వచ్చే వచ్చే వాన జల్లు
- జిల్లాను పలకరించిన నైరుతి రుతుపవనాలు
- ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న కర్షకులు
- ఎండల నుంచి ఉపశమనం
- జిల్లాలో సగటు వర్షపాతం 2.8 మి.మీ. నమోదు
ఏలూరు/భీమవరం : ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా జల్లులు కురిశారు. భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలు చల్లదనంతో కాస్తంత సేదతీరగా.. అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. మెట్టలో ఎండిపోతున్న నారుమడులు, నాట్లు జీవం పోసుకునే అవకాశం కలిగింది. చెరకు, ఆరుుల్‌పామ్ తదితర పంటలు చేజారిపోతున్నాయన్న తరుణంలో కురిసిన చిరుజల్లులు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించారుు.
విస్తారంగా కురిస్తేనే గట్టెక్కేది
జూన్‌లో జిల్లాలో సగటున 104 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 18 మి.మీ. మాత్రమే నమోదైంది. శనివారం కొన్నిచోట్ల రెండు గంటలపాటు వర్షం కురిసినా.. మరింతగా వర్షం పడితే తప్ప ఖరీఫ్ సాగు ముందుకెళ్లే పరిస్థితి లేదు. అరునా.. భవిష్యత్‌పై ఆశతో రైతులు పొలాలను దుక్కిదున్ని, నారుపోసే పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్టలో ఎండిపోయే స్థితికి చేరిన నారుమళ్లు మూన తిరగడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నారు.
డెల్టాలోని రైతులంతా ఖరీఫ్ పనుల్లో తలమునకల య్యూరు. ఈ ఏడాది 2.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 12 వేల హెక్టార్లలో నారుమడులు పోయూల్సి ఉంది. మెట్ట ప్రాంతంలో ఇప్పటివరకు 4,000 హెక్టార్లలో నారుమడులు వేశారు. చాగల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు వంటి కొన్నిప్రాంతాల్లో నాట్లు పడినప్పటికీ అవి వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఇకనుంచి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ గండం గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు.