సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, అందుకు తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల సీడ్ గార్డెన్ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో నడుపుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించారు.
అక్కడ ఎఫ్‌జీవీ కంపెనీ రిఫైనరీ మొక్కలను సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి ఇప్పటికే రాష్ట్రానికి సీడ్స్‌ను చాలావరకు తెప్పించుకున్నామన్నారు. రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని కోరగా వారు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి అక్కడ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment