రైతు ఆరుగాలం శ్రమ వర్షార్పణమైంది. కళ్ల ముందే వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా నిలిచిపోయాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట, దుబ్బాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. టార్పాలిన్లు లేకపోవడంతో వానకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో అన్నదాత విలవిలలాడిపోయాడు.
సిద్దిపేట జోన్,న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతను నట్టేట ముం చింది. ఆరుగాలాల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నీటి పాలు అ వుతున్నా ఎమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అన్నదాత మిగిలి పోయాడు. సిద్దిపేట యా ర్డుకు విక్రయానికి తెచ్చిన రైతు ధాన్యం మం గళవారం కురిసిన అకాల వర్షానికి కొట్టుకుపోయింది.
సుమారు నాలుగు వేల బస్తాలు నీటిపాలవ్వడంతో అన్నదాత విలవిలలాడాడు. మరో వైపు మంగళవారం సిద్దిపేట యార్డులో మద్దతు ధర అమాంతం పడిపోయింది. అటు మద్దతు ధర రాక, ఇటు వర్షానికి ధాన్యం తడవడంతో రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా మా రింది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు జిల్లా తో పాటు పొరుగున ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామా ల రైతులు ధాన్యాన్ని తీసుకువస్తారు. అందు లో భాగంగా మంగళవారం సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం యార్డుకు వచ్చింది. నిర్ణిత వేలల్లో బీటు నిర్వహించాల్సిన వ్యాపారులు ఆలస్యంగా బీటు చేపట్టారు. యార్డులోని షెడ్డులతో పాటు ఆరుబయట పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
దీంతో మార్కెట్ యార్డు ఆరుబయట ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యపు రాసుల నుండి వర్షపు నీరు కాలువలుగా ప్రవహించడంతో ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రైతుల ధా న్యానికి సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి గుర్రాలగొందికి చెం దిన గుర్రం యాదగిరి, కొంపెల్లి ఎల్లయ్య, చంద్రయ్య, ఎన్‌సాన్‌పల్లికి చెందిన పబ్బతి లక్ష్మి, ఇర్కోడుకు చెందిన గుట్టకింది ఎల్లవ్వ, మిట్టపల్లికి చెందిన యాదయ్యలకు చెందిన ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది. పరిస్థితిని మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య పరి శీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇదిలాఉండగా మంగళవారం నాటి బీటులో రైతుకు మద్దతు ధర పడిపోయింది. క్వింటాల్‌కు గరిష్టం రూ. 1220, కనిష్టం రూ. 1200 ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన చెందారు.
ఈదుగాలులతో కూడిన వర్షం
దుబ్బాక, దుబ్బాక రూరల్ : రైతు కష్టం నీటిపాలయ్యింది. దుబ్బాకలో మంగళవారం ఈదురుగాలులతో కురి సిన వర్షానికి యార్డులో సూమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. దీంతో యార్డులో తడిసిన ధాన్యాన్ని కాపడుకునేం దుకు అన్నదాతలు నానా తంటాలు పడ్డారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో 12 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణమైంది. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరద నీటికి ధాన్యం నీటిపై తేలాడింది. దీంతో అన్నదాతలు అల్లాడిపోయారు. తమ రెక్కల కష్టం వృథా అయిపోయిందని ఆవేదన చెందారు. అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ఉంటే తమ ధాన్యం తడిసి ఉండేది కాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
ధాన్యం వర్షార్పణం
Published Tue, May 27 2014 11:11 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement