సాగిపోయే ఒక జీవన విధానం. వైవిధ్యభరతమైన సంప్రదాయ వంగడాలను అనాదిగా సేకరిస్తూ, వాటి ప్రయోజనాన్ని గుర్తెరిగి తరతరాలుగా సాగు చేస్తుండడం వీరి సంప్రదాయ విజ్ఞానానికి, విజ్ఞతకు నిదర్శనం. 206 పాత పంటలు.. వరిలో 13 రకాల వంగడాలున్నా వేటి ప్రయోజనం వాటికి ఉంది! వీటితోపాటు 8 రకాల రాగులు, 7 రకాల సామలు, 5 రకాల జొన్నలు, 5 రకాల కొర్రలు, 8 రకాల చిక్కుళ్లు, 5 రకాల కందులతోపాటు గంటెలు(సజ్జలు), మొక్కజొన్న, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, క్యారెట్, గుమ్మడి, ఆనప, ఆగాకర, బీర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పనస, బంగాళదుంప, తెల్లదుంప, ఎర్రదుంప తదితర 206 పాత పంటలను దాదాపు 5 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. మలివలస గ్రామంలో 203, దేముడువలసలో 197 రకాల పాత పంటలు సాగులో ఉండడం విశేషం. కొండ వాలు పొలాల్లో అధిక వర్షాలను తట్టుకొని పండేవి కొన్నయితే.. నీటి వసతి ఉన్న మైదాన ప్రాంత పొలంలో పండేవి మరికొన్ని. దిగుబడి ఎంత వస్తున్నదనే దానితో నిమిత్తం లేకుండా.. ఇన్ని పంటలను ప్రతి ఏటా సాగు చేస్తుండడం విశేషం. అయితే, గిరిజన యువతలో పాతపంటలపై చిన్న చూపు గూడుకట్టుకుంటున్న దశలో కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామానికి చెందిన పచారి దేవుళ్లు 15 ఏళ్ల క్రితం దృష్టిసారించి ఉండకపోతే ఇక్కడి పాత పంటల ప్రాభవం కొంత మసకబారిపోయేది. సంజీవని రూరల్ డెవలప్మెంట్ సొసైటీని నెలకొల్పిన దేవుళ్లు 90 గ్రామాల్లోని 3,215 గిరిజన కుటుంబాలలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పాత విత్తనాల జాతరతో కొత్త ఉత్సాహం! గత పదేళ్లుగా ఏటా పాత విత్తనాల జాతర నిర్వహించడం.. పంటలను స్థానిక సంతల్లో అయినకాడికి అమ్ముకుంటున్న గిరిజన రైతులను విశాఖ రైతుబజార్లకు అనుసంధానం చేయడంతో గిరిజన రైతుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. 420 మంది గిరిజన రైతులు 150 కిలోమీటర్ల దూరంలోని రైతుబజార్లకు తీసుకొచ్చి తాము పండించిన అమృతాహారాన్ని విక్రయిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో 38 వరకు ధాన్యం బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తమ అవసరాలకు మించి పండించిన ధాన్యాలను వీటిల్లో దాచుకోవచ్చు లేదా అమ్మవచ్చు. ఇవి గిరిజనులను కష్టకాలంలో ఆదుకుంటున్నాయి. పంటలు పండకపోయినా, పెళ్లిళ్లు వంటి అవసరాలు వచ్చినా ఈ బ్యాంకుల నుంచి ధాన్యం తీసుకోవచ్చు. హెదరాబాద్లోని జాతీయ పంటల జన్యువనరుల పరిరక్షణ సంస్థకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త డా. బలిజేపల్లి శరత్‌బాబు ఈ ప్రాంత పాత పంటల జీవవైవిధ్య వైభవాన్ని నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు (2011-12) దక్కింది. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది మే 22న రూ. పది లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని వీళ్లు న్యూఢిల్లీలో అందుకున్నారు. మన రాష్ర్టవాసులకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే ప్రథమం.గిరిజనులు పాత పంటల్లోని ఔషధగుణాలను గుర్తెరిగి వినియోగిస్తుండడం విశేషం. బాలింతకు పెద్దసామల గంజి తాపుతారు. బోడ్దాన్ అనే రకం బియ్యం వండి పెడతారు. నూతన వధూవరులకు పసుపు సన్నాల బియ్యం వండిపెడతారు. వర్షాకాలం జబ్బుపడిన వారికి బలవర్ధకమైన ఊదల గంజి ఇస్తారు. పోదు, గదబ, పూర్జ, కొండదొర జాతుల ఆదివాసులు చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం తినరు. ఇప్పటికీ పూర్తిగా తమ సంప్రదాయ ఆహారాన్నే తింటారు! అరకు గిరిజన రైతులు విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. - సైమన్ గునపర్తి, న్యూస్‌లైన్, విశాఖపట్నం సిటీ (ద్వారకానగర్) (మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా..) పిల్లలను సాకినంత ఆనందం.. ప్రకృతిసిద్ధంగా పండించటమే మా సంప్రదాయం. సంజీవిని సంస్థ అండతో పప్పుదినుసులు, పసుపు, అల్లం, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు పండిస్తున్నాం. ఎలా నాటాలో వాటికి కావాల్సిన సేంద్రియ ఎరువులు సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు. వ్యవసాయం చేయడం అంటే పిల్లలను సాకినంత ఆనందంగా ఉంటుంది. -పండన్న, అరకు కూరగాయల రైతుల సంఘం సభ్యుడు, కిలోగుడ, విశాఖ జిల్లా అంతరిస్తున్న వంగడాలపై దృష్టి మన విత్తనాల కన్నా బయటి విత్తనాలే మంచివనే దురభిప్రాయం గతంలో కొందరు గిరిజనుల్లో ఉండేది. సేంద్రియ వ్యవసాయం పట్ల, పాత విత్త నాలను నిలబెట్టుకోవడం పట్ల ఆసక్తిని పెంచడానికి మొదట్లో మా సంస్థ చాలా కష్టపడవలసి వచ్చింది. ఏటా జరుపుతున్న పాత విత్తనాల పండగ ద్వారా అవగాహన పెరిగింది. అంతరించిపోతున్న అనేక వంగడాలను గుర్తించి, వాటిని సాగులోకి తెస్తున్నాం. ఉదాహరణకు.. సంకణాలు అనే అరుదైన నూనె గింజలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తోడ్పాటుతో రైతుల చేత సాగు చేయిస్తున్నాం. కనుమరుగైన పెసర, కొన్ని వరి వంగడాలను కూడా ఈ ఏడాది సేకరించి రైతులతో సాగు చేయిస్తున్నాం. - పి. దేవుళ్లు(98492 05469), కార్యదర్శి, సంజీవిని, కిలోగుడ, విశాఖ జిల్లా -
ఎక్కడి ధాన్యం అక్కడే..
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు పంట అమ్మకంలోనూ తప్పని అవస్థలు... సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. గన్నీ సంచుల సరఫరాలో నిర్లక్ష్యం.. ధాన్యం రవాణాలో జాప్యం.. హమాలీల కొరత.. వెరసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలో 2.30 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. 13 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 619 కొనుగోలు కేంద్రాల ద్వారా 5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నెల 4న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు 341 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, 13 మార్కెట్ కమిటీల ద్వారా 1.54 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. వరికోతలు ముగింపు దశకు చేరడంతో ధాన్యం కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతోంది. కేంద్రాలకు రోజువారీగా వస్తున్న ధాన్యంలో కనీసం 40 శాతం కొనుగోళ్లు కూడా జరగడం లేదని రైతులు అంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేసుకోవాల్సిన మిల్లర్లు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. రోజుకు నాలుగైదు లారీల ధాన్యం కేంద్రాలకు వస్తుంటే.. ఒకట్రెండు వాహనాలు మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యం కేంద్రాల్లోనే మూలుగుతోంది. కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో, కోరుట్ల మండలం పెద్దాపూర్ రైతులు, ముస్తాబాద్ రైతులు, కాటారం మండలం రేగులగూడెంలో ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో సిబ్బందిని నిర్బంధించారు. వసతులేవీ.. పైసలేవీ? ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం అధికారులు రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతులకు నోచుకోకపోవడంతో నిల్వలు పేరుకుపోయూరుు. కొనుగోలు చేసిన ధాన్యంలో 40 శాతం కేంద్రాల్లోనే పేరుకుపోగా.. ఎప్పటికప్పుడు రవాణా కాకపోవడంతో కొత్తగా కొనుగోళ్లు జరగడం లేదు. 50 లక్షల వరకు గన్నీ సంచులు అవసరమున్నా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచలేదు. ఇప్పటివరకు 270 ఐకేపీ కేంద్రాల ద్వారా 89,683 టన్నులు, 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 64,231 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా చెల్లించలేదు. రూ.207 కోట్లు చెల్లింపు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారి రైతులకు ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలు, వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో విక్రయించిన ధాన్యం చెల్లింపులు మరింత ఆలస్యం కానుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దళారులతో దగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,345 కాగా.. రైతులు ఎక్కువగా ఆయా కేంద్రాలకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. తూకం, రవాణాలో జాప్యం కావడంతో రోజుల తరబడి పడిగాపులు కాయలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్లాల వద్ద దళారులు క్వింటాల్‌కు రూ.1,260కే కొనుగోలు చేసి అన్నదాతల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు. అధికారులు, దళారులు కుమ్మక్కై మార్కెట్లో ధాన్యం త్వరగా కొనుగోలు చేయకుండా వివిధ కారణాలతో తమ సహనాన్ని పరీక్షిస్తూ ధాన్యాన్ని దళారుల పాలు చేసేలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం 4, 5 కాంటాలు ఏర్పాటు చేసి ఏరోజుకారోజు ధాన్యాన్ని తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని, హమాలీ డబ్బులు సైతం త్వరగా ఇప్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు సమకూరుస్తాం - బి. చంద్రప్రకాశ్, డీఎస్వో కొన్ని చోట్ల ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తిన విషయం మా దృష్టికి వచ్చింది. రవాణా బాధ్యతను మిల్లర్లకు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు అప్పగించాం. తిరిగి సమస్య తలెత్తడంతో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు సూచించాం. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో అన్ని సెంటర్లు పరిశీలించి రెవెన్యూ, పోలీస్, సివిల్సప్లై శాఖలు సంయుక్తంగా వాహనాల సమకూర్పునకు చర్యలు తీసుకుంటాం. చెల్లింపులో ఆన్లైన్లోనే.. - సంపత్, సివిల్సప్లై డీఎం ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు. రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది. జేసీ ఆదేశాల మేరకు ఈసారి రైతులకు ఆన్లైన్లో చెల్లిస్తాం. ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో ఉన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లిస్తాం. -
రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : వేటగాడు.. కాసిని నూకలు చల్లి, పక్షులను పన్నిన వలలోకి రప్పించినట్టు- మోసగాళ్లు.. చిల్లరనో, నోట్లనో ఎరగా వేసి, దృష్టి మళ్లించి.. లక్షలు కాజేసే ఉదంతాలు కోకొల్లలు. అయినా- జగమెరిగిన ఈ టోకరా తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటుంది. తాజాగా గురువారం కాకినాడలో పునరావృతమైన ఈ దగాపర్వం ఖరీదు ఏకంగా రూ.20 లక్షలు! తాళ్లరేవులోని రాజువర్మ ఎంటర్ప్రైజెస్ అకౌంటెంట్ బులుసు వెంకట రామశర్మ.. రోడ్డుపై పడిఉన్న రూ.10 నోట్లను ఏరుకునే ఆదుర్దాలో అంత పెద్ద మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొయ్య రైతులకు సీడ్, కెమికల్స్ సరఫరా చేసే రాజు వర్మ ఎంటర్‌ప్రైజెస్‌లో శర్మ 12 ఏళ్ల నుంచి అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. సంస్థ పేరిట వచ్చిన చెక్కులను కాకినాడ బాలాజీచెరువు సమీపంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసి సొమ్ము తీసుకు వెళుతుంటాడు. గురువారం రూ.20 లక్షల చెక్కును నగదుగా మార్చి, ఆ మొత్తాన్ని బ్యాగ్‌లో ఉంచి బ్యాంకు బయటకు వచ్చాడు. బ్యాగ్‌ను మోటార్ బైక్ ఆయిల్ ట్యాంక్‌పై ఉంచి స్టార్ట్ చేయబోతుండగా ఓ ఆగంతకుడు వచ్చి, కింద పడి ఉన్న రూ.10 నోట్లను శర్మకు చూపించాడు. శర్మ బైక్ దిగకుండానే వంగి నోట్లు ఏరుకుని, జేబులో పెట్టుకోబోయేసరికి ట్యాంక్ మీద ఉండాల్సిన బ్యాగ్ కనిపించలేదు. ఆ ఆగంతకుడూ పత్తా లేడు. చేష్టలుడిగిన శర్మ తేరుకుని చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. వారంతా సమీపంలో గాలించినా ఫలితం లేకపోయింది. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి, వన్‌టౌన్ క్రైం ఎస్సై పి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శర్మ నుంచి వివరాలు సేకరించారు. యూనియన్ బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరాల క్లిప్పింగ్‌లను పరిశీలించారు. ఆగంతకుడు రూ.పది నోట్లు కింద పడేయడమే కాక శర్మ వీపుపై కిళ్లీ ఉమ్మినట్టు కనిపించింది. దీన్నిబట్టి శర్మ పది నోట్లు తీసుకునేలోపు బ్యాగ్ చోరీ సాధ్యం కాకపోతే కిళ్లీ ఉమ్మి తుడుస్తున్నట్టు నటిస్తూ బ్యాగ్ కాజేయాలన్నది ఆగంతకుడి పన్నాగమై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాలను బట్టి స్థానిక నిందితుడే నేరానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు సవాలు కాగా నిత్యం రద్దీగా ఉండే బాలాజీ చెరువు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు క్రైం పోలీసులు గస్తీ నిర్వహిస్తుంటారు. అలాంటి చోట పట్టపగలు ఇంత మొత్తం చోరీ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ సంఘటన బ్యాంకు సిబ్బందిని కూడా కలవరపరిచింది. శర్మ ఫిర్యాదుతో వన్‌టౌన్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.