చేవెళ్ల: పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. ఓ వైపు తీవ్రమవుతున్న విద్యుత్ కోతలు.. మరో వైపు పెరుగుతున్న ఎండలతోపాటు చిరు జల్లులు కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.
ముఖ్యంగా అస్తవ్యస్త విద్యుత్ సరఫరా రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న కాస్త పంటలను కాపాడుకోవడానికి రైతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కన్పించడం లేదు. చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌లో చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలున్నాయి.
ఈ మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలతోపాటు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో దిగులుపడిన రైతన్న గత నెలలో కురిసిన వర్షాలతో ఊరట చెందాడు. ఆ సమయంలోనే రైతులు రెండో దఫా మరికొంద సాగు చేపట్టారు. ఇప్పుడాపంటన్నీ ఎండుతున్నాయి.
ఓ వైపు వ్యవసాయ బోర్లు, బావులలో నీరుంది.. కానీ విద్యుత్ లేక పంటలు ఎండుతున్నారు. రోజుకు ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి 3 నుంచి 4 గంటలకు మించి సరఫరా ఉండడం లేదని రైతులు వాపోతున్నారు.
పవర్ పంచ్!
Published Mon, Oct 6 2014 11:56 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement