సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు పేరు ఖరా రైంది. ప్రస్తుతం ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగు తున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నా రు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయు డు, మొదటి ఆసియా వ్యక్తి కూడా కేశవులే కావడం విశేషం.
2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే. అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడ మే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్ ఇస్తారు.
కేశవులు నియా మకంతో ఇక్కడి నుంచి ఇతర దేశాలకు నాణ్యమైన విత్తన ఎగుమతులు జరుగుతాయని భావిస్తున్నా రు. విత్తన నాణ్యతకు అనువైన లేబొరేటరీలు ఇక్కడకు వచ్చే అవకాశముంది. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5 శాతమైతే.. భారత్‌లో వృద్ధి రేటు 12–15 శాతంతో అంతర్జాతీయంగా ఐదో స్థా నంలో ఉందని ఇన్‌స్టా కాంగ్రెస్‌లో మంత్రి నిరం జన్‌రెడ్డి చెప్పారు. ఇందులో తెలంగాణ విత్తన పరి శ్రమ వృద్ధి రేటు 85% కావడం విశేషమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment