రుణమాఫీపై సందిగ్ధంలో కేంద్ర సహకార బ్యాంకు
- మాఫీతో 61,823 మంది రైతులకు ఊరట
- ఈ యేడాది ఐదు శాతం కూడా రుణాలివ్వని వైనం
కలెక్టరేట్ : రైతు శ్రేయస్సు కోసం సహాయం అందించాల్సి న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయించడం తప్ప రుణాలు అందించడం లేదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందించాల్సిన సంఘాల సాయం అందకుండా పో తోంది. సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉన్నా వారికి అందని ద్రాక్షలా మారాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐ దు శాతం రుణాలు కూడా ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని బ్యాంకు అధికారులు పేర్కొం టున్నారు. రుణమాఫీ వర్తిస్తుందా.. లేదా.? ఎవరికి వర్తిస్తుంది..? అనే దానిపై స్పష్టత లేక సహకార బ్యాం కు సందిగ్ధంలో పడింది. గతేడాది ఖరీఫ్ రుణ ల క్ష్యంతో పోల్చుకుంటే ఈసారి ఐదు శాతం కూడా రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా సొసైటీలు విత్తనాలు, ఎరువులను విక్రయించడం తప్ప రైతులకు రుణ సాయంలో చేయూతనిచ్చినట్లు కన్పించడం లేదు.
రుణం మాఫీతో 61,823 మందికి ఊరట..
జిల్లాలో 77 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 60 సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోకి వస్తాయి. 60 సంఘాల్లో 1,80,408 మంది రైతులు సభ్యులు ఉన్నారు. ఇందులో 61,823 మంది పంట రుణాలు తీసుకున్నారు. మిగతా 1,18,585 మంది పంట రుణాలు తీసుకోలేదు. అయితే.. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లకు కలిపి మొత్తం రూ. 251 కోట్ల పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఖరీఫ్ సీజన్‌లో 61,823 మంది రైతులకు రూ.156.17 కోట్లు రుణాలు ఇచ్చారు. రబీ సీజన్‌లో 53,458 మంది రైతులకు రూ.135.04 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. మొత్తం రూ.291.21 కోట్ల రుణాలను ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంపిణీ చేసి లక్ష్యం చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ వర్తిస్తే జిల్లాలోని 61,823 మంది రైతులకు ఊరట లభిస్తుంది. కాగా, గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చిన పంట రుణాలతో పోల్చుకుంటే ఈ యేడాది పంట రుణాలు చాలా వరకు తగ్గాయి. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ. 2.50 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. ఈ సారి రుణమాఫీ ఉంటుందనే ఆశతో రైతులు తీసుకున్న రుణాలు కట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల వస్తేనే ఈ విషయంలో ప్రశ్నలు తొలగిపోయే అవకాశం ఉంది.
దృష్టి సారించని ప్రతినిధులు..
గ్రామాల్లో ఉన్న వ్యవసాయ పరపతి సంఘాలను ఆదుకునే దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో రైతులను సహకార సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. ప్యాకేజీల ద్వారా సంఘాలకు పునరుజ్జీవనం పోయాలన్న ఆలోచనే ప్రతినిధులకు లేకుండా పోయింది. జిల్లాలో 77 సంఘాలకు గాను 34 సంఘాలే ఈ యేడాది ఖరీఫ్‌లో సోయా విత్తనాలను పంపిణీ చేశాయి.
రుణ ‘సహకారం ఏదీ..?
Published Sun, Jun 29 2014 12:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement