ఆయా పంటలపై విధాన రూపకల్పనకు కేంద్రం సంప్రదింపులు జరపాలి
కేంద్రానికి దక్షిణ భారత రైతు సంఘాల నాయకుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వే‹Ùరెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది.
ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆరి్థక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment