pullarao
-
ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం
గుంటూరు ఈస్ట్: టీడీపీ గూండాల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శావల్యాపురం మండల కన్వినర్ భీమని అంకారావును వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే తనపై దాడి చేసి రెండు గంటల పాటు తన కారును అడ్డగించారని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో అంకారావు అడ్డుగా రావడంతో టీడీపీ నేతల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు వేసుకున్న రాళ్లే వాళ్లకు తగిలాయన్నారు. టీడీపీ నేత పుల్లారావు, ఆయన భార్య చేసిన దోపిడీ గురించి అందరికీ తెలుసన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తనకు అక్రమ ఆస్తులున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. జీవీ ఆంజనేయులు ఎన్ఎస్పీ కాలువ పైన రైతుల వద్ద నుంచి కొన్న భూమిలో గెస్ట్‌హౌస్ నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు వినుకొండలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
20 నిమిషాలివ్వండి.. అన్నీ నిరూపిస్తా
-
దళితుల భూముల్లోని గ్రానైట్‌పై కన్నేసిన మంత్రి
-
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
అనంతపురం అగ్రికల్చర్ : మితిమీరిన పెట్టుబడుల కారణంగా రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ప్రకతి వ్యవసాయాన్ని భారీగా విస్తరించాలని నాచురల్ ఫార్మింగ్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం) రాయలసీమ జిల్లాల ఇన్చార్జి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లాలో ఉన్న 10 ఎన్‌పీఎం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడటం వల్ల వ్యవసాయం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో పురుగు మందులు లేని, పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేవలం ఆవుపేడ, మూత్రం ద్వారా తయారు చేసిన జీవామతం, ఇతరత్రా కషాయాలు వాడేలా రైతుల దష్టిని మళ్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల పరిధిలో 10 క్లస్టర్ల కింద 53 గ్రామాల్లో 4,150 మంది రైతుల ద్వారా ఈ ఏడాది ఎన్‌పీఎం పద్ధతులు అమలు చేస్తున్నట్లు డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏఓ లక్ష్మానాయక్ తెలిపారు. కస్టర్ల పరిధిలో 10 కస్టమ్ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు), 50 వరకు కషాయాల విక్రయ కేంద్రాలు, అలాగే కషాయాల తయారీకి ఉపయోగపడే దేశీయ ఆవులు రాయితీతో పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. -
విత్తన చట్టంలో మార్పులు తెస్తాం
పెద్దాపురం : చరిత్ర కల్గిన పెద్దాపురం దుంప పరిశోధన కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక దుంప పరిశోధనా కేంద్రాన్ని మంత్రి పుల్లారావు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరిగిన సభలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ బయో పేరుతో రసాయనాలతో ఎరువులు కల్తి చేసిన చేసిన 51 కంపెనీల యజమానులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడతామని హెచ్చరించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పరిశోధనా కేంద్రాన్ని పెద్దాపురం తీసుకువచ్చిన ఘనత రాజప్పదేనన్నారు. మంత్రి రాజప్ప మాట్లాడుతూ రైతు అభివృద్ధికి పాటుపడుతాన్నారు. అనంతరం సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన నూతన పరిశోధన కేంద్ర భవనానికి మంత్రులు, ఎంపీ, భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేలు వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, జిల్లా గ్రం«థాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, రైతు నేతలుమాసిన వెంకట్రావు, పుట్టా సోమన్నచౌదరి, నున్నా రామకృçష్ణ (రాంబాబు), రంధి సత్యనారాయణ, ఎంపీపీ గుడాల రమేష్, జెడ్పీటీసీ సుందరపల్లి శివ నాగరాజు పాల్గొన్నారు. -
ఐఏఎస్‌నంటూ ఎస్సైని బురిడీ!
ఒంగోలు(ప్రకాశం): ఐఏఎస్‌కు ఎంపికయ్యానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాలివీ... గుంటూరు జిల్లా క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన కజ్జా పుల్లారావు(31) ప్రకాశం జిల్లా ఈపూరుపాలేనికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ను 2012లో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తరువాత వారి మధ్య సఖ్యత కొరవడింది. గత కొంతకాలం నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యాయని, త్వరలో శిక్షణకు వెళ్లబోతున్నానని, చాలామంది ఐఏఎస్‌లు తనకు పరిచయం ఉన్నారని కొందరిని నమ్మించాడు. కారంచేడు ఎస్సై రాజేష్‌ను కూడా మాయమాటలతో ఇదే విధంగా నమ్మించాడు. ఆ విషయం అక్కడితో పరిమితం కాకుండా ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. గుంటూరు జిల్లాకు చెందిన చల్లా పూర్ణ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరికొందరి వద్ద నుంచి రూ.40 లక్షలు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రహస్యంగా విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడడంతో ఐఏఎస్ నంటూ మోసాలకు పాల్పడుతున్న పుల్లారావును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
విచారణకు సిద్ధంకండి
హైదరాబాద్ :ఏపీ కొత్త రాజధాని ప్రాంతంలో ముందుగానే భూములు కొంటున్నారని తాము ముందే చెప్పామని, చంద్రబాబు నాయుడి బినామీలంతా అక్కడ ముందే వేల ఎకరాలు కొని చక్కబెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగానే అక్కడ ఎకరం 2 లక్షలకు, 3 లక్షలకు కొని, ఆ తర్వాత అక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పారన్నారు. ఇది కొన్ని లక్షల కోట్ల కుంభకోణమని అప్పుడే చెప్పామని ఆయన గుర్తు చేశారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదని అనుకుంటుందని, కానీ.. ఏదో ఒకరోజు పిల్లిని చూడటం, దాని నడ్డి విరగ్గొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. బినామీలన్నింటి వివరాలను సమగ్రంగా చెబుతూ సాక్షిలో కథనం వచ్చిందని, వాటిపై స్పష్టత ఇవ్వడానికి బదులు సాక్షి మీద సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామంటూ బెదిరిపు ధోరణిలో మాట్లాడారని అంబటి రాంబాబు అన్నారు. ఇంతకుముందు.. సాక్షి ప్రభుత్వ పత్రిక అని, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా రాస్తారని బాబు కూడా అన్నారని గుర్తుచేశారు. కానీ, ఈ అంశంపై ఐదారు నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలతో కలిపి కథనం రాశారని ఆయన తెలిపారు. నిజంగా మీకు భయం లేకపోతే.. ఏ విచారణకైనా సిద్ధమన్న మాట చెప్పచ్చు కదా అని ప్రశ్నించారు. అలాంటి విచారణ జరపించుకుని, వాళ్లు నిర్దోషులమని నిరూపించుకుంటే శభాష్ అని ప్రజలు కూడా మెచ్చుకుంటారని తెలిపారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా, ముందే బినామీ కొనుగోళ్లు చేయించడం చంద్రబాబుకు కొత్త కాదని ఆయన అన్నారు. ఇక మీ గురించి ఏం మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడతారని అంబటి ఎద్దేవా చేశారు. జగన్ 5 లక్షల ఎకరాలను కబ్జా చేశారంటున్నారని, అది నోరా.. తాటిపట్టా అని మండిపడ్డారు. అసలు 5 లక్షల ఎకరాలంటే ఎంతో తెలుసా.. నిజంగా అంత భూమి ఉంటే మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులకు చెరి సగం ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని సవాలు చేశారు. లేదంటే లోకేష్‌కి రాయమన్నా రాయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా మీరు గొప్పవాళ్లని నిరూపించుకోవడం సరికాదని, న్యాయవిచారణ ఎదుర్కోవాలి తప్ప బురదచల్లే కార్యక్రమాలతో తప్పుకోవాలని చూడటం ధర్మంగా ఉండదని ఆయన అన్నారు. ఇక మంత్రులు చెప్పిన ప్రతివిషయం అసంబద్ధంగా, అతుకుల బొంతలాగే ఉంది తప్ప సరైన వివరణ ఎక్కడా లేదన్నారు. మీకు బినామీ భూములు లేకపోతే ఈపాటికే అక్కడ రాజధాని నిర్మాణం మొదలయ్యేదని రాంబాబు అన్నారు. తాత్కాలిక రాజధాని, అందులో భవనం కడతామన్నారని, అడుగు 3350 రూపాయల చొప్పున కాంట్రాక్టు ఇచ్చి అందులో లంచాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తాము ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నామని కూడా మంత్రులు అంటున్నారని ఆయన అన్నారు. మొన్నటివరకు తమఅభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారని, ఇప్పుడు మాత్రం జగన్ మోహన్ రెడ్డి అంటే గిట్టక వస్తున్నారంటున్నారని, ఏది నిజమో మీరే తేల్చుకోవాలని చెప్పారు. ఓపక్క రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని చెబుతూ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చేంత అభివృద్ధి ఎలా సాధించారని నిలదీశారు. విచ్చలవిడిగా ధనం సంపాదించి, దాన్ని ఎదుటి పార్టీ వాళ్ల మీద చల్లుతున్నారని మండిపడ్డారు. మొత్తం బినామీ ఆస్తుల వివరాలన్నింటినీ రిజిస్ట్రేషన్ వివరాలతో సహా పత్రికలో వస్తే.. వాటిని పేరుపేరునా ఖండించే దమ్ము వాళ్లకు లేదని అన్నారు. అసలు మంత్రి నారాయణకు ఏం సంబంధం ఉందని ఆయన భూసేకరణకు వచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఆయన అత్యంత సన్నిహితుడు కాబట్టే రెవెన్యూ కార్యక్రమాలు కూడా ఆయనకే అప్పగించారన్నారు. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ మంత్రి అయినా, అక్కడేం జరుగుతోందో తనకు తెలియదని సాక్షాత్తు ఆయనే చెప్పారని గుర్తుచేశారు. నారాయణ అయితే గుట్టు చప్పుడు కాకుండా బినామీ సొమ్ము అంటగడతారు కాబట్టి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అక్కడ ప్రపంచస్థాయి రాజధాని కాదు, ప్రపంచస్థాయి దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. నిజానికి మీరంతా లోకేష్ బినామీలే తప్ప.. పుల్లారావు, నారాయణ సంపాదించుకుంటున్నారని తాము అనట్లేదన్నారు. నిజాయితీగా ఉన్న పత్రికలు ఏవైనా వాళ్ల అవినీతిని బయట పెట్టడానికే ప్రయత్నిస్తాయి గానీ, ఏదో బెదిరించి ఎరేంజిమెంట్లు చేసుకుంటున్నారని అన్నారు. కొన్ని చానళ్లు, పత్రికలు కొంతకాలం భయపడుతున్నాయి గానీ... కలకాలం అలా ఉండవని స్పష్టం చేశారు. పేదల కడుపులు కొట్టి కోటీశ్వరులు కావాలనుకుంటే దానికి మూల్యం చెల్లించక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందని అంబటి రాంబాబు తెలిపారు. -
'అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం'
హైదరాబాద్: ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని టీడీపీ నేత ప్రదీప్ చౌదరితోపాటు విద్యార్థి నాయకుడు పుల్లారావు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో మంగళవారం వారిద్దరిని ఏసీబీ విచారించింది. ఆ విచారణ అనంతరం ప్రదీప్ చౌదరి, పుల్లారావులు విలేకర్లతో మాట్లాడారు. తన ఫోన్ లిస్ట్ ఆధారంగా తనను విచారించారని ప్రదీప్ వివరించారు. అలాగే పుల్లారావు మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పుల్లారావు ఆరోపించారు. తనకు జిమ్మిబాబు స్నేహితుడని వివరించారు. వారితో మాట్లాడిన కాల్‌లిస్ట్ ఆధారంగానే తనను విచారించారని పుల్లారావు తెలిపారు. -
8న సుప్రీంలో పోలవరం నిర్వాసితుల కేసు
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కొత్త చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా నిర్వాసితుల కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని పిటిషనర్ పుల్లారావు తరపు న్యాయవాది ...ఉన్నత ధర్మాసనాన్ని కోరారు. వచ్చే సోమవారం కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. -
15నుండి రైతురుణవిముక్తి యాత్ర
-
ఏపీ రాజధానికి లక్ష ఎకరాలు అవసరం: మంత్రులు
-
ఏపీ రాజధానికి లక్ష ఎకరాలు అవసరం: మంత్రులు
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఆరు నెలల్లో సేకరించి, వర్గీకరించి, తర్వాత మరో ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజధానిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పి.నారాయణ చెప్పారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉంటాయని తెలిపారు. రైతులకు ఎంత షేర్ ఇస్తారని అడిగినప్పుడు మాత్రం.. నేరుగా చెప్పకుండా ఇతర వివరాలు అన్నీ ఏకరువు పెట్టారు. చండీగఢ్‌లో ఎకరాకు 1100 చదరపు గజాలు ఇచ్చారని, అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 100 గజాలు కమర్షియల్ ఇచ్చారని తెలిపారు. ఇది 22-23 శాతం అవుతుందన్నారు. గాంధీనగర్‌లో అభివృద్ధి చేసినదాంట్లో 25 శాతం, నయా రాయ్‌పూర్‌లో అభివృద్ధి చేసినదాంట్లో 35 శాతం ఇచ్చామన్నా, వాస్తవానికి వారికి వెళ్లింది 29 శాతమేనన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి, అక్కడ అభివృద్ధి చేయడానికి అయిన వ్యయాన్ని బట్టి ఎంత వాటా ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్నారు. ఆధునిక సదుపాయాలతో రాజధాని నగరాన్ని నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఇంతవరకు నాలుగు పద్ధతుల్లో భూసేకరణ జరిపారని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. మొత్తం లక్ష ఎకరాల వరకు భూమిని సేకరించాలని నిర్ణయించామని, తొలిదశలో 25 వేల ఎకరాలు, రెండో దశలో మరో 25 వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. గుంటూరు, తెనాలి, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలు కవరయ్యేలా స్థల సేకరణ చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే సమావేశానికి రెండు జిల్లాల కలెక్టర్లను రమ్మని కోరామన్నారు. రైతులకు అనుకూలంగా విన్-విన్ పద్ధతిలోనే ల్యాండ్ పూలింగ్ చేయాలని అనుకుంటున్నామని, దేశంలోకెల్లా అందమైన రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వా ఆలోచన అని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీన్ని రైతుల సహకారంతోనే నిర్మిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌లోకి వెళ్లినా, తమకు ఇప్పుడు ఉన్న ధరల కంటే ఎక్కువ రేట్లే వస్తాయని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎకరాకు ఎంత ఆదాయం వస్తోందో, అంత చొప్పున డెవలప్మెంట్ పూర్తయ్యేవరకు ప్రభుత్వం వారికి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఉపయోగించని భూమినే తాము వినియోగంలోకి తెస్తామని అన్నారు. -
జైపాల్‌రెడ్డి పచ్చి అవకాశవాది
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: రాజకీయాల్లో పచ్చి అవకాశవాది కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులను అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించడాన్ని ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నామన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే దురాశతోనే ఆయన పక్షపాతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలకు స్వస్థి పలకాలని హితవు పలికారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే చదువుకున్న మూర్ఖుడిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడమే తమ ఏకైక లక్ష్యమని చెప్పారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలకు జైపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు, గంగిరెద్దులు, భోగిపళ్లు, గాలిపటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల విజేతలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి, ఇందిరా ప్రియదర్శిని, ఎం.విజయ, బి.రమణమ్మ పాల్గొన్నారు. -
కేసీకి సాగునీరు విడుదల
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: సుంకేసుల జలాశయం నుంచి కర్నూలు-కడప కాలువకు సాగునీరు విడుదల చేసినట్లు కేసీ కెనాల్ ఈఈ పుల్లారావు ఆదివారం ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. కేసీ కింద రబీ ఆయకట్టు పంటలను ఆదుకునేందుకు శనివారం రాత్రి నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొదటి రెండు రోజులు 1500 క్యూసెక్కులు, ఆ తర్వాత రెండు రోజులు 1200 క్యూసెక్కులు, 1000 క్యూసెక్కులు చొప్పున మరో రెండు రోజుల పాటు నీరందిస్తామన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి వదిలిన నీరు రెండు రోజుల్లో ఆర్డీఎస్ చేరుకుంటుందని.. ఈ నీరు సుంకేసులకు చేరుకునేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆదేశాలతో సుంకేసులలో 0.6 టీఎంసీ నీటిని నిల్వ చేసి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. 0 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రబీలో దాదాపు 25,600 ఎకరాల్లో ప్రస్తుతం మిరప, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు సాగయ్యాయన్నారు. ఈ పంటలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలన్నారు. రైతులు సర్దుబాటుతో వ్యవహరించాలని ఆయన కోరారు.