కామారెడ్డి: చినుకు కోసం జిల్లా రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మొదట్లోనే వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షాకాలం మొదలై నెల దాటినా విత్తనాలు వే యడానికి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. గతేడాది ఈ పాటికి భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంట లు జల సిరిని ధరించగా, ఈ ఏడాది ఇప్పటికీ చినుకులే తప్ప భారీ వర్షాల జాడలేకుండాపోయింది. ప్రతీ రోజు కమ్ముకొచ్చే మేఘాలను చూసి రైతులు ఆశపడుతున్నా, వరుణుడు మాత్రం కరుణించడం లేదు.
ఈ యేడు జూన్ ఒకటి నుంచి జూలై రెండు వరకు సాధారణ వర్షపాతం 178.1 మిల్లీమీటర్లు కాగా, కేవలం 57.7 మిల్లీమీటర్ల వర్షపా తం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కన్నా 68 శాతం తక్కువగా కురిసింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తొలకరి జల్లులు కూడా కురవలేదంటే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.
ఎత్తిపోతున్న బోర్లు
వర్షాభావ పరిస్థితులతో బోర్లు ఒక్కొక్కటిగా ఎత్తిపోతున్నా యి. నిన్న మొన్నటిదాకా బోర్ల మీద కొంత ఆశ ఉన్న రై తులు భూగర్భజలాల మట్టం పడిపోతుండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. గత యేడాది భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు పొంగిపొరలా యి. దీంతో భూగర్భజలాలు వృద్ధి చెంది పెద్దగా ఇబ్బం దులు లేకుండా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు సాగయ్యా యి.
ఈసారి వర్షాకాలంలోనే వానల జాడలేకపోవడం భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీస వర్ష పాతం కూడా నమోదు కాకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. బావులు, బోర్లవద్ద ఖరీఫ్ సాగుకోసం విత్తనాలు వేద్దామని ఆలోచన చేసిన రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే విత్తనం వేసిన వారు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదును దాటుతున్నా జాడలేని వానలు
Published Tue, Jul 8 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement