అనంతపురం అగ్రికల్చర్ : మితిమీరిన పెట్టుబడుల కారణంగా రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ప్రకతి వ్యవసాయాన్ని భారీగా విస్తరించాలని నాచురల్ ఫార్మింగ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లాలో ఉన్న 10 ఎన్‌పీఎం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడటం వల్ల వ్యవసాయం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో పురుగు మందులు లేని, పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేవలం ఆవుపేడ, మూత్రం ద్వారా తయారు చేసిన జీవామతం, ఇతరత్రా కషాయాలు వాడేలా రైతుల దష్టిని మళ్లించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా 8 మండలాల పరిధిలో 10 క్లస్టర్ల కింద 53 గ్రామాల్లో 4,150 మంది రైతుల ద్వారా ఈ ఏడాది ఎన్‌పీఎం పద్ధతులు అమలు చేస్తున్నట్లు డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏఓ లక్ష్మానాయక్ తెలిపారు. కస్టర్ల పరిధిలో 10 కస్టమ్ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు), 50 వరకు కషాయాల విక్రయ కేంద్రాలు, అలాగే కషాయాల తయారీకి ఉపయోగపడే దేశీయ ఆవులు రాయితీతో పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
Published Thu, Oct 27 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
Advertisement
Advertisement