విత్తన చట్టంలో మార్పులు తెస్తాం | seed act pattipati pullarao peddapuram | Sakshi
Sakshi News home page

విత్తన చట్టంలో మార్పులు తెస్తాం

Published Wed, Oct 26 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

విత్తన చట్టంలో మార్పులు తెస్తాం

విత్తన చట్టంలో మార్పులు తెస్తాం

పెద్దాపురం : చరిత్ర కల్గిన పెద్దాపురం దుంప పరిశోధన కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక దుంప పరిశోధనా కేంద్రాన్ని మంత్రి పుల్లారావు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప  జరిగిన సభలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ  బయో పేరుతో రసాయనాలతో ఎరువులు కల్తి చేసిన చేసిన 51 కంపెనీల యజమానులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడతామని హెచ్చరించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పరిశోధనా కేంద్రాన్ని పెద్దాపురం తీసుకువచ్చిన ఘనత రాజప్పదేనన్నారు. మంత్రి రాజప్ప మాట్లాడుతూ రైతు అభివృద్ధికి పాటుపడుతాన్నారు. అనంతరం సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన నూతన పరిశోధన కేంద్ర భవనానికి మంత్రులు, ఎంపీ, భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేలు వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, జిల్లా గ్రం«థాలయ సంస్థ చైర్మన్‌ వీర్రెడ్డి పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్‌లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, రైతు నేతలుమాసిన వెంకట్రావు, పుట్టా సోమన్నచౌదరి, నున్నా రామకృçష్ణ (రాంబాబు), రంధి సత్యనారాయణ, ఎంపీపీ గుడాల రమేష్, జెడ్పీటీసీ సుందరపల్లి శివ నాగరాజు  పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement