Southwest monsoon. Farmers
-
ముఖం చాటేసిన వరుణుడు
సాక్షి,బళ్లారి: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వరణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. జిల్లాలో తుంగభద్ర ఆయకట్టుతో పాటు, వర్షాధారిత భూములు దాదాపు ఐదు లక్షలు ఎకరాలు సాగుభూమి ఉంది. ఇందులో తుంగభద్ర ఆయకట్టు కింద దాదాపు మూడు లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, మిగిలిన భూమి వర్షాధారిత ఆధారంగా పంటలు పండిస్తున్నారు. బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, సండూరు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షలు ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా జూన్ నెల దాటే సమయం వస్తున్నప్పటి ఇప్పటి వరకు సరైన పదును వాన రాకపోవడం విత్తన సాగు ప్రశ్నార్థంగా మారింది. దుక్కులు దున్ని దిక్కులు అష్టకష్టాలతో దుక్కులు దున్ని విత్తన సాగుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారి మల్లికార్జున సాక్షికి తెలిపారు. జిల్లాలో ప్రధానంగా వర్షాధారిత భూముల్లో జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, కంది తదితర పంటలు సాగు చేస్తుండగా, వర్షాలు ఆలస్యం కావడంతో జొన్న సాగు చేయడానికి కష్టతరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారిత భూముల్లో దుక్కిలు దున్ని పొలాలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురుచూస్తుండగా, తుంగభద్ర డ్యాం ఖాళీ కావడంతో ఆయకట్టు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ముందుగా వరినారు సిద్ధం చేసుకునేందుకు కూడా భయపడుతున్నారు. సాధారణంగా జూన్ రెండవ వారంలోపు తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో బాగా పెరుగుతుండేవి. ఇప్పుడు డ్యాంలో నిల్వలు అడుగంటాయి. 4 టీఎంసీలు పడిపోవడంతో ఇన్‌ఫ్లోలు జీరో అయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 40 టీఎంసీలకు పైగా ఉండటంతో రైతులు ఆయకట్టులో వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఈ ఏడాది డ్యాంలో నీటిమట్టం ఎప్పుడు పెరుగుతుందా, వర్షాలు ఎప్పుడు వస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
13న రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఆదివారం ఉదయం కేరళను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్ష దీవుల్లో చాలా ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి, సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అక్కడినుంచి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వాస్తవంగా రుతుపవనాలు ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. రెండ్రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవే శించాయి. భూమి వేడి తగ్గితేనే రుతుపవనాలు వేగం గా ప్రవేశిస్తాయని, వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది 97 శాతం వర్షాలు... సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది ఇదే సీజలో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా కేవలం 92 శాతమే వర్షం కురిసింది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఇప్పుడే మరింత ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్ 7న ప్రవేశించాయి. ఇప్పుడు 8న వచ్చాయి. ఉపరితల ఆవర్తనంతో అక్కడక్కడా వర్షాలు.. మరోవైపు తూర్పు పశ్చిమ షియర్ జోన్ దక్షిణ భారత్ మీదుగా 2.1 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఫలితంగా రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి కాస్తంత ఉపశమనం ఏర్పడింది. రుతుపవనాల రాకకు ముందు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వివిధ సంవత్సరాల్లో కేరళకు, తెలంగాణల్లోకి చల్లబడ్డ హైదరాబాద్... నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లో నగరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు శుక్ర, శనివారాల్లో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉంటే శనివారం నగరంలో పగటిపూట 34 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా, అత్యల్పంగా 22.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువ కావటం విశేషం. కాగా, శుక్రవారం నగరంలో అత్యధికంగా హకీంపేటలో 26.4 ఎంఎం, మేడ్చల్‌లో 17.8 ఎంఎం వర్షం కురిసింది. వ్యవసాయ ప్రణాళిక విడుదలపై అధికారుల నిర్లక్ష్యం... ఖరీఫ్ మొదలైంది. త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు రానున్నాయి. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆ ప్రకారం వ్యవసాయశాఖ ప్రణాళిక విడుదల చేయాలి. మే నెలలోనే రైతుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతుంది. సాధారణ పంటల సాగు 2019–20 ఖరీఫ్, రబీల్లో ఎంతెంత చేసే అవకాశముందో ప్రణాళికలో వివరిస్తారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తరుణంలో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో అదనంగా ఏడెనిమిది లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. ఆ ప్రకారం ఎంత సాగు పెరిగే అవకాశముందో అంచనా వేస్తారు. అంటే సాధారణ సాగు విస్తీర్ణం, పెరిగే విస్తీర్ణాన్ని ప్రణాళికలో ప్రస్తావిస్తారు. మరోవైపు ఉత్పత్తి, ఉత్పాదకతల లక్ష్యాన్ని కూడా వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో ప్రస్తావిస్తుంది. ఎరువులు, విత్తనాల లక్ష్యం, సరఫరాలను ప్రస్తావిస్తారు. కానీ ఇంతవరకు ప్రణాళికను అధికారులు విడుదల చేయకపోవడంపై సర్కారు పెద్దలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు రైతుబంధు పథకం కింద నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఖరీఫ్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
వచ్చే వచ్చే వాన జల్లు
- జిల్లాను పలకరించిన నైరుతి రుతుపవనాలు - ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న కర్షకులు - ఎండల నుంచి ఉపశమనం - జిల్లాలో సగటు వర్షపాతం 2.8 మి.మీ. నమోదు ఏలూరు/భీమవరం : ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా జల్లులు కురిశారు. భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలు చల్లదనంతో కాస్తంత సేదతీరగా.. అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. మెట్టలో ఎండిపోతున్న నారుమడులు, నాట్లు జీవం పోసుకునే అవకాశం కలిగింది. చెరకు, ఆరుుల్‌పామ్ తదితర పంటలు చేజారిపోతున్నాయన్న తరుణంలో కురిసిన చిరుజల్లులు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించారుు. విస్తారంగా కురిస్తేనే గట్టెక్కేది జూన్‌లో జిల్లాలో సగటున 104 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 18 మి.మీ. మాత్రమే నమోదైంది. శనివారం కొన్నిచోట్ల రెండు గంటలపాటు వర్షం కురిసినా.. మరింతగా వర్షం పడితే తప్ప ఖరీఫ్ సాగు ముందుకెళ్లే పరిస్థితి లేదు. అరునా.. భవిష్యత్‌పై ఆశతో రైతులు పొలాలను దుక్కిదున్ని, నారుపోసే పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్టలో ఎండిపోయే స్థితికి చేరిన నారుమళ్లు మూన తిరగడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నారు. డెల్టాలోని రైతులంతా ఖరీఫ్ పనుల్లో తలమునకల య్యూరు. ఈ ఏడాది 2.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 12 వేల హెక్టార్లలో నారుమడులు పోయూల్సి ఉంది. మెట్ట ప్రాంతంలో ఇప్పటివరకు 4,000 హెక్టార్లలో నారుమడులు వేశారు. చాగల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు వంటి కొన్నిప్రాంతాల్లో నాట్లు పడినప్పటికీ అవి వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఇకనుంచి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ గండం గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు.