Genetically modified crops
-
జన్యు మార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వే‹Ùరెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది.ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆరి్థక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
GM Mustard: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!
మన దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకి కూడా జన్యుమార్పిడి సాంకేతికత వచ్చేస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జెఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతో పాటు కలుపుమందును తట్టుకునే విధంగా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టిబిటి) హైబ్రిడ్ ఆవాల రకం డిఎంహెచ్ 11కు జెఈఏసీ పచ్చజెండా ఊపటం, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ పరిశోధనా సంస్థల ఆవరణల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభం కావటం జరిగిపోయింది. వంట నూనెల ఉత్పత్తిని దేశీయంగా పెంపొందించటం ద్వారా దిగుమతులను తగ్గించటం కోసమే బీటీ ఆవాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. జీఎం పంటలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో విచారణ కూడా ప్రారంభమైంది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయనిక కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలతో పాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన వందలాది సీడ్ సేవర్స్, సేంద్రియ రైతులతో కూడిన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టిబిటి ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పూర్వరంగంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. పురుగును తట్టుకునే జన్యువులతోపాటు, కలుపు మందును తట్టుకునే ఆవాల పంటకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆవాల ఉత్పత్తి పెంచటం కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. మీరేమనుకుంటున్నారు? జన్యుమార్పిడి సాంకేతికతను ఆహార పంటల్లో ప్రవేశపెట్టాలన్న పట్టుదలతోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జన్యుమార్పిడి ఆవ హైబ్రిడ్ పంట డిఎంహెచ్11 సాగుకు పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే ఆవ రకాలేవి? జన్యుమార్పిడి ఆవ డిఎంహెచ్11 రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల ఆవాల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల ఆవాల దిగుబడిని ఇస్తుంది. 5 నెలల పంట. నారు పోసి, నాట్లు (3“2.5 అడుగుల దూరం) వేసుకోవడానికి అనువైన రకం ఇది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే.. ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడం మాత్రమే. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ఆవాల జీవవైవిధ్యానికి మన దేశం పుట్టిల్లు. జీవవైవిధ్య కేంద్రాలైన దేశాల్లో ఆయా పంటల్లో జన్యుమార్పిడి ప్రవేశపెట్టవద్దని అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక నిర్దేశిస్తోంది. అయినా జీఎం ఆవాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. జన్యుకాలుష్యం ముప్పు, తేనెటీగల పెంపకం, సేంద్రియ తేనె ఎగుమతి రంగానికి కలిగే తీరని/ వెనక్కి తీసుకోలేని నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరసమాజం, రైతు సంఘాలు, సంస్థలు వద్దంటున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులు మంజూరు చేసే ముప్పు పొంచి ఉంది. ఏయే ఆహార పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు రాబోతున్నారంటారు..? కలుపుమందులను తట్టుకునే (హెచ్‌టీ) బీటీ పత్తి, బీటీ వంగ, బీటీ మొక్కజొన్న, బీటీ వరి తదితర జన్యుమార్పిడి పంటల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జన్యుమార్పిడి వల్ల ముప్పు ఏమిటి? తరతరాలుగా మెరుగైన విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తుకొని పంటలు పండిస్తూ, పండించిన పంట నుంచి విత్తనాలు దాచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి వ్యవసాయ సమాజాలకు, రైతులకు ఆయా సంప్రదాయ విత్తనాలపై సర్వహక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వంగడాలు జీవ–సాంస్కృతిక వారసత్వంగా సంక్రమించినవి. వీటిని ప్రైవేటు/కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కొద్దీ జన్యుమార్పిడి చేసి, కంపెనీల సొంత ఆస్థిగా విత్తనాలను మార్చే ప్రక్రియ ప్రజా వ్యతిరేకమైనది. జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరగకుండానే చూడాలి. జరిగిన తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. భూమి, నీరు, జీవవైవిధ్యం, ప్రజారోగ్యం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా జన్యుమార్పిడి పంటల దుష్పలితాలకు గురవుతాయి. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. మైసూరులో ఇటీవల జరిగిన కిసాన్ స్వరాజ్య సమ్మేళనం వెలువరించిన ‘విత్తన స్వరాజ్య ప్రకటన –2022’ రైతుల సంప్రదాయ విత్తన హక్కుల్ని కాపాడటంలో రాజీలేని ధోరణి చూపమని పాలకులకు విజ్ఞప్తి చేసింది. (క్లిక్ చేయండి: అల్సర్‌ని తగ్గించిన అరటి.. 10 పిలకల ధర 4,200) -
దిగుబడి అబద్ధం, అనారోగ్యం నిజం
జన్యుమార్పిడి ఆవాల విత్తన వినియోగానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని అక్టోబర్ 31 నాడు మూడు జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థల (ఐసీఎంఆర్, ఎన్ఏఎస్ఎస్, టీఏఎస్ఎస్) అధిపతులు ప్రకటించారు. జన్యుమార్పిడి ఉత్పత్తుల వరదకు గేట్లు తెరవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. జన్యుపరంగా మార్పుచేసిన ఆహార పంటల వాణిజ్య సాగును అనుమతించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానా లను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. జన్యుమార్పిడి విత్తనాలు దిగుబడులు తేకపోగా, అనారోగ్యానికి కారణం అవుతాయని గత అనుభవాలు చెబు తున్నాయి. అయినా అవాంఛిత, హానికరమైన సాంకేతిక పరిజ్ఞాన వాడకానికి ప్రపంచంలోనే అతిపెద్ద చెత్తబుట్టగా భారత్ మారడానికి సిద్ధమవుతోంది. యూరోపియన్ యూనియన్ జన్యు మార్పిడి (జీఎం) పంటలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వ్యతిరేకత తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా జన్యు మార్పిడి పంటలను అనుమతించబోనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పాలన ఉన్నప్పటికీ చైనా కూడా ప్రమాదకరమైన సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉంది. ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో జన్యు మార్పిడి విత్తన రంగం మరెక్కడకు మారగలదు, భారతదేశం తప్పితే. సాంకేతిక ఆవిష్కరణ పేరిట, జన్యుమార్పిడి ఆవాల (డీఎంహెచ్–11 రకం) వాణిజ్య సాగుకు ఆమోదం ఇవ్వవలసి వస్తే, శాస్త్రీయ నిబంధనల ప్రక్రియ ఎంత అశాస్త్రీయంగా మారిందో అర్థమవుతుంది. జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) జీఎం ఆవాలకు ఆమోదం మంజూరు చేసిన పద్ధతి అన్ని శాస్త్రీయ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్క రించడానికి జన్యు మార్పిడి టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసును ధ్రువీకరించడానికి జీఈఏసీ తన నియంత్రణను బలహీనపరిస్తే, విధాన రూపకర్తలు వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయినట్లే. జన్యు మార్పిడి ఆవాలు 30 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, అందువల్ల రూ.1,71,000 కోట్ల వంటనూనె దిగుమతి బిల్లును తగ్గించడానికి అవకాశం లభిస్తుందని ఒక అసంబద్ధ వాదన చేస్తు న్నారు. ఆమోదించిన డీఎంహెచ్–11 రకం అధిక దిగుబడినిచ్చేది కాదు. దీని ఉత్పాదకత ప్రస్తుతం వాడుతున్న మూడు ఇతర నాన్– జీఎం రకాల కంటే తక్కువ. అన్ని శాస్త్రీయ నిబంధనల ప్రకారం, ఇది అసలు పరిశీలించాల్సిన రకం కూడా కాదు. అధిక ఉత్పాదకతతో ఇప్పటికే నాలుగు ఆవాల రకాలు ఉన్నాయని ఒక శాస్త్రవేత్త సెంటర్ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సౌత్ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. మూడు రకాలు ఒకే డీఎంహెచ్ శ్రేణిలో ఉన్నాయి. సంప్రదాయ రకం అయిన డీఎంహెచ్–4, జన్యుమార్పిడి ఆవాల కంటే 14.7 శాతం అధిక దిగు బడి ఇస్తుంది. రెండు విత్తన కంపెనీల (పయనీర్, అడ్వాంటా ఉత్పత్తి చేసిన) మరో రెండు రకాలు కూడా 30 శాతం అధిక దిగుబడిని ఇస్తాయి. కాబట్టి వంటనూనెల దిగుమతులను తగ్గించేందుకే అను మతి ఇస్తున్నారన్న వాదనలో అర్థం లేదు. 2016–17లో భారతదేశం గణనీయ స్థాయిలో ఆవాలను పండించింది. అధిక ఉత్పత్తి నేపథ్యంలో ధరలు పడిపోయినాయి. రైతులకు సగటున క్వింటాలుకు రూ.400–600 వరకు ధరలు తగ్గాయి. దాదాపు 65 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఆవాల పంట, దిగు బడి సమస్యలను ఎన్నడూ ఎదుర్కోలేదు. ఉన్న సమస్య కనీస మద్దతు ధర గానీ, గిట్టుబాటు ధర గానీ రాకపోవడం. నీతి ఆయోగ్ రైతులకు భరోసా ధర కల్పించే ప్రయత్నం చేయకుండా, దిగుబడి మాత్రమే సమస్య అన్నట్లుగా, అధిక దిగుబడితోనే అధిక ఆదాయం వస్తుందనే భావన కల్పిస్తున్నది. 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం వంటనూనెల దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారకంలో లోటును తగ్గిం చాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ సీడ్ టెక్నాలజీ మిషన్ ప్రారంభమైంది. ఫలితంగా, 1993–94 నాటికి భారత్ దాదాపు స్వయం సమృద్ధి సాధించింది. వంటనూనెల ఉత్పత్తి 97 శాతం దేశీయం కాగా, కేవలం 3 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ ‘ఎల్లో రివల్యూషన్’ ఎక్కువ కాలం నిలవలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా దిగుమతి సుంకాలను తగ్గించాయి. భారతదేశం విధించగల 300 శాతం దిగుమతి సుంకాల పరిమితికి వ్యతిరేకంగా, సుంకాలు దాదాపు సున్నాకు తగ్గిపోయాయి. చౌక నూనె దిగుమతులు పెరిగినాయి. ప్రధా నంగా పామాయిల్ దిగుమతులు దేశీయ మార్కెట్లను ముంచెత్తాయి. కేవలం 3 శాతం దిగుమతుల నుంచి, మళ్లీ 60 శాతానికి పైగా దిగు మతి చేసుకోవడం మొదలైంది. ఫలితంగా, వర్షాధార భూములలో ఎక్కువగా పండించే నూనెగింజల రైతులు ఇతర పంటలకు మార వలసి వచ్చింది. దేశీయ వంటనూనె పరిశ్రమ నష్టాల్లోకి పోయింది. కొన్ని భారతీయ కంపెనీలు శ్రీలంకకు కూడా తరలివెళ్లాయి. వంట నూనెల దిగుమతి ఖర్చును తగ్గించడమే లక్ష్యం అయితే, మొదట దేశీయ నూనె ఉత్పత్తికి అనుకూల వాతావరణాన్ని కల్పిం చాలి. దిగుమతి సుంకాలను పెంచకపోతే, విదేశీ మారకంలో తరు గును తగ్గించే ఏ చర్య అయినా అర్థరహితం అవు తుంది. ఈ విషయం నీతి ఆయోగ్‌కు తెలుసు. వంటనూనె ఉత్పత్తిని దేశీయంగా పెంచాలనే ఉద్దేశం ఉంటే భారతదేశం ‘పసుపు విప్లవం’ మార్గంలో నడవవలసి ఉంటుందని దానికి తెలుసు. అయినా కొన్ని విత్తన కంపెనీల వ్యాపార అభివృద్ధికే జన్యుమార్పిడి ఆవాల అనుమతి ఇచ్చారు. జన్యుమార్పిడి ఆవాల రకం వాస్తవానికి రసాయన కలుపు నాశిని తట్టుకునే పంట. కానీ జీఈఏసీ దీనిని ఖండించింది. కాకపోతే, ఖరీదైన కలుపు నాశక రసాయనాలను రైతులు కొనలేరు కనుక వాటిని వాడే అవసరం ఉండదని వాదిస్తున్నారు. ఇది అశాస్త్రీయ వాదన. జన్యుమార్పిడి ఆవాల రకం అనుమతి వెనుక కలుపునాశక రసాయ నాల కంపెనీల వ్యాపార విస్తరణ కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే, హెచ్‌టీ బీటీ ప్రత్తి గింజలకు అనుమతి లేకున్నా చట్ట వ్యతిరేకంగా వేల ఎకరాలలో సాగు అవుతోంది. ఈ పంట కోసం గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం పెరిగింది. ఇటీవల దాని ఉపయోగం అత్యంత ప్రమాదకరం అని గుర్తించిన ప్రభుత్వం, రైతులు కాకుండా, రసాయన పిచికారీ కంపెనీలు మాత్రమే చేయాలని నిబంధన తెచ్చింది. జన్యు మార్పిడి ఆవాల రకాన్ని అనుమతి ఇచ్చిన కొద్దీ రోజులలోనే ఆ నిబంధన తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు అనుమతులు ఒకదానికొకటి సంబంధం లేనట్లు ఉన్నా, జన్యు మార్పిడి విత్తనాలు ఈ కలుపునాశక రసాయనం తట్టుకునే రకాలు కావడం విశేషం. అంటే, జన్యుమార్పిడి ఆవాల రకం విత్తనాలు రైతులు వాడితే తప్పనిసరిగా కలుపునాశక రసాయనం కొనవలసిందే. అవి వాడి రైతులు మరణిస్తే, మొత్తం ప్యాకేజికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం రైతులు కాకుండా ప్రత్యేక కంపెనీలు పిచికారీ చేసే విధంగా నిబంధన తెచ్చారు. దీని వలన, రెండు ప్రయోజనాలు: గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం చట్ట బద్ధం అవుతుంది, జన్యుమార్పిడి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. భారత దేశంలో గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం కేవలం తేయాకు తోటలలోనే చేయాలి. ఇంకెక్కడైనా చేస్తే అది చట్టవిరుద్ధం. ప్రత్యేకంగా ఆహార పంట మీద చేయడానికి వీలు లేదు. జన్యు మార్పిడి ఆవాల ద్వార హానిచేసే రసాయన అవశేషాలు కూడా విని యోగదారులకు అందుతాయి. జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు ప్రమాదకరమైనవి. ఆహార పదార్థాల జన్యు నిర్మాణం పక్కదారి పట్టినట్లయితే, జీవ క్రియలు, బయోకెమిస్ట్రీ ప్రభావితమవుతాయి. దాని వలన అలర్జీలు, అనేక ఇతర వ్యాధులు రావచ్చు. ఏ1, ఏ2 పాల నుండి లాక్టోస్ అలర్జీ, గోధుమల నుండి గ్లూటెన్ అలెర్జీ వంటి వాటిని ఇప్పటికే చూస్తున్నాం. బహుళజాతి కంపెనీల లాభాపేక్ష ఆధారంగా విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. విత్తనాల మీద రైతుల హక్కులు తగ్గుతున్నాయి. బీటీ పత్తికి అనుమతి ఇచ్చిన 20 ఏళ్ళలో రైతుల పరిస్థితి మెరుగు పడకపోగా ఆత్మహత్యలు, అనారోగ్యం పెరిగినాయి. జన్యు మార్పిడి పంటల వల్ల లాభపడేది రైతులు, వినియోగదారులు కాదు. విత్తన కంపెనీలు మాత్రమే. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత పౌరులు జీఎం ఆవాలను వ్యతిరేకించాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు -
జన్యు మార్పిడి పంటలు
గ్రూప్స్ ప్రత్యేకం జన్యువుల (డీఎన్ఏ) మార్పిడి ఫలితంగా ఏర్పడిన పంటలను జన్యు మార్పిడి పంటలు (Genetically Modified Crops) లేదా ’ఎక’ పంటలు అంటారు. రీ కాంబినెంట్ ఈూఅ టెక్నాలజీని ఉపయోగించి, ఒక జాతి మొక్క ఈూఅలో వేరొక జాతి ఈూఅను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడిన మొక్కలను ‘జన్యు రూపాంతర మొక్కలు’గా పేర్కొంటారు. ప్రపంచంలో మొట్టమొదటగా జన్యుమార్పిడి చేసిన మొక్క పొగాకు (ఖీౌఛ్చఛిఛిౌ 1982). అయితే మానవ వినియోగం కోసం విడుదల చేసిన మొదటి ఆహార పంట టమోటా. జన్యుమార్పిడి టమోటా సాగుకు అమెరికా ప్రభుత్వం 1994లో అనుమతి ఇచ్చింది. సాధారణ టమోటాల కంటే జన్యుమార్పిడి టమోటాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. తర్వాతి కాలంలో సోయాబీన్, మొక్కజొన్న, వంకాయ, బొప్పాయి, బంగాళాదుంప, చెరకు, వరి, స్వీట్కార్న, పత్తి వంటి పంటల ఈూఅను మార్పుచేసి జన్యుమార్పిడి పంటలను సాగు చేశారు. వ్యాధి నిరోధకత జన్యుమార్పిడి ద్వారా మొక్కల్లో వ్యాధి నిరోధకతను పెంచొచ్చు. తక్కువ కాలంలోనే కోతకు వచ్చే, కరువును తట్టుకొనే, అధిక దిగుబడినిచ్చే, అధిక పోషక విలువలు కలిగిన రకాలను ఉత్పత్తి చేయొచ్చు. ఫలితంగా ఆహార కొరతను, పోషక లోపాలను అరికట్టవచ్చు. గోల్డెన్ రైస్ అధిక మోతాదులో విటమిన్-ఎను కలిగిన బియ్యాన్నిInternational Rice Research Institute (మనీలా) శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. దీన్నే గోల్డెన్ రైస్ అంటారు. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సంబంధ సమస్యలు, రేచీకటిని నివారించొచ్చు. ఆర్కిటిక్ ఆపిల్ 2015లో అమెరికా ప్రభుత్వం జన్యుమార్పిడి ఆపిల్‌ను విడుదల చేసింది. ఆపిల్‌ను కోయగానే రంగు మారిపోవడానికి కారణమైన ౌ్కడఞజిౌ్ఛ ై్ఠజీఛ్చీట్ఛ అనే ఎంజైమ్‌ను దీన్నుంచి తొలగించారు. అందువల్ల కోసిన తర్వాత జన్యుమార్పిడి ఆపిల్ రంగు మారదు. జీఎం బొప్పాయి జన్యు మార్పిడి చేసిన (జీఎం) బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్‌ను తట్టుకుంటుంది. జీఎం మొక్కజొన్న ఇది అధిక శాతం విటమిన్లను కలిగి ఉంటుంది. సాధారణ రకం కంటే 169 రెట్లు అధిక విటమిన్-ఎ, 6 రెట్లు అధిక విటమిన్-సిను కలిగి ఉంటుంది. అధిక దిగుబడిని ఇస్తుంది. జీఎం బంగాళాదుంప జన్యుమార్పిడి చేసిన బంగాళా దుంపలో అధిక పిండి పదార్థం (స్టార్‌చ) ఉంటుంది. లెట్‌బ్లైట్ తెగులును తట్టుకుంటుంది. బీటీ పత్తి జన్యు మార్పిడి చేసిన పత్తినిBt పత్తి అంటారు. Bt అనేది బాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా పేరు. ఈ బ్యాక్టీరియా నుంచి Cry1Ac అనే జన్యువును తీసుకొని, పత్తిలో ప్రవేశపెట్టారు. ఈ జన్యువు ఒక రకమైన విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది పత్తి పంటను అధికంగా ఆశించే పచ్చపురుగు (లేదా) బోల్‌వార్‌మ తెగులును నిరోధిస్తుంది. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. పురుగు మందుల వాడకం కూడా తగ్గుతుంది. రైతుకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి వాణిజ్య పంట ఆ్ట పత్తి (2002). ప్రస్తుతం దేశంలో 96% బీటీ పత్తి విస్తరించింది. ఆ్ట వంకాయ భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి ఆహారపంట ఆ్ట వంకాయ. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ పంటపై నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల వినియోగంలో అమెరికా ప్రథమస్థానంలో ఉంది. 2011 నాటికి 25 రకాల జన్యు మార్పిడి పంటలు అమెరికాలో వాడుకలో ఉన్నాయి. 2015 నాటికి అమెరికాలో మొక్కజొన్న పంటలో 92%, సోయాబీన్లో 94%, పత్తిలో 94% జన్యు మార్పిడి చేసిన రకాలను ఉపయోగిస్తున్నారు. జన్యుమార్పిడి పంటల వల్ల లాభాలు వ్యాధి నిరోధకతను ప్రదర్శించే పంటలను తయారు చేయవచ్చు. ఉదా: ఎక బొప్పాయి కీటకాలు, పురుగుల దాడి నుంచి తట్టుకొనే పంటలను సాగుచేయొచ్చు. ఉదా. ఆ్ట పత్తి. అధిక ఉష్ణోగ్రత, అధిక చలిని తట్టుకొనే పంటలను ఉత్పత్తి చేయొచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొనే రకాలను ఉత్పత్తి చేయొచ్చు. అధిక లవణీయతను తట్టుకొనే పంటలను పండించొచ్చు. అప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లోని ఉప్పునేలల్లో కూడా వ్యవసాయం సాధ్యమవుతుంది. అధిక పోషక విలువలు కలిగిన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. ఉదా: గోల్డెన్ రైస్ అధిక దిగుబడినిచ్చే రకాలను ఉత్పత్తి చేయొచ్చు. పంట పక్వానికి వచ్చే కాలాన్ని తగ్గించి, తక్కువ కాలంలో పంటలను పండించొచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండే పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేయొచ్చు. ఉదా. ఎక టమోటా నష్టాలు కొన్నిసార్లు జన్యుమార్పిడి పంటలు అలర్జీలను కలగజేస్తాయి. జన్యుమార్పిడి పంటలు అంత రుచికరంగా ఉండవు. జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయి. ప్రాంతీయ నాటు రకాలు కనుమరుగవుతాయి. పర్యావరణ వేత్తల అభిప్రాయం ప్రకారం జన్యుమార్పిడి పంటలు అంత శ్రేయస్కరం కాదు. జన్యుపరివర్తన పంటల్లో ఉండే విషపదార్థాలకు అలవాటుపడి, కీటకాలు భవిష్యత్తులో ఏ మందులకూ లొంగని విధంగా తయారయ్యే ప్రమాదం ఉంది. వివాదాస్పద అంశాలు సాధారణ పంటల్లో వచ్చే విత్తనాలను తరువాతి పంటకు వాడతారు. కానీ జన్యు మార్పిడి పంటల్లో టెర్మినేటర్ జన్యువును వాడతారు. అందువల్ల విత్తనాలు రావు. ఒకవేళ విత్తనాలు వచ్చినా అవి తరవాతి పంటకు పనికిరావు. అందువల్ల రైతు ప్రతి పంటకూ కొత్త విత్తనాలను అధిక ధర చెల్లించి కొనాలి. అంటే మన వ్యవసాయాన్ని విదేశీ విత్తన సంస్థలు నియంత్రిస్తాయి. జన్యుపరివర్తిత పంటల విత్తనాలను ఇప్పటి వరకు మోన్శాంటో వంటి విదేశీ సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. మనదేశ రైతుల భవితవ్యం విదేశీ సంస్థల ఆధీనంలో ఉండటం దేశ భద్రతకు హానికరం. అంతేగాక జన్యు పరివర్తన మొక్కల్లోని పుప్పొడి రేణువులు సహజంగా పెరిగే సాధారణ వేరొక జాతి మొక్కలపై పడితే అవికూడా పనికిరాని వంధ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా వేల సంవత్సరాల నుంచి దేశంలో సాగుచేస్తున్న ప్రాంతీయ రకాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జన్యు రూపాంతర పంటలు ఎంతవరకు శ్రేయస్కరం అనే విషయాన్ని ఇప్పటివరకూ నిరూపించలేదు. ముగింపు జన్యుమార్పిడి పంటల వల్ల ఎన్నో లాభాలున్నాయి. పేద దేశాల్లో ఆహార కొరతను, పోషకాహార లోపాన్ని నియంత్రించవచ్చు. కానీ జన్యుమార్పిడి ప్రకృతి విరుద్ధం. జన్యు మార్పిడిని ప్రకృతి కూడా చేస్తుంది. ప్రకృతి చేసే పనిని మనిషి చేయకూడదు. తాత్కాలికంగా ఈ పంటలు లాభం కలిగించినా భవిష్యత్‌లో కలిగించే నష్టం ఊహకు అందనిది.