పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం | pocharam srinivas speech on Crop Production and Seeds | Sakshi
Sakshi News home page

పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం

Published Fri, Jul 21 2017 1:41 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM

పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం - Sakshi

పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం. నకిలీ విత్తన  సరఫరా దార్లపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీ విత్తన సరఫరా సంస్థలపై పీడీ యాక్ట్‌ తెచ్చాం’’ అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం సచివాలయంలో  ‘‘ఇండో– జర్మన్‌ కోఆపరేషన్‌ ఆన్‌ సీడ్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌’’ లో భాగంగా జరిగిన ప్రాజెక్టు స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ప్రస్తుత విత్తన చట్టం స్థానంలో కొత్త విత్తన చట్టం తీసుకు రావడం, దేశీయ అవసరాలకు అనుగుణంగా సేంద్రియ ధ్రువీకరణ విధానాన్ని రూపొందించుకోవడం, సీడ్‌ పా ర్క్స్‌ ఏర్పాటు, ప్రైవేటు విత్తన సంస్థలను ప్రోత్సహించ డం అనే 4 అంశాలపై పలు ప్రతిపాదనలు తీర్మానించారు.

అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూసే విధంగా వ్యవ సాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్య లు చేపట్టిందన్నారు. ప్రస్తుతం దేశ విత్తన అవసరా లలో 60% రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నా యని, ఈ ఏడాది 20 దేశాలకు విత్తనాల ఎగుమతి జరుగుతుందన్నారు. స్వయంగా రైతే సీఎంగా ఉం డటం తెలంగాణ అదృష్టమన్నారు. జర్మనీ సాంకేతికతో రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగుతుందన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన బృందంతో జర్మనీ సందర్శిస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement