Rainfall deficiency
-
ఆ పట్టణంలో వర్షం కురిసిన దాఖలాలే లేవు..!
భూమిపై వర్షం కురువని ప్రదేశం ఒకటి ఉందన్న విషయం నమ్మశక్యంగా లేదా..? నమ్మశక్యంగా లేనప్పటికీ తప్పక నమ్మి తీరాల్సిందే. చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు. ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది. -
ముంచుకొస్తున్న ముప్పు..!
కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. నీటికరువు వెంటాడుతోంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. పశువులు, పక్షులు సైతం నీరు లేక అల్లాడుతున్నాయి. తాగడానికి సైతం నీరు దొరకకపోవడం గమనార్హం. పరిస్థితి ఇప్పుడే ఇలాగుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరువు రక్కసిని తలుచుకుని కకావికలం అవుతున్నారు. చెన్నూర్‌రూరల్ : గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రంగానే వచ్చింది.వేసవి కాలం ప్రారంభం కాక ముందే గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండి పోయి దర్శనమిస్తున్నాయి.దీంతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో చెరువులు, కుంటల్లో నీరు లేక బోసి పోతున్నాయి. పశువులకు తాగేందుకు కరువే.. మండలంలోని కత్తెరసాల, చింతలపల్లి, సుద్దాల, కిష్టంపేట, బావురావుపేట, కమ్మరిపల్లి, కాచన్‌పల్లి, కొమ్మెర, పొక్కూరు, ఆస్నాద తదితర గ్రామాల సమీపాల్లోని చెరువుల్లో, నదుల్లో గతంలో ఏడాదంతా పుష్కలంగా నీరుండి మూగజీవాలకు నీరు కరువు ఉండేది కాదు. పగలంతా మేత మేసి సాయంకాలం పశువులు చెరువుల్లో దాహార్తి తీర్చుకునేవి. కానీ గత ఖరీఫ్‌లో వర్షాలు కురవక పోవడంతో వేసవికి ముందే చెరువులు, వాగులు, కుంటలు, నదుల్లో చుక్క నీరు లేకుండా ఇంకి పోయి, అలాగే భూగర్భజలాలు అడుగంటి చివరకు బావుల్లో సైతం చుక్క నీరు లేకుండా కావడంతో పశువులు, కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి బొట్టును వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చుక్క నీరు లేక నదులు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు కళ తప్పి వెల వెల బోతూ దర్శనమిస్తున్నాయి. పశువులకు తాగేందుకు నీరు సక్రమంగా దొరకడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు ఎండి పోయి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు, కాపర్లు పశువులకు, జీవాలకు తాగునీరందించేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. బోరుబావుల దగ్గరికి వెళ్లి పశువులకు తాగునీటిని పెట్టాల్సి వస్తుందని, చెరువుల్లో ఎక్కడో గుంతల్లో ఉన్న నీటిని తాగుతున్నాయని రైతులు, కాపర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన నీటితొట్లు శిథిలావస్థకు చేరుకోగా, మరి కొన్ని నీరు లేక నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకొని శిథిలావస్థకు చేరుకున్న నీటితొట్లకు మరమ్మతులు చేయించి, నీటితొట్లలోకి నీరు వచ్చే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
కరెంట్.. కన్నీరు
నర్సంపేట : ఖరీఫ్ సాగు కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరువు పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని వణికిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో మురిపెంలా కురిసిన తొలకరి చినుకులు రైతుల్లో ఆశలు రేపి... ఆ తర్వాత మొహం చాటేశారుు. వర్షాభావం నేపథ్యంలో కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా వెనుకడుగు వేయడంతో పంట భూములన్నీ ఖాళీగా ఉన్నారుు. ఆశతో మరికొందరు రెట్టింపు పెట్టుబడి పెట్టి పలు పర్యాయూలు విత్తనాలు నాటి, బిందె సేద్యంతో పంటలు కాపాడుకున్నారు. అదును దాటిన తర్వాత కొంత నయమనిపించేలా కురిసిన వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించారుు. జిల్లాలో సాధారణ వర్షపా తం 703.09 మిల్లీమీటర్లు కాగా... 531.04 మి.మీల వర్షం కురిసింది. ఇది కూడా పంటల సాగు సవుయుం మించిన తర్వాత నమోదైన వర్షపాతమే. జిల్లా లో మొత్తం 5,02,132 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా... 4,06,558 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. కానీ.. తాజా పరిస్థితులు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. వర్షాలు కురవకపోవడానికి తోడుగా కరెంట్ కోతలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చే స్తున్నారుు. పట్టుమని మూడు గంటలు కూడా కరెం ట్ సరఫరా కాని పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పొలాలు నెర్రెలుబారుతున్నారుు. మక్క, పత్తి, సోయ, వరి పంటలు ఎండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంటలకు నీరు పెట్టాలని పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతు న్నా... విద్యుత్ సరఫరా ప్రతిబంధకంగా మారడం తో రైతులు గుండలవిసేలా రోదిస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంట్ సరఫరా గగనంగా వూరడంతో రైతన్నలు సాగుపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తు తం జిల్లాలో 70 శాతం మేర వరి అక్కరకు రాకుండా పోరుునట్లు వ్యవసాయ అధికారుల అంచనా. బోసిబోరుున ధాన్యాగారం జిల్లాలోనే ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సంపేట ప్రాంతం వరి సాగు లేక బోసిపోరుుంది. ఖరీఫ్‌లో అనుకున్న సవుయూనికి వర్షాలు కురిస్తే పాఖాల, వూధన్నపేట, రంగాయు చెరువుల్లోకి నీరు చేరుతాయుని ఆశించి రైతులు నారు వుడులు సిద్ధ చేసుకున్నారు. వర్షాలు లేక నారు వుడులు ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు. పాకాల సరస్సు కింద 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉండగా... ప్రస్తుతం ఎక్కడ చూసినా బీడు భూవుులే కనిపిస్తూ ఎండిపోరుున ఆనవాళ్లతో నారు వుడుల గుర్తులు ఉన్నారుు. -
ఆశ నిరాశేనా?
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో మొక్కజొన్న రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షాభావం కారణంగా మొక్కజొన్న పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివస్తుందనుకున్న మొక్కజొన్న పంట పశువులకు దాణాగా మారుతోంది. పంట ఎండిపోతుండడంతో చేసేదేమి లేక రైతులు మొక్కజొన్న పొలాల్లో పశువులను మేపుతున్నారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న 1,10,662 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా రైతులు 1,07,521 హెక్టార్లలో మొక్కజొన్న పంటలను సాగు చేశారు. వర్షాభావం కారణంగా జిల్లాలో మొక్కజొన్నసాగు విస్తీర్ణం తగ్గింది. తాజాగా సకాలంలో వర్షాలు కురియక మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న పంట విత్తు ఎదిగే దశలో ఉంది. ఈ దశలో మొక్కజొన్న పంటలకు వర్షం చాలా అవసరం. అయితే గత 20 రోజులుగా వర్షాలు కురవడంలేదు. వర్షాభావం కారణంగా జిల్లాలో సుమారు 15వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరోవారం రోజులపాటు వర్షాలు కురవకపోతే మొక్కజొన్నపంట మరింత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో మొక్కజొన్నపంట ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయశాఖ అధికారులు మొక్కజొన్న పంట నష్టం వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాభావమే శాపంగా మారింది. జిల్లాలో ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మొక్కజొన్న పంటపై వర్షాభావం పరిస్థితి ఎక్కువగా ఉంది. ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. అయితే పంట ఎదిగే దశలో, కంకిపట్టే దశలో, విత్తు ఎదిగే దశల్లో వర్షాలు కురవలేదు. దీంతో మొక్కజొన్నపంట దెబ్బతింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వర్షాభావం కారణంగా మొక్కజొన్నపంట ఎండిపోతోంది. మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులు మొక్కజొన్న ఎండిపోవడంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు. వర్షాభావంతో 40 శాతం మేర మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.