ఆశలు ఆవిరి
వరుణదేవుడు కరుణించేటట్లు కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతులు వేరుశెనగ విత్తన సాగు కోసం ఎదురు చూస్తున్నా... వర్షాలు కురవకపోవడంతో పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల జూన్ నెలలో కురిసిన అరకొర వర్షాలకు విత్తనం వేసుకున్న రైతుల పొలాల్లో మొలకెత్తిన వేరుశనగ కాస్తా ఎండు ముఖం పడుతోంది. రైతుల బోర్లలో నీరు ఇంకిపోయి పండ్ల తోటలు కూడా వాడు పట్టారు. చాలా ప్రాంతాల్లో తినేందుకు గడ్డి , తాగేందుకు నీళ్లులేక మూగజీవాలు అవస్థలు పడుతున్నాయి.
- ఫొటోగ్రాఫర్, అనంతపురం