విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు
సూర్యాపేటః
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మిరప విత్తనాల విక్రయాలకు సంబంధించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు దుకాణాల్లో డివిజన్ వ్యవసాయాధికారి కె.శంఖర్ రాథోడ్ ఆధ్వర్యంలో తనఖీలు చేశారు. స్థానిక సాయికృప ఆగ్రో ఏజెన్సీస్, శ్రీరామచంద్ర సీడ్స్ దుకాణల్లో నకిలీ మిరప విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు దుకాణాల్లోనూ జీవ ఆగ్రో జెనిటిక్స్ కంపెనీకి చెందిన జేసీఫోర్ 801 మిరప విత్తనాలను విక్రయించడం జరిగిందని తెలిపారు. విత్తనాల విక్రయ రసీద్‌లను స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. విత్తన, ఎరువుల దుకాణాల యాజమానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓలు అరుణ, సందీప్‌తో పాటు పలువురు ఉన్నారు.