పేరుకుపోయిన ధాన్యం నిల్వలు | Deposited grain reserves | Sakshi
Sakshi News home page

పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

Published Wed, May 21 2014 2:57 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Deposited grain reserves

 నల్లగొండ, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బందికి ముందు చూపు లేకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి.  ధాన్యం దిగుబడులు మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి పూర్తి స్థాయిలో జిల్లా పౌరసరఫరాల సంస్థ, డీఎం సివిల్ సప్లయీస్‌లు ధాన్యం రవాణా, మిల్లులకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
 
 ఫలితంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో  కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథం కొనుగోలు కేంద్రాలు రైతులకు సౌకర్యంగానే ఉన్నా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అధికారుల, సంఘాల తీరు పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల సంఘాల నిర్వహకులను నిర్బం దించిన సంఘటనలు, ధర్నా రాస్తారోకోలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
 
 పేరుకుపోయిన నిల్వలివే..
 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యా యి. వాస్తవానికి కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తే 45 రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి. కానీ అధికారుల వైఫ్యలం వల్ల కేంద్రాలు ప్రారంభించి రెండు  నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం పైనే ఇంకా కింద మీదా పడుతున్నారు. ‘న్యూస్‌లైన్’ సేకరించిన సమాచారం మేరకు జిల్లాలోని 45 ఐకేపీ కేంద్రాల వద్ద ప్రస్తుతం లక్షా 46 వేల 527 క్విం టాళ్లు ధాన్యం నిల్వలు పేరుకుపోయా యి. ఇది గాక రైతుల కల్లాల వద్ద నుంచి ఇంకా 6 నుంచి 7 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చే అవకా శం ఉంది. ఈ సీజ న్‌లో ఐకేపీ కేంద్రాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 21 లక్షల 58 వేల 915 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో మిల్లులకు దాదాపుగా 20 లక్షల క్వింటాళ్ల వరకు తరలించారు.
 
 ఎక్కడెక్కడ..అంటే..
 అనుముల మండలం తిరుమలగిరి కేంద్రంలో 4,360 క్వింటాళ్లు, కొట్టాలలో3,200 క్విం టాళ్లు, కట్టంగూరు మండలం కురుమర్తి 3,124 క్వింటాళ్లు, తిరుమలగిరి మండలం మామిడిపల్లి 3,161 క్వింటాళ్లు, నూతనకల్ మండలం గోరంట్ల 2,466 క్వింటాళ్లు, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం 1394 క్వింటాళ్లు, మామిడాల 1,177 క్వింటాళ్లు, తుర్కపల్లి 2, 304, పెన్‌పహాడ్ మండల ఎన్ అన్నారంలో 2,443 , తుంగతుర్తిలో 2,096, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో 2,354 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది.
 
 ముందుచూపేదీ..?
 గతేడాది భారీ వర్షాలు పడటంతో ఈ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో పంట దిగుబడి పది లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని నిర్ధేశించిన అధికారులకు ఏర్పాట్లు విషయంలో మాత్రం ముందుచూపు కొరవడింది. ధాన్యం దిగుబడి దండిగా రావడంతో ఐకేపీ కేంద్రా లు, మిల్లులు ధాన్యం రాశులతో కిక్కిరిసిపోయాయి. దీంతో మరో గత్యం తరం లేక డివిజన్ నుంచి మరొక డివి జన్ పరిధిలోని మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. అయితే డివిజన్  దాటి ధాన్యం రవాణా చేయ డం వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుచాలడం లేదని కాంట్రాక్టర్లు పేచీపెట్టారు. ఈ సమస్యను పరి ష్కరించడంలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయలేకపోతున్నాయి. దీంతో పా టు మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తోం దన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 
 లారీలు రావడం లేదు
 కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు రావడం లేదు.  పక్షం రోజు లుగా మా సంఘ బంధం ద్వారా 17, 551 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాం. కానీ 2500 బస్తాల ధాన్యం మాత్రమే లారీల్లో మిల్లుకు తరలించాము. రోజుకో లారీ కూడ రావడం లేదు. లారీల కోసం మిల్లులు, పోలీస్‌స్టేషన్ చుట్టు తిరగాల్సి వస్తుంది. ఏమి చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
 - తిరపతమ్మ, సంఘ బంధంసభ్యురాలు,
 తిరుమలగిరి, హాలియా మండలం
 
 మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు
 కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ధాన్యం తీసుకుపోయిన లారీ 24 గంటలు అయితే గాని దిగుమతి కావడం లేదు. దీంతో లారీ యజమానులు రెండు రోజుల కిరాయి అడుగుతున్నారు. ప్రభుత్వం క్వింటా ధాన్యాన్ని రవాణా చేస్తు క్వింటాకు రూ.16  ఇస్త్తూ మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం వల్ల రూ.32 చెల్లించాల్సి వస్తుంది.
 - బి. మంగమ్మ, సంఘ బంధం సభ్యురాలు,  
 తిరుమలగిరి, హాలియా మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement