Dryland
-
డ్రైల్యాండ్ హార్టికల్చర్‌లోకి ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగు
వర్షాధారిత భూముల్లో పండ్ల తోటల సాగు ద్వారా జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం కింద ఏటా వివిధ రకాల పండ్ల మొక్కల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ నిధులతో అమలు చేసే ఈ పథకంలోకి ఈసారి డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చింది. అనంతపురం టౌన్/నార్పల: జిల్లాలో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. మామిడి, చీనీ, అరటి, బొప్పాయి, సపోటా, దానిమ్మ తదితర పండ్లతోటల విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 1,02,224 హెక్టార్లలో తోటలు విస్తరించి ఉన్నాయి. డ్రైల్యాండ్ హార్టికల్చర్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉద్యాన తోటల సాగుకు ముందుకు వస్తున్నారు. సంప్రదాయ పండ్ల తోటలే కాకుండా డ్రాగన్‌ఫ్రూట్ వంటి అరుదైన రకాలూ సాగు చేస్తూ ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. రైతుల ఆలోచనలకు తగ్గట్టే అధికారులు కూడా నూతన పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ‘డ్రాగన్’ సాగుకు ప్రోత్సాహం బహుళ పోషకాలు అందించే పండుగా డ్రాగన్ ఫ్రూట్ పేరుగాంచింది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుండడంతో జిల్లాలోనూ డ్రాగన్‌ఫ్రూట్స్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 80 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగులో ఉంది. నార్పల, కనగానపల్లి, గార్లదిన్నె, పుట్టపర్తి తదితర మండలాల్లోని రైతులు సొంతంగా ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట వేశారు. రైతుల ఆసక్తిని గమనించిన అధికారులు ఈ పంటను కూడా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) నుంచే ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈసారి దాదాపు 15 వేల ఎకరాలలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ అమలుచేయనున్నారు. ఇందులో అన్ని పండ్లతోటలతో పాటు డ్రాగన్‌ఫ్రూట్‌కూ అవకాశం కల్పించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు దాదాపు అన్ని పండ్లతోటల సాగుకు అనువుగా ఉన్నాయి. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ పంట ద్వారానూ లాభాలు గడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ పంటకు చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు దాదాపు రూ.300 పలుకుతున్నాయి. స్థానికంగా విక్రయించుకున్నా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పెద్దసంఖ్యలో పంట సాగుకు ముందుకొచ్చే అవకాశముంది. అర ఎకరాకు రూ.2.50 లక్షల ప్రోత్సాహం డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అర ఎకరా వరకు అనుమతి ఇస్తారు. ఇందులో 400 మొక్కలు నాటవచ్చు. మొక్క ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. మొక్కకు సపోర్ట్‌గా నిలువు స్తంభంతో పాటు దానిపై చక్రం ఏర్పాటు చేస్తారు. మొక్క నాటిన రోజు నుంచి మూడేళ్ల పాటు సంరక్షణ కోసం రైతులకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల నిధులను ఉపాధి హామీ ద్వారా చెల్లించనున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ పంటను డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకంలోకి చేర్చాం. ప్రతి రైతుకూ అర ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు అవకాశం కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు ఒక ఎకరా వరకు మునగ పంట సాగు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాం. – వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) -
బీడు భూముల్లోనూ ఉద్యాన సిరులు
కర్నూలు (అగ్రికల్చర్): పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల సాగుకు అవకాశం కల్పిస్తోంది. బావి, బోరు లేకున్నా పండ్ల తోటలు అభివృద్ధి చేసుకునేలా డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం కింద బీడు భూమి సమీపంలోని చెరువు, కుంట, ఫారమ్ పాండ్ నుంచి నీళ్లు తెచ్చి మొక్కలను బతికించుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరువు పీడిత జిల్లాల రైతులకు ఈ పథకం వరంగా మారుతోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో చాలామంది రైతులు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానంపై ఆసక్తి ఉన్న 39,173 మంది రైతులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. 60,495 ఎకరాల్లో సాగుకు అంచనాలు సిద్ధం చేశారు. వీరిలో 23,747 మంది రైతులకు 38,096 ఎకరాల్లో సాగు చేపట్టేలా ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. పండ్ల తోటల అభివృద్ధిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉంది. ఉపాధి నిధులతో పండ్ల తోటల సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా అట్టడుగున ఉంది. అనంతపురం జిల్లాలో 15,001 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 15,351 ఎకరాలకు సంబంధించి 5,652 మంది రైతులను గుర్తించడం విశేషం. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి నిధులతో అన్ని రకాల పండ్ల తోటలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రైతులు పండ్ల మొక్కలను ఎక్కడి నుంచైనా తెచ్చుకుని నాటుకోవచ్చు. వీటికి జిల్లాస్థాయి పర్చేజ్ కమిటీ నిర్ణయించిన ధరలను చెల్లిస్తారు. లేకపోతే ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. 26 వేల కి.మీ. పొడవునా అవెన్యూ ప్లాంటేషన్ పండ్ల తోటలను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26,002 కి.మీ. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నిర్ణయించింది. కి.మీ.కు 200 మొక్కల చొప్పున నాటి పచ్చదనం అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 15,027 కి.మీ. మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 6,600 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు పరిపాలన అనుమతులొచ్చాయి. పచ్చదనం తరిగిపోయిన కొండల్లో అటవీ జాతి చెట్లకు సంబంధించి లక్షలాది సీడ్‌బాల్స్‌ను వెదజల్లనున్నారు. కర్నూలు జిల్లాలోనే 10 లక్షల సీడ్‌బాల్స్‌ను వేయనున్నారు. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ రైతుల్ని ఆదుకుంటోంది ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో చేపట్టిన డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం రైతులను ఆదుకుంటోంది. ఉపాధి నిధులతో జిల్లాలో 35 వేల ఎకరాల్లో పండ్ల తోటల్ని అభివృద్ధి చేశాం. ఈ ఏడాది జిల్లాలో 8వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 2 వేల కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకున్నాం. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు -
మెజారిటీపై మరింత విశ్వాసం
సాక్షి,మహబూబాబాద్: సీఎం సభ సక్సెస్‌తో అభ్యర్థి మెజార్టీ పై మరింత విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్సీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి సత్యవతిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.మానుకోటలో జరిగిన సీఎం సభలో మెడికల్ కళాశాలతోపాటు పలు విషయాలపై స్పందించి హామీ ఇచ్చారన్నారు. పోడు భూముల సమస్య కూడా పరిష్కరిస్తామని సీఎం ప్రకటించారని, పోడు రైతులు అర్థం చేసుకుని టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. సమష్టిగా కృషి చేయడంతో సభ సక్సెస్ అయ్యిందని, అలాగే అభ్యర్థి గెలుపు విషయంలోనూ కలిసి పనిచేసి సీఎం చెప్పిన విధంగా 3.50లక్షల మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలన్నారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ టికెట్ రాలేదనే మనోవేదన సీఎం సభ కంటే ముందు ఉండేదని, సభలో సీఎం తనను మచ్చలేని నాయకుడని, కొన్ని సమీకరణల్లో టికెట్ ఇవ్వలేకపోయామని తనపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి కవిత గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రంలో బలం పెరిగి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎంపీ అభ్యర్థికి మానుకోట నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ నెహ్రూ, రంగన్న, డోలి లింగుబాబు, యాళ్ల మురళీధర్‌రెడ్డి, నాయిని రంజిత్, ఆదిల్, యాళ్ల పుష్పలత, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
అందం పెరుగు
పెరుగులో ఒక స్పూను తేనె, రెండు స్పూన్ల నిమ్మకాయరసం కలిపి తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో ముల్తానమట్టి కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మంపై మురికిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. పెరుగులో పంచదార గాని, ఉప్మారవ్వ గాని కలిపి ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే మృతకణాలు తొలగి పోతాయి. మీగడ పెరుగును వేళ్లతో మెత్తగా చేసి ముఖం, చేతులు, పాదాలకు పట్టించి ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే డ్రై స్కిన్ మృదువుగా మారుతుంది. -
50 శాతంలోపు పడినా డ్రైస్పెల్
వర్షాభావ పరిస్థితి లెక్కింపు నిబంధనలు మార్చిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులను లెక్కించే విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. వరుసగా 21 రోజుల పాటు పూర్తిగా వర్షం పడకుంటే ‘డ్రైస్పెల్’గా పరిగణించే విధానాన్ని మార్చి.. ఈ 21 రోజుల పాటు 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా ‘డ్రెస్పెల్’గా పరిగణించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చిన కరువు మ్యాన్యువల్‌ను రాష్ట్రాలకు పంపి.. దాని ప్రకారం డ్రైస్పెల్ మండలాలను లెక్కించాలని సూచించింది. దీనికితోడు పలు ఇతర అంశాలను పరిశీలించి కరువు పరిస్థితులను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర అంశాలు దారుణంగా ఉన్నా డ్రైస్పెల్ నిర్వచనం కారణంగా కరువు మండలాల సంఖ్య తక్కువగా ఉంటూ వచ్చింది. డ్రైస్పెల్ నిర్వచనం మార్చిన నేపథ్యంలో కరువు మండలాల సంఖ్య పెరగనుంది. 6 అంశాల ఆధారంగా కరువు నిర్ధారణ ప్రస్తుతం కరువు నిర్ధారణ అశాస్త్రీయంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 1) వర్షాభావ పరిస్థితులు, 2) డ్రైస్పెల్, 3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ), 4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ), 5) సాగు విస్తీర్ణం, 6) దిగుబడుల పరిస్థితి ఉంటాయి. వీటిలో ఏవైనా ఐదు అంశాల ఆధారంగా కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇచ్చి.. నాలుగు అంశాలను (వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండడం, సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి 50 శాతానికి తగ్గిపోవడం, పశుగ్రాసానికి ఏర్పడిన కొరత ఏర్పడడం) పరిగణనలోకి తీసుకుంటారు. ఇకఇప్పటివరకు మధ్యస్థంగా, తీవ్ర కరువు ఉన్నప్పుడు మాత్రమే కరువు మండలాలను ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించేది. అయితే ఆ విధానం ప్రకారం చాలా ప్రాంతాల్లో డ్రైస్పెల్‌గా పరిగణించలేని పరిస్థితి ఉండేది. మూడు వారాల్లో ఒక్కసారి కూడా వర్షం పడకుండా ఉండాలన్నది సరికాదన్న వాదనలు వచ్చాయి. ఆ మూడు వారాల్లో ఒకట్రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసినా డ్రైస్పెల్‌గా పరిగణించరని, దాంతో కరువు మండలాల ప్రకటనలో అన్యా యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల్లో ప్రతీ వారం 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా డ్రైస్పెల్‌గా పరిగణించాలన్న కొత్త నిబంధనను తీసుకొచ్చారు. రాష్ట్రంలో 200 మండలాల్లో.. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాతి నుంచి లోటు వర్షపాతమే నమోదైంది. జూలైలో 40 శాతం, ఆగస్టులో 12 శాతం, ఈ నెలలో ఇప్పటివరకు 27 శాతం లోటు నెలకొంది. చాలా మండలాల్లో డ్రైస్పెల్ నెలకొంది. నూతన విధానంలో లెక్కిస్తే రాష్ట్రంలో దాదాపు 200 మండలాలు డ్రైస్పెల్లో చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా రెండు సార్లు డ్రైస్పెల్ ఉన్న మండలాలను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రైస్పెల్ను మార్చిన మాట వాస్తవమేనని, దీనిపై ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. -
అలిగిన చినుకు.. పైరుకు వణుకు...
వర్షాల మధ్య అంతరంతో లక్షలాది ఎకరాల్లో పంటలపై ప్రభావం ⇒ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 20 రోజులుగా జాడ లేని వాన ⇒ మొలక దశలోనే దెబ్బతింటున్న సోయాబీన్, మొక్కజొన్న ⇒ పత్తిని హడలెత్తిస్తున్న గులాబీ రంగు పురుగు ⇒ 42 లక్షల ఎకరాల్లో పంటకు గండం ⇒ డ్రైస్పెల్ ఉంటే ఉధృతంగా విస్తరించే పురుగు ⇒ సుమారు 50 మండలాల్లో డ్రైస్పెల్.. ఆందోళనలో రైతాంగం సాక్షి, హైదరాబాద్ ఈసారి సాధారణానికి మించి వర్షపాతం నమోదైనా.. రాష్ట్రంలో రైతన్నకు మాత్రం కలవరం తప్పలేదు. వర్షాల మధ్య తీవ్ర అంతరం (డ్రైస్పెల్) రావడంతో పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది. అనేక చోట్ల పత్తి, సోయాబీన్లతో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తి పంటకు గులాబీరంగు కాయ తొలుచు పురుగుతో తీవ్ర ముప్పు ముంచుకొచ్చింది. లక్షలాది ఎకరాల్లో పత్తి సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడమే దీనికి కారణం. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరో వారం పాటు వర్షాలు కురవకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా మండలాల్లో వాన కరువు రాష్ట్రంలో మొత్తం 584 మండలాలు ఉండగా.. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు (56 రోజుల్లో) 257 మండలాల్లో సాధారణ వర్షపాతం, 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యాయి. 183 మండలాల్లో మాత్రం సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. అయితే వాతావరణశాఖ వర్గాల లెక్క ప్రకారం... సాధారణ, లోటు వర్షపాతం నమోదైన పలు మండలాల్లో డ్రైస్పెల్స్ ఏర్పడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి మండలాలు 50కి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. మరో వారం వర్షాలు కురవకుంటే డ్రైస్పెల్ మండలాల సంఖ్య 75 వరకు పెరగవచ్చని అంటున్నారు. ఇక ఏదైనా మండలంలో కొన్ని గ్రామాల్లో వర్షాలు కురిసినా.. మరికొన్ని గ్రామాల్లో డ్రైస్పెల్ ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు. డ్రైస్పెల్తో పంటలకు చేటు రాష్ట్రంలో ఖరీఫ్‌లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఈసారి ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావడం గమనార్హం. ఇక ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.72 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 25.90 లక్షల ఎకరాల్లో వేశారు. ఇందులో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మొక్కజొన్న 13.20 లక్షల ఎకరాలకుగాను 9.82 లక్షల ఎకరాల్లో.. సోయాబీన్ 5.10 లక్షల ఎకరాలకుగాను 3.77 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. మొత్తంగా భారీగా సాగు జరిగిన పత్తి పంట పరిస్థితి ‘డ్రైస్పెల్’కారణంగా దారుణంగా మారింది. సోయా, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలు కూడా ఎండిపోతున్నట్లు గుర్తించారు. లోటు వర్షపాతం నమోదైన 144 మండలాల్లో అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడే మాట్లాడటానికి వ్యవసాయశాఖ వర్గాలు నిరాకరిస్తున్నాయి. మందగించిన వరి నాట్లు.. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 6.72 లక్షల ఎకరాల్లో (29%) మాత్రమే నాట్లు పడడం గమనార్హం. జూలై ముగుస్తున్నా నాట్లు ఊపందుకోకపోవడంపై వ్యవసాయశాఖ ఆందోళన చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసినా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. భూగర్భ జలాలు కొద్దిగా పెరిగాయంతే. జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చేంతగా వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు పుంజుకోలేదు. నీరు పుష్కలంగా ఉన్న బోర్లు, బావుల కింద మాత్రమే నాట్లు పడ్డాయి. పత్తి విలవిల మే చివరి వారం నుంచి జూన్ తొలివారంలో మధ్య వేసిన పత్తి పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇలాంటి సమయంలో వర్షాల్లేక డ్రైస్పెల్ ఏర్పడడంతో పత్తికి కొత్త సమస్య వచ్చి పడింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ముందుగా వేసిన పత్తిని గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టి పీడిస్తోందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ధారించింది. మరిన్ని ప్రాంతాలకూ అది విస్తరించడం ఆందోళనకరంగా మారిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. డ్రైస్పెల్ కారణంగానే పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉందని.. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో పత్తి పంట ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. వేడి పెరిగితే ఈ పురుగు సోకుతుంది ‘‘డ్రైస్పెల్ వల్ల వర్షాలు కురవక వేడి పెరుగుతుంది. దాంతో గులాబీరంగు పురుగు ఉధృతమవుతుంది. ఆ పురుగు వస్తే పత్తి చేతికందే పరిస్థితి ఉండదు. గతేడాది గుజరాత్లో గులాబీ రంగు పురుగు సోకిన పత్తి పంటను తగులబెట్టారు కూడా. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సోకే ఈ పురుగు.. ఇప్పుడే సోకుతోందంటే పరిస్థితి దారుణంగా ఉన్నట్లే. దీనిని తట్టుకునేందుకు పురుగుమందులు వాడితే సాగు ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అయినా పంట చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు..’’ – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు, హైదరాబాద్ రెండు జిల్లాల్లో సమస్య.. ‘‘ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ముందుగా వేసిన పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉనికి గమనించాం. దాని ఉధృతి పెరగకుండా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలి. పత్తి చుట్టూ బెండ లేదా తుత్తురు బెండగానీ లేకుండా చూసుకోవాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మిల్లీమీటర్ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి..’’ – డాక్టర్ సుదర్శనం, శాస్త్రవేత్త (పత్తి), వరంగల్ -
ఆశలు ఆవిరి
వరుణదేవుడు కరుణించేటట్లు కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతులు వేరుశెనగ విత్తన సాగు కోసం ఎదురు చూస్తున్నా... వర్షాలు కురవకపోవడంతో పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల జూన్ నెలలో కురిసిన అరకొర వర్షాలకు విత్తనం వేసుకున్న రైతుల పొలాల్లో మొలకెత్తిన వేరుశనగ కాస్తా ఎండు ముఖం పడుతోంది. రైతుల బోర్లలో నీరు ఇంకిపోయి పండ్ల తోటలు కూడా వాడు పట్టారు. చాలా ప్రాంతాల్లో తినేందుకు గడ్డి , తాగేందుకు నీళ్లులేక మూగజీవాలు అవస్థలు పడుతున్నాయి. - ఫొటోగ్రాఫర్, అనంతపురం -
మత్స్య సంపదకు డ్రై ప్లాట్ ఫారమ్స్
డ్వామా పీడీ రాజకుమారి అల్లవరం (అమలాపురం) : మత్స్య సంపదను ఆరబెట్టేందుకు డ్రై ప్లాట్ ఫారమ్స్ ఉపాధి నిధులతో నిర్మిస్తున్నామని డ్వామా పీడీ రాజకుమారి అన్నారు. బెండమూర్లంక, బోడసకుర్రు, ఎస్.పల్లిపాలెం, ఓడలరేవు, గుండెపూడి గ్రామాల్లో ఏడుచోట్ల డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి రూ.22.73 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం బోడసకుర్రులో డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావుతో కలసి పరిశీలించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ డ్రై ప్లాట్‌ఫారమ్స్ నిర్మాణానికి 48 మత్స్యకార గ్రామాలకు రూ.80 లక్షల చొప్పున ఉపాధి నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు బండ్ ప్లాంటేషన్, హోమ్ ప్లాంటేషన్, పట్టు పురుగుల పెంపకం, వన సంరక్షణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నామన్నారు. జిల్లాలో 400 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టామని, 46 పూర్తయ్యాయని, 141 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉపాధి కూలీలకు వేతనాలు బ్యాంకు ఆకౌంట్లో జమ కాకపోవడానికి ఆధార్ లింక్ చేయకపోవడమే కారణమన్నారు. ఆధార్ లింక్ కాని ఉపాధి కూలీలకు బ్యాంకు అకౌంట్లో జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పీడీ వెంట ఏపీడీ భానుప్రకాష్, ఎంపీడీఓ వి.శాంతామణి, సర్పంచ్ దొమ్మేటి శ్యాంప్రకాష్ ఉన్నారు. డిసెంబర్ నాటికి మినీ హార్బర్ అంతర్వేదిలో రూ. 30 కోట్లతో నిర్మిస్తున్న మినీ హార్బర్ డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు అన్నారు. బోడసకుర్రులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఓడలరేవులో రూ.5.3 కోట్లతో జెట్టీ నిర్మాణం జరుగుతోందన్నారు. -
రేపు డ్రైలాండ్ హార్టికల్చర్‌పై రైతులకు శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: వర్షాధార పండ్లతోటల పెంపకం (డ్రైలాంండ్ హార్టికల్చర్)పై రేపు (బుధవారం) స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు హాజరై ప్రస్తుత వేసవిలో డ్రైలాండ్ హార్టికల్చర్ పండ్లతోటల్లో ఆచరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కొల్లేరు కటకట
ఏలూరు : జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది. ఆసియాలోని పెద్ద మంచినీటి సరస్సు దుస్థితి ఇది. నిత్య జలం.. పచ్చతోరణం అన్నట్టుండే కొల్లేరును కరువు కాటేసింది. ఏప్రిల్ మొదట్లోనే కష్టాలను తెచ్చిపెట్టింది. సరస్సులో పలు ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. బీటలు వారడంతో పచ్చదనం కనుమరుగై పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. చుక్కనీరు జాడ లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న కొద్దిపాటి నీటి వద్ద విదేశీ పక్షులు సేద తీరుతున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు దుర్భిక్షానికి సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు. -
నిలిచిన ఎండుకొబ్బరి తయారీ
కొబ్బరి ధర పెరుగుదల రైతులకు సంతోషాన్ని ఇస్తుంటే.. కొబ్బరి కార్మికులకు, తయారీ కొబ్బరి వ్యాపారులను మాత్రం కష్టాల్లోకి నెట్టుతోంది. పచ్చికొబ్బరి కాయ ధర పెరగడంతో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి).. కొబ్బరినూనె తయారీ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇటు వ్యాపారులకు... అటు కార్మికులకు చేతిలో పనిలేకుండా పోతోంది. – అమలాపురం/అంబాజీపేట ప్రస్తుతం మార్కెట్లో పచ్చికాయ, ముక్కుడు కాయ వెయ్యి కాయల ధర రూ.7,500 వేల వరకూ ఉంది. పది, పదిహేను రోజుల క్రితం రూ.పది వేలు ఈ ధర పలికింది. కాయ ధర ఎక్కువగా ఉండడంతో రైతులు, కొబ్బరి వ్యాపారులు నేరుగా కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత ధరకు కొనుగోలు చేసి.. తయారీ కొబ్బరి (కొత్తకొబ్బరి, ఎండుకొబ్బరి)ని స్థానికంగా తయారుచేసే అవకాశం లేదు. తయారీ కొబ్బరి కన్నా పచ్చికొబ్బరి ధర ఎక్కువగా ఉంది. తయారీ కొబ్బరి క్వింటాల్ ధర రూ.8 వేలు ఉండగా, పచ్చికొబ్బరి ధర రూ.7,500లే ఉంది. ఎండు కొబ్బరి చేస్తే నష్టమే.. వెయ్యి కొబ్బరికాయల నుంచి 90 కేజీల ఎండు కొబ్బరి తయారవుతుంది. క్వింటాల్ ఎండుకొబ్బరి తయారు చేయాలంటే 1,110 కాయలు అవసరం. మార్కెట్ ధరను బట్టి చేస్తే అయ్యే ఖర్చు రూ.8,325. వలుపు, తయారీ కార్మికులకు, రవాణా ఖర్చులు కలుపుకుంటే క్వింటాల్ ఎండు కొబ్బరి ఉత్పత్తికి అయ్చే ఖర్చు రూ.వెయ్యికిపైనే. అంటే క్వింటాల్ ఎండుకొబ్బరి తయారీ పెట్టుబడి రూ.9,500ల వరకూ అవుతున్నట్టు లెక్క. మార్కెట్ ధర మాత్రం రూ.8,200లే. దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలను వేలంలో పొందినవారే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. సీజ¯ŒSలో అంబాజీపేట మార్కెట్ నుంచి ఇప్పుడు 10 టన్నులు కూడా ఎగుమతి కావడం లేదు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పచ్చికొబ్బరి ఎగుమతి కన్నా ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఎగుమతులపైనే అంబాజీపేట మార్కెట్లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 3 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు. నిండా ముంచేస్తున్న వ్యాపారులు తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా నిల్వ చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎగుమతి చేసే పనిలో పడ్డారు. నిల్వలు పూర్తయ్యేవరకూ ధర తగ్గించేశారని రైతుల ఆరోపణ. నిల్వలు పూర్తయ్యాకా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, తరువాత ధరలు పెంచి లాభపడాలనే వ్యాపారుల వ్యూహానికి బలవుతున్నామని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ధర పెరిగిన తరువాత అమ్మకాలు చేయాలని కొబ్బరికాయలను నిల్వ చేస్తున్నారు. -
రెక్కల కష్టం ఎగిరిపోయి...
ఆరుగాలం శ్రమించిన రైతన్న రెక్కల కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు పంట నష్టానికి కారణం కాగా... మరో వైపు చేతికొచ్చిన అరకొర దిగుబడికి గిట్టుబాటు ధర లభ్యం కాక అన్నదాత కుదేలయ్యాడు. దళారుల ప్రమేయంతో ధర పతనమైంది. ఖరీఫ్ పంట కాలంపై మట్టి మనిషి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. వడ్లగింజలో చెమ్మను తొలగించేందుకు చెమ్మగిల్లిన కళ్లతో ఆరబెడుతూ... ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి ధర రాకపోతుందా అనే ఆశలు పెంచుకుంటున్నాడు శ్రమజీవి. అనంతపురం శివారులోని సోములదొడ్డి, నాగిరెడ్డిపల్లి, వడియంపేట గ్రామాల వద్ద నిత్యమూ కనిపిస్తున్న ఈ దృశ్యాలు వరి రైతు దైన్య స్థితికి అద్దం పడుతున్నాయి. -
ఆశలు ఆవిరి
- రబీనీ దెబ్బతీసిన వరుణుడు - కనీస వర్షపాతం కూడా నమోదుకాని వైనం - భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం - బీళ్లుగా మారిన పొలాలు - దిక్కుతోచని స్థితిలో రైతన్న అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌ను అల్లకల్లోలం చేసిన వరుణుడు రబీ వ్యవసాయాన్ని కూడా అతలాకుతలం చేశాడు. రబీపై రైతన్న పెట్టుకున్న కాస్తో కూస్తో ఆశలను ఆవిరి చేసేశాడు. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1,30,965 హెక్టార్లలో సాగులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతానికి కేవలం 28 వేల హెక్టార్లకు పరిమితం కావడం విశేషం. ఖరీఫ్‌కు సంబంధించి జూ¯ŒS నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 257.3 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో 6.70 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. జూన్, జూలై మినహా కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షంజాడ లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తమ్మీద 492.7 మి.మీ గానూ 283.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 42.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్, రబీ ఆశలు గల్లంతయ్యాయి. రబీ పరిస్థితి ఇలా రబీ సాగుకు కీలకమైన అక్టోబర్‌లో వర్షాలు కురవకపోవడంతో 78 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సిన ప్రధాన పంట పప్పుశెనగ 18,800 హెక్టార్లకు పరిమితమైంది. అరకొర తేమలో వేయడం వల్ల వేసిన పప్పుశెనగ నుంచి దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో ప్రధాన పంట వేరుశనగ 20 వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 4,500 హెక్టార్లు మాత్రమే సాగులో ఉంది. విత్తు సమయం ముగిసిపోవడంతో వేరుశనగ పంట కూడా సగం కన్నా తక్కువగానే రావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 10 వేల హెక్టార్లలో వరి సాగులోకి రావాల్సి ఉంగా ఇంకా 800 హెక్టార్లలో ఉంది. జొన్న 6,672 హెక్టార్లకు గానూ 1,750 హెక్టార్లు, మొక్కజొన్న 5926 హెక్టార్లకు గానూ 800 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 300 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకు గానూ 60 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి 25 శాతం విస్తీర్ణంలో పంటలు వేయగా ఇంకా 75 శాతం విస్తీర్ణం ఖాళీగానే దర్శనమిస్తోంది. రబీకి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 26.4 మి.మీ మాత్రమే నమోదు కావడం వర్షాభావ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమం చేసుకోవచ్చు. అది కూడా ఇటీవల సంభవించిన తుఫాను వల్ల సాధ్యమైంది. కాగా గతేడాది రబీ సీజన్లో 1.26 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారు. ఈ సారి మాత్రం అందులో సగం కూడా సాగులోకి రాలేదు. -
బీడు భూములపై కన్ను
* 159 ఎకరాల్లో దుర్గి బీడు భూములు * 60 ఎకరాల్లో రాత్రి వేళ చదును పనులు * అధికార పార్టీ అండతోనే కబ్జా..? దుర్గి బీడు భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. 159 ఎకరాల్లో విస్తరించిన ఈ భూముల్లో 60 ఎకరాలను రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా చదును చేయిస్తున్నారు. ఓ పది ఎకరాల్లో ఇప్పటికే పత్తి పంటను సాగు చేశారు. పశువుల మేతకు వినియోగించే భూములను కబ్జా చేయడంపై రైతులు, పశుపోషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దుర్గి : దుర్గి బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న దుర్గి బీడు భూములుగా పేరుగాంచిన ఎన్ఎస్పీ భూములు సుమారు 159 ఎకరాలు ఉన్నాయి. అందులో కబ్జాదారులు సుమారు 60 ఎకరాలను రాత్రి సమయాలలో పొక్లయిన్లతో పిచ్చిమొక్కలు, బండరాళ్లను తొలగించి సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుర్గి గ్రామస్తుల ద్వారా సోమవారం వెలుగులోకి వచ్చింది. అందులో 10 ఎకరాల భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ భూ కబ్జాలకు పాల్పడిన ప్రముఖ వ్యక్తులు దుర్గి, కంచరగుంట, ఆత్మకూరు, కంభంపాడు, అంజనాపురం గ్రామాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెల మేత కోసం ఉపయోగించుకుంటున్నారు. భూములను కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడడంలో కొంతమంది ముందంజలో ఉన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు నివసించడానికి రెండు సెంట్ల భూమి కూడా ఇవ్వలేని నాయకులు కబ్జాదారులకు అండదండలుగా ఉండటం శోచనీయం. దీనిపై తహసీల్దార్ ఏసుబాబును ‘సాక్షి’ వివరణ కోరింది. గురువారం భూములు పరిశీలిస్తామని, ఆక్రమణ జరిగినట్లు ఉంటే నిందితులపై చర్యలు తీసుకుం టామని వివరించారు. -
జలం.. జటిలం
చింతలపూడి : జిల్లాలోని మెట్ట ప్రాంత జలాశయాలు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. తమ్మిలేరు, ఎర్ర కాలువ, నందమూరి విద్యాసాగర్ ప్రాజెక్టులు దాదాపుగా అడుగంటాయి. పూర్తిగా వర్షాధారమైన ఈ ప్రాజెక్టులు సరైన వర్షాలు పడకపోవడంతో కళ తప్పాయి. దీంతో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది మెట్ట ప్రాంతంలోని రైతుల పరిస్థితి. చుట్టూ చెరువులున్నా సాగు నీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నా వినియోగించుకునే అవకాశం రైతులకు కలగడం లేదు. దీంతో జిల్లాలో వర్షాలపై ఆధారపడిన చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మెట్ట ప్రాంతంలో ప్రధానమైన తమ్మిలేరు, ఎర్రకాలువ, నందమూరి విద్యాసాగర్ జలాశయాలు నీరు లేక గతేడాది పూర్తిగా అడుగంటిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవిలో చెరువులు ఎండిపోగా, బోర్లు సుమారు 20 మీటర్లకు పైగా నీటి మట్టం పడిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కూడా మెట్ట ప్రాంతంలో సరైన వర్షాలు పడక పోవడంతో చెరువులు నిండలేదు. నీరు–చెట్టు పథకంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పూడిక తీత పనులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చెరువుల ఆక్రమణలు తొలగించకుండా కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేయడం వల్ల వర్షపు నీరు నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో 100 ఎకరాలకు పైబడిన చెరువులు సుమారు 450 వరకు ఉన్నాయి. ఇవి కాక వంద ఎకరాల లోపు చెరువులు, కుంటలు కలిపి దాదాపు 3,100 వరకు ఉంటాయి. ఈ చెరువుల విస్తీర్ణం సుమారు 1.80 లక్షల ఎకరాల్లో ఉంది. అడుగంటిన తమ్మిలేరు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు రిజర్వాయర్ ప్రస్తుతం అడుగంటింది. రాష్ట్ర విభజన తరువాత జలాశయానికి ఎగువ ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీటిని అక్కడి రైతులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. దీంతో మెట్ట రైతుల కల్పతరువు తమ్మిలేరు రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిగా నిండలేదు. ముందు ముందు తమ్మిలేరు భవిష్యత్తు ఏంటని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద 1969లో ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా ,ప్రస్తుతం 331 అడుగుల నీటిమట్టం ఉంది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కానీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదు. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్థితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు. ఆదుకోని నీరు–చెట్టు గతేడాది జిల్లాలో సుమారు 408 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది 374 చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం రూ. 69 కోట్లు మంజూరు చేసింది. అయితే చెరువుల్లో ఆక్రమణలు తొలగించకుండా పనులు తూతూమంత్రంగా చేసి మమ అనిపించారు. గతేడాది పనుల కంటే అధ్వానంగా చేశారు. నీరు–చెట్టు పథకంలో చెరువుల్లో పూడికతీసి భూగర్భ జలాలను పెంపొందించాలని భావించిన లక్ష్యం పూర్తవలేదు. ఆక్రమణలు తొలగించమని కోరాం చెరువులను సర్వే చేసి ఆక్రమణలు తొలగించమని రెవెన్యూ శాఖాధికారులను గతంలోనే కోరాం. అయితే ఆ విధంగా చర్యలు లేవు. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లోకి నీరు చేరుతుంది. చెరువు పల్లాలను ఆక్రమించుకుని ఎవరైనా పంటలు వేసుకుంటే మునిగిపోవడం ఖాయం. – యు.పరమానందం, ఇరిగేషన్ ఏఈ -
కాలం కాకపాయె!
వరుణుడి కరుణ కరువు నీళ్లు లేక చెరువులు వెలవెల నంగునూరులో కరువుఛాయలు అడుగంటిన భూగర్భ జలాలు నంగునూరు: కార్తెలు కరుగుతున్నా కాలం కాకపాయె.. నిత్యం వర్షాలు పడ్డా బావుల్లోకి నీరు రాదాయె.. అంటూ రైతులు వాపోతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు పొంగి చెరువులు, బావులు నిండుతున్నా.. నంగునూరు మండలంలో పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా చెరువుల్లో నీళ్లు లేక వెలవెల పోతున్నాయి. ఎక్కడా చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. వర్షా కాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా మండలంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో అన్న దాతల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇలాగే ఉంటే సంవత్సరం పొడవునా తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం వర్షాలు లేక చెరువులు, బావులు ఎండి పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం జూన్ మాసంలోనే తొలకరి పలకరించడంతో ఈసారి బాగా వర్షాలు పడి సంమృద్ధిగా పంటలు పండుతాయని అన్నదాతలు ఆశించారు. దీంతో మండలంలోని చాల గ్రామాల్లో రైతులు బీడు భూములను సహితం దుక్కులు దున్ని మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యపు పంటలతో పాటు వరిని సాగు చేశారు. జూన్ నుంచి ఆగస్టు నెల వరకు సాధారణ వర్షపాతం నమోదు కావడం, అడపాదడపా వర్షాలు పడ్డా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరక పిచ్చిమొక్కలతో నిడిపోయాయి. భారీ వర్షాలు కురువకపోవడంతో భూగర్భ జలాలు పెరుగక బావుల్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం వేసిన పంటలకు ఢోకా లేకున్నా భారీ వర్షాలు పడకుంటే వచ్చే రబీ పంటకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే జూన్ మాసంలో మొక్కజొన్న పంటలకు సరైన సమయంలో నీరందక చాలా గ్రామాల్లో పంటంతా ఎండిపోయింది. దీంతో 40 శాతం పంటకు నష్టం వాటిళ్లింది. సాధారణ వర్షపాతమే నంగునూరు మండలంలో అధికారుల లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం జూన్ నెలలో 109 శాతం నమోదు కావాల్సి ఉండగా 109.02, జూలై నెలలో 200గానూ.. 251.02, ఆగస్టు మాసంలో 160.0 శాతానికి గాను కేవలం 101.08 శాతం వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మరో నెల రోజుల్లో ముగియనుండడంతో నెలరోజుల్లో కురిసే వర్షాలపైనే అన్నదాతల ఆశలు పెట్టుకున్నారు. ఈ యేడు కాలం కాకుంటే దీని ప్రభావం వచ్చే వర్షకాలం వరకు ప్రభావం చూపుతుంది. బీడు భూములను తలపిస్తున్న చెరువులు గత సంవత్సరం సరిగా వర్షాలు పడకపోవడంతో చెరువులు, బావుల్లో నీళ్లులేక ఎండిపోయాయి. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడక చెరువుల్లో నీళ్లు లేక వెలవెల బోతున్నాయి. మండలంలోని చాలా గ్రామాల్లో బీడు భూములే దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట డివిజన్‌లోనే రెండో పెద్ద చెరువైన రాజగోపాల్‌పేట తటాకంలోకి చుక్క నీరు రాలేదు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీసినా వర్షాలు లేక పిచ్చిమొక్కలు పెరిగాయి. వరుణుడు కరుణించి సెప్టెంబర్ మాసంలో వానలు కురిపిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుంది. -
శాశ్వతంగా కరువు జిల్లాగా మార్చొద్దు
– ఆల్ పార్టీ సమావేశంలో వక్తల అభిప్రాయం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లాను అశాస్త్రీయంగా విభజించి శాశ్వత కరువు జిల్లాగా మార్చొద్దని వక్తలు అభిప్రాయ పడ్డారు. శనివారం డీసీసీబీ సమావేశం హాల్లో టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విభజన శాస్త్రీయతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నర్సిములు, కాంగ్రెస్ నాయకుడు సంజీవ్‌ముదిరాజ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అంబదాస్ మాట్లాడారు. అశాస్త్రీయంగా జిల్లాను విభజించి జిల్లాకు అన్యాయం చేయొద్దని కోరారు. జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టును జిల్లాకు కాకుండా చేసే కుట్రలు జరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడుతున్న అమరచింత, ఆత్మకూర్ మండలాలతోపాటు సీసీకుంట మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో కనీసం జూరాల లెఫ్ట్ బ్యాంక్ జిల్లాకు వస్తుందని చెప్పారు. ప్రతిపాదిత మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క జిల్లా కేంద్రం తప్ప మిగితా నియోజకవర్గాలు పూర్గిగా కరువు చాయలు అలుముకున్న ప్రాంతాలని వివరించారు. ఈ ప్రాంతాల నుంచి అధిక శాతం వలసలు పోతారని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రాంతం శాశ్వతంగా వలస జిల్లాగానే మారిపోతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్‌కు కలపడం అన్యాయమని, దీంతో జిల్లాకు వచ్చే అదాయం కూడా పోతుందని అన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రజాప్రతినిధులు గళం విప్పాలని కోరారు. జిల్లాకు జరగుతున్న అన్యాయంపై జేఏసీ ఇచ్చే ప్రతి పోరాటానికి మద్దతు ఇస్తామని వివిధ పార్టీల నాయకులు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ తాలూకా ఇ¯Œæచార్జ్ ఎన్పీ. వెంకటేశ్, జేఏసీ నాయకులు రామకృష్ణరావు, చంద్రనాయక్, శ్రీదర్‌గౌడ్, పరమేశ్, అంబాదాస్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరుతడి’కి సాగర్ నీరు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి : సాగర్ ఆయకట్టు పరిధిలోని ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని హట్యాతండాలో రూ.1.65కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి తుమ్మల శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పాలేరు కాలువకు ప్రతి 15 రోజులకోసారి సాగునీటిని విడుదల చేస్తామని, రైతులు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీళ్లు చివరి పొలాలకు పారేలా చర్యలు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను మంత్రి ఆదేశించారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు గోదావరి, కృష్ణా జలాలను పారించి.. సస్యశ్యామలం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని అన్నారు. పాలేరును సస్యశ్యామలం చేసేందుకు భక్తరామదాసు పథకం తీసుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడిత్య రాంచంద్రునాయక్, సర్పంచ్ బాణోత్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ జూకూరి విజయలక్ష్మీ, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, తహసీల్దార్ వెంకారెడ్డి, ఎంపీడీఓ విద్యాచందన, పీఆర్ ఏఈ రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ పుష్పలత, ఏడీ వాణి, ట్రాన్స్‌కో ఏడీఏ ఆనంద్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి రమణ, ఏఓ అరుణజ్యోతి, ఏఈలు శ్రీనివాస్, జగదీష్, రమేష్‌రెడ్డి, అరుంధతి, టీఆర్ఎస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బాదావత్ బిక్షంనాయక్, వీరవెల్లి నాగేశ్వరరావు, ఆసిఫ్‌పాషా, భూక్యా బీక్యానాయక్, బజ్జూరి రాంరెడ్డి, వెంకటరెడ్డి, బారి వీరభద్రం, మాదాసు ఉపేందర్ పాల్గొన్నారు. -
వరుణుడిపైనే భారం
ఎండుతున్న పంటలు పెద్దశంకరంపేటలో కరువు ఛాయలు కనీస వర్షపాతం నమోదుకాని దుస్థితి చెరువులు, కుంటలు వెలవెల ఆందోళనలో రైతులు పెద్దశంకరంపేట:మండలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. వర్షాలు మొహం చాటేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతీ యేటా ఖరీఫ్ సీజన్లో చెరువులు, కుంటల కింద భారీగా వరిపంటను సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మక్కజొన్నను సాగు చేస్తారు. మండలంలో ఎక్కువగా వరి, మక్కజొన్న పంటలను మాత్రమే సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతులు బోరుబావులు, చెరువులు, కుంటలపై మాత్రమే ఆధారపడ్డారు. నాలుగైదు గ్రామాలు మాత్రమే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్‌ల ద్వారా తమ బోర్లతో పంటలను పండించుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో పంటలు బాగానే పండుతున్నా ఈ ఏడాది కరువు రక్కసి కాటేసే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే మండలంలో సగానికిపైగా పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. మూడు రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. కానీ మండలంలో ముసురుకే పరిమితమైంది. దాదాపు ఆగస్టు నెలలో ఒక్క భారీ వర్షం కూడా పడకపోవడంతో రైతుల్లో పంటల దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. ఎక్కడ చూసిన రైతులు ఆదే చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కనీస వర్ష పాతం కూడా నమోదు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తాపేట, రామోజిపల్లి, నారాయణపల్లి, వీరోజిపల్లి, మాడ్చెట్‌పల్లి, బద్దారం, మల్కాపూర్, ఉత్తులూర్, బూర్గుపల్లి, టెంకటి, బుజ్రాన్‌పల్లి, జంబికుంట, చీలాపల్లి తదితర గ్రామాల్లో వరిపంటతో పాటు మొక్కజొన్నను సాగు చేశారు. ఓ వైపు బోర్ల వద్ద పంటలను సాగు చేస్తున్నా చివరి వరకు దిగుబడి వస్తుందా రాదా ఆనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల మక్కజొన్న భారీగా ఎండిపోయింది. దీంతో పాటు బోర్ల వద్ద రైతులు నీరు సక్రమంగా రాకపోవడంతో కొన్ని మడులను వదిలేసి కొంత మేర మాత్రమే పంటలను దక్కించుకుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన రైతులకు పెట్టుబడులతో పాటు దిగుబడులు కూడా రాకపోవడంతో వారు అప్పులపాలయ్యే ప్రమాదం నెలకొంది. పేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు -
తెచ్చారు.. ఎండబెట్టారు...
వరంగల్ : హరితహారంలో భాగంగా నాటేందుకు తెచ్చిన మొక్కలు ఎండకు ఎండిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారంలో భాగంగా 12.50లక్షల మెుక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 8,44,860 మొక్కలు నాటారు. అయితే, ఇంకా వేల సంఖ్యలో మెుక్కలు తెప్పించగా అందులో చాలా వరకు నాటడం లేదు. గ్రేటర్ వరంగల్ శివారు ఏనుమాముల వార్డు కార్యాలయం వద్ద మూడు వేలకు పైగా మెుక్కలు ఉన్నాయి. వాటిని నాటకపోవడంతో ఎండకు ఎండిపోతున్నాయి. వివిధ డివిజన్లలో మెుక్కల కోసం ప్రజలు బల్దియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడేమో సిద్ధంగా ఉన్న మెుక్కలను నాటకుండా, ప్రజలకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
డ్రై ప్రూట్స్ స్టాల్‌పై కేసు నమోదు
ద్వారకానగర్: వీఐపీ కూడలిలోని నట్స్, ప్రూట్స్ దుకాణంలోని డ్రైప్రూట్స్, కిస్మిస్లో పురుగులు ఉన్నట్లు కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఆహారభద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆహరభద్రత చట్టప్రకారం షాపు యాజమానికి నోటీసులు జారీ చేసికేసు నమోదు చేశారు. మొత్తం 15 రకాల శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం లేబరేటరీకిపంపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు యస్.జనార్ధనరావు,జి.వి.అప్పారావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ రిపోర్టు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. -
నయాగరా అందాలు అదృశ్యమౌతాయా?
ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం నయాగరా జలపాతం. అక్కడి ఎత్తైన కొండ కోనలనుంచి ఉరికి వచ్చే నీటి ధారలు.. వేసవిలో సందర్శకులకు కనువిందు చేస్తాయి. శతాబ్దాల కాలంగా ఆ మనోహర దృశ్య రూపం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్, కెనడాలోని ఒంటారియా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ జలపాతంపై బ్రిడ్జి ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు... సందర్శకులను, స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ ప్రయత్నం ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి... అక్కడి అందాలను కనుమరుగు చేస్తుందన్న వదంతులు వినిపిస్తున్నాయి. నయాగరా ఫాల్స్ ప్రాంతంలో అమెరికాను, గోట్ ఐలాండ్ ను కలుపుతున్న 115 సంవత్సరాలనాటి రెండు వంతెనలున్నాయి. వాటిని పునరుద్ధరించే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫాల్స్ మూతపడే ప్రతిపాదన ఉన్నట్లు న్యూయార్క్ స్టేట్ పార్క్... రవాణా సంస్థల ద్వారా తెలుస్తోంది. దీంతో అమెరికన్ జలపాతం, బ్రైడల్ వైల్ జలపాతం మధ్య ఉన్న పచ్చదనం కనిపించకుండా పోతుందన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కాగా వాటర్ ఫాల్స్ కు బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు. సుమారు 85శాతం నయాగరా జలపాతం కెనడా భాగంలోని హార్స్ షో ఫాల్స్ లోనే ఉంది. మిగిలిన ప్రాంతం మాత్రమే ఆమెరికా భాగంలో ఉంది. ప్రస్తుతం ఈ అమెరికన్ ఫాల్స్ భాగంలో తాత్కాలిక ఆనకట్ట కట్టి డ్రైన్ల ద్వారా పూర్తి నీటి ప్రవాహాన్నిహార్సేషో ఫాల్స్ వైపు మళ్ళించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న అతి పురాతనమైన 115 ఏళ్ళనాటి వంతెనలు పడగొట్టాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగానే నీటి ప్రవాహాన్ని మళ్ళించేందుకు డ్రైన్లు నిర్మించాల్సి వస్తుందని అంటున్నారు. బ్రిడ్జిలు తిరిగి నిర్మించేందుకు స్తంభాలు, వంతెన గోడల నిర్మాణాల పునాదులు గట్టిగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని పొడిగా మార్చాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. ఈ కొత్త వంతెనలు నిర్మించేందుకు సుమారు తొమ్మిది నెలల కాలం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతటి రమణీయ ప్రాంతాన్ని సందర్శకులకు దూరం చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావన కలిగిస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నూతన నిర్మాణం కెనడా వైపు కంటే అమెరికావైపు అవసరమని, ఈ కొత్త రాతి నిర్మాణం ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి తోడ్పడవచ్చని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల తమకు అద్భుతమైన మార్కెటింగ్ కు అవకాశాలు లభిస్తాయని నయాగరా టూరిజం అండ్ కన్వెన్షన్ కార్పొరేషన్ సీఈవో అంటున్నారు. పైగా నయాగరా ఫాల్స్ ను పొడిగా చూసే అవకాశం జీవితకాలంలో చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అయినా ఇది మొత్తం నయాగరాను మూసివేయడం కాదని, అమెరికన్ ఫాల్స్ ప్రాంతం మాత్రమే మళ్ళించబడుతుందని, కెనడా ప్రాంత ఫాల్స్ ఎప్పట్లానే సందర్శకులకు కనువిందు చేస్తాయని తెలుపుతున్నారు. అంతేకాక నీరు లేని సమయంలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తామని పర్యాటక అధికారులు అంటున్నారు. -
తెలంగాణలోడ్రైపోర్ట్
ప్రి ఫ్యాబ్ కాంక్రీట్ తయారీ ఫ్యాక్టరీ కూడా.. రాష్ట్రంతో ఎంవోయూ కుదుర్చుకున్న చైనా కంపెనీ సాని 45 మంది చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం గృహ నిర్మాణ రంగంలో అపార అవకాశాలున్నాయని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్ట్, ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు చైనాలోని అగ్రశ్రేణి సంస్థ సాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆ కంపెనీ ప్రతినిధులు అధికారులతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం-చైనా కంపెనీల మధ్య రెండు కీలక ఎంవోయూలు కుదిరినట్లయింది. శుక్రవారమిక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు-సాని గ్రూప్ నేతృత్వంలోని చైనా కంపెనీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైపోర్ట్ ఏర్పాటు చేసే ఒప్పంద పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి (ఇన్చార్జి) జయేశ్ రంజన్, సాని హెవీ ఇండస్ట్రీ చైర్మన్ వెన్‌జెన్, ఫోర్ట్లియాన్ యంగ్ గాంగ్ వైస్ ప్రెసిడెంట్ చున్హంగ్ పరస్పరం మార్చుకున్నారు. నిర్మాణాలకు ఉపయోగించే ప్రి ఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఒప్పంద పత్రాలను గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్, సాని ఇంటర్నేషనల్ హౌజింగ్ జనరల్ మేనేజర్ హైజున్ డెంగ్ మార్చుకున్నారు. నౌకాశ్రయానికి సరుకులను రవాణా చేసేందుకు వీలుగా రోడ్డు, రైలు మార్గాలు ఉన్నచోట ఏర్పాటు చేసే సరుకుల ఎగుమతి, దిగుమతి కేంద్రాన్ని డ్రైపోర్ట్‌గా వ్యవహరిస్తారు. పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం చైనా నుంచి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను చైనాకు వచ్చినప్పుడు మీరు ఎంతో ఆదరణ చూపారు. నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే వినూత్న పారిశ్రామిక విధానం అమల్లో ఉంది. అవినీతి రహిత పాలన ఉంది. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నాం. ఈ గృహ నిర్మాణ రంగంలో అపారమైన అవకాశాలున్నాయి..’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చైనా బృందంలో సాని గ్రూప్ చైర్మన్ లియాన్ వెన్‌జెన్, సాని (ఇండియా) డెరైక్టర్ జిగువో, సీఈవో డుయాన్ దావ్, సీసీటీఈజీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ గార్గ్, చైనా మిన్హెంగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ కేషు, చైనా కోల్‌మైన్ కన్స్ట్రక్షన్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్ జియోజాంగ్, పోర్డు హోల్డింగ్ గ్రూప్ కంపెనీస్ వైస్ ప్రెసిడెంట్ చున్‌హాంగ్ తదితరులు మొత్తం 45 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, మిగులు విద్యుత్ ఉత్పత్తికి చేస్తున్న ప్రయత్నాలు, డ్రైపోర్ట్ ఆవశ్యకతను, సింగరేణి కాలరీస్ ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌లో రహదారులు, రవాణా వ్యవస్థ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్'
హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేయదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుద్దేశించి ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి నిధుల కేటాయింపులపై కసరత్తు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
అన్నదాతలకు బాబు శఠగోపం!
హైదరాబాద్: 2013లో రాష్ట్రంలో ఏర్పడిన కరువు కారణంగా ఖరీఫ్ పంటలు ఎండిపోయాయి. ఖరీఫ్, రబీ పైర్లను పైలీన్, లెహర్, హెలెన్ తుపాన్లు, నైరుతి రుతుపవనాలతో కురిసిన కుండపోత వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈ క్రమంలో కోస్తాలోని 423 మండలాలను తుపాను ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కోస్తా పంటలను తుపాన్లు దెబ్బతీయగా.. రాయలసీమలో కరువు పరిస్థితులు పంటలను మాడిపోయేలా చేశాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 119 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఇందులో 6 మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మిగిలిన 113 కరువు మండలాల్లో 108 రాయలసీమలో ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లోని రైతులు పెట్టుబడులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో వీరికి రూ.2,173.61 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి ఆదుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు ఆ సబ్సిడీని ఎగ్గొట్టాలని నిర్ణయించింది. గణాంకాలు మేరకు.. అధికారిక గణాంకాల ప్రకారం పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల రాాష్ట్రంలో 2013 అక్టోబరులో 33 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల్లో 63 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.7,200 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 2013 నవంబరులో వచ్చిన హెలెన్ తుపానువల్ల తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఆ వెంటనే లెహర్ రూపంలో మరో తుపాను నాశనం చేసింది. విపత్తులవల్ల అప్పుల్లో కూరుకుపోయి ఉన్న అన్నదాతలకు పెట్టుబడి రాయితీ అయినా ఇచ్చి ఊరట కలిగించాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఎగనామం పెట్టాలని నిర్ణయించింది. ఇంతటి నష్టాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ బకాయిల గురించి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రస్తావించగా ‘పాతవన్నీ మర్చిపోండి. ఇక వాటిని ఇచ్చేది లేదు. 2014 కరువు, హుద్‌హుద్‌కు పెట్టుబడి రాయితీ గణాంకాలు మాత్రమే సమర్పించండి’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనడంతో అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. 2014 నష్టాలకే ఇన్పుట్ సబ్సిడీ గత ఏడాది(2014)లో కరువు, హుద్‌హుద్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు మాత్రమే పెట్టుబడి రాయితీ పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది రాష్ట్రంలోని 84.33 శాతం మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క జిల్లాలోనూ కనీస సాధారణ వర్షం కురవలేదు. రాష్ట్రం మొత్తమ్మీద సగటు కనీస సాధారణ వర్షపాతం కంటే 36 శాతం తక్కువ వర్షం కురిసింది. ఫలితంగా 560 మండలాల్లో కరువు కోరలు చాచింది. దీంతో వీటిని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి. అయితే, అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే.. ఎక్కువ పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం డ్రాట్ మాన్యువల్స్ పేరిట 226 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 50 శాతంపైగా పంట నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రూ.701.50 కోట్లు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంది. అదే సంవత్సరంలో హుద్‌హుద్ తుపానువల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.355 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. మిగిలిన బకాయిని విడుదల చేయాల్సి ఉంది. వరుస విపత్తులతో 2013లో పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు చంద్రబాబు సర్కారు శఠగోపం పెడుతోంది!. 2013లో కరువు, వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ) కోసం ఏడాదిన్నరగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అంతో ఇంతో అందే మొత్తంతో ప్రత్యామ్నాయ పంటలనైనా వేసుకుందామని భావిస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆశలపై బాబు సర్కారు నీళ్లు కుమ్మరించింది. 2013 నాటి పెట్టుబడి రాయితీ రూ.2,173.61 కోట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల అధికారులకు స్పష్టం చేశారు. ఆత్మస్థైర్యం నింపేది ఇలాగేనా? కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన విపత్తులతో రైతులు అప్పుల్లో చిక్కుకుని వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో కొద్దిపాటి సాయమైనా అందించి ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఏకంగా పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగ్గొట్టాలని నిర్ణయించడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రకరకాల కొర్రీలతో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన చందంగానే బాబు ప్రభుత్వం 2013నాటి పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వకుండా రైతులకు పంగనామాలు పెట్టిందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇది బాబు మార్కు మోసమని వారంటున్నారు.