సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత ఉందని.. అది ఈ ప్రాంతం, ఈ నేలలకే సొంతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇక్కడ సిద్ధమైన విత్తనం ప్రపంచంలో ఎక్కడైనా మొలకెత్తుతుందని చెప్పారు. అందుకే తెలంగాణ విత్తన భాండాగారం అయిందని పేర్కొన్నారు. శనివారం ఫ్యాప్సీ హాల్‌లో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాహితీవేత్తలకు నిర్వహించిన విత్తన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. జ్వలిత రచించిన సంగిడిముంత.. సుజనా రాజు ప్యూపా, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన బృందావనంల బాలల కథాసంపుటి పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment