ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహాపిరమిడ్‌లో ప్రపంచ ఐదో ధ్యాన మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహాపిరమిడ్‌లో ప్రపంచ ఐదో ధ్యాన మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది మహాపిరమిడ్‌లో ధ్యానం చేశారు. బ్రహ్మర్షీ పత్రీజీ, ఇతర ధ్యాన గురువులు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
కడ్తాల /ఆమనగల్లు: ధ్యానమయ జీవితం సుందరమయమని, ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారే ధ్యానులని ధ్యాన గురువు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ పేర్కొన్నారు. ధ్యానమే ముక్తి, ధ్యానమే శక్తి అని ధ్యానంతో మనలను మనం శక్తివంతులుగా తయారు చేసుకోవచ్చని అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో జరుగుతున్న ఐదో ధ్యాన మహాచక్రాలు శుక్రవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పత్రీజీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక వేణునాద ధ్యానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పత్రీజీ ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. గురువుల సమక్షంలో సాముహిక ధ్యానం, సంగీత ధ్యానం, ప్రకృతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం, యోగ ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తి మూడురె ట్లు అధికంగా పొందవచ్చని చెప్పారు. మనసంతా మనతో ఉంటూ, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉచ్వాసనిచ్వాసలను గమనించడమే ధ్యానమని పేర్కొన్నారు. మంత్రం, యంత్రం, తంత్రం, మాయా ఏమి లేదని, శ్వాస మీదా ధ్యాసే ధ్యానమని సూచించారు.
ధ్యానం... పైసా ఖర్చులేని ప్రక్రియ: మందా
నయా పైసా ఖర్చులేని కొత్త ప్రక్రియ ధ్యానమని, పత్రీజీ కొత్త తరహా ఆలోచనలతో ధ్యానాన్ని మనకు పరిచయం చేశారని, ధ్యానం ఖర్చులేని వైద్యమని నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మం దా జగన్నాథం పేర్కొన్నారు. ధ్యానంకు సమయం అంటూ లేదని, మనకు వీలు దొరికిన సమయాల్లో శ్వాసమీద ధ్యాసతో ధ్యానం చేయవచ్చని సూచించారు.
శరీరంలోని అన్ని రసాయన ప్రక్రియలను సమతుల్యంలో ఉంచేంది ధ్యానమని తెలిపారు. ధ్యానంలో మనమంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళలు- ఏడు శరీరాలు, సనాతనం-సనూతనం, విశ్వాసఫలం తదితర ధ్యాన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎంపీ జగన్నాథంను పిరమిడ్ ట్రస్టు సభ్యులతో కలిసి పత్రీజీ సన్మానించారు.